Wrestling Tournament
-
‘టోక్యో’కు అన్షు, సోనమ్
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్ తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్‌గోరుజుల్ బోల్డ్‌సైఖాన్ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్ (చైనా)తో తలపడాల్సిన సోనమ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్‌కు స్వర్ణం, సోనమ్‌కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్‌కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. -
రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా?
నిద్రలో కంటున్న చిరునవ్వుల కల ఆఖరి నిముషంలో చెదిరిపోయినట్లే, వాస్తవం లో నెరవేర్చుకోవాలన్న కల చివరి ఒక్క పాయింట్‌తోనో, ఒక్క మార్కుతోనో ఛిద్రమైపోతుంది. పోయింది పాయింటే తప్ప, తగ్గింది మార్కే తప్ప జీవితం కాదు. అంత ఆలోచించే శక్తి లేకపోయింది రితికా ఫొగట్‌కు! ఈ లోకాన్నే విడిచిపోయింది. ఎంత వయసని! పదిహేడేళ్ల అమ్మాయి రితిక. రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారిణి. ఆటలో ఫైనల్స్ వరకు వచ్చింది. ఒక్క పాయిట్‌తో ‘గెలుపు’ను మిస్ అయింది. ఎంత వ్యథ చెందిందో. గెలవలేకపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రాణాలు తీసుకుంది. నిజంగా తనే ప్రాణాలు తీసుకుందా? గెలిచి తీరాలన్న పంతం ఒత్తిడిగా మారి ప్రాణం తీసిందా? ఓడి, ఇంటికి వచ్చాకనైనా ఆమె లోలోపలి ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? బాధను పంచుకోలేకపోయారా? ఏమైనా.. ఇది విషాదం. చుట్టూ ఇంతమంది ఉండి ఒక్కరైనా రితిక మూడ్స్‌ని పసిగట్టి, ఆమెను కాపాడలేకపోవడం! ఆమె పెద్దమ్మ కూతుళ్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్ ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్లూ రెజ్లర్లే! వాళ్లూ కెరీర్ ఆరంభంలో ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లే. తన ఆవేదనను ఒక్కమాటగానైనా అక్కలలో ఒక్కరికైనా చెప్పలేకపోయిందా రితిక!! ఎవరికి ముఖం చాటేయడానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది! రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మార్చి 14న జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజయం రితక చేజారింది. మార్చి 17న ఆమె తన జీవితాన్ని చేజార్చుకుంది. భరత్పూర్ నుంచి తిరిగొచ్చాక జైపూర్ దగ్గరి స్వగ్రామంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె చనిపోయిన తేదీపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోవడానికి కారణం మాత్రం ఏకాభిప్రాయానికి యోగ్యమైదే. ఓటమి నుంచి తిరిగొచ్చాక ఆమెనెవరూ అంటిపెట్టుకుని లేరు! ఒక మాటైతే అని ఉంటారు.. ‘నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అని. ‘టేక్ ఇట్ ఈజీ రితికా’ అని కూడా అని ఉండొచ్చు. కానీ ఆమె గుండె లోతుల్లో ఏం ఉందో ఎవరు ఊహించగలరు? ఊహించాలి. ఆటలో ఓడిన వారిని, మాట పడొచ్చిన వారిని ఒంటరిగా వదలకూడదు. నీడలా వెన్నంటి ఉండాలి. సున్నితమైన మనసు గలవారినే కాదు.. గట్టిగా ఉండేవాళ్లను కూడా దగ్గరగా గమనిస్తుండాలి. ఓటమి ఎంత గట్టివాళ్లనైనా క్రుంగదీస్తుంది. వారిలో కుంగుబాటు కనిపిస్తే నిఘా ఉంచాలి. చెట్టుకు కంచెలా వారి ప్రాణానికి ‘గమనింపు’ను కావలిగా పెట్టాలి. ‘రెస్ట్ ఇన్ పీస్ చోటీ బెహన్ రితికా’ అని వేల పోస్ట్‌లు వస్తున్నాయి. రితిక ఆ ఆరుగురు ‘పొఘట్ సిస్టర్స్’కి మాత్రమే చెల్లి కాదు అన్నట్లుగా నెట్ నిండా కన్నీటి ట్వీట్లు కురుస్తున్నాయి. -
