జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్‌డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్‌డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది.
దీంతో పాటు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్‌గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment