ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యా లు
అష్గబాత్ (తుర్క్‌మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యా లు లభించాయి. అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ (3ని:48.67 సెకన్లు)... ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్ (16.21 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు.
మహిళల ట్రాక్ సైక్లింగ్ 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్‌లో దెబోరా హెరాల్డ్ రజతం... కురాష్ ప్లస్ 87 కేజీల్లో నేహా సోలంకి, అండర్–87 కేజీల్లో జ్యోతి కాంస్య పతకాలు నెగ్గారు.