gold medals
-
స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్‌లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు
జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది. దీంతో పాటు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్‌గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది. -
‘కామన్వెల్త్’ పవర్ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు
సాక్షి, అమరావతి: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో సాదియా అల్మాస్ గురువారం బంగారు పతకాలు సాధించారు. స్వాట్, బెంచ్ ప్రెస్, డెట్ లిఫ్ట్ మూడు విభాగాల్లోను బంగారు పతకాలతోపాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్ విభాగంలో కూడా మరో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అమెకు ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. -
ముకేశ్ పాంచ్ పటాకా
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మన షూటర్లు క్లీన్‌స్వీప్ చేస్తూ మూడు పతకాలు ఖాతాలో వేసుకోగా... ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి ఓవరాల్‌గా ఐదో పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు గెలిచిన గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్... పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత్‌కే చెందిన సూరజ్ శర్మ 571 పాయింట్లతో బంగారు పతకం కైవసం చేసుకోగా... 568 పాయింట్లతో ముకేశ్ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల ఫైనల్లో దివాన్షి 564 పాయింట్లు సాధించి అగ్ర స్థానం దక్కించుకోగా... భారత్‌కే చెందిన పారిశా గుప్తా 557 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటర్ మాన్వి జైన్ 557 పాయింట్లతో కాంస్యం దక్కించుకోవడంతో మూడు పతకాలు మన ఖాతాలోనే చేరాయి. దీంతో ఈ టోర్నీ చరిత్రలో భారత షూటర్లు తొలిసారి ఒక విభాగంలో మూడు పతకాలను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించారు. దివాన్షికి ఈ పోటీల్లో ఇది ఐదో పతకం కావడం విశేషం. ఈ టోరీ్నలో భారత్ 21 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, రెండు రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. -
మీ ప్రదర్శన అద్భుతం
న్యూఢిల్లీ: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన భారత చాంపియన్ గ్రాండ్‌మాస్టర్లు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో పసిడి పతకాలు సాధించి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన పురుషులు, మహిళల జట్లను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. అందరితోనూ చనువుగా మాట్లాడిన మోదీ వారి ప్రదర్శనను ఆకాశానికెత్తారు. మహిళా గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, మూడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, ఆర్.ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతిలతో ప్రధాని ముచ్చటించారు. 11 గేమ్లకుగాను 10 గేముల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన దొమ్మరాజు గుకేశ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలతో కలిసి మోదీ గేమ్ ఆడారు. అనంతరం విజేత సభ్యులంతా కలిసి తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన చెస్ బోర్డును ప్రధానికి అందజేశారు. ప్లేయర్లతో ప్రధాని ముఖా ముఖీ వీడియోను క్రీడాశాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డిఫెండింగ్ టైటిల్‌ను వదిలేసి... ప్రధానితో ప్రత్యేక భేటీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకోరాదనే ఉద్దేశంతో విదిత్ సంతోష్ గుజరాతి అజర్బైజాన్ టోర్నీ నుంచి వైదొలగి హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చాడు. గతేడాది బాకులో జరిగిన వుగార్ గాషిమోవ్ మెమోరియల్ చెస్ సూపర్ టోర్నమెంట్లో విదిత్ విజేతగా నిలిచాడు. టైటిల్ నిలబెట్టుకునేందుకు బాకు చేరుకున్న అతనికి ప్రధాని భేటీకి సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో ఉన్నపళంగా డిఫెండింగ్ చాంపియన్íÙప్ను వదిలేసి ఢిల్లీకి పయనమై కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఏఐసీఎఫ్ నజరానా రూ. 3 కోట్ల 20 లక్షలు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్లకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ. 3 కోట్ల 20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత పురుషుల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున.... భారత మహిళల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ ప్రకటించారు.పురుషుల జట్టు కోచ్, కెప్టెన్ శ్రీనాథ్ నారాయణన్‌కు, మహిళల జట్టు కోచ్, కెప్టెన్ అభిజిత్ కుంతేకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. భారత బృందం చీఫ్ దివ్యేందు బారువాకు రూ. 10 లక్షలు, అసిస్టెంట్ కోచ్‌లకు రూ. 7 లక్షల 50 వేల చొప్పున లభిస్తాయి. -
బంగారం... మన చదరంగం
బుడాపెస్ట్: ప్రపంచ చదరంగ సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైతే చెస్ ఒలింపియాడ్‌లో బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని భారత క్రీడాకారులు దర్జాగా పూర్తి చేశారు. ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తులు వేశారు. తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరసి ఇన్నాళ్లూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి. » ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి. » గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి. » వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. » చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా... భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. » పురుషుల 11వ రౌండ్ గేముల్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెల్పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్ డెమ్చెంకోపై నెగ్గగా... మాతెజ్ సబెనిక్తో జరిగిన గేమ్‌ను విదిత్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. » మహిళల 11వ రౌండ్ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్ బలజయేవాపై గెలుపొందగా... ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. » గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా... భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.కల నిజమైంది చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రస్థానం 13 ఏళ్ల వయస్సులో 2004లో మొదలైంది. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు నా స్వర్ణ స్వప్నం సాకారం అయింది. స్వదేశంలో 2022లో జరిగిన ఒలింపియాడ్‌లో పసిడి పతకం సాధించే అవకాశాలున్నా ఆఖర్లో తడబడి చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాం. కానీ ఈసారి ఆఖరి రౌండ్లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడి ‘బంగారు’ కలను నిజం చేసుకున్నాం. ఈసారి ఒలింపియాడ్‌కు నేను ప్రత్యేక సన్నాహాలు చేయకుండానే బరిలోకి దిగాను. ఈ మెగా టోర్నీలో నా అపార అనుభవం ఉపయోగపడింది. నాతోపాటు దివ్య, వంతిక, వైశాలి, తానియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాం. పటిష్ట జట్లతో ఆడి పోరాడి గెలిచాం. ఈ స్వర్ణ పతకానికి మేమందరం అర్హులం. –‘సాక్షి’తో హారిక -
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
‘ఈత’కు చేతులు కావాలా!.. స్వర్ణాల వీరుడు
పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనే వారంతా వివిధ రకాల వైకల్యాలతో ఇబ్బంది పడేవారే. నిబంధనలకు అనుగుణంగా దాదాపు తమలాంటి శారీరక లోపాలతో ఉన్న వ్యక్తులతోనే వారంతా పోటీ పడటం కూడా వాస్తవమే. అయినా సరే కొందరు ఆటగాళ్ల శారీరక లోపాలు అయ్యో అనిపిస్తాయి. మరికొందరి పోరాటం కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాంటి జాబితాలో ఉండే ప్లేయర్ గాబ్రియెల్ డాస్ సాంతోస్ అరాజో.డాల్ఫిన్ తరహాలో దూసుకుపోతాడుబ్రెజిల్కు చెందిన ఈ స్విమ్మర్ ఈత కొలనులో దూసుకుపోతున్న తీరు చూస్తే ఎలాంటి వైకల్యమైనా తలవంచి అభివాదం చేస్తుంది. పుట్టుకతోనే ‘ఫోకోమెలియా’ అనే వ్యాధి బారిన పడటంతో గాబ్రియెల్ రెండు చేతులూ పూర్తిగా కోల్పోయాడు. కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. ఇలాంటి స్థితిలోనూ అతను స్విమ్మింగ్‌పై ఆసక్తి చూపించి కొలనులోకి దిగాడు. మిగిలిన శరీరాన్ని మాత్రమే కదిలిస్తూ డాల్ఫిన్ తరహాలో ఈతలో దూసుకుపోయే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తీవ్ర సాధనతో పారాలింపిక్ స్విమ్మర్‌గా ఎదిగాడు. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల గాబ్రియెల్ బ్రెజిల్ దేశానికి తొలి పతకాన్ని అందించాడు. ఎస్2 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దూసుకుపోయిన అతను స్వర్ణం గెలుచుకున్నాడు. స్వర్ణాల వీరుడుఅంతేకాదు.. 1 నిమిషం 53.67 సెకన్లలోనే అతను దీనిని పూర్తి చేయడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన ఘనత గాబ్రియెల్ అతని సొంతం. విజయం సాధించిన తర్వాత తమ దేశ సాంప్రదాయ ‘సాంబా’ నృత్యాన్ని అతను ప్రదర్శించిన తీరు గాబ్రియెల్ ఘనతకు మరింత ప్రత్యేకతను తెచ్చింది. View this post on Instagram A post shared by Paralympics (@paralympics) -
భారత్ ‘పసిడి పట్టు’
అమ్మాన్ (జోర్డాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు తమ పట్టు నిరూపించుకుంటున్నారు. ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. గురువారం జరిగిన నాలుగు ఫైనల్స్‌లో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఎదురులేని విజయాలు సాధించి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. అదితి కుమారి (43 కేజీలు), నేహా (57 కేజీలు), పుల్కిత్ (65 కేజీలు), మాన్సీ లాథెర్ (73 కేజీలు) ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు. శుక్రవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాజల్ (69 కేజీలు), శ్రుతిక శివాజీ పాటిల్ (46 కేజీలు) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకాల కోసం పోటీపడతారు. రాజ్‌బాలా (40 కేజీలు), ముస్కాన్ (53 కేజీలు), రజీ్నత (61 కేజీలు) కాంస్య పతకాల రేసులో ఉన్నారు. 49 కేజీల విభాగంలో భారత్ నుంచి ఎవరూ బరిలోకి దిగలేదు. ఓవరాల్‌గా భారత అమ్మాయిల జట్టకు టీమ్ ట్రోఫీ టైటిల్ లభించే అవకాశం కూడా ఉంది. 43 కేజీల ఫైనల్లో అదితి 7–0తో మరియా లుజా జికికా (గ్రీస్)పై గెలుపొందగా... 57 కేజీల ఫైనల్లో నేహా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో 10–0తో జపాన్ రెజ్లర్ సో సుత్సుయ్‌ను చిత్తు చేయడం విశేషం. 3 నిమిషాల 59 సెకన్లలో నేహా జపాన్ రెజ్లర్‌పై పది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. 65 కేజీల ఫైనల్లో పుల్కిత్ 6–3తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ దరియా ఫ్రోలోవాపై నెగ్గింది. 73 కేజీల ఫైనల్లో మాన్సీ 5–0తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ హనా పిర్స్కాయాపై గెలిచింది. -
Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు
Diana Taurasi: ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా పారిస్ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్ లీ వెన్వెన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్వెన్ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది. చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్ (49 కేజీలు), షిఫాంగ్ లువో (59 కేజీలు), లీ ఫాబిన్ (61 కేజీలు), లీ హువాన్హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
నఫీసాటు సంచలనం
పారిస్: ఒక్క క్రీడాంశంలో పోటీపడి ఒలింపిక్ పతకం గెలవాలంటేనే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ఈవెంట్లో ఏడు క్రీడాంశాలు ఉంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బెల్జియం క్రీడాకారిణి నఫీసాటు థియామ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏడు క్రీడాంశాల సమాహారమైన ‘హెప్టాథ్లాన్’లో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో హెప్టాథ్లాన్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా నఫీసాటు థియామ్ కొత్త చరిత్ర లిఖించింది. హెప్టాథ్లాన్‌లో 100 మీటర్ల హర్డిల్స్ రేసు, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల రేసు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల రేసు ఉంటాయి. ఈ ఏడింటిలో ఆయా అథ్లెట్స్ సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. పారిస్ ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల నఫీసాటు 6880 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నఫీసాటు పసిడి పతకాలు సాధించింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కాటరీనా జాన్సన్ థాంప్సన్ (బ్రిటన్; 6844 పాయింట్లు) రజతం, నూర్ విడిట్స్ (బెల్జియం; 6707 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
అజేయ అమెరికా
ఒలింపిక్స్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు సొంతం చేసుకుంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు పరాజయం అన్నదే ఎరగకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలో వరుసగా 60 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ‘పారిస్’ క్రీడల్లో ఫైనల్ చేరడం ద్వారా అమెరికా ఈ ఘనత సాధించింది. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్లో అమెరికా 85–64తో ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది. నేడు ఫ్రాన్స్‌తో స్వర్ణం కోసం తలపడనుంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచింది. ఈసారి కూడా పసిడి కైవసం చేసుకుంటే.. విశ్వక్రీడల చరిత్రలో వరుసగా 8 బంగారు పతకాలు గెలిచిన తొలి టీమ్‌గా చరిత్ర కెక్కనుంది. -
డైవింగ్‌లో చైనా క్లీన్‌స్వీప్
పారిస్ ఒలింపిక్స్ డైవింగ్ క్రీడాంశంలో చైనా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అక్వాటిక్ సెంటర్లో అద్భుతాలు చేసిన చైనా డైవర్లు రికార్డు స్థాయిలో ఎనిమిది స్వర్ణాలతో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని పసిడి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. శనివారం పురుషుల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ కావో యున్ (చైనా) 547.50 పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ డైవింగ్‌లో 1988 తర్వాత స్వర్ణం నిలబెట్టుకున్న మొదటి స్విమ్మర్‌గా కావో యున్ నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రెగ్ లుగానిస్ 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. తమాయి రికుటో (జపాన్; 507.65 పాయింట్లు), విలియమ్స్ నోహ్ (గ్రేట్ బ్రిటన్; 497.35 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. గతంలో ఎనిమిదింట ఏడు పతకాలు నెగ్గిన చైనా... ఈసారి మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. ‘పారిస్’ క్రీడల్లో డైవింగ్ విభాగంలో జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ పోటీల్లో చైనా స్విమ్మర్లు అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. చైనా డైవర్లు ఈ ఎనిమిది విభాగాల్లో స్వర్ణాలే కాకుండా.. మరో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలిచి మొత్తంగా డైవింగ్లోనే 11 పతకాలు పట్టారు. -
బంగారు బైల్స్.. ప్యారిస్ ఒలిపింక్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ (ఫోటోలు)
-
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్‌కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్‌గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అస్తానా (కజకిస్తాన్): ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు)... విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్)పై, పూనమ్ 4–1తో సకిష్ అనెల్ (కజకిస్తాన్)పై, ప్రాచి 4–1తో అనర్ తుసిన్బెక్ (కజకిస్తాన్)పై, ముస్కాన్ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు.విశ్వనాథ్ సురేశ్ 5–0తో కరాప్ యెర్నర్ (కజకిస్తాన్)పై, సబీర్ యెర్బోలత్ (కజకిస్తాన్)పై నిఖిల్, ఆకాశ్ 4–1తో రుస్లాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్–22, యూత్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు. -
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్‌లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్‌తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరుగుతాయి. -
భారత్‌కు పతకాల పంట
దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. మహిళల లాంగ్‌జంప్‌లో పావన నాగరాజ్ (6.32 మీటర్లు)... షాట్‌పుట్‌లో అనురాగ్ (19.23 మీటర్లు)... 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రణ్వీర్ (9ని:22.62 సెకన్లు), ఏక్తా డే (10ని:31.92 సెకన్లు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. -
ధీరజ్ ధమాకా
బాగ్ధాద్ (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీ తొలి అంచె టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో విజేతగా నిలిచాడు. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ 7–3తో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్‌ను ఓడించాడు. టీమ్ విభాగం ఫైనల్లో ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 6–2తో ఇస్లామ్, రూబెల్, అలీఫ్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టుపై గెలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధీరజ్–సిమ్రన్జోడీ 6–0తో దియా–ఇస్లామ్ జంట (బంగ్లాదేశ్)పై నెగ్గింది. ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్నాడు. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నలో ధీరజ్ రజత పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. -
WC: ఏపీ షూటర్ ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణం
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. సోమవారం జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఉమామహేశ్ బంగారు పతకం నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కూడా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఉమామహేశ్–ఇషా తక్సాలె (భారత్) జోడీ 16–8 పాయింట్ల తేడాతో అన్వీ రాథోడ్–అభినవ్ షా (భారత్) జంటను ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
Asian Para Games: భారత్ సరికొత్త చరిత్ర.. వందో పతకం గోల్డ్! ఎవరిదంటే
Asian para games 2023: ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు. పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్.. భారత్ గర్వించదగ్గ మధుర జ్ఞాపకాల్లో తన పేరును ‘సువర్ణా’క్షరాలతో లిఖించుకున్నాడు. కాగా ఆసియా పారా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది. ప్రధాని మోదీ అభినందనలు ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ.. ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదంటూ అథ్లెట్లను మోదీ అభినందించారు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? 100 MEDALS at the Asian Para Games! A moment of unparalleled joy. This success is a result of the sheer talent, hard work, and determination of our athletes. This remarkable milestone fills our hearts with immense pride. I extend my deepest appreciation and gratitude to our… pic.twitter.com/UYQD0F9veM — Narendra Modi (@narendramodi) October 28, 2023 -
Reeni Tharakan: బామ్మ పవర్
53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్నెస్ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్ సందేశం ఇస్తోంది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.పి.ఎఫ్) చాంపియన్‌షిప్స్ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్ నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం. భారీ పోటీ మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. డెడ్లిఫ్టింగ్లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్. బరువు తగ్గడానికి వెళ్లి రీని తారకన్ కొచ్చిన్ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్కు అనిపించింది. దాంతో కొచ్చిన్ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్ లో చేరింది. ఇంటినుంచి జిమ్ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్లిఫ్టర్ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్. సమర్థింపులు, సూటిపోట్లు ‘నేను పవర్‌లిఫ్టర్ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్. -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్‌లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్‌లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్‌గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్‌పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్‌పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
పసిడి పారుల్ అన్ను బంగారం
చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్‌కు 5000 మీటర్ల విభాగంలో పారుల్... జావెలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్యం... పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రజతం గెల్చుకున్నారు. అథ్లెటిక్స్ కాకుండా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు... కనోయింగ్‌లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్‌గా ఆసియా క్రీడల పదో రోజు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్‌లో మరో పతకం... క్రికెట్లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్‌కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం గెలిచింది. గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్ (2010–రజతం), కవితా రౌత్ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు. మూడో ప్రయత్నంలో... వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్‌ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు. ‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో గతంలో బార్బరా వెబ్‌స్టర్ (1951; కాంస్యం), ఎలిజబెత్ డావెన్‌పోర్ట్ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్ కౌర్ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్‌లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 49 ఏళ్ల తర్వాత... పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో 49 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్ సింగ్ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్ జాతీయ రికార్డును తేజస్విన్ సవరించాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్‌కు పతకం అందించిన డెకాథ్లెట్‌గా తేజస్విన్ గుర్తింపు పొందాడు. -
చైనాలో కొనసాగుతున్న భారత్ పతకాల వేట.. చరిత్ర సృష్టించిన ముఖర్జీ సిస్టర్స్
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది. కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! ముఖర్జీ సిస్టర్స్‌కు కాంస్యం టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓 🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫 They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p — SAI Media (@Media_SAI) October 2, 2023 రోలర్ స్కేటింగ్‌లో.. భారత స్కేటింగ్ రిలే టీమ్ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. అబ్బాయిలు సైతం.. రోలర్ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ. రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు. 🥉 BACK TO BACK BRONZE GLORY 🇮🇳 What a start to the day! ☀️ 🇮🇳's Aryan Pal, Anand Kumar, Siddhant, and Vikram have rolled their way to BRONZE in the Men's Speed Skating 3000m Relay, clocking an incredible time of 4:10.128! 🤩 🛼 Let's give them a roaring applause for their… pic.twitter.com/WkLDxvKvTS — SAI Media (@Media_SAI) October 2, 2023 -
భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శనివారం మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో వచ్చి చేరింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో థైపీ జోడీని బోపన్న, రుతుజా ద్వయం ఓడించింది. కాగా ఇది భారత్‌కు 9వ గోల్డ్‌మెడల్ కావడం గమానార్హం. ఇక ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్ కప్ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
భారత్ బంగారు గురి
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో రిథమ్ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. అనాహత్ అదరహో డాలియన్ (చైనా): భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3–1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోరీ్నలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. అండర్–19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్–19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్–15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. చాంపియన్ వృత్తి అగర్వాల్ భువనేశ్వర్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోరీ్నలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. హైదరాబాద్ అమ్మాయి వృత్తి అగర్వాల్ గ్రూప్–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించింది. వృత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది. గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని శిక్షణ తీసుకుంటోంది. నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్ ప్రీతమ్ రెండు కాంస్యాలు నెగ్గారు. -
భారత షూటర్ల జోరు.. సిఫ్ట్ కౌర్‌కు రెండు స్వర్ణాలు ..
