నేషన్స్ కప్ అంతర్జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. సెర్బియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి.
న్యూఢిల్లీ: నేషన్స్ కప్ అంతర్జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. సెర్బియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి. సోనియా (48 కేజీలు), మన్‌దీప్ కౌర్ (50 కేజీలు), ముస్కాన్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. అంజలి శర్మ (46 కేజీలు), హర్‌ప్రీత్ కౌర్ (54 కేజీలు), శ్రుతి యాదవ్ (63 కేజీలు) రజత పతకాలను నెగ్గారు. టోకస్ (52 కేజీలు), అనీ లామా (57 కేజీలు) కాంస్యాలు గెలిచారు.