
పతకాలతో పూజ, సాక్షి మలిక్
న్యూఢిల్లీ: మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బెలారస్‌లో ఆదివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 2–6తో మరియానా సస్తిన్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల విభాగంలో పూజ ధండా కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో పూజ 10–0తో కెల్సీ క్యాంప్‌బెల్ (అమెరికా)ను చిత్తుగా ఓడించింది.