చెంగ్డూ: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్లు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు. పంజాబ్ అమ్మాయి సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో, వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 3527 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ 462.9 పాయింట్లతో విజేతగా నిలువగా, ఆశి చౌక్సీ 461.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అర్జున్ సింగ్ చీమా, వరుణ్ తోమర్, అన్మోల్ జైన్‌లతో కూడిన భారత జ ట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
మను భాకర్‌కు రెండు స్వర్ణాలు
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్ మనూ భాకర్ రెండు పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో శనివారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. టీమ్ ఈవెంట్లో ఆమెతో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్, అభింద్య అశోక్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది. -
ఇంటి పేరు గోల్డ్ మెడల్
‘గొడ్ల చావిడిలో పశువుల ఆలనా పాలనా స్త్రీలు చూసినప్పుడు వాటికి వైద్యం మేమెందుకు చేయలేము’ అంటున్నారు నేటి యువతులు.శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ చదివిన లొగుడు ప్రత్యూష ఏకంగా 7 గోల్డ్ మెడల్స్ సాధిస్తే, తీర్థాల హేమనయని 5 గోల్డ్ మెడల్స్సాధించింది.వెటర్నరీ రంగంలో 60 శాతం సీట్లు అమ్మాయిలే సొంతం చేసుకుంటున్నారని పశు వైద్యరంగంలో తమ సామర్థ్యం చూపి ఉపా ధి అవకాశాలు అందుకుంటున్నామని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పశువైద్యానికి సంబంధించిన ఏకైక యూనివర్సిటీ– శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. జూలై 22న జరిగిన 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ (బి.వి.ఎస్.సి) కోర్సులో ఒకరు ఏడు స్వర్ణాలు, మరొకరు ఐదు స్వర్ణాలు సాధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పుడు పశు వైద్యంలో మగవారే 90 శాతం ఉండేవారు. నేడు అరవై నుంచి డెబ్బయి శాతం అమ్మాయిలే ఉంటున్నారు. బి.వి.ఎస్.సిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 200 పై చిలుకు సీట్లు ఉంటే వాటిలో ప్రతి ఏటా అమ్మాయిలే ఎక్కువ సీట్లు ΄పొందుతున్నారు. తిరుపతి, పోద్దుటూరు, గన్నవరం, గరివిడిలలో ఉన్న నాలుగు కాలేజీలు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కిందకే వస్తాయి. సీట్లు తక్కువే అయినా వాటిని ΄పొందుతున్న అమ్మాయిలు ఎక్కువ. ‘ఈ రంగంలో మాకు ఆసక్తి ఉంది. చేయగల సామర్థ్యం ఉంది. అవకాశాల పట్ల ఎరుక ఉంది’ అంటున్నారు వాళ్లు. 7 స్వర్ణాలు సాధించిన ప్రత్యూష, 5 స్వర్ణాలు సాధించిన హేమనయని అంతరంగాలు... ఆంధ్రా నుంచి అమెరికా వరకు అవకాశాలు మనుషులకు వైద్యం చేసే డాక్టర్లు మనుషులకు మాత్రమే చేస్తారు. కాని మేము భిన్న జంతు జీవాలకు వైద్యం చేస్తాం. కుక్క, పిల్లి, ఆవు, గేదె, గుర్రం, గొర్రె... ఒక్కోదానికి ఒక్కో రీతిన వైద్యం చేయాలి. నేడు పశువైద్యం చదివితే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లేదంటే కొద్దిపా టి పెట్టుబడితో పెట్ క్లినిక్ పెట్టుకుంటే మంచి ఉపా ధి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఎన్నో ఉపా ధి అవకాశాలు వెటర్నరీ డాక్టర్లకు ఉండటం వల్ల, రిజర్వేషన్ ప్రయోజనం అదనంగా జతై నేడు ఎక్కువమంది అమ్మాయిలు పశువైద్యం చదువుతున్నారు. నేను కూడా ఆ అవగాహనతోనే పోద్దుటూరు వెటర్నరీ కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. నాకు 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొండమంచిలి గ్రామం. నాన్న నా చిన్న వయస్సు నుంచే గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నేను బాగా చదవడానికి మా అక్క, అమ్మ ముఖ్య కారకులు. అక్కయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని నాకు అండగా ఉంటోంది. ఇంటర్ వరకు పా లకొల్లులో చదివాను. ఇంటర్ బై.పి.సిలో 987 మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. జంతువుల పట్ల ప్రేమతో ఎలాగైనా వెటర్నరీ డాక్టర్ కావాలని ఎంసెట్ రాసి 1499 ర్యాంకును సాధించాను. ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని తపన పడేదానిని. రోజుకు సుమారు 4 నుంచి 6 గంటలు చదివాను. సెలవురోజులలో కళాశాలలో ఉన్న లైబ్రరీలను, ల్యాబ్‌లను సందర్శించి ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్‌ను అర్ధం చేసుకుని చదివాను. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం వెటర్నరీ పీజి చేయాలని ప్రవేశ పరీక్ష రాశాను. భవిష్యత్తులో పశువైద్య అధ్యాపకురాలుగా రాణించాలని ఉంది. – తీర్థాల హేమనయని, బి.వి.ఎస్.సి, 5 బంగారు పతకాల గ్రహీత, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ,ప్రోద్దుటూరు. పశు వ్యాధులను శోధించే సైంటిస్ట్ అవుతాను నేనిప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో ‘ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో పిజి సీటు సాధించి వెటర్నరీ మైక్రోబయాలజీ చేస్తుండటం వల్ల మొన్నటి స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయాను. కాని 7 గోల్డ్ మెడల్స్ సాధించడం మాత్రం సంతోషంగా ఉంది. చదువులో బాగా రాణించాలని రోజుకు ఆరు గంటలు చదివాను. సీనియర్లు, అధ్యాపకులు బాగాప్రోత్సహించారు. బి.వి.ఎస్.సిలో ఐదు సంవత్సరాల్లో 18 సబ్జెక్ట్స్ చదువుతాము. వాటిలో దాదాపు 17 గోల్డ్‌మెడల్స్ ఉంటే నాకు 7 వచ్చాయి. మాది అనంతపురం. మా నాన్న గవర్నమెంట్ టీచర్. నేను తిరుపతి కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కావాలని ఇంటర్లో బై.పి.సి చదివి 969 మార్కులు సాధించాను. నీట్లో సీట్ రాకపోయినా బాధపడలేదు. ఎంసెట్‌లో 1248వ ర్యాంకు సాధించి వెటర్నరీ కళాశాలలో బి.వి.ఎస్.సి డిగ్రీలో చేరాను. మనుషులకు వైద్యం చేసే డాక్టరైనా పశువులకు వైద్యం చేసే డాక్టరైనా డాక్టరే. చిన్నప్పటి నుంచి నాకు మూగజీవాలంటే ఇష్టం. ఆడవాళ్లు పశువుల ఆలనా పా లనా బాగా చూస్తారు. వైద్యం కూడా బాగా చేయగలరని నా నమ్మకం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో పశు వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రా తక్కువే ఉంది. కాని ఇటీవల పెట్స్‌కు డిమాండ్ పెరిగింది. అయితే రేబిస్ వంటి ఏ ఒకటి రెండు వ్యాక్సిన్ల గురించి మాత్రమే కాకుండా పశువులకు సంబంధించిన ఎన్నో వ్యాక్సిన్ల గురించి తగినంత చైతన్యం రావాలి. నాకైతే పశువులకు వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సైంటిస్ట్ కావాలని ఉంది. వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవి పశువులకు ఎలా జబ్బులు కలిగిస్తాయో పరిశోధనలు కొనసాగుతూ ఉంటే పశువులను కాపా డటమే కాదు వాటి వల్ల మనుషులకు వచ్చే జబ్బులను కూడా నిరోధించి మనుషులనూ కాపా డవచ్చు. – లొడుగు ప్రత్యూష, బి.వి.ఎస్.సి, ఏడు బంగారు పతకాల గ్రహీత, ఎస్.వి. వెటర్నరీ కళాశాల, తిరుపతి -
పసిడి పతకాలతో ముగింపు
చాంగ్వాన్ (కొరియా): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత షూటర్లు పసిడి పతకాలతో ముగించారు. ఈ టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం లభించాయి. పురుషుల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కమల్జీత్ 544 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కమల్జీత్, అంకిత్ తోమర్, సందీప్ బిష్ణోయ్‌లతో కూడిన భారత జట్టు 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో 1617 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. మహిళల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో టియానా 519 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. టియానా, యశిత షోకీన్, వీర్పాల్ కౌర్‌లతో కూడిన భారత జట్టు మహిళల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో 1498 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత షూటర్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 17 పతకాలతో రెండో స్థానంలో నిలిచారు. 28 పతకాలతో చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా..మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్(World Master Athletics Indoor Championship)లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో ఈవెంట్స్‌లో భగవానీ దేవి డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. హర్యానాలోని ఖేడ్కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్‌కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది. అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో క్లర్క్‌గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్ డాగర్ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్నాడు. India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW — ANI (@ANI) March 29, 2023 🙏🙏🙏🙏🙏 https://t.co/IUdldckOOc — ATHLETE BHAGWANI DEVI DAGAR (@BhagwaniDevi94) March 6, 2023 చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
ఆ విశేషణాలకు అసలు అర్థం అతడే! సరదాలు ఎక్కువై.. అప్పుడు దారితప్పినా..
మెరుపు ఎలా ఉంటుందో దగ్గరి నుంచి చూశారా.. అతని పరుగు చూస్తే చాలు తెలిసిపోతుంది! రెప్పపాటు కాలంలో, కళ్లు మూసి తెరిచేలోగా అంటూ విశేషణాలు తరచుగా వాడేస్తుంటామా.. వాటి అసలు అర్థం ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది! పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం ఏమిటో చెప్పాలా.. అథ్లెటిక్స్‌లో అతడు సాధించిన ఘనతలు చూస్తే మరెవరికీ అవి సాధ్యం కావని అర్థమవుతుంది! ఒకటి కాదు రెండు కాదు, ట్రాక్ పైకి అడుగు పెట్టగానే అతని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్న ప్రపంచ రికార్డులు, ఒలింపిక్స్ పతకాలు, లెక్కలేనంత అభిమాన గణం.. ఎంతటి సాధారణ నేపథ్యమైనా సరే విజయానికి దానితో పని లేదని.. ఆటతో, శ్రమతో, పట్టుదలతో శిఖరానికి చేరవచ్చని నిరూపించిన దిగ్గజం! తన ప్రతి పరుగుతో ట్రాక్‌ను శాసించిన ఆ అద్భుతం.. ఉసేన్ బోల్ట్!! మైకేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్.. ప్రపంచ క్రికెట్‌కు జమైకా అందించిన దిగ్గజ పేస్ బౌలర్లు. ఉసేన్ బోల్ట్ కూడా వారి బాటలోనే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. అయితే అతని భవిష్యత్తు మరో రూపంలో ఎదురుచూస్తోందని బోల్ట్‌కు తెలీదు. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో బోల్ట్ ఆడుతున్నప్పుడు చూసిన కోచ్ అతనికి మరో మార్గాన్ని నిర్దేశించాడు. నీకున్న మెరుపు పరుగుకు క్రికెట్ కంటే అథ్లెటిక్స్ బెటర్. ఆ రంగమైతే మరింత ‘వేగంగా’ ఎదుగుతావు అని చెప్పాడు. అప్పుడే సీన్ లోకి వచ్చిన అథ్లెటిక్స్ కోచ్ మెక్నీల్ ఆ కుర్రాడిలోని ప్రతిభను సానబెట్టడంతో బంగారు భవిష్యత్తుకు పునాది పడింది. ఆ తర్వాత అతని సహజ ప్రతిభతో స్కూల్ స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న కరీబియన్ స్పోర్ట్స్ (కరిఫ్తా గేమ్స్)లో రెండు రజత పతకాలు సాధించడంతో అతని ఆట గురించి జమైకా బయట కూడా తెలిసింది. కొత్త తారగా దూసుకెళ్లి.. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య జూనియర్, యూత్ స్థాయిలోనూ అధికారికంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది. ఆ టోర్నీల్లో రాణిస్తే ఇక బంగారు భవిష్యత్తు ఉండటం ఖాయమని ఒక అంచనా. 15 ఏళ్ల వయసులో బోల్ట్ హంగేరీలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ప్రపంచ వేదికపై ఇదే అతనికి తొలి మెగా ఈవెంట్. అయితే 200 మీటర్ల పరుగులో అతను కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇదే కారణం వల్ల కావచ్చు.. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అతను ఆటపై దృష్టి పెట్టకుండా దూరం జరుగుతూ పోయాడు. అయితే కోచ్‌లు సరైన సమయంలో కల్పించుకోవడంతో మళ్లీ దారిలోకి వచ్చాడు. మరుసటి ఏడాదే కింగ్‌స్టన్‌లో వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ జరిగింది. సొంతగడ్డ నుంచే అద్భుతం మొదలైందా అన్నట్లుగా ఈ ఈవెంట్లో బోల్ట్ చెలరేగిపోయాడు. 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు మరో రెండు రజతాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు మొదలైన ఆ జోరు ఆ తర్వాత వేగంగా కొనసాగింది. ఎక్కడ పరుగెత్తినా, ఎక్కడ పాల్గొన్నా వరుస పతకాలు, రికార్డులు వచ్చి చేరాయి. ఈసారీ మరో ప్రమాద హెచ్చరిక! తాజా విజయాలతో బోల్ట్‌కు సరదాలు ఎక్కువయ్యాయని, క్లబ్‌లలో పార్టీలు, జంక్ ఫుడ్లతో దారి తప్పుతున్న అతడిని జాగ్రత్తగా చూసుకోమని జమైకా ప్రభుత్వమే నేరుగా జమైకా అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు చెప్పింది. దాంతో మళ్లీ కొత్తగా దారిలోకి తీసుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఇదే ఆఖరు! ఆ దిగ్గజం మళ్లీ ట్రాక్ తప్పాల్సిన అవసరం రాలేదు. వరల్డ్ చాంపియన్‌షిప్‌తో మొదలు.. బోల్ట్.. ఒలింపిక్స్ ఎంట్రీ 2004 ఏథెన్స్‌లోనే జరిగింది. అయితే తాను కూడా దానిని ఎంతో తొందరగా మర్చిపోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పరుగులో తొలి రౌండ్లోనే అతను వెనుదిరిగాడు. తర్వాతి ఏడాది తొలి ప్రపంచ చాంపియన్ షిప్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఫైనల్స్‌లో అతను చివరి స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో చూపిన ఘనతలు సీనియర్‌కు వచ్చే సరికి కనిపించకపోవడంతో బోల్ట్‌పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఇది అతనిలో కసిని పెంచింది. దాదాపు రెండేళ్ల పాటు అన్నీ వదిలి అతను ఒకే ఒక లక్ష్యంతో తీవ్ర సాధన చేశాడు. తన స్ప్రింట్స్ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని 200 మీటర్లే కాదు, 100 మీటర్ల పరుగులోనూ పాల్గొంటానంటూ కోచ్‌తో పట్టుబట్టి మరీ తన మాట నెగ్గించుకున్నాడు. 2007 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గెలిచిన 2 రజతాలు బోల్ట్‌ను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో, వరల్డ్ చాంపియన్ షిప్లో అతని విజయధ్వానం వినిపించింది. అలా ముగిసింది.. 2017 ఆగస్టు.. లండన్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతోంది. అంతకు ముందు ఏడాదే రియో ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన తర్వాత బోల్ట్ ఆటకు గుడ్‌బై చెప్పవచ్చని వినిపించింది. అయితే కొన్ని ఒప్పందాలు, ఇతర కారణాల వల్ల అతను మరో మెగా ఈవెంట్‌కు సిద్ధం కావాల్సి వచ్చింది. అయితే పతకాలు సాధించే చాన్సెస్ పట్ల కొన్ని సందేహాలు ఉన్నా.. అతనిపై అభిమానులకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. అది 100 మీటర్ల రేస్‌లో కనిపించింది. అయితే భయపడినట్లుగానే అనూహ్య ఫలితం వచ్చింది. పదేళ్ల కాలం పాటు ఓటమి లేకుండా ట్రాక్‌ను శాసించిన బోల్ట్ చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పందెంలో పాల్గొనని బోల్ట్.. తన అభిమానుల కోసం దేశం తరఫున 4* 100 మీటర్ రిలేలో పరుగెత్తేందుకు సంకల్పించాడు. అది బోల్ట్ చివరి రేస్‌గా ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకించింది. అయితే చివరి లెగ్‌లో జమైకా ఆశలు మోస్తూ పరుగు ప్రారంభించిన బోల్ట్ సగం దూరానికే కుప్పకూలిపోయాడు. కండరాలు పట్టేయడంతో ముందుకు వెళ్లలేక కన్నీళ్లపర్యంతం అయ్యాడు. నిర్వహకులు వీల్‌చైర్ తీసుకు రాగా, వారిని నివారిస్తూ తన సహచరులు తోడుగా రాగా ‘ఫినిషింగ్ లైన్’ను దాటాడు. అథ్లెటిక్స్ ట్రాక్‌పై ఒక అత్యద్భుత ప్రస్థానం చివరకు అలా ముగిసింది. బంగారాల సింగారం.. అథ్లెటిక్స్ చరిత్రలో అనితరసాధ్యమైన రికార్డులు బోల్ట్ పేరిట ఉన్నాయి. మూడు ఈవెంట్లు 100 మీ., 200 మీ., 4* 100 మీ. రిలేలలో మూడేసి చొప్పున వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతను 9 స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్ , 2016 రియో ఒలింపిక్స్‌లలో అతను ఈ ఘనత సాధించాడు. 6 ప్రపంచ చాంపియన్ షిప్‌లతో కలిపి 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం అతను సాధించాడు. 2008లో స్వర్ణం సాధించిన జమైకా రిలే జట్టులో సభ్యుడైన నెస్టా కార్టర్ 2017లో డోపింగ్‌లో పట్టుబడటంతో ఆ ఫలితాన్ని రద్దు చేసి పతకం వెనక్కి తీసుకోవడంతో బోల్ట్ ఖాతాలో 8 స్వర్ణాలు మిగిలాయి. అయితే ఇది తన ఘనతను ఏమాత్రం తగ్గించదని అతను చెప్పుకున్నాడు. టు ద వరల్డ్ ఉసేన్ బోల్ట్ అనగానే అందరి మదిలో మెదిలే దృశ్యం విజయానంతరం అతను ఇచ్చే పోజ్! సామాన్యుడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగానని చెప్పేలా ‘టు ద వరల్డ్’ అంటూ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక దశలో ప్రపంచ ప్రముఖులు ఎంతో మంది దీనిని అనుకరించి చూపించడం విశేషం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
జిమ్నాస్టిక్స్‌లో ఏపీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలికల ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు. జిమ్నాస్టిక్స్ అండర్–19 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్) స్వర్ణం, డి.దేవ్ (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు. కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్–బి రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్థాన్ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్–19) పూల్‌లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్–19) పూల్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన ఆయూష్ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా నిలిచారు. 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది. 226 పాయింట్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, అయూష్ చర్పొట, రంజిత్, సునీల్ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్‌గఢ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్‌లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్‌హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్‌గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. -
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా
యుజీన్ (అమెరికా): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్లాఫ్లిన్లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు. స్వర్ణంతో ఫెలిక్స్ రిటైర్... అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4్ఠ400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4్ఠ400 మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది. -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన యువకుల సత్తా
అనంతగిరి/ జి.మాడుగుల/ చింతూరు: (అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని అనంతగిరి, జి.మాడుగుల, చింతూరు మండలాలకు చెందిన గిరిజన యువకులు నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన యూత్‌గేమ్స్ ఇండో, నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్–2022 పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ వెన్నెల గ్రామానికి చెందిన ప్రభూషణరావు అండర్–19 విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. అలాగే చింతూరుకు చెందిన కారం చక్రియవర్ధన్ రెండు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. బ్యాడ్మింటన్ అండర్–17 విభాగం సింగిల్స్‌లో చక్రియవర్ధన్ గోల్డ్‌మెడల్ సాధించగా, రంపచోడవరానికి చెందిన లతిక్‌తో కలసి డబుల్స్ విభాగంలోనూ గోల్డ్‌మెడల్ సాధించాడు. అలాగే అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీకి చెందిన పాంగి గౌతమ్ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. అనంతగిరి పంచాయతీ పెద్దూరు గ్రామానికి చెందిన కమిడి సూర్య, గౌతమ్ కలిసి డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు. (క్లిక్: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా) -
Junior World Cup: మనోళ్ల గురి అదిరింది
సాక్షి, హైదరాబాద్/విజయవాడ స్పోర్ట్స్: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ షూటర్ మద్దినేని ఉమామహేశ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్జీత్లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది. -
జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...
ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్‌గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది. పూర్వ విద్యార్థుల చేయూత క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి జేఎన్టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సతీష్‌రెడ్డి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్‌డీని జేఎన్టీయూ హైదరాబాద్‌లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్డీఓ చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారు. 35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్‌డీలు జేఎన్టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. బంగారు కొండలు వీరే... జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎం. సతీష్‌కుమార్‌రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్ఈలో బి. సరయూ, కెమికల్ ఇంజినీరింగ్‌లో బి. వీరవంశీకుమార్ బంగారు పతకాలను సాధించారు. సువర్ణ విజేత.. సుప్రజ జేఎన్టీయూ అనంతపురం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్ తిరువెంగళం గోల్డ్‌మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ టీఎస్ రాఘవన్ గోల్డ్‌మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్‌మెడల్, కళాశాల టాపర్ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్‌మెడల్ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు. చదువుల తల్లి .. మైథిలి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ టాపర్‌గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యారు. సివిల్ ఇంజినీరింగ్‌లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్ టాపర్ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు. మెకానికల్ టాపర్ .. సతీష్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.సతీష్‌రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్ బ్రాంచ్ టాపర్‌తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్‌మెడల్ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు. అగ్రగామిగా తీర్చిదిద్దుతాం జేఎన్టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. – జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
సత్తా చాటిన భారత ఆర్చర్లు.. ఆసియాకప్‌లో మూడు స్వర్ణాలు
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీలో భారత గురి అదిరింది. మంగళవారం జరిగిన పోటీల్లో మన ఆర్చర్లు 3 స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుపొందారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో పర్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీలతో కూడిన భారత జట్టు 204–201తో కజకిస్తాన్ జట్టును ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల ఫైనల్లో ప్రథమేశ్, రిషభ్ యాదవ్, సమాధాన్ బృందం 224–218తో బంగ్లాదేశ్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఇక మూడో స్వర్ణం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రథమేశ్–పర్నీత్ కౌర్ సాధించారు. ఫైనల్లో ఈ జోడీ 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సమాధాన్ 147–145తో సెర్గెయ్ క్రిస్టిచ్ (కజకిస్తాన్)పై గెలిచి రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు భారత ఆర్చర్లు పది పతకాల కోసం పోటీపడనున్నారు. -
డెఫిలింపిక్స్‌లో మెరిసిన హైదరాబాద్ షూటర్..భారత్‌కు గోల్డ్‌మెడల్
విశ్వ వేదికపై తెలుగు తేజం ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన గురితో అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో ఈ తెలంగాణ యువ షూటర్ భారత్‌కు బంగారు బోణీ అందించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన శౌర్య సైనీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనే కాంస్య పతకం దక్కించుకున్నాడు. గత ఏడాది ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో స్వర్ణం... 2019లో ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు గెలిచిన ధనుష్ శ్రీకాంత్ అదే జోరును డెఫిలింపిక్స్లోనూ కొనసాగించాడు. కాక్సియస్ డు సుల్ (బ్రెజిల్): భారీ బృందంతో బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత్ ఒకే రోజు మూడు పతకాలతో మెరిసింధి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సంపాదించారు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం... శౌర్య సైనీ కాంస్యం సాధించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో టీమిండియా బంగారు పతకం దక్కించుకుంది. జెర్లీన్, అభినవ్ శర్మ, ఆదిత్య యాదవ్, శ్రేయా సింగ్లా, రోహిత్ భాకెర్, హృతిక్ ఆనంద్‌లతో కూ డిన భారత్ ఫైనల్లో 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం భారత్ మూడు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. కొత్త ప్రపంచ రికార్డుతో... ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్ 247.5 పాయింట్లు స్కోరు చేశాడు. బధిరుల విభాగం ఫైనల్లో ఇది కొత్త ప్రపంచ రికార్డు కావడం విశేషం. గతంలో ఈ రికార్డు కొలిన్ ముల్లర్ (జర్మనీ; 243.2 పాయింట్లు) పేరిట ఉండేది. ఎలిమినేషన్ పద్ధతిలో 24 షాట్లపాటు జరిగిన ఫైనల్లో కొరియా షూటర్ కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... శౌర్య సైనీ 224.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో ధనుష్ 623.3 పాయింట్లతో రెండో స్థానంలో, శౌర్య 622.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభించాయి. గగన్ నారంగ్ శిక్షణలో... భారత స్టార్ షూటర్, హైదరాబాద్‌కే చెందిన గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో ధనుష్ శ్రీకాంత్ ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. బధిరుడైన శ్రీకాంత్‌కు గగన్ ప్రత్యేక పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. రైఫిల్‌ను ఎలా పట్టుకోవాలి... గురి ఎలా చూడాలి... షూట్ చేసేందుకు ఎలా నిలబడాలి... తదితర విషయాలను కాగితాలపై బొమ్మలు గీసి శ్రీకాంత్‌కు ఈ క్రీడలోని మెళకువలను నేర్పించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లోనూ పతకాలు నెగ్గిన శ్రీకాంత్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు పతకాలు అందించాడు. ఈ నెలలో అజర్బైజాన్లో జరిగే ప్రపంచకప్‌లో ధనుష్ శ్రీకాంత్ భారత సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించనున్నాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్..? -
రవి దహియా కొత్త చరిత్ర
ఉలాన్బాటర్ (మంగోలియా): భారత రెజ్లర్ రవి కుమార్ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్‌గానూ ఘనత వహించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు. -
డబుల్ స్వర్ణ పతకాలు సాధించిన రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. రాజా రిత్విక్, తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి, అరవింద్ చిదంబరం (తమిళనాడు), పురాణిక్ అభిమన్యు (మహారాష్ట్ర), సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)లతో కూడిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు టీమ్ విభాగంలో 16 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగతంగా బోర్డు–5పై ఆడిన రాజా రిత్విక్ ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి మరో స్వర్ణ పతకాన్ని సాధించాడు. బోర్డు–3పై ఆడిన హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి. పతకాలు నెగ్గిన రాజా రిత్విక్, హర్ష భరతకోటిలను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం' -
చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు
జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ పారా స్విమ్మర్ జియారాయ్ నేవీ అధికారి మదన్ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది. మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్ జియాను స్విమ్మింగ్ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్ థెరపీలో భాగంగా వాటర్ గేమ్స్ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది. 14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా. కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్ సెటిల్మెంట్ నుంచి తమిళ నాడులోని ధనుష్కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ‘యంగెస్ట్ స్విమ్మర్’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిలిప్స్ రోల్ మోడల్. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చేప పిల్ల.. కావేరీ ధీమార్.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు. కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్ కెనోయిర్‌గా నిలిచింది. పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కనోయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్ చాంపియన్‌షిప్స్’ లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
ఈ తాత మామూలోడు కాదండోయ్
తాత అనేగానే.. ఒళ్లు కుంగిపోయి, చర్మం ముడతలు పడి, సరిగ్గా కదల్లేక ఓ మూలన కూర్చుంటాడు అనుకుంటారేమో. ‘కబాలీ.. రా’ రేంజ్లో హుషారు చూపిస్తుంటాడీ తాత. ఈ తాత మామూలోడు కాదు. పేరు.. సావాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. ఉండేది థాయ్‌లాండ్ సాముత్ సాంగ్ఖ్రమ్ ప్రావిన్స్‌లో. పోయినవారం అక్కడ 26వ ఇటెరేషన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీకి జరిగిన పోటీల్లో ఈ తాతే మొత్తం మెడల్స్ మెడలో వేసేసుకున్నాడు. స్వతహాగానే ఈ పెద్దాయన ఒక అథ్లెట్. అందుకే ఈ ఏజ్‌లోనూ హుషారుగా పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈసారి పోటీల్లో ఈయనగారు ఏకంగా ఓ రికార్డ్ కూడా నెలకొల్పాడు. తన ఈడు వాళ్లతో పోటీపడి వంద మీటర్ల పరుగు పందెంను 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ పేరిట ఉంది(2009లో 9.58 సెకండ్లు). అలాంటిది ఈ ఏజ్‌లో ఈ తాత ఈ రికార్డును నెలకొల్పడం గొప్పే కదా! Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI — Reuters (@Reuters) March 3, 2022 ఈ గొప్పతనం వల్లే ఈ తాతకి.. లేడీస్లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. యూత్ ఫిజికల్ టిప్స్ కోసం ఈ తాతను కలుస్తుంటారు.. ఇక డెభ్భై ఏళ్ల ఆయన కూతురే సిరిపాన్.. ప్రస్తుతం సావాంగ్కు ట్రయినర్‌గా ఉంది. ఆటలే నన్ను ధృడంగా ఉంచుతున్నాయి. టైంకి మంచిగా తిని.. ఎక్సర్సైజులు గట్రా చేస్తే నాలాగే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నాడు ఈ తాత. వీటితో పాటు పాజిటివ్ మైండ్ తన తండ్రి ఆరోగ్య రహస్యం అంటోంది సిరిపాన్. థాయ్‌లాండ్ మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ పోటీలు 1996 నుంచి నడుస్తున్నాయి. అప్పుడు కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారు. మరి ఇప్పుడో.. 2 వేల మంది.. అదీ 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొంటున్నారు. అంటే.. ఫిట్నెస్ మీద థాయ్‌లాండ్ ప్రజలకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మెహబూబ్ సిస్టర్స్.. అరవై దాటినా పతకాల వేట
అమలాపురం టౌన్ (తూర్పుగోదావరి): పట్టణానికి చెందిన మెహబూబ్ సిస్టర్స్ షకీలా, షాహీరా మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు దేశంలో ఎక్కడికి వెళ్లినా పతకాలు గెలిచి వస్తారు. ఇద్దరికీ అరవై ఏళ్ల వయస్సు దాటినా ఇరవై ఏళ్ల వయసులో ఉన్నట్లే చలాకీగా ఆటలాడేస్తారు. వయసులు మా శరీరానికే గాని మనసులకు కాదని అంటారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్పీవీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన 40వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్–2022 పోటీల్లో మెహబూబ్ సిస్టర్స్ షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో నాలుగు బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు. చదవండి: చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక షకీలా 60 ప్లస్ విభాగంలో షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో మొదటి స్థానాల్లో నిలిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. షాహీరా 70 ప్లస్ విభాగంలో లాంగ్ జంప్‌లో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానాలు సాధించి రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలైన మెహబూబ్ సిస్టర్స్‌ను జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, ఎం.బాపిరాజు అభినందించారు. -
చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి మాజీ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చెర్మన్ చాముండేశ్వరనాథ్ కియా కారును బహుమతిగా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కియా సోనెట్ కారును ఆయన ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవీతో పాటు కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు.. జిమ్నాస్ట్ అరుణారెడ్డికి కారు కీని అందజేశారు. ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో అరణా రెడ్డి కాంస్యం సాధించింది. మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల అరుణ ఈజిప్ట్ కైరోలో మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. -
సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు
టోక్యో: ఆత్మ విశ్వాసం ముందు.. వైకల్యం తలవంచక తప్పదని చైనా స్విమ్మర్ జెంగ్ టావో నిరూపించాడు. టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు. ఆ దేశానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి పెట్టాడు. స్విమ్మింగ్‌లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది పూర్తిగా రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్ టావో నాలుగు బంగారు పతకాలు సాధించి క్రీడా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. అంతకముందు రియో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు జెంగ్ టావో సాధించాడు. చిన్నతనంలో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన జెంగ్ టావో.. అంగవైకల్యం శరీరానికే కాని, మనస్సుకు కాదని... లక్ష్యంతో ముందుకు వెళ్లిన తీరు స్ఫూర్తిదాయకం. ఈ రోజు ప్రపంచ చరిత్రలో తన పేరును లిఖించుకుని అతడు అద్భుతమే చేశాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైన్ల్లో విజయం సాధించగానే.. చైనీయులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎందుకంటే 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో మొదలైన చైనా బంగారు పతకాల పంట నేటికి 500 కు చేరింది. ఆనతరం మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన జెంగ్ టావో... ‘‘నా చిట్టితల్లీ.. చూడు నాకు రెండు చేతులు లేనప్పటికీ నేను చాలా వేగంగా ఈత కొట్టగలను’’ అంటూ తన కుమార్తెకు వీడియో సందేశాన్ని పంపాడు. నివేదికల ప్రకారం.. జెంగ్ టోక్యో పారాలింపిక్స్ సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతిరోజూ కనీసం 10 కిలోమీటర్లు ఈత కొడుతూ ప్రాక్టీస్ చేసేవాడు. కాగా జెంగ్ టావో 13 సంవత్సరాల వయస్సులో స్విమ్మింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో పందొమ్మిదేళ్ల వయస్సులో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటిల్లో అరంగేట్రం చేశాడు. తరువాత 2012 లండన్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తన మొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది పారాలింపిక్ పతకాలు జెంగ్ టావో సాధించాడు. చదవండి: Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో.. Chinese para-swimmer Zheng Tao who has no arms picks up FOURTH gold medal at Tokyo 2020 https://t.co/tir4z54RDD — Daily Mail Online (@MailOnline) September 2, 2021 -
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 జావెలిన్ ఎడిషన్! ఎవరి కోసం?
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఇండియాకు స్వర్ణపతకం సాధించిన సుమిత్ అంటిల్‌కి సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు సుమిత్ అంటిల్ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ప్రత్యేకంగా జావెలిన్ త్రో ఎడిషన్‌గా తయారు చేయాలంటూ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పారా ఒలింపిక్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్ ప్రతిభను ఆయన కొనియాడారు. అంతకు ముందు ఇదే పారా ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో స్వరం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు కూడా ఎక్స్‌యూవీ 700ను బహుమతిగా అందిస్తానంటూ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు జావెలిన్ ఎడిషన్ పారా ఒలింపియన్ దీపా మాలిక్ ఇటీవల తనకు ఎస్యూవీ కార్లు నడపడం అంటే చాలా ఇష్టమనీ పేర్కొన్నారు. తన లాంటి ప్రత్యేక ఎబిలిటీ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయాలంటూ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. వీటికి స్పందించిన ఆనంద్ మహీంద్రా, ఈ ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారి కోసం కారును బహుమతిగా ఇవ్వడమే కాకుండా వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. అందులో భాగంగానే జావెలిన్‌త్రో విజయం సాధించిన సుమిత్ అంటిల్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తోన్న ఎక్స్‌యూవీకి జావెలిన్ ఎడిషన్‌గా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు జావెలిన్ త్రోలో స్వరం సాధించిన సుమిత్ అంటిల్ కృత్రిమ కాలు అమర్చుకుని సాధాన చేసేవాడు. ఈ సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్’ అనే తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే వాడు. కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతున్నా ఆ బాధ తట్టుకుంటూ ప్రాక్టీస్ చేశాడు. చివరికి అద్భుతమైన ఫలితం సాధించాడు. కారు నడిపే సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్ రాకుండా జావెలిన్ ఎడిషన్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. జావెలిన్ విషయానికి వస్తే సుమిత్ కంటే ముందు టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్డా సైతం బంగారు పతకం సాధించాడు. An awesome sporting feat. Without exception. His performance demands an XUV 7OO. India now has TWO Golds in this ancient sport. @BosePratap Please design another Javelin edition of the XUV 7OO that we will be privileged to gift this incredible sportsperson. 👏🏽👏🏽👏🏽 https://t.co/DA22MG1pIF — anand mahindra (@anandmahindra) August 30, 2021 చదవండి : మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా -
Tokyo Paralympics : బుల్లెట్ దిగింది బల్లెం మెరిసింది
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తళుక్కుమన్నారు. ఊహించని విధంగా ఒకేరోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్‌లో 4 పతకాలు నెగ్గడమే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే సోమవారం టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి ఓవరాల్‌గా ఏడు పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 26వ స్థానంలో కొనసాగుతోంది. మరో వారంరోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. టోక్యో: ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో ఏ భారతీయ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను భారత టీనేజ్ షూటర్ అవనీ లేఖరా సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు (బ్యాడ్మింటన్)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్).. 2016 రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ (షాట్‌పుట్), 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్) రజత పతకాలు గెలిచారు. అయితే 19 ఏళ్ల అవని పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది. చెదరని గురి... ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. నిర్ణీత 10 షాట్ల తర్వాత అవని 103.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు షాట్లు ముగిశాక అవని 124.9 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది. అటునుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంటూ చివరకు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 248.9 పాయింట్లతో క్యూపింగ్ జాంగ్ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) కాంస్యం గెలిచారు. అవని గురి పెట్టిన మొత్తం 24 షాట్లలో 20 షాట్లు 10 కంటే ఎక్కువ పాయింట్లవి ఉండటం విశేషం. అంతకుముందు 21 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో అవని 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. సూపర్ సుమిత్... బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్‌లోనే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ కాంతులను విరజిమ్మాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్ బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను మూడు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. హరియాణాకు చెందిన సుమిత్ బల్లెంను తొలి ప్రయత్నంలో 66.95 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2019లో దుబాయ్‌లో 62.88 మీటర్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సుమిత్ సవరించాడు. అనంతరం రెండో ప్రయత్నంలో సుమిత్ జావెలిన్‌ను 68.08 మీటర్ల దూరం పంపించాడు. ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్ల దూరం... నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరం విసిరిన సుమిత్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 68.55 మీటర్ల దూరం విసిరి మూడోసారి ప్రపంచ రికార్డు సవరించడంతోపాటు పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్‌బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు. సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్‌కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. -
వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!
వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్ రూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే.... అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
అదరగొట్టిన కిప్చోగెదే: మరోసారి స్వర్ణం అతడిదే
టోక్యో: పురుషుల మారథాన్ రేసులో తనకు తిరుగులేదని కెన్యా అథ్లెట్ ఎలూయిడ్ కిప్‌చోగె మరోసారి నిరూపించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన అతడు... ఐదేళ్ల తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) కిప్‌చోగె 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో కిప్చోగెకిది నాలుగో పతకం కాగా... ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. అంతేకాకుండా పురుషుల మారథాన్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన మూడో అథ్లెట్‌గా కిప్‌చోగె నిలిచాడు. గతంలో అబెబె బికిలా (ఇథియోపియా–1960, 64), వాల్దెమర్ సిరి్పన్స్కి (జర్మనీ–1976, 80) కిప్‌చోగె కంటే ముందు ఈ ఘనతను సాధించారు. మొత్తం 106 మంది ఈ మారథాన్‌లో పాల్గొనగా... 30 మంది రేసును పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగారు. చదవండి: Tokyo Olympics: 37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారిగా.. -
37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారి; బ్రిటన్ సైక్లిస్ట్ సరికొత్త చరిత్ర
టోక్యో: హ్యాండ్‌బాల్‌లో ఫ్రాన్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 30–25తో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ)పై గెలుపొంది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పురుషుల విభాగంలోనూ ఫ్రాన్స్ జట్టే స్వర్ణాన్ని నెగ్గడంతో... 37 ఏళ్ల తర్వాత రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. కాంస్యం కోసం జరిగిన పోరులో నార్వే 36–19తో స్వీడన్‌పై నెగ్గింది. జేసన్ కెన్నీ రికార్డు స్వర్ణాలు ఒలింపిక్స్‌లో బ్రిటన్ సైక్లిస్ట్ జేసన్ కెన్నీ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల కీరిన్ ఫైనల్ రేసులో జేసన్ అందరి కంటే ముందుగా 10.481 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణాన్ని నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణాన్ని సాధించిన జేసన్... బ్రిటన్ తరఫున అత్యధిక పసిడి పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా ఘనతకెక్కాడు. 0.763 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మొహమ్మద్ అజీజుల్లాస్ని (మలేసియా) రజతాన్ని... హ్యారీ లావ్రిసెన్ (నెదర్లాండ్స్) కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి: భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్ గంభీర్ -
125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇలా తొలిసారి..
టోక్యో: 125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించగా, అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్ చరిత్ర ఇదే తొలిసారి. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా, ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు. కాగా, ఈ ఇద్దరు అన్నా చెలెల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో జపాన్ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఓవరాల్‌గా ఆతిధ్య దేశం ఖాతాలో ఆరు పతకాలు(5 స్వర్ణాలు సహా ఓ రజతం) చేరాయి. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్‌కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. -
సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు అన్నా నేహాథామస్ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్‌కు పలువురు అభినందనలు తెలిపారు. -
రైతు బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్’ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్నొవేషన్ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్ అశోక్ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు. విత్తనం వేసుకునే చేతి పరికరం: పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడే పరికరం అశోక్ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. బహుళ ప్రయోజనకర యంత్రం అశోక్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్ యుటిలిటీ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా! ashokgorre17@gmail.com -
Indian Women Boxers: సప్త స్వర్ణాలు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత బాక్సర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు. బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు విసిరిన పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చాయి. పోలాండ్‌లో గురువారం జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు గీతిక (48 కేజీలు), బేబీరోజీసనా చాను (51 కేజీలు), పూనమ్ (57 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతి (69 కేజీలు), థోక్చోమ్ సనమచ చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యధికంగా ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. ఫైనల్స్‌లో గీతిక 5–0తో నటాలియా (పోలాండ్)పై... బేబీరోజీసనా 5–0తో వలేరియా లింకోవా (రష్యా)పై... పూనమ్ 5–0తో స్థెలిన్ గ్రాసీ (ఫ్రాన్స్)పై గెలిచారు. వింకా పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుల్దిజ్ (కజకిస్తాన్) ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ చివరి రౌండ్ పూర్తి కాకుండానే బౌట్‌ను నిలిపి వేశారు. అరుంధతి 5–0తో బార్బరా (పోలాండ్)పై... సనమచ చాను 3–2తో డానా డిడే (కజకిస్తాన్)పై... అల్ఫియా 5–0తో దరియా కొజోరెజ్ (మాల్దొవా)పై విజయం సాధించారు. శుక్రవారం జరిగే పురుషుల విభాగం ఫైనల్లో భారత్ తరఫున సచిన్ సివాచ్ (56 కేజీలు) బరిలో ఉన్నాడు. -
అంతా ‘బేబీ’ బాక్సర్లే.. భారత్ మొదటి స్థానం
భారత యువ మహిళా బాక్సింగ్ జట్టు తాజా విజయ దరహాసం వెనుక గల అసమాన శక్తి సామర్థ్యాల ఈ విశేషాన్ని బేబీరోజిసాన ఛానుతో మొదలుపెట్టడమే సబబు. యూత్ టోర్నిలో ఈ బేబీ బాక్సర్ బంగారు పతకాన్ని సాధించింది. జట్టులో మొత్తం పది మంది యువతులు ఉండగా మాంటెనెగ్రోలో జరిగిన ఈ యూత్ టోర్నీలో భారత్‌కు పది పతకాలు వచ్చాయి! ఐదు స్వర్ణాలు, మూడు రజితాలు, రెండు కాంస్యాలు. బంగారు పతకాల పట్టికలో కూడా వీరు భారత్‌ను మొదటి స్థానంలో నిలబెట్టారు. రెండు పతకాలతో ఉజ్బెకిస్థాన్, ఒక పతకంతో చెక్ రిపబ్లిక్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐరోపాలోని బాల్కన్ ప్రాంత దేశం అయిన మాంటెనెగ్రో ఆడ్రియాటిక్ సముద్రతీరం వెంబడి ఎగుడుదిగుడు పర్వతాలతో నిండి ఉంటుంది. అక్కడి బుద్వా నగరంలో జరిగిన 30వ ఆడ్రియాటిక్ పెర్ల్ టోర్నమెంట్‌లోనే భారత్ మహిళలు ఈ ఘన విజయాన్ని సాధించుకుని వచ్చారు. అంతా ‘బేబీ’ బాక్సర్లే. బరిలో మాత్రం ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. ఆదివారం టోర్నీ ముగిసింది. యువ బాక్సర్లు పది పతకాలతో వస్తున్నారని తెలియగానే భారత్‌లోని ప్రొఫెషనల్ ఉమెన్ బాక్సర్ల ముఖాలు వెలిగిపోయాయి. బేబీ ఛాను శిక్షణ పొందింది ఇంఫాల్‌లోని మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలోనే! ఆ శిక్షణ ఏ స్థాయిలో ఉందో ఆషియన్ జూనియర్ ఛాంపియన్ సబీనా బొబొకులోవా (ఉజ్బెకిస్తాన్) ను 3–2 తేడాతో ఆమె నాకౌట్ చేసినప్పుడు ప్రత్యర్థి జట్లు కనిపెట్టే ఉంటాయి. మరొక బంగారు పతకం అరుధంతీ చౌదరి సాధించినది. మూడుసార్లు ‘ఖేలో ఇండియా’ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఈ బాక్సింగ్ ఛాంపియన్ ఉక్రెయిన్ బాక్సర్ మార్యానా స్టోయికోను 5–0 తో ఓడించింది. మిగతా మూడు బంగారు పతకాలు అల్ఫియా పఠాన్, వింకా, సనమచ ఛాను సాధించినవి. బెస్ట్ ఉమెన్ బాక్సర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు కూడా మన యువ జట్టుకే దక్కింది. ఆ అవార్డు విజేత వింకా! అబ్బాయిల్ని అనడం కాదు కానీ మన పురుషుల జట్టుకు రెండు మాత్రమే బంగారు పతకాలు సాధ్యం అయ్యాయి. చదవండి: 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను' -
పోలియోను గెలిచి... ఒలింపిక్ వరకు పరుగు
పసితనంలోనే ఆమెకు పోలియో సోకింది. ఇక నడవడం కష్టమే అని డాక్టర్లు తేల్చేశారు. ఆపై మశూచి మహమ్మారి కూడా ఆమెను వదల్లేదు. ఇక కోలుకున్నట్లుగా అనిపించిన సమయంలో న్యుమోనియా దాడి చేసింది. ఒకదశలో బతకడం కూడా కష్టమని అనిపించింది. పదేళ్లు వయసు కూడా దాటక ముందే ఇలాంటి గండాలను ఎదుర్కొనే పిల్లల భవిష్యత్తు సాధారణంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా 22 మంది పిల్లల కుటుంబంలో ఆమె 20వ సంతానం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారిపై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కానీ విల్మా రుడాల్ఫ్ విధిని ఎదిరించింది. కష్టాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. నల్ల జాతీయుల ప్రతినిధిగా వారికి స్ఫూర్తిగా నిలిచింది. పరుగు, పరుగు, పరుగు... విల్మా గ్లాడియాన్ రుడాల్ఫ్ జీవితకాలం ఇష్టపడిన మంత్రం! కొత్తగా రెక్కలొచ్చిన పక్షికి ఎగరాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో బహుశా అదే ఆమెకు స్ఫూర్తినందించి ఉండవచ్చు. ఎందుకంటే పోలియో బారిన పడిన తర్వాత నడవలేనేమో అనుకున్న దశ నుంచి ఆమె కొంత కోలుకుంది. అయితే ఎడమ కాలు బాగా బలహీనంగా మారిపోయింది. కానీ సుదీర్ఘ చికిత్స తర్వాత 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె పాదాల్లో చురుకుదనం వచ్చింది. అంతే...ఆ తర్వాత నడకే కాదు పరుగునే విల్మా ప్రాణంగా మార్చుకుంది. కోచ్ దృష్టిలో పడి... పాఠశాల స్థాయిలో విల్మా బాస్కెట్‌బాల్ ఆడేది. ఆమె చురుకుదనం, వేగంతో స్కూల్ టీమ్‌కు పలు విజయాలు అందించింది. అదే సమయంలో విల్మాపై స్థానిక టెన్నెసీ యూనివర్సిటీ అథ్లెటిక్స్ కోచ్ ఎండ్ టెంపుల్ దృష్టి పడింది. ఆమెలోని సహజ అథ్లెట్ నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్... తమ వేసవి శిబిరంలో చేరాల్సిందిగా సూచించాడు. అక్కడి క్యాంప్‌లో భాగమైన తర్వాత విల్మా పరుగు మరింత మెరుగైంది. ఇదే జోరులో ప్రతిష్టాత్మక అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ నిర్వహించిన ట్రాక్ మీట్లో పాల్గొన్న ఈ అమ్మాయి తాను పాల్గొన్న 9 ఈవెంట్లలో కూడా విజేతగా నిలిచింది. ఆ తర్వాత విల్మా రుడాల్ఫ్ అథ్లెటిక్స్ కెరీర్ అమిత వేగంగా దూసుకుపోయింది. పోలియో నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఆమె అంతర్జాతీయస్థాయిలో పోటీ పడే అథ్లెట్‌గా ఎదగడం విశేషం. ఒలింపిక్ విజేతగా... విల్మా స్కూల్ చదువు కూడా పూర్తి కాక ముందే 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ కోసం అథ్లెటిక్స్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. 16 ఏళ్ల విల్మా ఇందులో పాల్గొని సత్తా చాటింది. 200 మీటర్ల పరుగులో పోటీ పడేందుకు జట్టులోకి ఎంపికై, మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూఎస్ జట్టులో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 200 మీటర్ల పరుగులో హీట్స్‌లోనే విఫలమై వెనుదిరిగినా... రిలే రూపంలో ఆమెకు మరో అవకాశం దక్కింది. అమెరికా మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. ఇందులో భాగంగా ఉన్న విల్మా ఖాతాలో తొలి ఒలింపిక్ పతకం చేరింది. బంగారు బాల... విల్మా కెరీర్ మరో నాలుగేళ్ల తర్వాత శిఖరానికి చేరింది. మెల్బోర్న్ ఒలింపిక్స్ అనుభవంతో ఆమె తర్వాతి ఒలింపిక్స్‌కు మరింత పట్టుదలగా, కఠోర శ్రమతో సిద్ధమైంది. దాని ఫలితమే 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగులో వ్యక్తిగత స్వర్ణాలు గెలుచుకున్న ఈ స్ప్రింటర్ 4్ఠ100 మీటర్ల రిలేలో ఈసారి తన పతకం రంగు మార్చుకుంది. విల్మా సభ్యురాలిగా ఉన్న జట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఇదే మెగా ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీల ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దాంతో ఒక్కసారిగా విల్మా పేరు మారుమోగిపోయి స్టార్‌గా మారిపోయింది. అన్ని దేశాలు ఆమె వేగాన్ని ప్రశంసిస్తూ ‘టోర్నడో’... ‘ఫ్లాష్’... ‘ట్రాక్ స్టార్’... ‘ద బ్లాక్ పెర్ల్’ అంటూ వేర్వేరు ఉపమానాలతో విల్మాను ఆకాశానికెత్తేశాయి. 22 ఏళ్లకే ముగించి... రోమ్ ఒలింపిక్స్ తర్వాత కూడా అనేక మంది మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పలు ఈవెంట్లలో విల్మా పాల్గొంది. కానీ తన కోసం ఎలాంటి ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకోలేదు. ‘నేను వచ్చే ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. నేను సాధించింది చాలు. ఇక పరుగు ఆపడమే మంచిది’ అంటూ కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగా 22 ఏళ్లకే ట్రాక్‌కు రిటైర్మెంట్ చెప్పేసింది. అందుకే 1964 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనలేదు. ఆట ముగించగానే తన చదువుపై దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆపై పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమైంది. ముఖ్యంగా నల్ల జాతి అమెరికన్స్ పౌర హక్కులు, మహిళల హక్కుల కోసం ఆమె పోరాడింది. చిన్నప్పటి వైకల్యాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన విల్మా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. -
‘త్రిస్వర్ణ’ కాంతులు...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా రెజ్లర్లు స్వర్ణ కాంతులీనారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ పోటీల్లో భారత్‌కు ఒకే రోజు మూడు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. దివ్య కాక్రాన్ (68 కేజీలు), సరితా మోర్ (59 కేజీలు), పింకీ (55 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా... నిర్మలా దేవి (50 కేజీలు) రజతం దక్కించుకుంది. కిరణ్ (76 కేజీలు) మాత్రం విఫలమైంది. ఫైనల్స్‌లో సరిత 3–2తో బాట్‌సెట్‌సెగ్ అల్టాంట్‌సెగ్ (మంగోలియా)పై... పింకీ 2–1తో డల్గున్ బొలోర్మా (మంగోలియా)పై గెలిచారు. నిర్మలా దేవి 2–3తో మిహో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగంలో ఐదుగురు రెజ్లర్లు మాత్రమే ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. దివ్య బరిలోకి దిగిన నాలుగు బౌట్లలోనూ గెలిచి విజేతగా అవతరించింది. దివ్య వరుసగా 6–0తో అల్బీనా (కజకిస్తాన్)పై, 11–2తో డెల్‌గెరామా (మంగోలియా)పై, 8–0తో అజోదా (ఉజ్బెకిస్తాన్)పై, 6–4తో నరువా మత్సుయుకి (జపాన్)పై గెలిచి అజేయం గా నిలిచింది. ఇంతకుముందు ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఏకైక స్వర్ణం 2018లో నవ్‌జ్యోత్ కౌర్ (65 కేజీలు) రూపంలో లభించింది. ఈసారి మాత్రం ఒకేరోజు మూడు పసిడి పతకాలు లభించడం విశేషం. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
బోరస్ (స్వీడన్): గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించి అదరగొట్టారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది. జూనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) ‘బెస్ట్ బాక్సర్’ అవార్డును కైవసం చేసుకుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. సాన్యా (57 కేజీలు), దీపిక (64 కేజీలు), ముస్కాన్ (69 కేజీలు), సాక్షి (75 కేజీలు) కాంస్యాలు గెలిచారు. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది. -
అమ్మమ్మ వయసులో నాలుగు గోల్డ్ మెడల్స్..!
