RamGopal Verma
-
ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు
సాక్షి నెట్వర్క్: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిన ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెచ్చిపోతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను సోషల్ మీడియాలో ప్రశి్నంచారని ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశి్నంచడంతో ప్రభుత్వం పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. సోషల్ మీడియాలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కొందరి పేర్లను ఎంపిక చేసి పచ్చ పార్టీ కార్యకర్తల ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తోంది. ఫిర్యాదులు అందుకున్నదే తడవుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలో ముగ్గురిపై.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై రేపల్లె నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. షేక్ మహ్మద్ ఖాజా మొహిద్దీన్‌పై నగరం మండలానికి చెందిన ఐటీడీపీ కన్వీనర్ జుజ్జూరి బాలనరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన టీడీపీ నేత శొంఠి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు జింకల రామాంజనేయులుపై కేసు నమోదైంది. దిండికి చెందిన టీడీపీ నేత నాగకిశోర్ ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసు స్టేషన్లో బత్తులపల్లి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల అదుపులో సోషల్ మీడియా కన్వీనర్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపారపు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావును కలవగా.. రమణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారని కుటుంబ సభ్యులు వివరించారు. దివ్యాంగుడి పైనా పోలీసు ప్రతాపం నరసాపురానికి చెందిన బుడితి సుజన్‌కుమార్ అనే దివ్యాంగుడు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ భీమవరం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల సాయం ఉంటేనే గానీ అడుగు ముందుకు వేయలేని సుజన్‌కుమార్‌ను స్టేషన్‌కు రావాలంటూ పోలీసుల నుంచి పదేపదే ఫోన్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సుజన్‌కుమార్ తండ్రి తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి టీచర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సుజన్‌కుమార్‌కు పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బాధితుడు సుజన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు భయపడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకు భీమవరం పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్సై ఫోన్ చేసి.. మీరు సోషల్ మీడియా కేసులో ఇరుక్కున్నారని చెప్పి స్టేషన్‌కు రావాలన్నారని తెలిపారు.స్థానికేతరులపై స్థానిక నేతల ఫిర్యాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన స్థానికేతరులపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యద్దనపూడి గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీను విశాఖపట్నం జిల్లా యండాడ గ్రామానికి చెందిన బై జయంత్‌పై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన గొర్రెపాటి నాగదుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బూడి వెంకటేశ్‌పై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చినగంజాం గ్రామ సర్పంచ్, కూటమి నాయకుడు రాయని ఆత్మారావు, తుమ్మలపెంట సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన ఇందుకూరి శ్రీనివాసరాజుపై చినగంజాం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సత్యసాయి జిల్లా రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డి పోస్టులు పెడుతున్నారని నెల్లూరు టీడీపీ నాయకుడు షేక్ ముఫీద్ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్జీవీపై తుళ్లూరులో ఫిర్యాదు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దున్నపోతులకు పవన్‌కళ్యాణ్, లోకేశ్ ఫొటోలు మారి్ఫంగ్ చేసి పెట్టడం, చంద్రబాబును పవన్‌కళ్యాణ్ ఎత్తుకున్నట్టు పెట్టిన పోస్టులపై తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి ఆయనకు నోటీసులు పంపినట్టు దర్యాప్తు అధికారి, ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు మంగళవారం తెలిపారు. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కనీ్వనర్ బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని బాడిత శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ప్రెస్‌మీట్ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా ఇష్టాన్ని ఎంజాయ్ చేస్తారు– రామ్‌గోపాల్ వర్మ
లెస్బియన్స్ పాత్రల్లో నైనా గంగూలీ, అప్సరా రాణి బాగా నటించారు. వారిద్దరూ తమ పేరెంట్స్‌తో మాట్లాడి ఈ సినిమా చేశారు. మా సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’. ఈ నెల 8న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘వర్మతో పని చేయడం కిక్ ఇస్తుంది. ‘మా ఇష్టం’లాంటి సినిమాని వేరే ఏ డైరెక్టర్ చేయలేడని సగర్వంగా చెబుతాను. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘హీరోకి జోడీగా నటించడం చాలా ఈజీ. కానీ, అమ్మాయితో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా కష్టం’’ అన్నారు నైనా గంగూలీ. ‘‘ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటి? అనేది ఈ సినిమా. ఇందులో రొమాంటిక్ పాటలో నటించడం ఎంతో థ్రిల్‌గా అనిపించింది’’ అన్నారు అప్సరా రాణి. -
ఇది నా కలల ప్రాజెక్ట్
అండర్ వరల్డ్ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘డి–కంపెనీ’. ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అన్నది ఉపశీర్షిక. స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్, రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది మా చిత్రంలో చూపించబోతున్నాం. గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ‘డి–కంపెనీ’ తల్లి లాంటిది.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా దావూద్ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో కీలకం. ఈ మూవీని ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్లో షేర్ చేయడం విశేషం. -
పిచ్చోడి చేతిలో రాయి
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై వస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్ కొంత గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. కృష్ణప్రియ, సంపూర్ణ మలకర్ హీరోయిన్లు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ పాటకు క్రాంతి చేసిన డ్యాన్స్‌కి ప్రశంసలు లభిస్తున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.ఎ. ఖుద్దూస్. -
లాక్డౌన్లో ఏం జరిగింది?
‘లాక్డౌన్ తర్వాత థియేటర్స్‌లో విడుదలయ్యే తొలి సినిమా మాదే’ అంటున్నారు దర్శకులు రామ్‌గోపాల్ వర్మ. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్’. కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో చిక్కుకున్న ఓ కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్ర చేశారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ‘‘డిసెంబర్ 11న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదో నిజజీవిత హారర్ కథా చిత్రం’’ అన్నారు వర్మ. -
తేడా సైకో
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నట్టి క్రాంతి హీరోగా, కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత నట్టికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి లక్ష్మి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా నట్టి కుమార్ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన ‘డీఎస్‌జె (దెయ్యంతో సహజీవనం)’ సినిమా లొకేషన్లో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నట్టికుమార్ మాట్లాడుతూ– ‘‘సైకో వర్మ’ షూటింగ్ దాదాపు పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. మా అబ్బాయి నట్టి క్రాంతి నేను అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, కెమెరా: జనార్ధననాయుడు, జనా, లైన్ ప్రొడ్యూసర్స్: కె.ప్రేమ సాగర్, ఎస్. రమణా రెడ్డి. -
ఉపేంద్ర కబ్జా
ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
వార్జీవి
-
అది ఆర్జీవీ సీక్రెట్!
‘‘ఆర్జీవీ వరల్డ్’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్జీవీ వరల్డ్’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుంది. ‘ఆర్జీవీ వరల్డ్ యాప్’, ఓటీటీ ప్లాట్ఫామ్స్ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు.. ► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్ ప్లాట్‌ఫామ్) ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్షిప్ పెరుగుతుందంటే ఆడియన్స్ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్వారు కంటెంట్ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్ ఓపెనింగ్స్ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్. మొబైల్లో సినిమా చూసినప్పుడు థియేటర్ ఫీల్‌ని మిస్ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్. ► పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ సినిమాలయితే థియేటర్లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అలాగే ఫీచర్ ఫిల్మ్ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే. ► ‘ఆర్జీవీ వరల్డ్’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తాం. ► కమల్‌హాసన్ ‘డైరెక్ట్ హోమ్’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్ చేశారు. అప్పుడు సెటప్ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్’. ఇది నా దృష్టిలో ఒక హారర్ ఫిల్మ్. దెయ్యం బదులు వైరస్ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్. ► ఫిల్మ్‌మేకింగ్ అనేది టీమ్ ఎఫర్ట్ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్ ఇస్తాను. ‘కరోనా వైరస్’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్ కూడా చేరింది. కరోనా వైరస్ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్డౌన్ సమయంలో ‘క్లైమాక్స్, కరోనా వైరస్’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి. ► ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్ సెటైర్స్ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్ వేయలేదు. ఆ అమ్మాయంటే ఇష్టం చాలామంది పోర్న్‌స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్టీ’, ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్ కపుల్ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. -
నా లైఫ్ బ్యూటిఫుల్
‘‘మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్ని ఉద్రేకానికి గురి చేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నా హిట్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా తీసుకుంటానో నా ఫ్లాప్‌ని కూడా అంతే బ్యూటిఫుల్‌గా తీసుకుంటాను. నా జీవితంలో ఎవరిపైనా ఫిర్యాదు చేయను.. నాకు ఎవరి మీదా కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాకపోవచ్చు.. కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలి, సూరి జంటగా రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ఉపశీర్షిక. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను ‘రంగీలా’ సినిమా తీసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నైనా విషయంలోనూ అదే జరిగింది. కొంతమంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. నేను పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్లలేదు. దానికి రెండు కారణాలు.. ఒకటి నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండోది అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు.. అవి రెండూ కుదిరాయి కాబట్టే ఈ సినిమా మొదలుపెట్టాం’’ అన్నారు. అగస్త్య మంజు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ముంబైలో ఉన్న ధారావి అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతం అంత ‘బ్యూటిఫుల్’ ప్లేస్ కాదు. కానీ అక్కడి మనుషులు బ్యూటిఫుల్‌గా ఉంటారు. అందుకే ఆ పేరు పెట్టాం’’ అన్నారు. ‘‘రాము త్వరలోనే ‘శివ’లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘మా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టి.అంజయ్య. ఈ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వేడుకలో నిర్మాతలు నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు చంద్ర సిద్ధార్థ్, బీవీఎస్ రవి, హీరో ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్ బాగుంది – రామ్‌గోపాల్ వర్మ
‘‘ఊల్లాల ఊల్లాల’ మేకింగ్ వీడియో చూసి ఆశ్చర్యపోయా. సత్యప్రకాష్లో ఇంత ప్రతిభ ఉందా? అనిపించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. గురురాజ్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటరాజ్ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్యప్రకాష్ దర్శకత్వం వహించారు. ఎ.గురురాజ్ నిరి్మంచిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. సత్యప్రకాష్ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నటరాజ్‌ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నా. గురురాజ్‌తో జర్నీ చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల.. ఊల్లాల’ అనే టైటిల్ ఆయన ఆలోచనే. టైటిల్ బాగుందని వర్మగారు కూడా అన్నారు’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు గురురాజ్. ‘‘కొత్తవారితో సినిమా అంటే ఆరి్థక సమస్యలుంటాయి. కానీ, గురురాజ్ సినిమాను విడుదల చేస్తాడనే భరోసానే సత్యప్రకా‹Ùను నడిపించింది’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. -
త్వరలో బ్యూటిఫుల్
నైనా, సూరి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ట్రిబ్యూట్ టూ రంగీలా అనేది చిత్రానికి ఉపశీర్షిక. అగస్త్య మంజు ఈ చిత్రానికి రచన, ఫొటోగ్రఫీతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ రూపొందించగా టి.అంజయ్య సమర్పించారు. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. హీరో హీరోయిన్లు బాగా నటించారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి పాటలు: సిరాశ్రీ. -
అందమైన పాట
సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీఫుల్’. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘రొమాంటిక్ కథాంశంతో వైవిధ్యభరితంగా ఉంటుందీ చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం అందించారు. ∙నైనా, సూరి -
ట్రిబ్యూట్ టు రంగీలా
రామ్‌గోపాల్ వర్మ కెరీర్లో ‘రంగీలా’ సినిమా చాలా స్పెషల్. ఇప్పుడు ఆ సినిమాకు ట్రిబ్యూట్‌గా ‘బ్యూటిఫుల్’ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రిబ్యూట్ టూ రంగీలా’ అనేది క్యాప్షన్. రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు వర్మతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 9న ‘బ్యూటిఫుల్’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి స్ఫూర్తి బాలకృష్ణ
‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్‌ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్‌గా ఒక సినిమా అవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనకాల నాకు ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అగస్త్య మంజు, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథపై నాకు అంత అవగాహన లేదు. ‘వైశ్రాయ్ హాటల్’ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది అన్నది వాస్తవంగా నాకు తెలియదు. కానీ, బయోపిక్‌లు స్టార్ట్ అయ్యాక నేను కొంతమందిని కలిశాను. వాస్తవాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు పరిశోధించా. బయోపిక్ తీయడానికి ముఖ్యంగా కావాల్సింది నిజాయతీ. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక వారి బంధం నాలుగైదేళ్లు ఉంటే దాన్ని 2:30 గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడం సినిమాటిక్‌గా సాధ్యం కాదు. అందుకే ఆ సోల్ అనేది మిస్ అవకుండా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ఈ సినిమా నా కెరీర్లో చాలా చాలా ప్రత్యేకం’’ అన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీగారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. 23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకుని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో.. ఇక అలిసిపోయి ఇంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదు అనుకున్న సమయంలో.. ఆర్జీవీగారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలీదు. ఇంతకుముందు ఆర్జీవీగారి ‘క్షణం క్షణం’ సినిమా చూశాను. ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. తమదైన మార్గంలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లే ఇలాంటివాళ్లు సమాజాన్నే శాసించగలరు అనిపిస్తుంది. ఈ రోజు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఏ పాత్ర అయితే పనికిరాదు అని వాళ్లు అన్నారో.. ఏ పేజీలైతే చింపేయాలని కుటుంబం అంతా భావించిందో .. ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్‌గారికి లేదు అని చెప్పి ఒక ముద్రవేయడానికి వాళ్ల మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో... ఆ పేజీలను తీసుకుని, ఆ చరిత్రను తీసుకుని నేను న్యాయం చేస్తానని ముందుకువచ్చిన ఆర్జీవీగారికి థ్యాంక్స్. ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఫారిన్ నుంచి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆర్జీవీగారిలో ఓ హీరోను చూస్తున్నాం అన్నారు వారందరూ. ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు.. మహిళలందరికీ న్యాయం జరిగినట్లే అని వారు మాట్లాడుతుంటే ...æ గ్రేట్ ఆర్జీవీగారు. థ్యాంక్‌ఫుల్ టు యు’’ అన్నారు. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూడగానే నేను మాట్లాడాను. అతను వైసీపీ మనిషి అందుకే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అలా మాట్లాడే వెధవలకు నేను ఒకటే చెబుతున్నాను. తప్పు జరిగింది కాబట్టే దర్శకుడు ఈ సినిమా తీశారు. దానికీ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఏదడిగినా ‘నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్లాను.. ఇక్కడికి వెళ్లాను’ అంటారు. 36 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్‌ను ఓడించిన ఘనత ఎన్టీఆర్‌గారిది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మడం తిప్పని నైజం, సంస్కృతికి చిహ్నం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు. ఈ ఫేస్‌ను ఎవరు చూస్తారండి? ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖరరెడ్డిగారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు. ‘అయ్యా చంద్రబాబు.. నువ్వు ఏ రోజూ నిజం మాట్లాడవు. ఒక మునీశ్వరుడి శాపం ఉంది నీ తలపై. నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలు అవుతుందని’. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అసలు కథ. ‘వైశ్రాయ్ సంఘటనకు’ నేనే సాక్ష్యం. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత నిబద్ధతగా డైరెక్టర్‌గారు చూపించిన వాస్తవాలు గొప్పా? మీరు మాట్లాడే అబద్ధాలు గొప్పా? అప్పట్లో సీడీలు లేవు. వీహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ సీడీలు తీసుకొచ్చి చూపిస్తాను’’ అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని బయటికి రానివ్వరు, ఫలానా పార్టీవాళ్లు ఆపేస్తారు.. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు. నువ్వు నిజాయతీగా ఉండొచ్చు కదా? నిజాయతీగా ఉండని, నీతిమంతమైన రాజకీయాలు చేయనివాడికి ఇలాంటి సమస్యలొస్తాయి. వాజ్‌పాయి, అద్వానీ, పుచ్చలపల్లి సుందరయ్య... ఇలా చాలామంది నిజాయతీపరులకు సమస్యలు రాలేదు కదా? బాధలు, కన్నీళ్లు అన్నవి అవినీతి పనులు చేసినవాడికి, వెధవ వేషాలు వేసినవాడికి, వెన్నుపోటు పొడిచినవాడికి వస్తాయి.. వాడే బాధపడుతుంటాడు. నవ్వు ఆ పనులు ఆ రోజు చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా? ఏ రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా? నవ్వు వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా తనపై తానే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలి పెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను పౌరుడు. ఓటరు.. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు 100 శాతం ఉంటుంది. ఈ సినిమా జరిగిన కథ. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా బయటికొస్తే ప్రజలు రియలైజ్ అవుతారు’’ అన్నారు.‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతే విజయవంతం చేయాలి’’ అన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఈ వేడుకలో ‘‘ఆర్టీవీ గన్‌షాట్ ఫిల్మ్స్’ లోగోని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ బదులిస్తూ... ► ఎన్టీఆర్‌గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. లక్ష్మీపార్వతిగారి ఎపిసోడ్ లేకుంటే నేను చేయనన్నాను. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉండాలన్న విషయంలో మా మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి కానీ, కథ విషయంలో కాదు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. ► నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. రాజకీయాలను పట్టించుకోను. అయితే ఈ స్టోరీలో రాజకీయాలున్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చేయొద్దని కొందరు బెదిరించారు. అలాంటి వారికి భయపడితే సినిమా తీయలేం. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొద్దని నన్ను బెదిరిస్తే మాత్రం నేను కూడా వాళ్లను బెదిరిస్తా. ► ఈ కథలోని విషయాలు అందరికీ తెలుసు. తెలియని విషయాలు నేను చెప్పడం లేదు. జనాలకు నిజం చెప్పడమే నా లక్ష్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశా. నేను ఎన్టీఆర్‌గారికి వీరాభిమానిని. ఆయన జీవితంలో ‘వైశ్రాయ్’ సంఘటన ఎగై్జట్‌మెంట్ ఇచ్చింది కాబట్టే ఈ చిత్రం చేశా. ఇందులో ఎన్టీఆర్‌గారి ఔన్నత్యాన్ని ఎక్కడా తగ్గించలేదు. కొత్తవారికి ఏ ఇమేజ్ ఉండదు కాబట్టి పాత్రలు ఎలివేట్ అవుతాయి. అందుకే కొత్తవారిని తీసుకున్నాం. -
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి నాంపల్లిలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. మహి ళలను కించపరిచేలా రూపొందించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ చిత్రం విడుదల కాకుండా చూడాలని ఫిర్యాదులో కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాంగోపాల్‌వర్మ బూతు సినిమాలు సమాజాన్ని చెడగొడుతున్నట్లు మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలతో పోర్న్ చిత్రాలు తీస్తానన్న వర్మ వ్యాఖ్యలను ఖండించారు. జీఎస్టీ సినిమాను తీసి మహిళలను ఆటబొమ్మలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చిత్రాలను వీక్షించి యువత పాడైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేవి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐటీ యాక్టు 67, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాంగోపాల్‌వర్మపై పలు మహిళా సంఘాల నాయకులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ భీంరెడ్డికి ఫిర్యాదు చేశారు. వర్మ చిత్రీకరించిన జీఎస్టీ చిత్రంలో అసభ్యకర దృశ్యాలున్నాయని పేర్కొన్నారు.ంగోపాల్వర్మపై కేసు -
రాజమౌళిపై ఒట్టును వర్మ నిలబెట్టుకున్నాడా?
‘రాజమౌళి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇకముందు అందరూ గర్వపడే సినిమాలే తీస్తా..’ అని ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్లో శపథం చేసిన రాంగోపాల్ వర్మ.. మాట నిలబెట్టుకున్నాడా? లేక ‘నేను మాటమీద నిలబడేరకం కాదు’అని మరోసారి నిరూపించుకున్నాడా? శుక్రవారం ‘సర్కార్-3’ విడుదలైన సందర్భంగా.. సోషల్ మీడియాలో ఈ తరహా చర్చలు బోలెడు కనిపించాయి. రామూ దర్శకత్వంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్కార్-3’ రివ్యూలపై ఓ లుక్కేస్తే.. బౌండెడ్ స్క్రిప్ట్ లాంటిదేది లేకుండా సినిమాలు తీసే వర్మ(ఈ విషయం ఆయనే చెప్పారు) మ్యాజిక్ సర్కార్-3 విషయంలో ఫలించిందా? లేదా అనేది అర్థం అవుతుంది. టైటిల్: సర్కార్-3 డైరెక్షన్, స్క్రీన్ ప్లే: రాంగోపాల్ వర్మ జానర్: డ్రామా నటీనటులు: అమితాబ్ బచ్చన్, అమిత్ సాధ్, జాకీ ష్రాఫ్, మనోజ్ వాజపేయి, రోనిత్ రాయ్, యామి గౌతమ్ తదితరులు రచన: జయకుమార్, రామ్‌కుమార్ సింగ్ సంగీతం: రవి శంకర్ సినిమాటోగ్రఫీ: అమోల్ రాథోడ్ నిర్మాతలు: ‘వి వన్’ బ్యానర్‌పై రాహుల్ మిత్రా, ఆనంద్ పండిట్, గోపాల్ శివరామ్ తదితరులు నిడివి: 132 నిమిషాలు విడుదల: మే 12, 2017 కథ: వ్యవస్థ(సిస్టమ్) నుంచి ఉద్భవించి, ముంబై ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందే సర్కార్ అలియాస్ సుభాష్ నాగ్రే(అమితాబ్ బచ్చన్) జీవితంలో చోటుచేసుకున్న భిన్న కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం సర్కార్-3 మూల కథ. ఇంతకు ముందు భాగాలైన సర్కార్, సర్కార్ రాజ్‌ల తరహాలోనే సుభాష్ నాగ్రే.. సంఘవిద్రోహ శక్తులపాలిట సింహ స్వప్నంగా కనిపిస్తారు. సర్కార్‌ను సాధారణ డాన్‌గా భావించి తమ కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా కొందరు రావడం, అందుకు సర్కార్ తనదైన శైలిలో నో చెప్పడం ఓపెనింగ్ సీన్లు. కొద్ది సేపటికే సర్కార్ మనవడు, దివంగత శంకర్ నాగ్రే కుమారుడైన చీకూ అలియాస్ శివాజీ నాగ్రే(అమిత్ సాధ్) ఎంట్రీ ఇస్తాడు. ఆవేశానికి మారుపేరైన ఈ పాత్ర.. వస్తూనే సర్కార్ అనుచరులతో గొడవపడి, చివరికి ఇంటినుంచి గెంటివేతకు గురవుతాడు. అలా సొంత మనవడే సర్కార్‌కు బద్ధవిరోధి అవుతాడు. ఒకదశలో మనవడు చీకూను చంపేయాలని సర్కార్ డిసైడ్ అవుతాడు. తాతా మనవళ్ల యుద్ధంలో చివరికి ఎవరు గెలుస్తారు? చీకూ లాగే సర్కార్‌ను మట్టుపెట్టాలనుకునే మిగతా విలన్ల పథకాలు ఫలించాయా? అనేవి తెరపైనే చూడాలి! అమితాబ్ విశ్వరూపం: యాంగ్రీ ఓల్డ్మన్ పాత్రధారణలో ప్రపంచంలోనే తనకెవ్వరూ సాటిరారనే స్థాయిలో అమితాబ్ నట విశ్వరూపం చూపించారు. ప్రత్యర్థులకు ధమ్కీ ఇస్తూ ఆయన చెప్పిన డైలాగ్స్ అమోఘం. మనవణ్ని చంపాలని డిసైడ్ అయ్యే సమయంలో బిగ్‌బీ హావభావాలు.. ఆస్వాదించినోళ్లకు ఆస్వాదించినంత! సర్కార్-3పై వచ్చిన రివ్యూలన్నీ అమితాబ్‌ను వేనోళ్లాపొడిగాయి. మనవడి పాత్రలో అమిత్, విలన్లుగా మనోజ్, జాకీ, రోనిత్, చిన్నపాత్రే అయినా యామీ గౌతమ్‌లు తమతమ పరుధుల్లో రాణించారు. హైలైట్: సర్కార్-3 సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ గురించే. ‘నా మనవడు వచ్చినప్పుడే.. నాకు, నా భార్యకు ఈ విషయం తెలుసు..’అంటూ సర్కార్ రివీల్ చేసిన విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయంటే అతిశయోక్తికాదు. అలా చివర్లో వర్మ చేసిన మ్యాజిక్‌తో రాజమౌళికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో లేదో ప్రేక్షకులకు ఇట్టే అర్థం చేసుకోగలరు. -
పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్.. కానీ : వర్మ
ఎప్పుడూ తన సినిమాలతో పాటు వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తన మార్కు సెటైర్లు వేశాడు. ఆదివారం రాత్రి జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా వర్మ వదలలేదు. ఆడియో ఫంక్షన్ లో పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్‌గా ఉంటే మెగా స్టార్ చిరంజీవి ప్రసంగం పవర్‌ఫుల్‌గా ఉన్నా సహజత్వం లేదని వర్మ వ్యాఖ్యానించారు. అయినా మెగా, పవర్ ఫుల్‌గా అన్నదమ్ముల అనుబంధం మాత్రం వర్కవుట్ అయిందని ట్విట్ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ విషయంలో మాత్రం అర్థమై కానట్లు తనదైన శైలిలో ట్విట్ చేశాడు. చివర్లో జై పవన్ అంటూ ముగించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో విడుదల చేయడం సూపర్ డూపర్ తప్పు అవుతుందని ఇంతకు ముందు ట్విట్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి స్థాయిలో విజువల్స్ స్థాయి ఉంటే తప్ప ఆ సినిమాను హిందీలో విడుదల చేయొద్దని కూడా అప్పుడు సలహా ఇచ్చాడు. SGS trailer is badder than best,worser then fantastic,extraordinarily ordinary in context but superlatively tremendous in intent ..Jai P K — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2016 SGS trailer is badder than best,worser then fantastic,extraordinarily ordinary in context but superlatively tremendous in intent ..Jai P K — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2016 -
తెలుగులో 7న వస్తున్నవీరప్పన్
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఈ నెల 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం తమిళం, కన్నడంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కాగా ఈ నెల ఏడో తేదీన కిల్లింగ్ వీరప్పన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వర్మ ట్విట్ చేశారు. కాగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు సమాచారం. అందువల్లే చిత్ర నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద హీరో: వర్మ
ముంబై: ట్విట్టర్లో తనదైన మార్కు వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు ఏదో హల్చల్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మ్యాగీ న్యూడిల్స్‌పై పడ్డారు. చెన్నై వరద బీభత్సానికి సంబంధించి అతిపెద్ద హీరోగా బాధిత మ్యాగీ న్యూడిల్సే నిలిచిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. చెన్నైలో బాధిత ప్రజలకు సరఫరా అయిన మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద రక్షకురాలిగా నిలిచిందని, ప్రభుత్వం తనను ధ్వంసం చేయాలని చూసినా.. మ్యాగీ న్యూడిల్స్ మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడిందని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మ్యాగీకి జై కొట్టారు. ఉన్నట్టుండి వర్మ మ్యాగీ గురించి వ్యాఖ్యలు చేయడంలో అంతర్థారం లేకపోలేదు. ఇటీవల నిషేధానికి గురైన మ్యాగీ న్యూడిల్స్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై ప్రజలకు ముందుస్తుగా అందజేసిన ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో మ్యాగీ న్యూడిల్సే అగ్రస్థానంలో నిలిచింది. సహాయక చర్యల్లో భాగంగా నెస్ట్లే సంస్థ రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే మ్యాగీ న్యూడిల్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందజేసింది. చెన్నై ప్రజలకు కొరత రాకుండా ప్యాకేజెడ్ ఆహార పదార్థాలు, తాగునీరు బాటిళ్లు అందజేయాలని కేంద్రమంత్రి హర్సిమత్కౌర్ బాదల్ పిలుపునిచ్చారు. దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్యాకేజెడ్ ఆహారపదార్థాలు అందజేశాయి. ఈ జాబితాలో 10 మిలియన్ టన్నుల న్యూడిల్స్, 5వేల లీటర్ల టెట్రా ప్యాకేడ్ పాలు, 50వేల కాపీ పొట్లాలతో నెస్ల్టే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఎంటీఆర్, ఐటీసీ సంస్థలు కూడా భారీమొత్తం ఆహార పదార్థాలు అందజేశాయి. -
'కిల్లింగ్ వీరప్పన్'పై కోర్టు స్టే
బెంగళూరు: రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం విడుదలపై బెంగళూరు నగర సివిల్ కోర్టు స్టే విధించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అడవిదొంగ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందించిన చిత్రంపై కన్నడ, తమిళ చలనచిత్ర రంగానికి చెందిన రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. వీరప్పన్ జీవిత చరిత్రను ముద్రించడానికి, తెరకెక్కించడానికి తనకే సర్వహక్కులు ఉన్నట్లు ఈ మేరకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ తనకు లిఖిత పూర్వకంగా అనుమతిచ్చారని రాజు కోర్టుకు తెలిపారు. దీంతో 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా విడుదలపై స్టే ఇస్తూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు నిర్మాత కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించడానికి రెండు మూడు రోజుల్లో రానున్నట్లు సమాచారం. కిల్లింగ్ వీరప్పన్‌లో శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా'
ముంబయి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పనికి తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టను మసకబార్చారని ట్విట్టర్లో ఆరోపించారు. కేసీఆర్ ముక్కు సూటి తననానికి తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నాని అన్నారు. రేవంత్ రెడ్డి చాలా క్రియాశీలకంగా ఉండేవాడని, దూకుడుగా పనిచేసేవాడని అనవసరంగా ఓటుకు నోటు వ్యవహారం ఇరుక్కున్నారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడు. ఇందులో చంద్రబాబునాయుడు కూడా ఇరుక్కోకుండా ఉండాలని కోరుకుంటున్నాని వ్యంగ్యంగా అన్నారు. తాను ప్రత్యేకంగా ఒక ప్రాంతం ఉద్దేశించి చెప్పేవాడిని కాదని, అయితే, తన ప్రాంతంతో పోలిస్తే చంద్రబాబు కంటే కేసీఆర్ ముందున్నారని కొనియాడారు. Am embarrassed as Andhra citizen with CB Naidu for making national embarrassment of Andhra people nd I bow down to Kcr's straightforwardness — Ram Gopal Varma (@RGVzoomin) June 15, 2015 I love Revanth reddy's aggression nd forthrightness on the cash for vote scam and I wish that CB is not so embarrassingly evasive on same — Ram Gopal Varma (@RGVzoomin) June 15, 2015 I am not particularly into regional regionalising but from my regional region Kcr region seems far more regionous than CB's regionalising — Ram Gopal Varma (@RGVzoomin) June 15, 2015 -
వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్...
ముంబయి: ఎప్పుడు చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ వివాదాల్లో చిక్కుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏం తోచలేదేమో.. నిన్న ఓ నియంత, నేడు ఓ ఉగ్రవాది ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానులను అవాక్కయ్యేలా చేశారు. మంగళవారం ఉదయాన్నే లాడెన్ చిన్ననాటి ఫొటోలు.. అతడి పిల్లల ఫొటోలు పెట్టి చర్చల్లో నిలిచాడు. వర్మ తన ట్విట్టర్లో ముందుగా హిట్లర్ చిన్న నాటి ఫొటో పెట్టి.. 'ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యి 60 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాడని మనం ఊహించగలమా.. అతడి పేరు అడాల్ఫ్ హిట్లర్ అని వ్యాఖ్య చేశాడు. ఇక లాడెన్ బాలుడిగా ఉన్నప్పటి ఫొటో, యుక్త వయసులో ఉన్న ఫొటో, అతడి పిల్లల ఫొటోలు పెట్టాడు. బాలుడిగా ఉన్నప్పటి ఫొటోపై 'ఈ బాలుడి పేరు ఒసామా బిన్ లాడెన్.. అమెరికాపై యుద్ధం ప్రకటించి పోయి గుహల్లో కూర్చున్నాడు' అని, యుక్త వయసులో ఉన్న ఫొటో పెట్టి 'బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయ్యి లాడెన్ కరాటే నేర్చుకున్నాడని, ఇక లాడెన్ ఆరుగురి పిల్లల ఫొటో పెట్టి 'ఈ ఆరుగురు లాడెన్‌కు ఉన్న 25 మంది సంతానంలో కొందరు. లాడెన్ మనుషులను చంపడమే కాకుండా.. అందుకు భిన్నమైన మరెన్నో ఎన్నో పనులు చేస్తాడని చెప్పేందుకు ఇదొక నిదర్శనం' అని పేర్కొన్నాడు. This innocent cute kid called Hitler unleashed violence on a scale unseen before or after and hopefully never pic.twitter.com/UxdmgTBksJ — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 Osama bin laden 3rd from left got inspired from Bruce lee pic.twitter.com/sWp5CJ3MKo — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 This boy called Osama Bin Laden grew up and sitting in a cave declared war on America pic.twitter.com/uj5HNBu4UW — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 6 of Bin Laden's children out of estimated 25 children..This proves he did other things too apart from killing people pic.twitter.com/yRLrpsPV6q — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 -
‘సావిత్రి’ వద్దు
ఉపాధ్యాయుల కొరత తీర్చకపోతే పోరాటమే టిఎస్‌యూటీఎఫ్ దోమలగూడ: రేషనలైజేషన్ పేరు చెప్పి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం శోచనీయమని, ఉపాధ్యాయులను నియమించకపోతే పోరాటం తప్పదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దోమలగూడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల్లో స్వీపర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తక్షణమే సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్, పరీక్షల విధానం మారిందని గుర్తు చేశారు. వీటిపై ఉపాధ్యాయులకు అవగడాహన కల్పించాలని, మారిన పాఠ్యపుస్తకాలపై శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 10వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్ల ఖాళీలను అడ్‌హక్ రూల్స్‌లో పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. ‘సావిత్రి’ వద్దు ‘సావిత్రి’ పేరుతో రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన సినిమా పోస్టరును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉన్న పోస్టర్లు ముద్రించవద్దని, అసలు సినిమా నిర్మాణమే వద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు మానవ హక్కుల క మిషనర్‌ను, నగర పోలీసు క మిషనర్‌ను కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినట్టు చెప్పారు. -
మూడు సినిమాలతో బిజీ
రాజశేఖర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘పట్టపగలు’లో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వమ్’కు రీమేక్‌గా ‘గడ్డం గ్యాంగ్’ చేస్తున్నారు. అలాగే జీవిత దర్శకత్వంలో ‘వందకు వంద’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాల గురించి రాజశేఖర్ వివరిస్తూ- ‘‘ఓ హోటల్‌కి లంచ్‌కి వెళ్ళినపుడు అనుకోకుండా రామ్‌గోపాల్‌వర్మ కనిపించారు. అప్పుడే ‘పట్టపగలు’ సినిమా ప్రతిపాదన వచ్చింది. ఓ వైపు భయపడుతూనే, మరోవైపు సెంటిమెంట్‌తో సాగే పాత్ర నాది. జూన్ 6 న ఈ సినిమా విడులవుతుంది. ‘వందకు వంద’ లో మా పెద్దమ్మాయి శివాని కీలకపాత్ర చేస్తోంది. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయింది. సంతోష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘గడ్డం గ్యాంగ్’ లో నా పాత్ర పేరు గడ్డం దాస్. అంజలి లావానియా నాయికగా చేస్తున్నారు. ఈ సినిమా చాలా బావుంటుంది’’ అన్నారు.