
న్యూఢిల్లీ: అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో 14–4తో అషిరోవ్ (కజకిస్తాన్)పై... క్వార్టర్ ఫైనల్లో 4–0తో కుర్బాన్ షిరయెవ్ (రష్యా)పై... సెమీఫైనల్లో 8–6తో దుదయెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో రసాదిన్ (రష్యా)తో బజరంగ్ తలపడతాడు.