గాంధీనగర్: చదువుకు శ్రద్ధ ఉంటే చాలు.. వయసుతో పనిలేదని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా 55 ఏళ్ల వయసులో మరోసారి పుస్తకాలు పట్టుకొని కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది. లేటు వయసుసలో న్యాయవాద కోర్సును పూర్తి చేయడమే కాకుండా ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా సాధించి అందరిని ఔరా అనిపించింది. గుజరాత్‌కు చెందిన నీతి రావల్ అనే మహిళ సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు సంచలనంగా మారింది. (ఒక్క గంటలో ఆయన సంపాదన రూ. 16వేల కోట్లు) నీతీ రావల్‌కు 30 ఏళ్ల క్రితం మౌలిన్ రావల్ అనే వ్యాపారితో వివాహం అయింది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లయింది. కొడుకు లాయర్‌గా స్థిరపడ్డాడు. ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను మోసిన నీతి రావల్‌కి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఎవరేం అనుకున్నా పర్వాలేదని 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. తన కుటుంబం సాయంతో గుజరాత్ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసింది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ డేలో 4 గోల్డ్ మెడల్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమెలో ఉన్న ఆసక్తి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా నీతీ రావల్ ఇంతటితో ఆగిపోవడం లేదు. త్వరలోనే మాస్టర్ ఇన్ లా అడ్మిషన్ కూడా పూర్తి చేస్తానని చెప్తోంది. నీతి రావల్ మాట్లాడుతూ.. నాకు ఒక్క దానికే ఇంట్లో ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదైనా చేయాలని అనుకొని లా పూర్తి చేసినట్టు తెలిపారు. ఆమె భర్త మౌలిన్ రావల్ మాట్లాడుతూ.. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. టెక్ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..! -
బంగారు బుల్లోడు
పేద కుటుంబం..తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం..సర్కార్ బడిలోనే చదివాడు. అందుబాటులోని అవకాశాలనే అందిపుచ్చుకున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బేస్‌బాల్, లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం పోటీల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాల మోత మోగిస్తున్నాడు. ఈ కుర్రాడే వెదురుకుప్పం మండలం బొమ్మసముద్రం దినకర్. ఆయన విజయబాటను మనమూ చూసొద్దాం.. అడుగుపెడితే స్వర్ణ పతకమే... అథ్లెటిక్స్‌లో రాటుదేలిన దినకర్ తొమ్మిదో తరగతి నుంచే బంగారు పతకాలు సాధిస్తూ వచ్చాడు. ఎక్కడ ఏ మైదానంలో అడుగుపెట్టినా తన సత్తా చూపించి తనేంటో నిరూపిస్తూ ఓప్రత్యేకతను చాటుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వివిధ రకాల క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాల పంట పండిస్తున్నాడు. రూర్కెలా ఎన్ఐటీ డైరెక్టర్ సంగల్ నుంచి బంగారు పతకం అందుకుంటున్న దినకర్ క్రీడలపై మక్కువ పెంచుకుని గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తన సత్తా ఏంటో నిరూస్తున్నాడు వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లె గ్రామానికి చెందిన బొమ్మసముద్రం శివాజీ, పుష్ప దంపతుల కుమారుడు దినకర్(23). శివాజీకి దినకర్, దయాకర్ కుమారులు. శివాజీ గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పుష్ప కూలీ పనులు చేస్తోంది. పేదరికంలో ఉన్నా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే తపన వారికి ఉండేది. పెద్ద కొడుకు దినకర్ 5వ తరగతి వరకు అదే గ్రామంలో విద్యనభ్యసించాడు. ఆతరువాత 2005లో నవోదయ ప్రవేశ పరీక్ష రాయడంతో అర్హత సాధించి మదనపల్లెలో ఆరవ తరగతిలో చేరాడు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. ప్రధానంగా బేస్‌బాల్‌పై మక్కువ చూపేవాడు. 6,7 తరగతులు చదివే రోజుల్లో బేస్‌బాల్‌తోపాటు అన్ని క్రీడల్లో పట్టుసాధించి ప్రతిభను కనపరిచేవాడు. పాఠశాల స్థాయిలో జరిగిన గేమ్స్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి ప్రసంశలు పొందేవాడు. ఆత్మస్థైర్యమే అండ.. దినకర్ క్రీడల్లో చూపుతున్న ప్రతిభను ఫిజికల్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి గుర్తించారు. ‘బేస్‌బాల్ ఆటేకాదు..నువ్వు అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లాలి.. బాగా రాణిస్తావు..నీలో ఆత్మసైర్థ్యం ఉంది..నేను అండగా ఉంటా’ అని వెన్నుతట్టాడు. పీడీ ప్రోత్సాహంతో లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం క్రీడల్లో శిక్షణ పొందాడు. పీడీ చెప్పిన మెలకువలు, సూచనలను వంటబట్టించుకున్న దినకర్ అథ్లెటిక్స్‌పై పట్టుబిగించాడు. ఒక పక్క చదువులో రాణిస్తూ క్రీడల్లో కూడా తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ వచ్చాడు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తన సత్తాను చాటాడు. ఈక్రమంలో మొట్టమొదటిసారి కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విఫలమై వెనుదిరిగాడు. అయినా మొక్కవోని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పూర్తి స్థాయిలో క్రీడా విద్యలో ఆరితేరాడు. పతకాల పంట ♦ 2008లో కర్ణాటకలో జరిగిన అథ్లెటిక్స్ లాంగ్‌జంప్‌లో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం ♦ 2009లో కర్నూలు నవోదయ విద్యాలయలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం(100మీటర్లు)లో ప్రథమస్థానం, పరుగుపందెం (200మీటర్లు)లో ద్వితీయ స్థానం ♦ 2010లో ఢిల్లీలో జరిగిన ఆల్ఇండియా జావెలిన్ త్రో పోటీలో ప్రథమ బహుమతి. ♦ ఇంటర్‌గేమ్స్‌లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జాతీయ స్థాయిలో ♦ 2012లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం ♦ 2014లో ఒడిస్సాలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ పోటీల్లో లాంగ్ జంప్‌లో గోల్డ్‌మెడల్ ♦ 2015లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇంటర్ కాలేజ్ పోటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ స్థానం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా మానసిక ప్రశాంతతకు క్రీడలు చాలా అవసరం. ఆరోగ్యం..శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యం. ఆటల వల్ల అనేక రుగ్మతల నుంచి దూరం కావచ్చు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నదే నా కోరిక. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఉన్నత స్థానానికి ఎదిగితే గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను పోత్సహించేందుకు కృషి చేస్తా. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు వచ్చేందుకు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన పీడీ సురేంద్రరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. – దినకర్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
ఇషాకు 2 స్వర్ణాలు
దోహా: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. జూనియర్ విభాగంలో ఇషా సింగ్, వివాన్ కపూర్లు చెరో రెండు పసిడి పతకాలతో చెలరేగారు. గురువారం జరిగిన జూనియర్ పురుషుల ట్రాప్ ఈవెంట్లో 45 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచిన వివాన్ బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. 42 పాయింట్లతో బోవ్నీశ్ మెన్దిరట్ట రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. జూనియర్ పురుషుల ట్రాప్ ఈవెంట్ టీం విభాగంలో బరిలో దిగిన వివాన్, బోవ్నీశ్, మానవాదిత్య సింగ్‌లతో కూడిన భారత జట్టు తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని గెలిచారు. జూనియర్ మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో బరిలో దిగిన ఇషా సింగ్ 242.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రియా రాఘవ 217.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇక టీమ్ విభాగంలో బరిలో దిగిన ఈశా, ప్రియా, యువిక తోమర్ 1721 పాయింట్లతో ప్రపంచ జూనియర్ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని భారత్ ఖాతాలో వేశారు. -
సౌరభ్, రాహీ డబుల్ ధమాకా
మ్యూనిక్ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 586 పాయింట్లు, షాజర్ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. -
రెజ్లర్ బజరంగ్ ఖాతాలో మరో స్వర్ణం
అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం జరిగిన ఫైనల్లో బజరంగ్ 13–8 పాయింట్ల తేడాతో విక్టర్ రసాదిన్ (రష్యా)పై గెలుపొందాడు. ఈ ఏడాది బజరంగ్‌కిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. డాన్ కొలోవ్ టోర్నీలో పసిడి నెగ్గిన బజరంగ్ ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా బజరంగ్ తాను పాల్గొన్న గత తొమ్మిది టోర్నమెంట్లలో ఏడు స్వర్ణాలు నెగ్గడం విశేషం. -
ఫైనల్లో బజరంగ్
న్యూఢిల్లీ: అలీ అలియెవ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్ 65 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో 14–4తో అషిరోవ్ (కజకిస్తాన్)పై... క్వార్టర్ ఫైనల్లో 4–0తో కుర్బాన్ షిరయెవ్ (రష్యా)పై... సెమీఫైనల్లో 8–6తో దుదయెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో రసాదిన్ (రష్యా)తో బజరంగ్ తలపడతాడు. -
ఒలింపిక్స్‌కు మరింత పకడ్బందీగా...
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్ షిప్లో బాక్సర్ల అద్భుత ప్రదర్శన (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలు సహా 13 పతకాలు)తో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నూతనోత్సాహంతో ఉంది. ఈ ఫలితాలతో టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా సమాఖ్య ప్రణాళికలు వేస్తోంది. చాంపియన్‌షిప్ పతకాల్లో కొన్నింటినైనా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తోంది. తమ తదుపరి లక్ష్యం ఇదేనని సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా విదేశీ పర్యటనలకు షెడ్యూల్‌కు పది రోజుల ముందే ఆటగాళ్లను పంపనుంది. వాతావరణ మార్పుల కారణంగా ఆహారానికి ఇబ్బంది రాకుండా చెఫ్‌లను పంపించే యోచన చేస్తోంది. సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌తో ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ‘ప్రతిష్ఠాత్మక క్రీడలకు బాక్సర్లను సర్వసన్నద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలం. ఇందులో భాగంగా మార్గదర్శకం, కోచింగ్, పోషకాహారం ఇలా ప్రతి అంశంపై శ్రద్ధ చూపుతాం’ అని మంగళవారం బాక్సర్ల సన్మాన కార్యక్రమంలో అజయ్ సింగ్ అన్నారు. ‘ఆసియా’ ప్రదర్శనకు గాను బాక్సర్లు, కోచ్‌లను ఆయన ప్రశంసించారు. ‘అర్జున’కు అమిత్, గౌరవ్ పేర్లు జకార్తా ఆసియా క్రీడల 49 కేజీల విభాగంలో, ఆసియా చాంపియన్‌షిప్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాల విజేత అమిత్ పంఘాల్.... 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన గౌరవ్ బిధురి పేర్లను బీఎఫ్ఐ మంగళవారం ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించింది. వీరిలో అమిత్ పేరును గతేడాది కూడా పరిశీలనకు పంపారు. 2012లో డోప్ టెస్టులో విఫలమై ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో అతడికి పురస్కారం దక్కలేదు. ఈ వివాదం సమసిన తర్వాత అమిత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గాడు. మహిళల సహాయ కోచ్ సంధ్య గురుంగ్, మాజీ చీఫ్ కోచ్ శివ్ సింగ్‌లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు ప్రతిపాదించారు. ఇక... ఇండియన్ బాక్సింగ్ లీగ్ దేశంలో క్రికెట్ సహా అనేక క్రీడా లీగ్‌లు విజయవంతమైన నేపథ్యంలో త్వరలో ‘ఇండియన్ బాక్సింగ్ లీగ్’ తెరపైకి రానుంది. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ లీగ్‌కు కార్యరూపం ఇచ్చి ఈ ఏడాది జులై–ఆగస్టు మధ్య నిర్వహించేలా బీఎఫ్ఐ ప్రణాళికలు వేస్తోంది. భారత మేటి బాక్సర్లు అమిత్ పంఘాల్, శివ థాపా, సరితా దేవి సహా విదేశీయులు కూడా పాల్గొనే లీగ్‌ను పురుషులు, మహిళల విభాగాల్లో మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు స్పోర్ట్జ్‌లైవ్ సంస్థ ఎండీ అతుల్ పాండే తెలిపారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ను ప్రారంభించిన ఈ సంస్థే... బాక్సింగ్ లీగ్ బాధ్యతలూ చూడనుంది. -
అభిషేక్ అదరహో
బీజింగ్: ఆడుతోంది తొలి ప్రపంచకప్ ఫైనల్... బరిలో మేటి షూటర్లు... అయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు... ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి ఒకే గురికి రెండు లక్ష్యాలు సాధించాడు భారత షూటర్ అభిషేక్ వర్మ. ఇక్కడ జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో అభిషేక్ వర్మ రూపంలో భారత్‌కు మూడో స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ 242.7 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెల్చుకున్నాడు. అంతేకాకుండా భారత్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. అర్తెమ్ చెముస్కోవ్ (రష్యా–240.4 పాయింట్లు) రజతం... సెయుంగ్వు హాన్ (కొరియా–220 పాయింట్లు) కాంస్యం సాధించారు. హరియాణాలో న్యాయవాదిగా ఉన్న 29 ఏళ్ల అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో తొలి షాట్ నుంచి చివరి షాట్ ముగిసేవరకు అభిషేక్ ఆధిక్యంలో ఉండటం విశేషం. -
అమిత్, పూజ ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్లో ఓడిన దీపక్ సింగ్ (49 కేజీలు), కవిందర్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి. ఫైనల్లో అమిత్ 5–0తో కిమ్ ఇంక్యు (కొరియా)పై, పూజా రాణి 4–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వాంగ్ లీనా (చైనా)పై గెలుపొందారు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ 2–3తో నొదిర్జాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... కవిందర్ 0–5తో మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకి స్తాన్) చేతిలో... ఆశిష్ కుమార్ 0–5తో కులాఖ్‌మెత్ (కజకిస్తాన్) చేతిలో... సిమ్రన్‌జిత్ కౌర్ 1–4తో డాన్ డుయు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
బజరంగ్ పసిడి పట్టు
జియాన్ (చైనా): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటుకున్నాడు. రెండోసారి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బజరంగ్ తన ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆసియా చాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. సయాత్‌బెక్ ఒకాసోవ్ (కజకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 12–7 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఒకదశలో 2–7తో వెనుకబడిన ఈ హరియాణా రెజ్లర్ ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి ఒకాసోవ్ పని పట్టాడు. రెండో విరామంలో పూర్తిగా దూకుడుగా వ్యవహరించిన బజరంగ్ తన ప్రత్యర్థిపై పట్టు సంపాదించి వరుసగా పది పాయింట్లు సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు బజరంగ్ సెమీఫైనల్లో 12–1తో సిరాజుద్దీన్ ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–0తో పీమన్ బియాబాని (ఇరాన్)పై, తొలి రౌండ్లో 10–0తో దివోషాన్ చార్లెస్ ఫెర్నాండో (శ్రీలంక)పై గెలుపొందాడు. సీజన్లో రెండో స్వర్ణం... గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన బజరంగ్... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో డాన్ కొలోవ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం నెగ్గి సీజన్లో శుభారంభం చేసిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పట్టుతో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది రెండో స్వర్ణం. 2017లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. అంతేకాకుండా ఈ టోర్నీ చరిత్రలో రెండు కాంస్యాలు (2018లో 65 కేజీలు; 2013లో 60 కేజీలు), ఒక రజతం (2014లో 61 కేజీలు) కూడా సాధించాడు. మరోవైపు పురుషుల 79 కేజీల విభాగంలో ప్రవీణ్ రాణా రజతం, 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 0–3తో బామన్ మొహమ్మద్ తెమూరి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో సత్యవర్త్ 8–2తో హావోబిన్ గావో (చైనా)పై గెలుపొందాడు. 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవి కుమార్ 3–5తో ప్రపంచ మాజీ చాంపియన్ యూకీ తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 70 కేజీల విభాగంలో రజనీశ్ తొలి రౌండ్లో 0–11తో యూనస్ అలీఅక్బర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. -
గోమతి, తేజిందర్‌లకు స్వర్ణాలు
దోహా: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోమతి మరిముత్తు... తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ తేజిందర్ పాల్ సింగ్ తూర్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. మహిళల 800 మీటర్ల రేసులో 30 ఏళ్ల గోమతి... పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో 24 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. చెన్నైకు చెందిన గోమతి 800 మీటర్ల రేసును 2 నిమిషాల 02.70 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన తేజిందర్ అదే జోరును ఇక్కడ కూడా కనబరిచి విజేతగా నిలిచాడు. పంజాబ్‌కు చెందిన తేజిందర్ ఇనుప గుండును 20.22 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఓవరాల్‌గా రెండో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. మహిళల 100 మీటర్ల రేసును భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 11.44 సెకన్లలో ముగించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో బరిలోకి దిగిన శివ్‌పాల్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. శివ్‌పాల్ జావెలిన్‌ను 86.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సరితాబెన్ గైక్వాడ్ 57.22 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబిర్ 49.13 సెకన్లతో కాంస్య పతకాన్ని నెగ్గాడు. తొలి రోజు ఆలస్యంగా జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసులో మురళీ కుమార్ (28ని:38.34 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
మీనా పసిడి పంచ్
న్యూఢిల్లీ: కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మైస్నమ్ మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జర్మనీలోని కొలోన్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 5 (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలను సాధించింది. ఫైనల్లో మచాయ్ బున్‌యానట్(థాయ్‌లాండ్)పై మీనా గెలిచింది. భారత్‌కే చెందిన సాక్షి (57 కేజీలు), పిలావో బాసుమతారి (64 కేజీలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో మికేలా వాల్ (ఐర్లాండ్) చేతిలో సాక్షి... చెంగ్యూ యాంగ్ (చైనా) చేతిలో బాసుమతారి ఓడిపోయారు. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. -
పసిడి సౌరభం
న్యూఢిల్లీ: మరో ఈవెంట్... మరో పసిడి పతకం... మరో ప్రపంచ రికార్డు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో వరుసగా రెండో రోజు భారత షూటర్ గురి అదిరింది. తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా ప్రపంచ రికార్డుతోపాటు పసిడి పతకం సొంతం చేసుకోగా... రెండో రోజు ఆదివారం 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సంచలన ప్రదర్శన చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ స్వర్ణ పతకంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు ఈ విభాగంలో భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. గత సంవత్సరం ఆసియా క్రీడల్లో, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన సౌరభ్ చౌధరీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన తొలిసారే పసిడి పతకాన్ని దక్కించుకోవడం విశేషం. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సౌరభ్ 245 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఒలె ఒమెల్చుక్ (ఉక్రెయిన్–243.6 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సౌరభ్ బద్దలు కొట్టాడు. దామిర్ మికెక్ (సెర్బియా–239.3 పాయింట్లు) రజతం... 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత పాంగ్ వె (చైనా–215.2 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సౌరభ్ జోరు ఎలా సాగిందంటే చివరి షాట్కంటే ముందుగానే అతనికి స్వర్ణం ఖాయమైంది. 76 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 587 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ 24వ స్థానంలో... రవీందర్ సింగ్ 26వ స్థానంలో నిలిచారు. ‘ప్రపంచ రికార్డు, ఒలింపిక్ బెర్త్, స్వర్ణ పతకంలాంటి అంశాల గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని గురి చూసి కొట్టాను. అనుకున్న ఫలితం వచ్చింది. ఒకవేళ వీటి గురించి ఆలోచిస్తూ షూటింగ్ చేసి ఉంటే అనవసరంగా ఒత్తిడికిలోనై తుది ఫలితం మరోలా ఉండేదేమో’ అని సౌరభ్ వ్యాఖ్యానించాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత యువతార మను భాకర్ ఫైనల్లో 22 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. వెరోనికా మేజర్ (హంగేరి–40 పాయింట్లు) స్వర్ణం సాధించగా... జింగ్జింగ్ జాంగ్ (చైనా), హనియా రొస్తామియాన్ (ఇరాన్) రజత, కాంస్య పతకాలు గెలిచారు. క్వాలిఫయింగ్‌లో 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచిన మను భాకర్ ఫైనల్లో మాత్రం తడబడింది. -
భారత బృందం కొత్త చరిత్ర
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం ఈ క్రీడల చివరి రోజు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో రెండు స్వర్ణాలు కైవసం చేసుకోవడంతో మొత్తం 72 (15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు) పతకాలతో పట్టికలో తొమ్మిదో స్థానంతో ముగించింది. 172 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. పారా ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. 2014 క్రీడల్లో భారత్ 33 (3 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలు) పతకాలు సాధించింది. పోటీల చివరి రోజు బ్యాడ్మింటన్ పురుషుల ఎస్ఎల్3 సింగిల్స్ ఫైనల్లో ప్రమోద్ భగత్ 21–19, 15–21, 21–14తో ఉకున్ రుకైన్‌డీ (ఇండోనేసియా)పై గెలిచాడు. ఎస్ఎల్4 ఫైనల్లో తరుణ్ 21–16, 21–6తో యుయాంగ్ (చైనా)పై నెగ్గాడు. -
భారత్‌కు ఐదు స్వర్ణాలు
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల ఏడోరోజు శుక్రవారం చెస్‌లో రెండు, అథ్లెటిక్స్‌లో రెండు, బ్యాడ్మింటన్‌లో ఓ స్వర్ణం లభించాయి. వీటితోపాటు ఏడు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 17 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల ర్యాపిడ్ చెస్ పి1 విభాగంలో కె. జెన్నిత 1–0తో మనురుంగ్ రోస్‌లిండా (ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణం చేజిక్కించుకోగా... పురుషుల ర్యాపిడ్–6 బీ2/బీ3 విభాగంలో కిషన్ పసిడి గెలిచాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్55 విభాగంలో నీరజ్ యాదవ్ (29.24 మీటర్లు) స్వర్ణం నెగ్గగా... అమిత్ బల్యాన్ ((28.79 మీటర్లు) రజతం సొంతం చేసుకున్నాడు. మెన్స్ క్లబ్ త్రో ఎఫ్51 విభాగంలో అమిత్ కుమార్ (29.47 మీటర్లు) పసిడి పతకం గెలుచుకోగా... ధరమ్వీర్ (24.81 మీటర్లు) రజతం సాధించాడు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో పరుల్ పర్మార్ 21–9, 21–5తో వన్డీ కమ్‌టమ్ (థాయ్‌లాండ్)పై నెగ్గి బంగారు పతకం సాధించింది. పురుషుల 100 మీటర్ల స్విమ్మింగ్ ఎస్10 కేటగిరీలో స్వప్నిల్ పాటిల్ రజతం నెగ్గాడు. పురుషుల 4000 మీటర్ల సైక్లింగ్ సీ4 విభాగంలో గుర్లాల్ సింగ్ కాంస్యం సాధించాడు. రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్ ఎఫ్ 51/52/53 డిస్కస్ త్రోలో కాంస్యం నెగ్గింది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో నిధి మిశ్రా (21.82 మీటర్లు) కాంస్యం సాధించింది. -
హైజంప్‌లో క్లీన్‌స్వీప్
జకార్తా: ఒక ఈవెంట్లో మూడు పతకాలు భారత్‌కే వచ్చాయి. మూడు త్రివర్ణ పతాకాలు ఒకేసారి రెపరెపలాడాయి. ఈ దృశ్యం పారా ఆసియా క్రీడల్లో కనువిందు చేసింది. హైజంప్‌లో భారత దివ్యాంగ అథ్లెట్లే పతకాలన్నీ కొల్లగొట్టారు. పురుషుల హైజంప్ టి42/63 కేటగిరీలో శరద్ కుమార్ (1.90 మీటర్లు) రెండు రికార్డులు నెలకొల్పి స్వర్ణం గెలుపొందగా... వరుణ్ భాటి (1.82 మీటర్లు), తంగవేలు మరియప్పన్ (1.67 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. గురువారం ఆరోరోజు పోటీల్లో ఒక్క అథ్లెటిక్స్‌లోనే డజను పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
పసిడి బుల్లెట్..
