ట్రైలర్‌ బాగుంది – రామ్‌గోపాల్‌ వర్మ | Ullala Ullala Movie Trailer Is Good Says Ramgopal Verma | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ బాగుంది – రామ్‌గోపాల్‌ వర్మ

Published Wed, Dec 18 2019 12:57 AM | Last Updated on Wed, Dec 18 2019 12:57 AM

Ullala Ullala Movie Trailer Is Good Says Ramgopal Verma - Sakshi

‘‘ఊల్లాల ఊల్లాల’ మేకింగ్‌ వీడియో చూసి ఆశ్చర్యపోయా. సత్యప్రకాష్‌లో ఇంత ప్రతిభ ఉందా? అనిపించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ చాలా బావున్నాయి. గురురాజ్‌కు ఈ సినిమా మంచి సక్సెస్‌ ఇవ్వాలి’’ అన్నారు  డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ. నటరాజ్‌ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్యప్రకాష్‌ దర్శకత్వం వహించారు. ఎ.గురురాజ్‌ నిరి్మంచిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు.

సత్యప్రకాష్‌ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నటరాజ్‌ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నా. గురురాజ్‌తో జర్నీ చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల.. ఊల్లాల’ అనే టైటిల్‌ ఆయన ఆలోచనే. టైటిల్‌ బాగుందని వర్మగారు కూడా అన్నారు’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు గురురాజ్‌. ‘‘కొత్తవారితో సినిమా అంటే ఆరి్థక సమస్యలుంటాయి. కానీ, గురురాజ్‌ సినిమాను విడుదల చేస్తాడనే భరోసానే సత్యప్రకా‹Ùను నడిపించింది’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్‌. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement