
పసిడి గెలిచిన ఆనందంలో రాహుల్ ఆవారే
సాక్షి, హైదరాబాద్ : 21వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఎనిమిదో రోజు భారత రెజ్లర్ రాహుల్ ఆవారే పసిడి పతకం సాధించారు. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు రాహుల్. దీంతో గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకూ సాధించిన పసిడి పతకాల సంఖ్య 13కు చేరింది. అంతకుముందు ఎనిమిదో రోజు పతకాల వేటను షూటర్ తేజస్వినీ సావంత్ రజతంతో ఆరంభించారు.
50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆమె రెండోస్థానంలో నిలిచి వెండి పతకాన్ని తెచ్చారు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో రెజ్లర్ బబితా కుమారి రజతం సాధించారు. మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కిరణ్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28కు చేరింది.