భారత ‘గన్’ మళ్లీ గర్జించింది. గురి చూసి మళ్లీ పసిడి పతకాన్ని కొట్టింది. మంగళవారం మను భాకర్ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... బుధవారం సౌరభ్ చౌధరీ బుల్లెట్‌కు మరో స్వర్ణం సొంతమైంది. ఫలితంగా యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఓవరాల్‌గా భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 6 పతకాలతో మూడోస్థానంలో ఉంది. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఇటీవలే ఆసియా క్రీడల్లో, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన స్వర్ణ పతకాలు గాలివాటమేమీ కాదని 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా గురి తప్పని ప్రదర్శనతో యూత్ ఒలింపిక్స్‌లోనూ అదరగొట్టాడు. ఫలితంగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ ఫైనల్లో 244.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సుంగ్ యున్హో (దక్షిణ కొరియా–236.7 పాయింట్లు) రజతం, సొలారీ జాసన్ (స్విట్జర్లాండ్–215.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. సౌరభ్, సుంగ్ యున్హో మధ్య ఏకంగా 7.5 పాయింట్ల తేడా ఉండటం భారత షూటర్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లోనూ సౌరభ్ తన జోరు ప్రదర్శించాడు. 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. కాంస్యం కోసం అర్చన పోరు... టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ కాంస్య పతకానికి విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో అర్చన 3–11, 7–11, 6–11, 11–1, 5–11తో సున్ యింగ్షా (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం ఆండ్రియా (రొమేనియా)తో అర్చన ఆడనుంది. హాకీ జట్టుకు తొలి ఓటమి... ఫైవ్–ఎ–సైడ్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆతిథ్య అర్జెంటీనాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ తరఫున రీత్, ముంతాజ్ ఖాన్ ఒక్కో గోల్ చేశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు సాధించి 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
మాతృభాషను మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది. చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు. మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
నేను అనర్హుడినా?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న దక్కకపోవడంపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బజరంగ్ ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య అత్యున్నత క్రీడా పురస్కారానికి బజరంగ్ పేరు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు ఆ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఆవేదనకు గురైన బజరంగ్ నేడు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోనున్నాడు. ‘ఈ నిర్ణయం నన్ను విస్మయానికి గురిచేసింది. నిరాశలో కూరుకుపోయాను. యోగి భాయ్ (యోగేశ్వర్ దత్)తో మాట్లాడిన అనంతరం క్రీడల మంత్రితో సమావేశమవుతా. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ ఏడాది ఈ పురస్కారానికి నేను అర్హుడిగా భావిస్తున్నా. అందుకే ఈ అంశంపై మాట్లాడుతున్నా. అవార్డులు అడుక్కోవడం కాదు. కానీ... ఓ క్రీడాకారుడిగా ఖేల్‌రత్న అందుకోవడం చాలా పెద్ద గౌరవం’ అని బజరంగ్ వ్యాఖ్యానించాడు. -
భారత బాక్సర్ల పతకాల పంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిలేసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. పోలండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యంతో ఓవరాల్‌గా 13 పతకాలతో దుమ్మురేపారు. భారత బాక్సర్లు పోటీపడ్డ 13 విభాగాల్లోనూ పతకాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్స్‌లో భారతి (46 కేజీలు) 5–0తో ఇజాబెలా (పోలాండ్)పై; టింగ్‌మిలా డౌన్‌జెల్ (48 కేజీలు) 5–0తో ఎలైన (జర్మనీ)పై; సందీప్ కౌర్ (52 కేజీలు) 5–0తో కరోలినా అమ్‌పుల్‌స్కా (పోలాండ్)పై; నేహా (54 కేజీలు) 3–2తో నికోలినా (లాత్వియా)పై; జైబురా (పోలాండ్)పై కోమల్ (80 కేజీలు); లియోన (స్వీడన్)పై అర్షి (57 కేజీలు) విజయం సాధించి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమీశ (50 కేజీలు) 0–5తో అలెక్సెస్ (పోలాండ్) చేతిలో, సాన్య నేగీ (60 కేజీలు) 2–3తో థెల్మా (స్వీడన్) చేతిలో, ఆశ్రేయ (63 కేజీలు) 1–4తో నైనా (సెర్బియా) చేతిలో, మితిక (66 కేజీలు) 2–3తో నటాలియా (పోలండ్) చేతిలో, రాజ్ సాహిబా (70 కేజీలు) 0–5తో జోఫియా (పోలాండ్) చేతిలో, లేపాక్షి (ప్లస్ 80 కేజీలు) 0–5తో ఓలీవియా (పోలాండ్) చేతిలో ఓడి రజతాలు దక్కించుకున్నారు. 75 కేజీల వెయిట్ కేటగిరీ సెమీఫైనల్లో నేహా 0–5తో పారడా డైరా (పోలాండ్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
భారత షూటర్ల కొత్త చరిత్ర
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో పదహారేళ్ల విజయ్‌వీర్ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. టీమ్ విభాగంలో విజయ్‌వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్‌ప్రీత్ సింగ్, విజయ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు. -
భళా... భారత గురి
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ షూటర్ల హవా కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్ ఆరో రోజు మన షూటర్లు 2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం సాధించారు. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో హృదయ్ హజారికా స్వర్ణం సాధించగా... మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు వరల్డ్ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఒక రజతం, కాంస్యం దక్కాయి. 17 ఏళ్ల హృదయ్ ఫైనల్లో మొహమ్మద్ అమీర్ (ఇరాన్)తో కలిసి 250.1 పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో విజేతను తేల్చేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించగా... అందులో హజారికా 10.3 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. అమీర్ 10.2 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నాడు. గ్రిగోరీ షామకోవ్ (228.6 పాయింట్లు–రష్యా)కు కాంస్యం దక్కింది. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత జట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది. ఎలవెనిల్ వలరివన్ (631), శ్రేయ అగర్వాల్ (628.5), మాణిని కౌశిక్ (621.2)లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 1880.7 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు పసిడి సొంతం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 249.8 పాయింట్లు సాధించి త్రుటిలో స్వర్ణం చేజార్చుకుంది. షై మెంగాయో ( 250.5 పాయింట్లు–చైనా) స్వర్ణం నెగ్గగా... శ్రేయ అగర్వాల్ (228.4 పాయింట్లు, భారత్) కాంస్యం చేజిక్కించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలు (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. మరోవైపు సీనియర్ పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్లు నిరాశ పరిచారు. స్వప్నిల్, అఖిల్, సంజీవ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
పట్టుదలగా శ్రమిస్తేనే పతకాలు
నలభై అయిదు దేశాలకు చెందిన 1,100మంది క్రీడాకారులు పక్షం రోజులపాటు వివిధ క్రీడాం శాల్లో పరస్పరం తలపడిన ఆసియా క్రీడోత్సవాలు ఇండొనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం ముగిశాయి. ఆరంభ వేడుకల్లాగే ముగింపు సంరంభం కూడా కన్నులపండువగా సాగి అందరినీ అలరించింది. ఇటువంటి అంతర్జాతీయ క్రీడా సంబరాలు దేశాల మధ్య సదవగాహనను పెంచు తాయి. ఆరోగ్యకరమైన పోటీని, క్రీడాస్ఫూర్తిని రగిలిస్తాయి. క్రీడా రంగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడమంటే మాటలు కాదు. ఆ అవకాశం దక్కించుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ క్రీడల్లో అహర్నిశలూ శ్రమిస్తారు. తమ నైపుణ్యానికి పదునుబెట్టుకుంటారు. ప్రత్యర్థిని మట్టికరిపించి క్రీడాభిమానుల హృదయాల్లో చెరగని ముద్రేయాలని చూస్తారు. అయితే బరిలో అప్పటికప్పుడు మెరుపువేగంతో తీసుకునే సరైన నిర్ణయాలు విజయాన్నందిస్తాయి. ఎప్పటిలాగే చైనా 132 స్వర్ణాలతో, 92 రజతాలతో శిఖరాగ్రాన నిలిచి వేరెవరూ తన దరిదాపుల్లో కూడా లేకుండా చూసుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ... ఉన్నతమైన కలలు కనగలిగినవారే ముందుకు దూసుకెళ్తారు. చైనా ఆ పనే చేసింది. ‘డ్రాగన్’తో తలపడటం మాటలు కాదని ఆ దేశ క్రీడాకారులు నిరూపించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఈత, జిమ్నా స్టిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ వగైరాల్లో అసమాన ప్రతిభ కనబరుస్తూ వస్తున్న చైనాకు ఫుట్ బాల్లో సైతం అగ్రభాగాన నిలవాలన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. కానీ అది ఇంతవరకూ నెరవేర లేదు. జకార్తాలో ఆ దేశ మహిళా టీం రజతం గెల్చుకున్నా, పురుషుల టీం బోల్తా పడింది. వచ్చే ఆసియా క్రీడోత్సవాలకు చైనాయే ఆతిథ్యమివ్వబోతున్నది గనుక ఫుట్‌బాల్‌లో సైతం బోణీ చేసేం దుకు మరింత పట్టుదలగా శ్రమిస్తుందనుకోవచ్చు. మన దేశం ఈసారి 15 స్వర్ణ పతకాలు, 24 రజతాలు, 30 కాంశ్య పతకాలు గెల్చుకుని ఫర్వా లేదనిపించింది. 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడోత్సవాల్లో కూడా ఇదే స్థాయిలో స్వర్ణాలు సాధించాం గనుక కనీసం మొదలెట్టిన చోటుకైనా ఇప్పటికి చేరుకోగలిగామని సంతృప్తిపడాలి. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో కనీసం ఈ మాదిరి ప్రతిభ కూడా మనవాళ్లు కనబరచలేకపోయారు. 1951తో పోలిస్తే మన దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది. అప్పటితో పోలిస్తే భిన్న రంగాల్లో ఎంతో ముందున్నాం. ఎంచుకున్న రంగంలో సమర్ధతను పెంచుకునేందుకు అనువైన శక్తిసామర్థ్యాలున్నాయి. ఈ కోణం నుంచి చూస్తే ఇప్పుడొచ్చిన పతకాలు తీసికట్టని చెప్పాలి. అంతర్జాతీయ క్రీడా సంబరాలు వచ్చినప్పుడల్లా గంపెడాశలు పెట్టుకోవటం... తీరా మన వాళ్లు ముఖాలు వేలాడేసుకు రావటం రివాజుగా మారింది. ప్రతిసారీ అంతక్రితం కంటే ఎంతో కొంత మెరుగ్గా ఉన్నారని సరిపెట్టుకుని సంతృప్తి పడటం తప్ప ఔరా అనిపించే స్థాయిలో ఆట తీరు ఉండటం లేదు. అందుకు ఈసారి కొన్ని మినహాయింపులున్నాయి. బహుళ క్రీడాంశాల సమా హారమైన హెప్టాథ్లాన్‌లో పసిడి పతకాన్ని సాధించిన స్వప్న బర్మన్ గురించి, బాక్సింగ్‌లో మోత మోగించిన అమిత్ పంఘాల్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీరిద్దరూ పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగినవారు. తాము ఎంచుకున్న క్రీడల్లో సాధన చేయడానికి కావల్సిన సాధనా సంపత్తులు వారిదగ్గర లేవు. స్వప్నబర్మన్ బెంగాల్‌లోని మారుమూల గ్రామంలో ఓ రిక్షా కార్మికుడి కుమార్తె. ఓ చిన్న రేకుల షెడ్డే వారి గూడు. పైగా తండ్రికి అయిదేళ్లక్రితం గుండెపోటు వచ్చి మంచా నికే పరిమితమయ్యాడు. పొట్టిగా ఉండటం వల్ల ఈ ఆటకు పనికిరావని కోచ్ తిరగ్గొట్టాడు. కాళ్లకు ఆరేసి వేళ్లుండటం వల్ల బూట్లు ధరించటం ఎంతో కష్టం. వాటికి పనికొచ్చేలా బూట్లు తయారు చేయించుకోవటం ఆమె వల్ల కాని పని. స్వప్న ప్రతిభను ఏ ప్రభుత్వ సంస్థా గమనించలేదు. అదృష్టవశాత్తూ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ప్రారంభించిన ఒక కార్యక్రమం వల్ల ఈ మట్టిలో మాణిక్యం వెలుగుచూసింది. 68 ఏళ్లనుంచి ఆ ఆటలో ఏ పతకమూ అందుకోలేకపోతున్న మన దేశానికి అనుకోని రీతిలో స్వర్ణాన్ని సాధించింది. బాక్సింగ్ స్టార్ అమిత్‌పంఘాల్ పరిస్థితీ అదే. బాక్సింగ్‌కు అవసరమైన గ్లోవ్స్ కూడా కొనుక్కోవటం అతని శక్తికి మించిన పని. దానికితోడు బాక్సింగ్‌లో ఉండేవారికి మంచి ఆహారం అవసరం. పేదరికం వల్ల అది కూడా పెద్దగా సాధ్య పడలేదు. ఇదే క్రీడలో అతనితోపాటు శిక్షణ పొందిన అతని అన్న అమిత్ కోసం బాక్సింగ్ నుంచి తప్పుకుని, సైన్యంలో చేరి నెలనెలా డబ్బు పంపుతూ ప్రోత్సహించాడు. ఇలా పడుతూ లేస్తూ శిక్షణ పొందిన అమిత్ జకార్తాలో ఓడించింది సాధారణ ప్రత్యర్థిని కాదు. రియో ఒలింపిక్స్‌లో చాంపి యన్‌గా నిలిచిన ఉజ్బెకిస్తాన్ క్రీడాకారుడు హసన్‌బోయ్ దుస్మతోవ్‌ను! చిత్తశుద్ధితో వెదకాలే గానీ ఇలాంటి స్వప్నలు, అమిత్‌లు దేశంలో వేలాదిమంది ఉంటారు. మెరికల్లాంటి అథ్లెట్ల కోసం టార్గెట్ ఒలిపింక్ పోడియం స్కీం(టీఓపీ) వంటి ప్రభుత్వ పథకాలున్నాయి. అవి కొందరికి అక్కరకొస్తు న్నాయి కూడా. కానీ చేరాల్సినంతమందికి ఆ పథకాలు చేరటం లేదు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచేవారిని గుర్తించి వారికి అత్యంత నిపుణులైనవారితో శిక్షణ నిప్పించటం, అవసరమైన సదుపాయాలన్నీ కల్పించి ఏ లోటూ లేకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ఈ శిక్షణ, సదుపాయాల కల్పన ఏదో ఒక క్రీడా సందర్భాన్ని పురస్కరించుకుని చేస్తే చాలదు. అదొక నిరంతర ప్రక్రియగా ఉండాలి. దాన్నొక యజ్ఞంగా భావించాలి. పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాంశాలను తప్పనిసరి చేయాలి. ఇతర పాఠ్యాంశాల్లాగే వాటికి కూడా మూల్యాంకన జరుగుతుండాలి. శిక్షణనివ్వడానికి ప్రతిభావంతులైనవారిని నియమించాలి. అంతే కాదు... విద్యా సంస్థల వెలుపల ఉంటున్న మెరికల్ని కూడా పసిగట్టాలి. మౌలిక సదుపాయాలకు ధారాళంగా నిధులు వెచ్చించాలి. ఇవన్నీ చేయగలిగితే దేశం తలెత్తుకునేలా, గర్వపడేలా అంతర్జాతీయ క్రీడా వేదికలపై మనవాళ్లు కూడా మెరుస్తారు. -
సచిన్ రాఠి, దీపక్‌లకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సచిన్ రాఠి, దీపక్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన 74 కేజీల ఫైనల్లో సచిన్ 9–2తో బియంబసురెన్ (మంగోలియా)ను ఓడించగా... 86 కేజీల తుదిపోరులో దీపక్ 10–0తో అజత్ గజ్యెవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. 61 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో సూరజ్ రాజ్ కుమార్ 16–8తో యుతో (జపాన్)ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. 92 కేజీల్లో సోమ్‌వీర్ సింగ్ నిరాశపరిచాడు. అతను మూడో రౌండ్లోనే 2–3తో తకుమా ఒత్సు (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 125 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక బౌట్లో ఎర్డెనెబాటర్ (మంగోలియా)పై మోహిత్ 10–0తో గెలిచాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్ 173 పాయింట్లతో రెండో స్థానం పొందగా, ఇరాన్ (189)కు అగ్రస్థానం దక్కింది. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సోట్విల్లీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో నీరజ్ జావెలిన్‌ను 85.17 మీటర్ల దూరం విసిరి పసిడి గెలుచుకున్నాడు. ఆండ్రియన్ మర్దారే (మాల్డోవా–81.48 మీటర్లు), ఎడిస్ మటుసేవిసియస్ (లిథువేనియా–79.31 మీటర్లు) వరుసగా రజత, క్యాంస్యాలు దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత కెశోర్న్ వాల్కాట్ ( ట్రినిడాడ్–78.26 మీటర్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20 ఏళ్ల నీరజ్ ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సాధించాడు. -
ఘనంగా ఎస్వీయూ స్నాతకోత్సవం
యూనివర్సిటీ క్యాంపస్ : మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఎస్యీయూ స్నాతకోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ శివన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ జానకి రామయ్య, రిజిస్ట్రార్ అనురాధ, పాలక మండలి సభ్యులు, ఫ్యాకల్టీ డీన్ల సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకగా సాగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హజరు కాకపోవడంతో ఎస్వీయూ వీసీ దామోదరం చాన్సలర్ హోదాలో ఇస్రో చైర్మన్ కే.శివన్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. అనంతరం పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ తదితర డిగ్రీలను ప్రదానం చేశారు. తరువాత వివిధ సబ్జెక్ట్‌లలో టాపర్లుగా నిలిచిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ స్నాతకోపన్యాసంతో ఈ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే డిగ్రీలు పొందిన విద్యార్థులు అనందంతో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఎస్వీయూతో ఇస్రోకు ఎంతో అనుబంధం ఉందని ఇస్రో చైర్మన్ కే.శివన్ అన్నారు. ఎస్వీయూ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోపన్యాసం చేశారు. ఎస్వీయూ ఎంతో పురోగతి సాధించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎస్వీయూ విశిష్టస్థానం దక్కించుకుందన్నారు. ఎస్వీయూ గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన విద్యార్థుల కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయన్నారు. డిగ్రీలు పొందిన వారు ఉన్నత లక్ష్యాలను చేరుకుని యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. నూతన ఆలోచనలు, సృజన్మాతకత కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధికి, వ్యక్తిగత, కుటుంబ అభివృద్ధికి అవసరమైన వేయి మార్గాలు విద్యార్థుల ఎదుట ఉన్నాయన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత, నూతన ఆలోచన ధోరణి విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, నీటి కొరత, నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి దిశగా ఎస్వీయూ ఎస్వీయూనివర్సిటీ మూడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దామోదరం చెప్పారు. ఎస్వీయూ నాక్‌లో ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు యూజీసీ కేటగిరి–1 అటానమస్ హోదా పొందిందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఎస్వీయూ మంచి ర్యాంకులు సాధించిందన్నారు. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చామన్నారు. కొత్త కోర్సులు, నూతన పరిశోధనలతో వర్సిటీని ముందుకు తీసుకెళున్నామన్నారు. 1,128 మందికి డిగ్రీలు ఎస్వీయూలో శనివారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవం సందర్భంగా 1,128 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. డిగ్రీలు పొందిన వారిలో 151 మంది పీహెచ్డీ, 1 ఎంఫిల్, 976 మంది పీజీ డిగ్రీలు పొందారు. వీరు కాకుండా ఇన్ అడ్వాన్స్ రూపంలో 21,094 మంది, ఇన్ ఆబ్సెన్సియా రూపంలో 4,109 మంది డిగ్రీలు పొందారు. 65 మందికి బంగారు పతకాలు స్నాతకోత్సవంలో 65 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. పసిడి పతకాలు పొందిన వారిలో పూర్ణ చంద్రిక, ముకుందవల్లి, సునీత (గణితం), భాస్కర్, యామిని(రసాయన శాస్త్రం), లీలాకుమారి(బయోటెక్నాలజీ), సాయి వైష్ణవి(బాటనీ), శ్వేత, హేమలత(కంప్యూటర్ సైన్స్), చరణ్‌కుమార్ రెడ్డి(జాగ్రఫీ), వైష్ణవి, భారతి(హోంసైన్స్), నాగేంద్ర, సరిత, రాము, గురవమ్మ, (ఫిజిక్స్), రెడ్డమ్మ(సైకాలజీ), స్వప్న (స్టాటిస్టిక్స్), భార్గవి(జువాలజీ), మోహన్ కృష్ణ( ఎకనామిక్స్), అశోక పుత్ర(ఇంగ్లిషు), సుధాకర్(హిందీ), శివకేశవర్ధన్(ఫిలాసపీ), చిన్ని(పబ్లిక్ అడ్మినిస్ట్రేçషన్), సురేఖ(పొలిటికల్ సైన్స్), వీరమణి(సంస్కృతం),సురేష్(సోషియాలజీ), వెంకటేశు, సురేఖ(తెలుగు), వడివేలు(తమిళం), గుణశేఖర్, మైర్టేల్(కామర్స్), సౌజన్య(లా), రామరెడ్డి(బీఎల్ఐసీ), జెస్సీ ప్రశాంతి (సోషియాలజీ) ఉన్నారు. స్నాతకోత్సవంలో పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, సిద్ధముని, హరి, ఫ్యాకల్టీ డీన్లు సవరయ్య, త్యాగరాజు, మల్లికార్జున, కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు. -
గౌరవ డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం లో నిర్వహించిన 55వ స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్ ఎ.దామోదరం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి రావాల్సిన వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ నరసింహన్ హాజరుకా లేదు. 1,128 మందికి వివిధ రకాల డిగ్రీలను, 65 మంది బంగారు పతకాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన శివన్ స్నాతకోపన్యాసం చేస్తూ మానవాళి ప్రయోజనాల కోసం ఇస్రో అనేక ప్రయోగాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపటానికి లాంచ్ వెహికల్స్‌ను విజయవంతంగా ప్రయోగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ బరువైన లాంచ్ వెహికల్స్‌ను అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధం చేస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్ల వల్ల టెలికమ్యూనికేషన్, టెలి ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల నిర్వహణతో పాటు ప్రకృతి విపత్తులను గుర్తించే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘గగన్’ను దేశంలోని 50 ఎయిర్‌పోర్ట్‌లలోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివల్ల విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చన్నారు. దీన్ని రైల్వేలోకి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీంతో మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. -
జూడోలో భారత్‌కు 10 స్వర్ణాలు
ఖట్మాండు : నేపాల్ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు 10 స్వర్ణాలు సాధించారు. 14 పతకాల కోసం సాగిన పోరులో భారత మహిళలు సింగిల్స్ విభాగంలో 7 పతకాలు సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో మూడు పతకాలు గెలుచుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత్ మూడు కాంస్యలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించగా ఆతిథ్య నేపాల్ 2 బంగారు 6 రజత, 13 కాంస్య పతకాలతో 21, పాకిస్తాన్ 2 బంగారు, మూడు రజత, మూడు కాంస్యలతో 8 పతకాలను సొంతం చేసుకుంది. శ్రీలంక 3 బంగారు, 5 రజతాలతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్ రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది. ఇక భూటాన్ కేవలం ఒక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక టీమ్ ఈవెంట్ విభాగం ఫైనల్లో భారత మహిళలు ఆతిథ్య నేపాల్‌పై 5-0తో విజయం సాధించగా.. పురుషుల జట్టు ఫైనల్లో 3-2 తేడాతో పాక్‌పై గెలుపొందింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పంట
-
కామన్వెల్త్ గేమ్స్.. భారత్‌కు భారీగా పతకాలు
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ వరుసగా పతకాలు సాధిస్తున్నారు. శనివారం భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు వచ్చి చేరాయి. ఈ రోజు భారీగా పతకాలు దక్కడంతో భారత్ పతకాల విషయంలో అర్ధ సెంచరీని దాటింది. మెడల్స్ పట్టికలో ప్రస్తుతం భారత్ 50 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 23 స్వర్ణాలు, 13 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ మరోసారి సత్తా చాటింది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 45-48 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించి ఆమె భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ పోటీల్లో రెజ్లర్ వినేష్ ఫొగట్, 125 కేజీల పురుషుల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రెజ్లర్ సుమిత్ గోల్డ్ మెడళ్లను సొంతం చేసుకున్నారు. జావెలింగ్ త్రో విభాగంలో నీరజా చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సైతం కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి సత్తా చాటి.. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది. -
పసిడి గెలిచిన రాహుల్ ఆవారే
సాక్షి, హైదరాబాద్ : 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో ఎనిమిదో రోజు భారత రెజ్లర్ రాహుల్ ఆవారే పసిడి పతకం సాధించారు. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు రాహుల్. దీంతో గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకూ సాధించిన పసిడి పతకాల సంఖ్య 13కు చేరింది. అంతకుముందు ఎనిమిదో రోజు పతకాల వేటను షూటర్ తేజస్వినీ సావంత్ రజతంతో ఆరంభించారు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆమె రెండోస్థానంలో నిలిచి వెండి పతకాన్ని తెచ్చారు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో రెజ్లర్ బబితా కుమారి రజతం సాధించారు. మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కిరణ్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28కు చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత వనితలు
-
పసిడి కాంతలు...
తొలి రోజు ఒకటి... రెండో రోజు ఒకటి... మూడో రోజు రెండు... నాలుగో రోజు మూడు... మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పసిడి పతకాల వేట మరింత జోరందుకుంది. ఈ ‘పసిడి’ పతకాల విజయ యాత్రలో అమ్మాయిలు తమ అద్వితీయ విన్యాసాలతో భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. పోటీల నాలుగో రోజు ఆదివారం భారత క్రీడాకారిణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్ యాదవ్ (69 కేజీలు) ‘లిఫ్ట్’కు బంగారు పతకం ఒడిలోకి చేరగా... ఆ తర్వాత షూటింగ్లో మను భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) గురికి మరో పసిడి పతకం వచ్చేసింది. చివర్లో మహిళల టీటీ జట్టు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్‌ను బోల్తా కొట్టించి ఈ క్రీడల చరిత్రలోనే తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. గోల్డ్‌కోస్ట్: భారత్ తరఫున మొదటి మూడు రోజులు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు కొల్లగొట్టగా... నాలుగోరోజు వీరి సరసన షూటర్లు, టీటీ క్రీడాకారిణులు కూడా చేరారు. ఫలితంగా కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఒకేరోజు మూడు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. మను మళ్లీ మెరిసె... పతకాలు సాధించే విషయంలో తమపై పెట్టుకున్న అంచనాలను భారత షూటర్లు నిజం చేశారు. ఆదివారం మొదలైన షూటింగ్ ఈవెంట్ తొలి రోజే మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హరియణాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మను భాకర్ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 240.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ 234 పాయింట్లు స్కోరు చేసి రజతం గెల్చుకుంది. గత నెలలో మెక్సికో ఆతిథ్యమిచ్చిన సీనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు, సిడ్నీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన మను అదే జోరును కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కనబరిచి ప్రపంచకప్‌లలో తాను నెగ్గిన పసిడి పతకాలు గాలివాటమేమీ కాదని నిరూపించింది. క్వాలిఫయింగ్‌లో 388 పాయింట్లు... ఫైనల్లో 240.9 పాయింట్లు స్కోరు చేసి మను కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పడం విశేషం. మరోవైపు మహిళల స్కీట్ ఫైనల్లో భారత షూటర్ సానియా షేక్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ రవి కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో రవి 224 పాయింట్లు సాధించాడు. మరో భారత షూటర్ దీపక్ కుమార్ 162 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు... వరుసగా నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు స్వర్ణం సాధించడం విశేషం. మహిళల 69 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పూనమ్ యాదవ్ మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకుంది. 2014 గ్లాస్కో గేమ్స్‌లో పూనమ్ 63 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించింది. పురుషుల 94 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్ ఠాకూర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను మొత్తం 351 కేజీలు (స్నాచ్‌లో 159+క్లీన్ అండ్ జెర్క్‌లో 192) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. 2014 గ్లాస్కో గేమ్స్‌లో వికాస్ 85 కేజీల విభాగంలో రజతం గెలిచాడు. మహిళల 75 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సీమా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మనిక మెరుపులు... ఆదివారం అన్నింటికంటే హైలైట్ భారత మహిళల టీటీ జట్టు ప్రదర్శన. టీమ్ విభాగంలో వరుసగా ఐదో స్వర్ణం సాధించాలని ఆశించిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్ జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఫైనల్లో భారత్ 3–1తో సింగపూర్‌ను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సింగపూర్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈసారి విజేతగా నిలిచి బదులు తీర్చుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల మనిక బాత్రా తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి భారత చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ మనిక 11–8, 8–11, 7–11, 11–9, 11–7తో ప్రపంచ 4వ ర్యాంకర్ ఫెంగ్ తియన్వెను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మధురిక ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో మౌమా దాస్–మధురిక ద్వయం 11–7, 11–6, 8–11, 11–7తో యిహాన్ జూ – మెంగ్యు యూ జోడీని ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 11–4, 11–7తో యిహాన్ జూపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు స్వర్ణాన్ని గెల్చుకుంది. ‘‘ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఒలింపిక్ పతక విజేతను నేను ఓడిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆమెపై గెలిచిన క్షణాన నేను ప్రపంచం శిఖరాన ఉన్నట్లు భావించాను’ అని మనిక వ్యాఖ్యానించింది. స్వర్ణ పతకాలతో భారత మహిళల టీటీ బృందం -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట
-
కామన్వెల్త్ గేమ్స్ : 6 స్వర్ణాలతో నాలుగోస్థానంలో భారత్
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. నాలుగో రోజు వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం గెలవగా.. 10 మీటర్ల మహిళల ఏయిర్ పిస్టల్ విభాగంలో మనూ భాకర్ స్వర్ణం సాధించారు. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. 10 మీటర్ల పురుషుల ఏయిర్ పిస్టల్ విభాగంలో రవికుమార్ కాంస్యం సొంతం చేసుకోగా.. పురుషుల 94 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వికాస్ ఠాకుర్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యలతో మొత్తం11 మెడల్స్‌తో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఎనిమిది పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. ఇక ఈ జాబితాలో 66 పతకాలతో(23 స్వర్ణాలు) ఆస్ట్రేలియా తొలిస్థానంలో ఉండగా.. 37 పతకాలతో(15 స్వర్ణాలు) ఇంగ్లండ్, 23 పతకాలతో(6 స్వర్ణాలు) కెనడా భారత్‌కన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. 18 పతకాలు గెలిచిన స్కాట్లాండ్ స్వర్ణపతకాల సంఖ్య(4) భారత్ కన్నా తక్కువగా ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది. -
పసిడితో ముగించారు
సిడ్నీ: ఈ నెలారంభంలో సీనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు ఓవరాల్ టీమ్ టైటిల్ నెగ్గగా... అదే జోరును జూనియర్ ప్రపంచకప్‌లోనూ కొనసాగించారు. సిడ్నీలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ తొమ్మిది స్వర్ణాలతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. చివరి రోజు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల ముస్కాన్ గురికి భారత్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఫైనల్లో ముస్కాన్ 35 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ (18 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముస్కాన్, మను భాకర్, దేవాన్షి రాణా బృందానికి పసిడి పతకం లభించగా... అరుణిమా, మహిమా, తనూ రావల్ జట్టుకు రజతం దక్కింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, ఆయూష్ రుద్రరాజు, గుర్నీలాల్ జట్టు 348 పాయింట్లు సాధించి రజతం గెల్చుకుంది. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలు గెలిచింది. చైనా తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 25 పతకాలు సొంతం చేసుకుంది. -
ఘట్టమనేని ఘటికురాలు
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి. తెనాలిరూరల్: తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది. కామన్వెల్త్లో మెరిసిన రేవతి.. సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. 2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్ విమెన్’, ‘బెస్ట్ లిఫ్టర్’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు. అంతర్జాతీయపోటీల్లో సత్తా 2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్ఛాంగ్మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్ విమెన్‌గా, ఒకసారి బెస్ట్ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్ (2015)లో టాపర్‌గా నిలిచింది. లక్ష్యంపైదృష్టి సారించాలి చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ -
శ్యామ్ కుమార్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3–0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4–1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు. రన్నరప్ భారత్ న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–15 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 0–1 గోల్‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరఫున షమ్సున్ నహర్ 41వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. -
శ్రీకాంత్, జ్యోతికలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ అండర్–19 చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ టోర్నీలో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర 400మీ. పరుగులో తెలంగాణకు చెందిన డి. శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 48.83 సెకన్లలో పూర్తిచేశాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన డి. జ్యోతిక శ్రీ 56.23 సెకన్లలో పరుగును పూర్తి చేసి పసిడి పతకాన్ని సాధించింది. -
’బంగారు’ విద్యార్థి
-
గోల్డెన్ గర్ల్ !
సూర్యాపేట: లక్ష్యానికి పట్టుదల తోడైతే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.. సూర్యాపేటకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని మతకాల అపర్ణ. తనకు సాఫ్ట్వేర్ రంగం వైపు ఆసక్తి ఉన్నా.. నాన్న కోరిక మేరకు వైద్యరంగం వైపు అడుగులేసి అతని కళ్లల్లో వెలుగులు నింపింది. కాన్పూర్‌లోని రామా మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ చదివి ఒకటి కాదు.. రెండు.. ఏకంగా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు సాధించి ఎనిమిది బంగారు పతకాలు చేజిక్కించుకుని గోల్డెన్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భవాని జీఎన్ఎం, ఏఎన్ఎం నర్సింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని మతకాల చలపతిరావు–శైలజ దంపతుల కుమార్తె అపర్ణ. ఈమె చిన్నతనం నుంచి చదువులో ఫస్ట్ ర్యాంకర్ ఏమి కాదు. ఎల్కేజీ, యూకేజీ హైదరాబాద్‌లో, 1వ తరగతి ఖమ్మంలోని సెయింట్‌ఆన్స్ స్కూల్లో, 2 నుంచి 4వ తరగతి వరకు బేబీమూన్ స్కూల్, 5 నుంచి 7వ తరగతి నార్కట్‌పల్లిలోని శ్రీ విద్యాపీఠ్‌లో, 8 నుంచి 10వ తరగతి వరకు శ్రీచైతన్య ఈ టెక్నో హైస్కూల్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య, ద్వితీయ సంవత్సరం విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తి చేసింది. ఈమె ఇంటర్మీడియట్ వరకు కూడా టాప్ టెన్‌లోనే నిలిచేది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యూపీసెట్ రాసి అందులో 356 ర్యాంకు సాధించింది. దీంతో ఆగ్రా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కాన్పూర్‌లో గల రామా మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి, పూర్తి చేసింది. అన్ని విభాగాల్లోనూ.. అపర్ణ సర్జరీ, మెడిసిన్ విభాగాలతో పాటు యూనివర్సిటీ పరిధిలో టాపర్‌గా నిలవడం, అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. మంగళవారం యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఎనిమిది బంగారు పతకాలు అందుకుంది. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుంచి ఏ విద్యార్థి కూడా ఇన్ని బంగారు పతకాలు సాధించిన చరిత్ర లేదు. దీంతో అపర్ణ 90 ఏళ్ల చరిత్రను తిరగరాసినట్టయింది. గ్రామీణులకు సేవ చేయడమే లక్ష్యం – అపర్ణ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎనిమిది బంగారు పతకాలు సాధిస్తానని అసలు ఊహించలేదని అపర్ణ తెలిపింది. ‘విషయమేంటంటే.. సైన్స్ అంటేనే తనకు ఇష్టముండేది కాదు. కానీ మా నాన్న కోరిక మేరకు సైన్స్‌పై మమకారం పెంచుకుని కష్టపడి, ఇష్టపడి చదివా. నాన్న కలను నెరవేర్చడంతో తన ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తనముందున్న లక్ష్యమొక్కటే గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం’ అని ఆమె తెలిపారు. కూతురుకు స్వీటు తినిపిస్తున్న తండ్రి నా కల నెరవేర్చింది.. నాకు చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలన్నా కోరిక ఉండేది. కానీ అప్పట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో డాక్టర్ కోర్సు చేయలేకపోయా. ఎలాగైనా నా కుమార్తె అపర్ణను డాక్టర్‌ను చేయాలనుకున్నా. ఆమె 10వ తరగతి చదివే సమయంలోనే ఆలోచన వచ్చింది. ఐఐటీ కావాలని తనకు కోరిక ఉన్నా నా కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనివి. – మతకాల చలపతిరావు, అపర్ణ తండ్రి -
మెడిసిన్‌లో ఎనిమిది బంగారు పతకాలు
సూర్యాపేట టౌన్: సూర్యాపేటకు చెందిన అపర్ణ మెడిసిన్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను సాధించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నట్టు విద్యార్థిని తండ్రి చలపతిరావు తెలిపారు. అపర్ణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని రామా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. సర్జరీ, మెడిసిన్ విభాగాల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిందన్నారు. -
వెజ్ తిని, మందు తాగకపోతేనే..
