Underworld
-
ఢిల్లీలో 'ముంబై అండర్‌వరల్డ్' పరిస్థితి: సీఎం అతిషి
ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్‌వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है। दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है। यही…— Atishi (@AtishiAAP) October 20, 2024ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ -
నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీ-గ్యాంగ్‌తో సంబంధాలున్న యూసుఫ్ లఖడీవాలా నుంచి ఆమె 80 లక్షలు రుణం తీసుకున్నారన్నారని ఆరోపించారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడని.. అతనితో సంబంధాలున్న అందరినీ ఈడీ విచారిస్తోందని తెలిపారు. మరి ఎంపీ నవనీత్ రాణా ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కాదా అని అన్నారు. ఆ దంపతులను ఈ కేసుల నుంచి బయటపడేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని అన్నారు. యూసుఫ్ లఖడీవాలాకు చెందిన అక్రమ సొమ్ము నవనీత్ కౌర్-రాణా దంపతుల ఖాతాల్లో ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. చదవండి👉🏾 అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ డీ-గ్యాంగ్‌తో వారికున్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులకు సంజయ్ రౌత్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం రాత్రి ట్వీట్ చేసిన ఆయన ప్రధాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్యాగ్ చేశారు. కాగా, ఇప్పటికే దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నవనీత్ కౌర్-రాణా దంపతులపై తాజా ఆరోపణలను బట్టిచూస్తే మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన యూసుఫ్ లఖడీవాలా ఆర్థర్ రోడ్ జైలులో గతేడాది సెప్టెంబర్‌లో మరణించడం గమనార్హం. अंडरवर्ल्ड कनेक्शन : लकड़ावाला को ED ने ₹200 करोड़ के मनी लांड्रिंग केस में अरेस्ट किया था, लॉकअप में ही उसकी डेथ हो गई। यूसुफ की गैरकानूनी कमाई का हिस्सा अब भी नवनीत राणा के अकाउंट में है।तो ED कब पिलाएगी राणा को चाय?क्यों बचाया जा रहा है इस D-गैंग को? बीजेपी चूप क्यूँ हैं? pic.twitter.com/hJ1itnitlL — Sanjay Raut (@rautsanjay61) April 27, 2022 చదవండి👉 తమిళనాడులో మళ్లీ లాక్డౌన్?.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ -
ఇది నా కలల ప్రాజెక్ట్
అండర్ వరల్డ్ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘డి–కంపెనీ’. ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అన్నది ఉపశీర్షిక. స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్, రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది మా చిత్రంలో చూపించబోతున్నాం. గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ‘డి–కంపెనీ’ తల్లి లాంటిది.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా దావూద్ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో కీలకం. ఈ మూవీని ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్లో షేర్ చేయడం విశేషం. -
‘మాతోశ్రీని పేల్చేస్తాం’
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని ఠాక్రేకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. చదవండి : ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కంగనా -
అండర్‌వరల్డ్ కబ్జా
‘‘ఇప్పటివరకూ ఎన్నో గ్యాంగ్‌స్టర్ కథలు విన్నారు.. చూశారు. కానీ మా సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. అండర్ వరల్డ్‌లోనే కొత్త కోణాన్ని చూపించబోతున్నాం’’ అంటోంది ‘కబ్జా’ చిత్రబృందం. ఉపేంద్ర ముఖ్య పాత్రలో ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర డాన్‌గా కనిపించబోతున్నారు. 1970ల కాలంలో ఈ సినిమా కథ ఉంటుందట. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్న ఈ చిత్రం 7 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
ఇకనైనా నన్ను వెంటాడటం మానండి: దావూద్
న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్కు ముందు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఊహించని కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా.. నీరజ్‌కుమార్ ఓరోజు దావూద్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. 'క్యా సాహెబ్, ఆప్ రిటైర్ హోనే జారేహే హో. ఆబ్ తో పీచ్చా ఛోడ్ దో' (ఏంటీ సర్ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోండి) అంటూ దావూద్ కోరాడు. 2013 జూన్ మొదటి వారంలో ఈ ఘటన జరిగింది. 'ఒక రోజు నా పర్సనల్ మొబైల్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది బహుశా దావూద్ వ్యక్తిగత నెంబర్ ఉంటుంది' అని నీరజ్‌కుమార్ ఈ ఫోన్‌కాల్ గురించి వివరించారు. 'మై కన్వర్సెషన్స్ విత్ దావూద్ ఇబ్రహీం' పేరుతో ఆయన రాసిన తాజా పుస్తకంలో 'డయల్ డీ ఫర్ డాన్' అధ్యాయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన వృత్తిజీవితంలో నిర్వహించిన 11 టాప్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ నీరజ్‌కుమార్ ఈ పుస్తకం రాశారు. ఈ ఆపరేషన్లన్నీ అండర్ వరల్డ్, 1993 ముంబై వరుస పేలుళ్లు, దేశవ్యాప్తంగా నేరగ్యాంగుల చుట్టే తిరుగుతాయి. ఎన్నో ఆసక్తికర అంశాలున్న ఈ పుస్తకం త్వరలోనే పెంగ్విన్ బుక్స్ విడుదల చేయనుంది. -
మాఫియాతో సంబంధాలపై..
