Nataraj
-
స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్‌లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు
జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది. దీంతో పాటు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్‌గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది. -
నిన్న కళాశాల.. నేడు చెరసాల
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిన్నటి వరకు కళాశాలలో ఓ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ప్రస్తుతం ప్రియురాలి అనుమానాస్పద కేసులో అరెస్టయి జైలు పక్షిగా మారిపోయాడు. తెలుగు అధ్యాపకురాలు హరిశాంతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డీజీ వైష్ణవీ కళాశాల ప్రాఫెసర్ నటరాజ్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలూకా ఎల్ల యమ్మన్ ఆలయం వీధికి చెందిన హరిశాంతి (32) ఉన్నత విద్యావంతురాలు. మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన హరిశాంతి చెన్నై పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుటీచర్గా పనిచేసేవారు. మద్రాసు యూనివర్సిటీలో తోటి విద్యార్థి నటరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారినట్లు సమాచారం. పీహెచ్డీ పట్టా అందుకున్న తరువాత హరిశాంతి, నటరాజ్ ఇద్దరూ చెన్నై అన్నానగర్ ఆర్చ్ సమీపం, అరుబాక్కంలోని డీజీ వైష్ణవీ కళాశాలలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే 2016లో నటరాజ్ మరో యువతిని పెళ్లిచేసుకోగా ఇద్దరు బిడ్డల తండ్రి కూడా అయ్యాడు. ఈ బాధతోనే మరో కారణం చేతనో హరిశాంతి డీజీ వైష్ణవీ కళాశాల ఉద్యోగాన్ని మానివేసి పెరంబూరులోని ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. అయినా తరచూ కళాశాలకు రాకపోకలు సాగిస్తుండేది. యథాప్రకారం ఈ నెల 17న సాయంత్రం డీజీ వైష్ణవీ కళాశాలకు వచ్చిన హరిశాంతి తెలుగుశాఖ గదిలో ఉరివేసుకుని వేలాతుండగా మరుసటి రోజు ఉదయం కళాశాల సిబ్బంది గుర్తించారు. ఆమె చేతి మణికట్టు పదునైన వస్తువుతో కోసినట్లుగా కూడా ఉంది. ఆరుంబాక్కం పోలీసులు ఆమె మృతదేహాన్ని కీల్పాక్ పోస్టుమార్టానికి పంపారు. ప్రొఫెసర్ నటరాజ్‌తో స్నేహం, ప్రేమ విఫలం, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను హరిశాంతి తన సెల్‌ఫోన్ వాట్సాప్‌లో నమోదు చేసినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. హరిశాంతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై నటరాజ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
ట్రైలర్ బాగుంది – రామ్‌గోపాల్ వర్మ
‘‘ఊల్లాల ఊల్లాల’ మేకింగ్ వీడియో చూసి ఆశ్చర్యపోయా. సత్యప్రకాష్లో ఇంత ప్రతిభ ఉందా? అనిపించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. గురురాజ్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటరాజ్ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్యప్రకాష్ దర్శకత్వం వహించారు. ఎ.గురురాజ్ నిరి్మంచిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. సత్యప్రకాష్ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నటరాజ్‌ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నా. గురురాజ్‌తో జర్నీ చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల.. ఊల్లాల’ అనే టైటిల్ ఆయన ఆలోచనే. టైటిల్ బాగుందని వర్మగారు కూడా అన్నారు’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు గురురాజ్. ‘‘కొత్తవారితో సినిమా అంటే ఆరి్థక సమస్యలుంటాయి. కానీ, గురురాజ్ సినిమాను విడుదల చేస్తాడనే భరోసానే సత్యప్రకా‹Ùను నడిపించింది’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. -
గిల్లీ–దండా ఆట
నటరాజ్, రోణిక సింగ్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘గిల్లీ–దండా’. ‘అరుంధతి’ శ్రీను దర్శకత్వంలో జె.వీరేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో ‘గిల్లీ–దండా’ ఆట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో, అనంతపురం, గుత్తి, బెంగళూరు, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు నిర్మాత జె. వీరేష్. ఈ చిత్రానికి కెమెరా: జి.జె. కృష్ణ, సంగీతం: రఘు కుంచె, నిర్వహణ: రాంబాబు.