పుణే : శాఖాహారులకు, ఆల్కహాల్ ముట్టని విద్యార్థులకు మాత్రమే షెలార్ మామ బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు పుణే విశ్వవిద్యాలయం పేర్కొంది. ఓ యోగా గురుకు చెందిన ట్రస్టు నేతృత్వంలో కాన్వకేషన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ మేరకు యూనివర్సిటీ సంబంధిత కళాశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రతిభను అంచనా వేయమని సర్క్యూలర్‌లో పేర్కొన్నా.. యూనివర్సిటీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2006 నుంచి యోగా మహర్షి రామ్‌చందర్ గోపాల్ షెలార్(షెలార్ మామ) పేరిట ఆర్ట్స్ గ్రూప్‌ల విద్యార్థులకు పుణే వర్సిటీ బంగారు పతకాలను అందిస్తోంది. ఈ మెడల్‌ను షెలార్ ట్రస్టు, కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. ఈ మెడల్ అందుకునే విద్యార్థులు శాఖాహారులై ఉండాలని, మద్యం సేవించే అలవాటు కూడా ఉండకూడదని పుణే యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. యోగా, ప్రాణాయామాలను ప్రతి రోజూ చేసే విద్యార్థులకు మొదటిగా పతకానికి అవకాశం ఇస్తారని తెలిపింది. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యా లు లభించాయి. అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ (3ని:48.67 సెకన్లు)... ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్ (16.21 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. మహిళల ట్రాక్ సైక్లింగ్ 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్‌లో దెబోరా హెరాల్డ్ రజతం... కురాష్ ప్లస్ 87 కేజీల్లో నేహా సోలంకి, అండర్–87 కేజీల్లో జ్యోతి కాంస్య పతకాలు నెగ్గారు. -
భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు
బ్యాంకాక్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. సోమవారం జరిగిన 10 కిలో మీటర్ల నడక విభాగంలో సంజయ్ కుమార్... డిస్కస్ త్రో ఈవెంట్లో అభయ్ గుప్తా విజేతలుగా నిలిచారు. సంజయ్ 45 నిమిషాల 30.39 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అభయ్ గుప్తా డిస్క్‌ను 56.47 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతేకాకుండా 2015లో సజ్జాద్ హసన్ (ఇరాన్–53.06 మీటర్లు) నెలకొల్పిన ఆసియా రికార్డును అభయ్ బద్దలు కొట్టాడు. డిస్కస్ త్రోలోనే భారత్‌కే చెందిన సాహిల్ సల్వాల్(54.58 మీటర్లు) రజతం గెల్చుకున్నాడు. జ్యోతికశ్రీకి నాలుగో స్థానం... బాలికల 400 మీటర్ల పరుగు ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతికశ్రీ 56.57 సెకన్లలో రేసును పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో జియాది మో (చైనా–55.19 సెకన్లు), జూ సువాన్ వాంగ్ (చైనీస్ తైపీ–55.81 సెకన్లు), మరియమ్ మోబీబీ (ఇరాన్–55.94 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. -
బంగారు పతకాల తెలంగాణ రావాలి
‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల సెయిలింగ్‌లో జాతీయ స్థారుులో 6 పతకాలు సాధించిన విద్యార్థులకు ఆదివారం యాట్ క్లబ్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిం చాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని... అలాగే తెలంగాణలోని క్రీడాకారులు ప్రతి అంశంలోనూ బంగారు పతకాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆ దిశగా ప్రతి క్రీడాకారుడు ముందుకు సాగేలా ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. సామాన్యమైన విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తూ వారికి అన్ని విధాలా సహకారం అందిస్తూ యాట్ క్లబ్ చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాట్ క్లబ్ అధ్యక్షులు కెప్టెన్ కేఎస్‌రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, నాంది ఫౌండేషన్ ప్రతినిధులు రోహిన ముఖర్జీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా, యాట్ క్లబ్ వ్యవస్థాపకులు సోహిమ్, గణేష్ బాలకిషన్, ఆశ్విన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు స్వర్ణాలు నెగ్గిన ఇష్వి
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్ ఇష్వి మిథాయ్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో చివరి రోజు ఇష్వి గ్రూప్-3 బాలికల 50 మీటర్ల బ్యాక్టక్,ర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాలు గెలిచింది. తొలి రోజు ఇష్వి 100 మీటర్ల బ్యాక్టక్ విభాగంలోనూ పసిడి పతకం సాధించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇష్వి మూడు స్వర్ణాలతో తన సత్తాను చాటుకుంది. -
కామన్వెల్త్ రెజ్లింగ్‌లో భారత్ స్వర్ణాల జోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో శనివారం సందీప్ తోమర్ (57కేజీ), అమిత్ ధన్కర్ (70కేజీ), సత్యవర్త్ కడియన్ (97కేజీ)లకు స్వర్ణాలు దక్కగా వినోద్(70కేజీ), రౌబల్జీత్ (97)లకు రజతాలు దక్కారుు. గ్రీకో రోమన్లో మనీష్ (66కేజీ), గుర్ప్రీత్ (75కేజీ), హర్‌ప్రీత్ సింగ్ (80కేజీ), ప్రభ్‌పాల్ (85కేజీ), నవీన్ (130కేజీ) తొలిస్థానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో రితూ ఫోగట్ (48కేజీ), రేష్మ మనే (63కేజీ), లలితా (55కేజీ), పింకీ, మను (58కేజీ) కూడా స్వర్ణాలు సాధించారు. జ్యోతి (75కేజీ), ని క్కీ, సోమాలి (75కేజీ) రజతాలు అందుకున్నారు. -
స్విమ్మింగ్‌లో బంగారు పతకాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్విమ్మింగ్‌లో జిల్లా ఉద్యోగులు ఆరుగురు బంగారు పతకాలు సాధించారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రవిశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో బుధవారం జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఉద్యోగులు ఈ పతకాలు సాధించారన్నారు. విజేతలు ఈ నెల 18 నుంచి 20 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగే జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు హాజరవుతారన్నారు. పతకాలు సాధించిన ఉద్యోగులను జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, గిరీష్, స్విమ్మింగ్ పూల్ అధినేత వెంకటరెడ్డి అభినందించారు. పేరు డిపార్ట్మెంట్ ఈవెంట్ త్యాగరాజు హెల్త్ డిపార్ట్మెంట్ 50 మీ. ఫ్రీ సై్టల్ బాబాసాహెబ్ హెల్త్ డిపార్ట్మెంట్ 50 మీ. ఫ్రీ సై్టల్ గంగాధర జిల్లా పరిషత్ 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ అమరనాథ్‌రెడ్డి జిల్లా పరిషత్ 50 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ కుళ్లాయప్ప ఎంఈఓ, గుంతకల్లు 100 మీ. బ్యాక్ స్ట్రోక్ సూర్యబాబు టీచర్, శెట్టూరు 50 మీ. బ్యాక్ స్ట్రోక్ -
భారత్ గురి అదిరింది
గబాలా (అజర్బైజాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల గురికి మూడు స్వర్ణాలు లభించాయి. ఆదివారం జరిగిన పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో శుభాంకర్ ప్రమాణిక్... 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో సంభాజీ పాటిల్... ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. ఫైనల్లో బెంగాల్‌కు చెందిన శుభాంకర్ 205.5 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సొంతం చేసుకోగా... ఫిలిప్ నెపెచాల్ (చెక్ రిపబ్లిక్-205.2 పాయింట్లు) రజతం, ద్రగోమిర్ లార్డెచె (రొమేనియా) కాంస్యం సాధించారు. టీమ్ విభాగంలో శుభాంకర్, ఫతే సింగ్ ధిల్లాన్, అజయ్ నితీశ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. స్టాండర్డ్ పిస్టల్ ఫైనల్లో సంభాజీ పాటిల్ 562 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో సంభాజీ, గుర్మీత్ సింగ్, రితురాజ్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం దక్కింది. -
క్రీడల్లో ‘శ్రీప్రకాష్’కు పతకాల పంట
దివాన్‌చెరువు (రాజానగరం) : తమిళనాడులోని వృద్ధాచలంలో ఈ నెల 26 నుంచి 28 వరకూ జరిగిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు పలు పతకాలను కైవసం చేసుకున్నట్టు దివాన్‌చెరువు శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఏఎస్ఎన్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగం హేండ్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. అలాగే బాలుర విభాగం చదరంగం, బాస్కెట్‌బాల్ పోటీల్లో రెండు బంగారు పతకాలు, 1500 మీటర్ల పరుగు పందెంలో రెండు రజత, కాంస్య çపతకాలు, 400 మీటర్ల పరుగు పందెం, హేండ్‌బాల్ పోటీల్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందారని వివరించారు. భారత ప్రభుత్వపు యువజన క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను, పీఈటీలు సురేష్, రామకృష్ణలను ప్రిన్సిపాల్‌తోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, డైరెక్టర్ విజయ్‌ప్రకాష్ అభినందించారు. -
సాహసమే ఊపిరి.. గిన్నిస్ బుక్‌పై గురి
సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్న ఉజ్వల్ చిరుప్రాయం నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో పాటవం గాలిలో, నేలపై అపూర్వ విన్యాసాలు పలు పోటీల్లో బహుమతులు, పతకాలు రాజమహేంద్రవరం సిటీ : అణువణువునా తొణికిసలాడే సాహసానికి సాధన తోడైతే.. కొండల్ని ఢీకొనవచ్చు. మబ్బుల్ని మథించే ఎత్తుకు ఎగరవచ్చు. వీసమెత్తు పొరపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసే విన్యాసాలను అలవోకగా చెయ్యవచ్చు. దీన్ని నమ్మిన వాడే రాజమహేంద్రవరానికి చెందిన కొమ్మ ఉజ్వల్. 21వ డివిజన్ ఉల్లితోటకు చెందిన 23 ఏళ్ల ఈ యువకుడు.. నీటిలో చేప ఈదినంత సులువుగా నేలపైనా, గాలిలోనూ సాహసకృత్యాలు చేస్తున్నాడు. తాజాగా ఆదివారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు నగరంలో 250 కేజీల బరువైన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ రైడర్‌తో కలిపి తన పొట్ట మీదుగా వెళ్లే సాహసాన్ని చేసి చూపాడు. అలా.. ఒకటికాదు, రెండు కాదు.. 100 ఎన్ఫీల్డ్ల పయనానికి ఉజ్వల్ తన ఉదరాన్ని వేదిక చేశాడు. ప్రత్యేకత కోసం తపనే ప్రేరణ 3వ తరగతి నుంచే కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్ క్రీడల్లో ఆరితేరిన ఉజ్వల్ తన కంటూ ప్రత్యేకత ఉండాలని తపించే వాడని, ఈ తపనే కుమారుడిని గిన్నిస్ బుక్ రికార్డు సాధన దిశగా ప్రేరణనిచ్చిందని తండ్రి శ్రీనివాసరావు ఉత్సాహంగా చెబుతారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్‌ఫూలలో ఉజ్వల్ ఇప్పటికే అనేక బంగారు పతకాలు, బహుమతులు అందుకున్నాడు. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి సాధించి, హీరో మహేష్‌బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. కిక్ బాక్సింగ్‌లో గాలిలో తేలి కాలితో పెంకులు పగులకొట్టడం, పొట్టపై మోటారు సైకిళ్లను ఎక్కించుకోవడం, ఫైర్ బ్లోయింగ్(గాలిలో మంటలు ఊదడం).. ఇలా అనేక విన్యాసాలు చేసి అబ్బురపరిచి అనేక బహుమతులు అందుకున్నాడు. 2001 హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషన్ బుడేకాన్ కరాటే పోటీలో 7వ స్థానం , 2002లో ఏపీ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్లో మూడవ స్థానం, 2005లో రాష్ట్ర కరాటే, కుంగ్‌ఫూ పోటీల ఆరెంజ్ బెల్ట్ విభాగంలో మొదటి బహుమతి, 2006లో బుడేకాన్ పోటీల్లో 6వ స్థానం, ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీలలో ద్వితీయ బహుమతి, 2007లో రాష్ట్రస్థాయి న్యూడ్రాగన్ చైనీస్ కుంగ్‌ఫూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానం, 2012 విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారుపతకం, 2013, 15 సంవత్సరాల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో బహుమతులు, 2014 లో రాష్ట్ర కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌తో పాటు బంగారు పతకం సాధించాడు. 2015లో పొట్టపై నుంచి 20 మోటారుసైకిళ్లను ఎక్కించుకుని పారగాన్ యూత్ ఐకాన్ టైటిల్ సాధించాడు. చారిత్రకనగరానికి చెందిన ఈ యువ కిశోరం.. సాహసాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే దిశగా దూసుకుపోతున్నాడు. -
భారత్ కు రెండు స్వర్ణాలు
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో విశేషంగా రాణించిన భారత జట్టు రెండు స్వర్ణాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రెండో డివిజన్లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో తొలుత భారత మహిళల జట్టు 3-1తేడాతో లక్సెంబర్గ్‌పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకోగా, ఆపై పురుషుల జట్టు 3-2 తేడాతో బ్రెజిల్‌ను మట్టికరిపించి పసిడిని సొంతం చేసుకుంది. 25 నుంచి 48 ర్యాంకింగ్స్ మధ్యలో ఉన్న జట్లు రెండో డివిజన్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే 25-26వ స్థానాల కోసం బ్రెజిల్‌తో భారత పురుషుల జట్టు, లక్సెంబర్గ్‌తో భారత మహిళల జట్టు తలపడ్డాయి. -
వినేశ్, సాక్షిలకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: వర్ధమాన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్, 60 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సాక్షి స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. 53 కేజీల ఫైనల్లో వినేశ్, మమతా రాణిని ఓడించగా...శీతల్, సీమాలకు కాంస్యాలు దక్కాయి. 60 కేజీల తుది పోరులో సాక్షి చేతిలో ఓడిన మనీషా, రజతంతో సంతృప్తి పడింది. ఈ విభాగంలో బబిత, అనిత కాంస్యాలు గెలుచుకున్నారు. 69 కేజీల కేటగిరీలో నవజోత్, గీతిక స్వర్ణ, రజతాలు సాధించారు. పురుషుల విభాగంలో మన్జీత్ (71 కేజీ), గౌరవ్‌శర్మ (59 కేజీలు), నవీన్ (130 కేజీలు) స్వర్ణాలు అందుకున్నారు. -
మనోళ్లు... ఎన్నాళ్లిలా..!
ఉసేన్ బోల్ట్ పరుగు తీస్తుంటే ఊపిరి బిగబట్టుకుని చూశాం. కెన్యా ఇథియోపియా లాంటి దేశాల అథ్లెట్లు పతకాలు కొల్లగొడుతుంటే అవాక్కయ్యాం. మరి విశ్వవేదికపై మనమెక్కడ? 130 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై పతకాలు తెచ్చే అథ్లెట్స్‌ను ఎందుకు తయారు చేయలేకపోతోంది? ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చైనాలో వైభవంగా ముగిసింది. బోల్ట్ మెరుపులతో, ఇతర అథ్లెట్ల విన్యాసాలతో ప్రపంచం ఆనందించింది. కానీ చైనా పక్కనే ఉన్న భారత దేశం మాత్రం ఎప్పటిలాగే కళ్లు కాయలు కాచేలా పతకం కోసం ఎదురుచూసి నిరాశ చెందింది. నిజానికి మన అథ్లెట్లు ప్రపంచ పోటీల్లో పతకం తెస్తారనే ఆశ లేకపోయినా... మెరుగైన ప్రదర్శన కనబరచాలని కోరుకున్నాం. కానీ ఎప్పటిలాగే నిరాశనే మిగిల్చారు. గతంతో పోలిస్తే ఇంకా దిగజారారు కూడా. మనతో పోలిస్తే చాలా చిన్న దేశాలు కూడా పతకాలు కొల్లగొట్టాయి. కెన్యా ఎంతుంటుంది..? చాలా చిన్న దేశం. కానీ అథ్లెటిక్స్‌లో మాత్రం చెలరేగుతుంది. ఈసారి ఏకంగా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 16 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జమైకా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిన్న దేశాల ధాటికి గతంలో 10 సార్లు టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఆసియా స్థాయిలో ఫర్వాలేదు: ఆసియా స్థాయిలో భారత అథ్లెట్లు ఎప్పుడూ ఫర్వాలేదనే ప్రదర్శన కనబరుస్తారు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మనకు అన్నింటికంటే అత్యధికంగా అథ్లెటిక్స్‌లోనే 13 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి. ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్‌కు సీమా అర్హత సాధించలేదు. రిలే జట్టు కేవలం హీట్స్ దశలోనే ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఆసియా క్రీడల్లో రజతాలు, కాంస్యాలు సాధించిన వారెవరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమ సత్తాను చాటుకోలేకపోయారు. ఎందుకిలా?: ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన శిక్షణ ఉండాలి. అయితే ఇవి లేకుండా కూడా పతకాలు సాధించొచ్చని కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా లాంటి చిన్న దేశాల అథ్లెట్లు నిరూపించారు. మన దగ్గర క్రీడలకు చాలా దేశాలతో పోలిస్తే మంచి సదుపాయాలే ఉన్నాయి. అయితే శిక్షణ, సదుపాయాల్లో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదనేది కూడా అంగీకరించాల్సిన వాస్తవం. మూలాల్లోకి వెళ్లాలి: ఇంత పెద్ద దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు దొరకరు అనుకోలేం. కానీ ప్రాథమిక స్థాయిలోనే మంచి అథ్లెట్లను ఒడిసిపట్టుకునే వ్యవస్థ లేకపోవడం అసలు సమస్య. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగే పోటీలపై దృష్టి పెట్టడం, పాఠశాల క్రీడలను మెరుగుపరచడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ముందు మూలాల్లోకి వెళ్లి చిన్న వయసులోనే అథ్లెట్లను గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే... ప్రపంచ పతకం కోసం తర్వాతి తరాలు కూడా నిరీక్షించాల్సే ఉంటుంది. -సాక్షి క్రీడావిభాగం 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్థానం - మొత్తం 206 దేశాలు పాల్గొన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు దేశాలతో సంయుక్తంగా 65వ స్థానంలో నిలిచింది. 33 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో 2003లో అంజూ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది. - 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో లలితా శివాజీ బాబర్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీనివల్ల భారత్‌కు ప్లేసింగ్ టేబుల్లో కనీసం స్థానం దక్కింది. - మొత్తం 18 మంది అథ్లెట్లు ఈసారి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు 4x400 మీ. రిలే జట్టు సభ్యులు. నేరుగా ఫైనల్స్ జరిగే విభాగాలను మినహాయిస్తే... కేవలం మూడు విభాగాల్లోనే భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరారు. -
రెండు వేల కోట్లు దోపిడి!
గోల్డ్ మెడల్స్ సాధించి, ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఐదుగురు ఐఐటీ విద్యార్థులు అనుకోని విధంగా 2000 కోట్ల రూపాయలను ఏ విధంగా దోచేశారు? ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? అనే కథాంశంతో పవన్ రెడ్డి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’. రమేశ్ ముక్కెర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సీడీని మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ ఆవిష్కరించి, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డికి అందించారు. దర్శకుడు మల్లికార్జున్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్, దర్శకుడు ప్రేమ్‌రాజ్ కూడా పాల్గొన్నారు. ‘‘ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా తెరపై పెద్ద సినిమా’’ అని దర్శకుడు అన్నారు. ‘‘చిన్న చిత్రాలకు విమర్శకులు రివ్యూలు రాయరు. కానీ, ఈ చిత్రాన్ని చూసి, రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని పవన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జనార్ధన్ రెడ్డి ఎల్లనూరు. -
గగన్‌కు రెండు పతకాలు
బింద్రా, చైన్ సింగ్‌లకు కూడా... హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: వచ్చే వారం అమెరికాలో మొదలయ్యే ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీకి ముందు భారత షూటర్లు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, చైన్ సింగ్ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. జర్మనీలో జరిగిన హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీలో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్‌తోపాటు అభినవ్ బింద్రా, చైన్ సింగ్ రెండేసి పతకాలను సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో గగన్ నారంగ్ (620.3), అభినవ్ బింద్రా (628.3), చైన్ సింగ్ (626.2)లతో కూడిన భారత బృందం 1874.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌లో అభినవ్ బింద్రా (208.2 పాయింట్లు), పసిడి పతకాన్ని, చైన్ సింగ్ (206) రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గగన్ నారంగ్ 447.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి చండేలా (188.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. -
బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు స్వర్ణం
జాతీయ క్రీడలు తిరువనంతపురం: వరుసగా మూడో రోజు జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ‘పసిడి’తో మెరిపించారు. ఆదివారం టెన్నిస్‌లో, సోమవారం కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణ పతకాలు రాగా... ఇదే స్ఫూర్తితో మంగళవారం మహిళల టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో తెలంగాణ జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య కేరళతో జరిగిన ఫైనల్లో రుత్విక శివాని, సిక్కి రెడ్డి, మేఘన, రితూపర్ణ దాస్, మనీషాలతో కూడిన తెలంగాణ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ 21-14, 21-18తో పి.సి.తులసీపై నెగ్గి తెలంగాణకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో రుత్విక శివాని-సిక్కి రెడ్డి జంట 21-18, 18-21, 21-13తో అపర్ణ బాలన్-ఆరతి సునీల్ జోడీని ఓడించడంతో తెలంగాణ విజయం ఖాయమైంది. మరోవైపు కయాకింగ్‌లో తెలంగాణకు మరో పతకం వచ్చింది. పురుషుల కయాక్ సింగిల్స్ 500 మీటర్ల ఈవెంట్లో పదమ్‌కర్ ప్రసాద్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 500 మీటర్ల దూరాన్ని ప్రసాద్ ఒక నిమిషం 54 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రీడల పదో రోజు తెలంగాణకు రెండు పతకాలు రాగా... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక్క పతకమూ చేరలేదు. అథ్లెటిక్స్‌లో వివాదాస్పద మహిళా స్ప్రింటర్ దుతీ చంద్ హీట్స్‌లోనే మీట్ రికార్డు నెలకొల్పింది. ఒడిశాకు చెందిన దుతీ 100 మీటర్ల హీట్స్‌ను 11.83 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో దుతీ 11.84 సెకన్లతో జ్యోతి పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం తెలంగాణ 18 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) పదో స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 14వ స్థానంలో ఉన్నాయి. సర్వీసెస్ 90 పతకాలతో (55 స్వర్ణాలు, 16 రజతాలు, 19 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ: నేషన్స్ కప్ అంతర్జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. సెర్బియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి. సోనియా (48 కేజీలు), మన్దీప్ కౌర్ (50 కేజీలు), ముస్కాన్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. అంజలి శర్మ (46 కేజీలు), హర్‌ప్రీత్ కౌర్ (54 కేజీలు), శ్రుతి యాదవ్ (63 కేజీలు) రజత పతకాలను నెగ్గారు. టోకస్ (52 కేజీలు), అనీ లామా (57 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
ప్రసాద్‌కు స్వర్ణం
జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ నాగ్‌పూర్: కొత్తగా ఏర్పడిన ‘బాక్సింగ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎలైట్ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పీఎల్) స్వర్ణ పతకాన్ని సాధించాడు. బుధవారం ముగిసిన ఈ పోటీల్లో వైజాగ్‌కు చెందిన ప్రసాద్... కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) విభాగంలో పోటీపడిన ప్రసాద్ ఫైనల్లో రైల్వేస్‌కు చెందిన సల్మాన్ షేక్‌ను ఓడించి తొలిసారి సీనియర్ చాంపియన్‌గా అవతరించాడు. దాంతోపాటు ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో శిక్షణ పొందిన ప్రసాద్ 2012లో ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో, 2013 ఆసియా యూత్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకాలు గెలిచాడు. -
సర్టిఫికెట్లు అమ్ముకుంటారా?
* యూనివర్సిటీలపైన్యాక్ డెరైక్టర్ ప్రొఫెసర్ రాయ్ ఆగ్రహం * ఉన్నత విద్యను అభ్యసించేవారు 20 శాతం కూడా లేరని వ్యాఖ్య * అత్యుత్తమస్థాయి విశ్వవిద్యాలయం లేకపోవడం దురదృష్టకరం * ఘనంగా పాలమూరు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సాక్షి, మహబూబ్‌నగర్: కొన్ని యూనివర్సిటీలు సర్టిఫికెట్లు అమ్ముకోవడం సహించరాని విషయమని బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) ప్రొఫెసర్ ఏఎన్ రాయ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మొదటి స్నాతకోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన 60 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల్లో దేశంలో మన దేశం రెండోస్థానంలో ఉన్నా.. ప్రపంచ అత్యుత్తమ స్థాయిలో వీటికి స్థానం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశంలో 18 నుంచి 24 ఏళ్ల మధ్యనున్న యువత ఉన్నత విద్యను అభ్యసించడంలో 20 శాతం కూడా మించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో విద్యాలయాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉన్న మొదటి తరం వారిలో అత్యధిక శాతం నిరక్ష్యరాస్యులు ఉండేవారని, ప్రస్తుత తరం వారిలో చదువుకున్న నిరక్ష్యరాసులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు లేని విద్య వల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూరడం లేదన్నారు. విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని, అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రపంచ దేశాలతో పోటీపడవచ్చన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే విశ్వవిద్యాలయాలకు సరైన నిధులు రావడంలేదని చెప్పారు. యూనివర్సిటీలు పూర్తిగా ప్రభుత్వ సాయం మీదనే ఆధారపడడం సరైంది కాదని, ప్రైవేట్ నిధులు సొంతంగా సేకరించేలా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో విద్యపై చేస్తున్న ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందన్నారు. మన దేశంలో ప్రభుత్వ విద్యాసంస్థల కంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, ఈ విషయంలో యూనివర్సిటీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అలాగే యూనివర్సిటీ నియంత్రణ మండళ్లు కూడా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి వి.భాగ్యనారాయణ, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
మానవసేవే మాధవ సేవ
వైద్య విద్యార్థులకు స్విమ్స్ వైస్‌చాన్స్‌లర్ వెంగమ్మ పిలుపు స్నాతకోత్సవంలో ఏడుగురికి గోల్డ్‌మెడల్స్.. కోర్సులు పూర్తిచేసుకున్న 296 మందికి డిగ్రీలు ప్రదానం తిరుపతి కార్పొరేషన్ : మానవ సేవే మాధవ సేవ అని, అదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.వెంగమ్మ పిలుపునిచ్చారు. స్విమ్స్ 5వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.వెంగమ్మ మాట్లాడుతూ డిగ్రీలు పొందిన వైద్యులు నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. 1993లో ప్రారంభించిన స్విమ్స్ ఆసుపత్రి ద్వారా వైద్య, విద్య పరంగా పరిశోధనలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ప్రాణదానం వంటి పథకాలతో పాటు పేదలకు ఉచిత వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో వై ద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పంపిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని వేదికపై ఆమె చదివి వినిపించారు. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిలో స్విమ్స్ మెడికల్ హబ్‌గా ఎదగాలని మంత్రి సందేశంలో వినిపించారు. అనంతరం, స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 296 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురికి బంగారు పతకాలు, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. వీరందరికీ ప్రొఫెసర్ అల్లాడి మోహన్ నేతృత్వంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు, శ్రీవారి పుస్తక ప్రసాదాలు అందించారు. అనంతరం డాక్టర్ వెంగమ్మ చేతుల మీదుగా అతిథులైన డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, ఎస్వీయూ వీసీ రాజేంద్ర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజులకు శ్రీవారి చిత్రపటాలను జ్ఞాపికలుగా అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల డీన్ రామసుబ్బారెడ్డి, మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, శ్రీసాయిసుధా హాస్పిటల్స్ డెరైక్టర్ డాక్టర్ సుధారాణి, తిరుమల డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, స్విమ్స్‌లోని అన్ని వైద్య విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
4న జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రెండేళ్లుగా స్నాతకోత్సవం నిర్వహణ తేదీలు వరుసగా పలుమార్లు వాయిదా పడుతుండడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు వర్సిటీ సిబ్బందిలోనూ అయోమయం నెలకొంది. ఈ అయోమయానికి తెరదించుతూ సెప్టెంబరు 4న ఉదయం 11 గంటల నుంచి స్నాతకోత్సవం నిర్వహించాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి యూనివర్సిటీల చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ నుంచి అనుమతి కూడా లభించింది. సుమారు లక్షమంది విద్యార్థులకు ఒరిజనల్ డిగ్రీ పట్టాలు, ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పరిశోధనలు పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలను స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఓడీ దరఖాస్తులకు గడువు పెంపు.. జేఎన్టీయూహెచ్ పరిధిలో పరిధిలో 4 అనుబంధ, 448 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.5లక్షలమంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తుండగా, ప్రతియేటా 70-80వేలమంది విద్యార్థులు తమకోర్సులు పూర్తి చేసుకొని ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళుతుంటారు. స్నాతకోత్సవం అనంతరం విద్యార్థులందరికీ ఒరిజినల్ డిగ్రీలను యూనివర్సిటీ అందజేస్తుంది. వచ్చేనెల 4న స్నాతకోత్సవానికి జరగనున్న నేపథ్యంలో.. ఆన్లైన్లో ఓడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఈనెల 11 వరకు పొడిగించారు. 2012-13 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 59 వేలమంది, 2013-14 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 39 వేలమంది ఇప్పటికే ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. 50 మందికి గోల్డ్ మెడల్స్ .. 2013-14 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూహెచ్ బంగారు పతకాలకు ఎంపికైన విద్యార్థుల్లో జేఎన్టీయూ హైదరాబాద్ కళాశాల నుంచి ప్రణవినాయుడు(సివిల్), జ్యోతి(ఈఈఈ), స్నేహ(మెకానికల్), హర్షిత(ఈసీఈ), సుజన(సీఎస్ఈ), అఖిలకృష్ణ(మెటలర్జీ), మంథని కళాశాలకు చెందిన అన్వేష్(సివిల్), భాస్కర్(మైనింగ్), వెంకటేశ్(మైనింగ్ మెషినరీ), జగిత్యాల కళాశాలకు చెందినశంతన్తేజ(ఈఈఈ), సంధ్యారాణి(మెకానికల్), రహేలా(ఈసీఈ), సృజన(సీఎస్ఈ), నవ్య(ఐటీ) ఉన్నారు. ఈసీఈ విద్యార్థిని హర్షితకు ఏకంగా ఐదు బంగారు పతకాలు, ప్రణవి నాయుడు మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరో 24మంది ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌కు ఎంపికైనట్లు యూనివ ర్సిటీ అధికారులు వెల్లడించారు. -
రెజ్లింగ్ లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు బబిత కుమారి, యోగీశ్వర్ దత్ లు పసిడి పతకాలను కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటారు. తొలుత మహిళల 55 కేజీల విభాగంలో బబిత కుమారి అద్యంతం ఆకట్టుకుని బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెనడాకు చెందిన బ్రిట్టేన్నీ లెవర్ డ్యూర్ పై ఒడిసి పట్టుకుని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉండగా 65 కేజీల విభాగంలో భారత్ ఆటగాడు యోగేశ్వర్ దత్ పసిడిని చేజిక్కించుకున్నాడు. కెనాడాకు చెందిన రెజ్లర్ జెవోన్ బాల్ ఫోర్ పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే గీతికా జఖర్ మాత్రం ఫైనల్ రౌండ్ లో నిరాశ పరిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ రెజ్లింగ్ లో ఐదు బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మొత్తం మీద 12 బంగారు పతకాలను కైవసం చేసుకుని అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్, వినేష్ పొగట్ లు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. తొలుత 57 కిలోల విభాగంలొ భారత్ ఆటగాడు అమిత్ కుమార్ తన ప్రత్యర్ధి నైజీరియా ఆటగాడు ఎబిక్ వెమినోవాపై విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా 48 కిలోల మహిళల విభాగంలో భారత్ క్రీడాకారిణి వినేష్ పొగాట్.. ఇంగ్లండ్ క్రీడాకారిణి యానాపై విజయం సాధించి పసిడిని తన ఖాతాలో వేసుకుంది. మరో భారత్ ఆటగాడు సుశీల్ కుమార్ 74 కిలోల విభాగంలో తన సమీప ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాడు అబ్బాస్ ను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే 124 కిలోల విభాగంలో రాజీవ్ తోమర్ మాత్రం కెనడా ఆటగాడు కోరీ జార్విస్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా పతకాలతో 10 పసిడిలను తన ఖాతాలో వేసుకున్న భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
జ్యోత్స్నకు పసిడి
జాతీయ అండర్-14 ఆర్చరీ విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జాతీయ అండర్-14 మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ఆర్చర్ కె.జ్యోత్స్న (ఓల్గా ఆర్చరీ అకాడమీ) కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈవెంట్లో ఆమె 139 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. బాలుర వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో రాష్ట్ర ఆర్చర్ ఎం.చరిత్ (ఓల్గా ఆర్చరీ అకాడమీ) రజత పతకం నెగ్గాడు. రికర్వ్‌లో బొమ్మదేవర ధీరజ్ (ఓల్గా ఆర్చరీ అకాడమీ) 30, 20 మీటర్ల విభాగంలో స్వర్ణపతకాలు సాధించాడు. బాలికల విభాగంలో బీఎం రిత్విక ప్రజ్ఞ కాంస్య పతకం సాధించింది. ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో నిజామాబాద్‌కు చెందిన బి.నవ్యశ్రీ 30 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం కైవసం చేసుకుంది. -
నిస్వార్థంగా సేవలందించండి
యువ వైద్యులకు గవర్నర్ భరద్వాజ్ సూచన వైద్య రంగంలో సేవలందించిన ఏడుగురికి గౌరవ డాక్టరేట్లు సాక్షి, బెంగళూరు : అవసరంలో ఉన్న పేదలకు నిస్వార్థంగా సేవలందించాలని యువ వైద్యులకు గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ సూచించారు. బుధవారమిక్కడి నిమ్హాన్స్ ప్రాంగణంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్, ఎంఎస్, ఎం.డి, బీడీఎస్ తదితర విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 62మందికి గోల్డ్‌మెడల్స్‌తో పాటు, వైద్య రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న ఏడుగురికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. గౌరవ డాక్టరేట్లను అందుకున్న వారిలో రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్లు డాక్టర్ ఆర్.చంద్రశేఖర్, డాక్టర్ ఎస్.రమానంద శెట్టి, కర్ణాటక వైద్యకీయ పరిషత్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కనంజప్ప, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బెనకప్ప, హెల్త్‌కేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవ ఆర్.పాండురంగి, నారాయణ హృదయాలయ అధ్యక్షుడు డాక్టర్ దేవీప్రసాద్ శెట్టి, నేత్రధామ కంటి ఆస్పత్రి అధ్యక్షుడు డాక్టర్ శ్రీ గణేష్ ఉన్నారు. కార్యక్రమంలో కేంద్ర వైద్య శాఖ డెరైక్టర్ డాక్టర్ విశ్వమోహన్ కటోచ్, రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ఎస్.శ్రీప్రకాష్ పాల్గొన్నారు. నీకెందుకు సమాధానం చెప్పాలి.... స్నాతకోత్సవ సంబరాల్లో పాల్గొని వెనుదిరిగిన గవర్నర్ భరద్వాజ్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘నేను నీకెందుకు సమాధానం చెప్పాలి, అసలు నువ్వు జర్నలిస్టువేనని నమ్మకం ఏంటి?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వివరాలు పరిశీలిస్తే...మంగళూరు విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ చాన్సలర్‌ను నియమించేందుకు గాను గవర్నర్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఎస్.రంగప్పను సభ్యుడిగా నియమించారు. కాగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారంటూ ఓ విలేకరి ప్రశ్నించడంతో గవర్నర్ కోపంతో ఊగిపోయారు. ‘అసలు నువ్వు జర్నలిస్టువేనా?అంటూ ప్రశ్నించారు. అవును సార్ నేను జర్నలిస్టునే, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అనగా...‘అసలు నేనెందుకు నీకు సమాధానం చెప్పాలి. నా ఇష్టం మేరకు నేను నియమించాను’ అని చెబుతూ అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయారు. -
నెమ్మిపాటి.. ఘనాపాటి
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ఇంట్లో ముగ్గూరూ ఆడపిల్లలే. తండ్రి వారిని ఎన్నడూ ఆడ పిల్లలుగా పెంచలేదు. మగాళ్లే అనుకుంటూ పౌరుషాన్ని, ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని బాల్యం నుంచే నూరిపోశాడు. చేరుకోవాల్సిన గమ్యాన్ని, సాధించాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించాడు. సాదాసీదా బతుకు కాదు.. సాధించి తీరుతా అనే భావన ఉండాలన్నాడు. మామూలు జీవితం కాదు. మట్టిలో మాణిక్యాల్లా రాణించాలన్నాడు. పుట్టిన మట్టి వాసనను మరువొద్దన్నాడు. కన్న ఊరికి, ఇంటికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఆకాశమే హద్దుగా ఎదగాలన్నాడు. వెన్ను తట్టిన తండ్రి ప్రోత్సాహాన్ని అంది పుచ్చుకున్న ఆ తనయ తమస్సుతో పోరాడారు. తపస్సుతో సాధించారు. ఆ ఇంటికే నవోషస్సుగా నిలిచారు.కర్నూలు జిల్లా బొల్లవరంలో పుట్టి పెరిగి కర్నూలు నగరంలోని ఈసీఎం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, హ్యామర్‌త్రో.. వెయిట్ లిఫ్టింగ్‌లలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. మే నెలలో జపాన్‌లో జరగనున్న అథ్లెటిక్స్ మీట్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొననున్నారు. అంతేగాదు పెయింటింగ్‌లో టైలరింగ్ లో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో, క్యాటరింగ్(రుచికరమైన వంటల్లో) తనదైన శైలిలో రాణించి అందరితో శెభాష్ అనిపించుకుని అన్ని రంగాల్లో ఘనాపాటిగా నిలిచిన నెమ్మిపాటి లక్ష్మీదేవి కథనం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. బొల్లవరంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో నెమ్మిపాటి లక్ష్మీదేవి జన్మించారు. తల్లి వెంకమ్మ తండ్రి కృష్ణారెడ్డిలు ఈమెను బాల్యం నుంచి అన్ని రంగాల్లో రాణించాలని ప్రోత్సహించారు. ముగ్గురు ఆడపిల్లలే కావడంతో తండ్రి కృష్ణారెడ్డి వాళ్లను ప్రేమతో ధైర్యం కలిపి పెంచారు. కర్నూలు ఈసీఎం స్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన ఈమె ఆ పాఠశాలలోనే కబడ్డీలో ఉత్తమ క్రీడాకారిణిగా రాణించారు. 1981 నుండి 1990 వరకు తొమ్మిదిసార్లు జాతీయ స్థాయి కబడ్డీలో విజేతగా నిలిచి మెడల్స్ అందుకున్నారు. కబడ్డీ, అథ్లెట్స్‌లో 150 మెడల్స్... రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఈమె మొత్తంగా 150 మెడల్స్ సాధించడం విశేషం. 1986లో ఈమె వివాహానంతరం కబడ్డీ ఆటకు చుక్క పెట్టి అథ్లెటిక్స్ వైపు వెయిట్ లిఫ్టింగ్ వైపు దృష్టి సారించారు. 1991లో ఈమె పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పో లీసు మీట్లలో ఉత్తమ అథ్లెట్‌గా రాణించి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారుల ప్రశంసలు పొందారు. అన్ని రాష్ట్రాల్లోని క్రీడా పోటీల్లో.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన క్రీడా పోటీల్లో ఈమె పాల్గొన్నారు. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో జరిగిన ప్రధాన క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిసారి పతకం సాధించుకొచ్చారు. పాఠశాల స్థాయిలో తనకు ప్రోత్సాహమిచ్చిన కళా ప్రపూర్ణ టీచరంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ ఆమెను కలిసి ఆశీస్సులు పొందుతుంటానని లక్ష్మిదేవి న్యూస్‌లైన్‌తో చెప్పారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లపై ప్రత్యేక ఆసక్తి.. క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లక్ష్మీదేవి పోలీసు మీట్స్‌కు వెళ్లినప్పుడు పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా ఆమెకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, రుచికరమైన వంటకాలపై ఆసక్తి కలిగింది. ఈ రంగాల్లోను ప్రత్యేక దృష్టి సారించి ఈమె ప్రస్తుతం కొంతమంది మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్‌లలో ఉపాధి చూపిస్తున్నారు. పలు రకాల పచ్చళ్ల తయారీ, చికెన్ వెరైటీ వంటకాలలోను ఈమె శిక్షణనివ్వగలరు. సంకటి, సద్దన్నమే...బలాన్నిచ్చాయి: లక్ష్మీదేవి నేను చిన్నప్పు్పడు మా పల్లెలో తిన్న సంకటి, సద్దన్నమే నాకు ఇంత బలాన్నిచ్చాయి. ప్రమాదంలో నా కుడి చేయికి గాయమై రెండు వ్రేళ్ల ఎముకలు దెబ్బతిన్నాయి. అయినా నేను వెనుకడుగు వేయలేదు. షార్ట్‌ఫుట్‌లో, డిస్కస్ త్రోలో, హామర్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ పతకాలు సాధించాను. మే 2014లో జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నాను. ఉత్తమ అంతర్జాతీయ క్రీడాకారణిగా రాణించాలన్నదే నా జీవిత ధ్యేయం. ఎస్పీ అభినందన కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీదేవి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. గత నెల ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన 35వ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో లక్ష్మిదేవి పాల్గొన్నారు. డిస్కస్ త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం, హ్యామర్ త్రోలోను మొదటి స్థానంతో బంగారు పతకం, జావెలిన్ త్రోలో రెండో స్థానంతో వెండి పతకం సాధించారు. కర్నూలు జిల్లా పోలీస్ శాఖ నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని స్వర్ణ, రజత పతకాలు సాధించడంతో పాటు జపాన్‌లో జరిగే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన లక్ష్మిదేవిని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ, ఇతర పోలీసు అధికారులు అభినందించారు. కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఆమెను పోలీసు అధికారులు కొనియాడారు. వచ్చే నెలలో జపాన్‌లో జరిగే క్రీడల్లో కూడా ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్ఐలు రెడ్డప్పరెడ్డి, ఆర్ఎస్ఐలు, సిబ్బంది ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
భారత్‌కు మూడు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రాణిం చారు. మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు మరో రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు నెగ్గారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో శనివారం ముగిసిన ఈ పోటీల్లో ఎనిమిది పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అండర్-16 బాలుర విభాగంలో కార్తికేయన్ మురళీ (చెన్నై) స్వర్ణం, గిరీశ్ కౌశిక్ (మైసూర్) రజతం సాధించారు. అండర్-8 బాలుర విభాగంలో ప్రజ్ఞానంద (చెన్నై) చాంపియన్ అయ్యాడు. అండర్-10 బాలికల విభాగంలో సైనా సోలంకి (ఒరిస్సా) టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-12 బాలుర విభాగంలో రఘునందన్ (బెంగళూరు) రజతం దక్కించుకున్నాడు. వైభవ్ (ఢిల్లీ, అండర్-18 బాలురు); సి.లక్ష్మీ (చెన్నై, అండర్-10 బాలికలు), భాగ్యశ్రీ (మహారాష్ట్ర, అండర్-8 బాలికలు) కాంస్యాలు నెగ్గారు. ఈ పోటీల్లో 123 దేశాల నుంచి 1,818 క్రీడాకారులు పాల్గొన్నారు. -
16 మంది టాపర్లకు గోల్డ్‌మెడల్స్
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 13న జరగనున్న తొలి స్నాతకోత్సవంలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 16 మంది టాపర్లు గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. స్నాతకోత్సవాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 16 కమిటీలను నియమించి, ఒక్కో కమిటీకి ఒక్కో పనిని అప్పగించారు. దీంట్లో గోల్డ్‌మెడల్ సెలక్షన్ కమిటీ ఒకటి. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరు బ్యాచులు పూర్తయ్యాయి. అసలే నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న వర్సిటీ తరపున ప్రతి బ్యాచు టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలంటే తలకు మించిన భారమే. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి జిల్లాకు చెందిన వివిధ రంగాల్లో పలువురు ప్రముఖులను కలిసి టాపర్లకు గోల్డ్ మెడల్స్ అందజేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. రిజిస్ట్రార్ విన్నపాన్ని మన్నించడంతో పాటు వర్సిటీ అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేయాలని సదుద్దేశంతో 15 మంది దాతలు గోల్డ్ మెడల్స్ అందజేయాలని కోరు తూ ఒక్కొక్కరు రూ.2.10లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఒక్కో దాత తమకు నచ్చిన కోర్సులో టాపర్‌కు గోల్డ్ మెడల్ అందజేయాలని సూచించారు. అలాగే వర్సిటీ ఉన్నతాధికారులు తమ వంతుగా ఒకరికి డాక్టర్ బీఆర్ అంబేద ్కర్ మెమోరియల్ గోల్డ్‌మెడల్ పేరిట అన్ని కోర్సుల్లో కలిపి టాపర్‌గా నిలిచిన వారికి గోల్డ్ మెడల్ అందజేయాలని నిర్ణయించారు. దీంతో తొలి స్నాతకోత్సవంలో 15 కోర్సుల్లో టాపర్లతో పాటు యూనివర్సిటీ టాపర్‌కు గోల్డ్‌మెడల్ అందజేయనున్నారు. దాతలు విరాళాలు అందజేసిన కోర్సులకు సంబంధించి గోల్డ్‌మెడల్ ఇవ్వనున్న టాపర్ల జాబితాకు వర్సిటీ పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కమిటీ) అనుమతి లభించింది. వర్సిటీ ఆధ్వర్యంలో ఇ చ్చే టాపర్‌కు పాలకమండలి అనుమతి లభిం చాల్సి ఉందని రిజిస్ట్రార్ లింబాద్రి తెలిపారు. -
15న ‘నిట్’ స్నాతకోత్సవం
= 8 మందికి గోల్డ్‌మెడల్స్ ప్రదానం = 1,323 మందికి డిగ్రీ పట్టాల అందజేత = ఖరారు కాని కేంద్ర మంత్రి పల్లంరాజు రాక = ముఖ్యఅతిథిగా కృష్ణా ఎం ఎల్ల = నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు వెల్లడి నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : కాజీ పేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11వ స్నాతకోత్సవాన్ని ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు నిట్ డెరైక్టర్, ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. నిట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గం టలకు నిట్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమంలో 1,323 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 773 మందికి, పీజీ కోర్సుల్లో 506 మందికి, పీహెచ్డీ స్కాలర్స్ 44 మందికి పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. స్నాత కోత్స వంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 8 మంది బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్లను గోల్డ్‌మెడల్స్‌కు ఎంపిక చేశామన్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఓవరాల్ గోల్డ్‌మెడల్‌ను నిట్ బీటెక్ విద్యార్థి(మెకానికల్ ఇంజినీరింగ్) పొన్నపల్లి చైతన్యసాయికి అందజేయనున్నామని చెప్పారు. గత స్నాతకోత్సవంలో 23 మందికి పీహెచ్డీ డిగ్రీలు ఇవ్వగా, ఈసారి 44 మందికి ఇవ్వనుండడమే ఇందుకు నిదర్శనమన్నా రు. డీన్, ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ సాధారణంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పీహెచ్డీ ఎక్కువగా చేస్తారని.. ఈసారి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు చేసిన 12 మందికి పీహెచ్డీ పట్టాలు ఇవ్వనుండడం విశేషమన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా కృష్ణా ఎం ఎల్ల స్నాతకోత్సవానికి నిట్ వరంగల్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణా ఎం ఎల్ల ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాన్వొకేషన్‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజు హాజరవుతారని అనుకున్నామని.. అయితే మంత్రి రాక అధికారికంగా ఖరారు కాలేదని చెప్పారు. అయినా షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో నిట్ కాన్వొకేషన్ ఇన్చార్జ్, ప్రొఫెసర్ రమేష్, పీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు. మెడల్స్ అందుకునేది వీరే.. నిట్‌క్యాంపస్ : మెకానికల్ ఇంజినీరింగ్‌లో వరంగల్‌కు చెందిన పొన్నపల్లి చైతన్యసాయి నిట్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన గౌరవ్జైన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్(ఈఈఈ)లో విశాఖపట్నంకు చెందిన లోకేష్‌చంద్ర, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ఈసీఈ)లో లక్నోకు చెందిన అభిమన్య శ్రీవాత్సవ, మెటలార్జికల్, మెటీరియల్ ఇంజినీరింగ్‌లో అలహాబాద్‌కు చెందిన ప్రభాత్కుమార్సింగ్, కెమికల్ ఇంజినీరింగ్‌లో బెంగళూర్‌కు చెందిన గోకుల్ హరిహరణ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జలందర్‌కు చెందిన అమిత్‌జోషి, చెన్నైకి చెందిన ప్రియవతి బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. సంతోషంగా ఉంది..: చైతన్యసాయి నిట్ ఇన్స్టిట్యూట్ గోల్డ్‌మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని చైతన్యసాయి అన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ బోధన ఉంటుందని చెప్పారు. తన తండ్రి హరికృష్ణప్రసాద్ నిట్‌లోని ఈసీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఇక్కడే మెడల్ తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. కాగా, ప్రస్తుతం చైతన్యసాయి ఓఎన్జీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉద్యోగం పొందారు. -
గురువులను మరవొద్దు
ముషీరాబాద్/హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత.. మనం ఆ స్థాయికి రావడానికి కారణమైన గురువులను, విద్యాలయాలను మరిచిపోవద్దని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఆయా విద్యాలయాలకు ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. ఏటా గాంధీ జయంతి రోజున నిర్వహించే కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్రాటెర్నిటీ (పూర్వ విద్యార్థుల సంఘం) వార్షిక సమావేశం బుధవారం నారాయణగూడలోని కేశవస్మారక కళాశాల హాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐటీ, రిజర్వ్‌బ్యాంక్, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కుటుంబ సమేతంగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిల్వర్ జూబ్లీ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన కృష్ణారావు ప్రసంగిస్తూ.. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటునందించాలని కోరారు. మనం అందించే చిన్న సహకారం పరోక్షంగా ఎంతో మంది పేద విద్యార్థులకు గొప్ప సహాయంగా ఉపయోగపడుతుందన్నారు. ఫ్రాటెర్నిటీ అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.జనార్ధన్ సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కళాశాల పూర్వ విద్యార్థులు పొట్ల మాదవరావు, ఆర్వీ శేషారెడ్డి గతేడాది అందించిన ఆర్థిక సహాయం వల్ల ఇద్దరు విద్యార్థులకు ఈ ఏడాది అవార్డులు, పురస్కారాలు అందించామన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోగా, దాతలు ఇచ్చిన రూ.1.50 లక్షలతో అతనికి రోబో కాలును అందజేసినట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు రూ.600 నుంచి రూ.1050కి పెరిగాయని, ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్‌లు డాక్టర్ పీవీ రమేష్, కె.సునీత, ఆజయ్మిశ్రాల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో మహిళలకు ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన 14 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, నగదు పురస్కారాలను గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందజేశారు. ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్‌ఖాదర్, సాక్షి బిజినెస్ స్పెషల్ కరస్పాండెంట్ డి.శివరామిరెడ్డి, సంఘం ముఖ్య ప్రతినిధులు సంపత్‌రెడ్డి, మల్లికార్జున్, లక్ష్మణ్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ మిమిక్రి ఆర్టిస్టు, సినీ నటుడు శివారెడ్డి తన మిమిక్రితో సభలో నవ్వులు పూయించారు. పూర్వ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.