
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ అండర్–19 చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఈ టోర్నీలో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర 400మీ. పరుగులో తెలంగాణకు చెందిన డి. శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 48.83 సెకన్లలో పూర్తిచేశాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన డి. జ్యోతిక శ్రీ 56.23 సెకన్లలో పరుగును పూర్తి చేసి పసిడి పతకాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment