
దావూద్; రామ్‌గోపాల్ వర్మ, సాగర్
అండర్ వరల్డ్ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘డి–కంపెనీ’. ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అన్నది ఉపశీర్షిక. స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్, రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది మా చిత్రంలో చూపించబోతున్నాం. గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ‘డి–కంపెనీ’ తల్లి లాంటిది.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా దావూద్ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో కీలకం. ఈ మూవీని ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment