అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం జరిగిన ఫైనల్లో బజరంగ్ 13–8 పాయింట్ల తేడాతో విక్టర్ రసాదిన్ (రష్యా)పై గెలుపొందాడు.
ఈ ఏడాది బజరంగ్‌కిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. డాన్ కొలోవ్ టోర్నీలో పసిడి నెగ్గిన బజరంగ్ ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా బజరంగ్ తాను పాల్గొన్న గత తొమ్మిది టోర్నమెంట్‌లలో ఏడు స్వర్ణాలు నెగ్గడం విశేషం.
రెజ్లర్ బజరంగ్ ఖాతాలో మరో స్వర్ణం
Published Fri, May 3 2019 4:50 AM | Last Updated on Fri, May 3 2019 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment