
రోమ్: వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ మంగో లియా రెజ్లర్ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. నిర్ణీత రెండు రౌండ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అయితే మంగోలియా రెజ్లర్ ఒక్కో పాయింట్ రెండుసార్లు సాధించగా... చివరి సెకన్లలో ఒకే పట్టుతో రెండు పాయింట్లు సాధించినందుకు బజరంగ్ ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 7–0తో సెలిమ్ కొజాన్ (టర్కీ)పై, సెమీఫైనల్లో 6–3తో క్రిస్టో ఫర్ (అమెరికా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన విశాల్ (70 కేజీలు) కాంస్యం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment