కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించాడు. తొమ్మిదిరోజు పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఖత్రీ ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందాడు. పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్ ఎరాస్‌మస్ చేతిలో 12-2 తేడాతో ఖత్రీ పరాజయం చెందాడు.