వినేశ్ ఫొగాట్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పట్టిన పట్టు ప్రతి వారం బంగారమవుతోంది. ఆమె వరుసగా మూడో వారం కూడా పసిడి పతకం నెగ్గింది. వార్సాలో జరుగుతున్న పొలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో ఆమె మహిళల 53 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్లో 24 ఏళ్ల భారత రెజ్లర్ 3–2తో పొలాండ్‌కు చెందిన రొక్సానాపై విజయం సాధించింది. స్వర్ణం నెగ్గే క్రమంలో ఆమె... క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సోఫియా మాట్సన్ (స్వీడెన్)ను కంగుతినిపించింది. గత నెలలో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రితో పాటు టర్కీలో జరిగిన యాసర్ డొగు ఇంటర్నేషనల్ టోర్నీలో బంగారు పతకాలు నెగ్గింది. హ్యాట్రిక్ స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్‌ను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) ప్రశంసలతో ముంచెత్తింది. ఓ చాంపియన్ రెజ్లర్‌కు అండదండలు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఓజీక్యూ సీఈఓ రస్కిన్హా ట్వీట్ చేశారు. -
భారత రెజ్లర్లకు తొమ్మిది పతకాలు
న్యూఢిల్లీ: ససారీ సిటీ మాటియో పెలికోన్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇటలీలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ సోన్బా గొంగాణే (65 కేజీలు) స్వర్ణం గెలుపొందగా... రాహుల్ అవారే (61 కేజీలు) రజతం, దీపక్ పూనియా (86 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో సోన్బా గొంగాణే 9–8తో ఇద్రిసోవ్ (రష్యా)పై గెలిచాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. గుర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) స్వర్ణం, జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్యం గెలిచారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా (50 కేజీలు) స్వర్ణం, పూజా ధండా (57 కేజీలు), మంజు (59 కేజీలు) రజతాలు, దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
రెజ్లర్ బజరంగ్ ఖాతాలో మరో స్వర్ణం
అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం జరిగిన ఫైనల్లో బజరంగ్ 13–8 పాయింట్ల తేడాతో విక్టర్ రసాదిన్ (రష్యా)పై గెలుపొందాడు. ఈ ఏడాది బజరంగ్‌కిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. డాన్ కొలోవ్ టోర్నీలో పసిడి నెగ్గిన బజరంగ్ ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా బజరంగ్ తాను పాల్గొన్న గత తొమ్మిది టోర్నమెంట్లలో ఏడు స్వర్ణాలు నెగ్గడం విశేషం. -
ఫైనల్లో బజరంగ్
న్యూఢిల్లీ: అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో 14–4తో అషిరోవ్ (కజకిస్తాన్)పై... క్వార్టర్ ఫైనల్లో 4–0తో కుర్బాన్ షిరయెవ్ (రష్యా)పై... సెమీఫైనల్లో 8–6తో దుదయెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో రసాదిన్ (రష్యా)తో బజరంగ్ తలపడతాడు. -
ఎదురులేని బజరంగ్
న్యూఢిల్లీ: గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కొత్త సీజన్‌ను స్వర్ణ పతకంతో ప్రారంభించాడు. బల్గేరియాలో ఆదివారం ముగిసిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో బజరంగ్ విజేతగా నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12–3 పాయింట్ల తేడాతో జోర్డాన్ మైకేల్ ఒలివర్ (అమెరికా)పై ఘనవిజయం సాధించాడు. ఈ విజయంతో బజరంగ్‌కు 25 పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో మొత్తం బజరంగ్ 35 పాయింట్లు స్కోరు చేసి, తన ప్రత్యర్థులకు 15 పాయింట్లు సమర్పించుకున్నాడు. హరియాణకు చెందిన బజరంగ్ తొలి రౌండ్లో 13–6తో లులియాన్ జెర్జెనోవ్ (రష్యా)పై... క్వార్టర్ ఫైనల్లో 2–0తో ఎడ్వర్డ్ గ్రిగోరెవ్ (రష్యా)పై... సెమీఫైనల్లో 8–6తో నిర్హున్ స్కారాబిన్ (బెలారస్)పై గెలుపొందాడు. ‘ఈ స్వర్ణ పతకాన్ని వింగ్ కమాండర్ అభినందన్‌కు అంకితం ఇస్తున్నాను. అతను తన ధీరత్వంతో నాలో స్ఫూర్తి నింపాడు. సాధ్యమైనంత త్వరలో అభినందన్‌ను కలిసి అతనితో కరచాలనం చేయాలనుకుంటున్నాను’ అని బజరంగ్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంలో బజరంగ్ ఖాతాలో చేరిన ఏడో అంతర్జాతీయ పతకమిది. గత సంవత్సర కాలంలో బజరంగ్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం...జార్జియా గ్రాండ్‌ప్రి టోర్నీలో స్వర్ణం... యాసర్ డొగు టోర్నీలో స్వర్ణం... ఆసియా క్రీడల్లో స్వర్ణం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. వినేశ్‌కు నిరాశ... మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ రజత పతకంతో సరిపెట్టుకుంది. కియాన్యు పాంగ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో వినేశ్ 2–9 పాయింట్ల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. తొలి రౌండ్లో వినేశ్ 10–0తో కెనిమయేవా (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–4తో ఆమీ ఫియర్ఇన్సైడ్ (అమెరికా)పై, సెమీఫైనల్లో 4–2తో సారా యాన్ హిల్డెబ్రాన్ంట్ (అమెరికా)పై గెలుపొందింది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. బజరంగ్తోపాటు పూజా ధండా (మహిళల 59 కేజీలు) స్వర్ణం నెగ్గగా... వినేశ్ (53 కేజీలు), సరిత మోర్ (59 కేజీలు), సాక్షి మలిక్ (65 కేజీలు), సందీప్ తోమర్ (పురుషుల 61 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
సాక్షికి రజతం
న్యూఢిల్లీ: మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బెలారస్లో ఆదివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 2–6తో మరియానా సస్తిన్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల విభాగంలో పూజ ధండా కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో పూజ 10–0తో కెల్సీ క్యాంప్‌బెల్ (అమెరికా)ను చిత్తుగా ఓడించింది. -
పసిడి పతక పోరుకు బజరంగ్ అర్హత
యాసర్ డొగు స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతోన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 70 కేజీల సెమీ ఫైనల్ బౌట్లో బజరంగ్ ఇరాన్ రెజ్లర్ యూనస్ ఇమామిచోఘయ్‌పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 15–4తో ముస్తఫా కాయా (టర్కీ)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆండ్రీ క్విటాయోస్కో (ఉక్రెయిన్)తో బజరంగ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సందీప్ తోమర్ 61 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. -
రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కలిగిరి : కలిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్(కుస్తీ) పోటీల్లో సత్తాచాటారు. స్థానిక కేజీబీవీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ కే.కిరణ్మయి మాట్లాడుతూ విజయవాడ సమీపంలోని పేళ్లప్రోలులో ఈ నెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయని, 66 కేజీల విభాగంలో పి.అన్విత, 43 కేజీల విభాగంలో ఎస్కే తస్లీమ ప్రథమ స్థానంలో, 38 కేజీల విభాగంలో ఎన్సుజిత ద్వితీయ స్థానంలో, 49 కేజీల విభాగంలో ఆర్.వెంగమ్మ తతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. నవంబర్‌లో పుణేలో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి పి.అన్విత, ఎస్కే.తస్లీమ ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
అమ్మాయిల ‘పట్టు’ అదిరింది
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీలో రన్నరప్ భారత్ అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్ కప్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత మహిళా రెజ్లింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. వినేశ్ (48 కేజీలు), లలితా షెరావత్ (55 కేజీలు), అనిత (63 కేజీలు) అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... సాక్షి మలిక్ (58 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది. నిర్మలా దేవి (53 కేజీలు), సరిత (60 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు), నిక్కీ (75 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 10 వేల డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి. ఆతిథ్య దేశం కజకిస్తాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, మంగోలియా మూడో స్థానంలో నిలిచింది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సన్నాహ కంగా భారత్ ఈ టోర్నీలో ఆడింది.