ఢిల్లీ: వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని అభిప్రాయపడుతున్నానని తెలిపారు. వోహ్ర కమిటీ తన నివేదికలో రాజకీయ నాయకులకు, మాఫియా లీడర్లకు గల సంబంధాలను ప్రస్తావించింది. మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజల దృష్టి వోహ్రా రిపోర్టుపై పడిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హౌం శాఖ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన నివేదికలోని అంశాలను ప్రజలముందుంచాల్సిన అవసరముందన్నారు. ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజలు దావూద్ ఇబ్రహీం ను వెనక్కి రప్పించడం గురించి డిమాండ్ చేస్తున్నారనీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ వోహ్రా నేతృత్వంలో 1990 లలో వేసిన కమిటీ నేరపూరితమైన రాజకీయాలపై నివేధిక ఇచ్చింది. దీనిలో రాజకీయ నాయకులకు, నేరగాళ్లకు గల సంబంధాలపై పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు. -
విక్కీ మల్హోత్రా చేతికి ఛోటా రాజన్ సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్ అరెస్టుతో ఆయన సామ్రాజ్యం పగ్గాలు మరో గ్యాంగ్ స్టర్ విక్కీ మల్హోత్రా చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. విక్కీ మల్హోత్రా ఛోటా రాజన్‌కు కుడిభుజం లాంటివాడు. తన బాస్ ఆశీస్సులతో అతను స్వతంత్ర అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి.. దావూద్ ఇబ్రహీం 'డీ' గ్యాంగ్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు. గడిచిన కొద్ది నెలల్లో అతని కదలికలు చూస్తుంటే.. అతడు సొంత గ్యాంగ్‌తో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని అతని కోసం గాలిస్తున్న భద్రతా సంస్థలు చెప్తున్నాయి. విక్కీ మల్హోత్రా గత రెండు దశాబ్ధాల నుంచి ఛోటారాజన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ వెంటే ఉన్నాడు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో ఛోటారాజన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత అతని కీలక అనుచరులు రవి పూజారి, సంతోష్ షెట్టి దూరం జరిగినా.. విక్కీ మాత్రం ధోకా చేయలేదు. 2005లో ఢిల్లీలోని అశోకా హోటల్ వద్ద అరెస్టయిన విక్కీ 2010లో బెయిల్ మీద బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతను దుబాయ్, ఆఫ్రికా మధ్య చక్కర్లు కొడుతున్నట్టు భావిస్తున్నారు. ఇదే సమయంలో దావూద్ కూడా గ్యాంగ్ కార్యకలాపాలను ఆఫ్రికాకు విస్తరించడం గమనార్హం. 'డీ' కంపెనీ వ్యవహారాలను కమాండ్ చేస్తున్న ఛోటా షకీల్ ముంబైలో అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో పట్టుసాధించకుండా నిరోధించేందుకే ఛోటా రాజన్ సామ్రాజ్య పగ్గాలు విక్కీకి ఇచ్చినట్టు భావిస్తున్నారు. విక్కీ మల్హోత్రా గ్యాంగ్‌ను నిరోధించేందుకు 'డీ' కంపెనీ ప్రయత్నిస్తే.. మళ్లీ ముంబైలో గ్యాంగ్‌వార్ ప్రారంభమయ్యే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఛోటా షకీల్ నుంచి ముప్పు పొంచి ఉండటం, ఆస్ట్రేలియా పోలీసులు తనకోసం గాలిస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలతో గత మే-ఏప్రిల్‌లోనే ఛోటా రాజన్ ఆస్ట్రేలియా నుంచి పలుసార్లు ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపాడని, పెద్దగా సానుకూలత రాకపోవడంతో తనకు తాను ముందుకొచ్చి అతను అరెస్టయి ఉంటాడని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో టచ్‌లో ఉన్న విక్కీ మల్హోత్రాను ఒప్పించి.. అతనికి తన సామ్రాజ్యాన్ని అప్పగించి.. ఛోటా రాజన్ అరెస్టయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ గతంలో దావూద్ కంపెనీతో చేతులు కలిపాడని వచ్చిన వార్తలను భద్రతా సంస్థలు తోసిపుచ్చాయి. అతడు ఇప్పటికీ ఛోటా రాజన్‌కే నమ్మకస్తుడిగా ఉన్నాడని పేర్కొన్నాయి. -
సింగర్‌కు మాఫియా బెదిరింపులు...
ముంబై: అండర్ వరల్డ్ మాఫియాకు, బాలీవుడ్‌కు మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా మాఫియా డాన్ రవి పూజారి.. ఓ బాలీవుడ్ గాయకుడిని టార్గెట్ చేశాడు. బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్‌ను సుమారు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే అంత పెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని అనడంతో మరో బేరానికి దిగాడు రవి పూజారి. తమ కోసం ఉచితంగా కొన్ని షోలు చేసి పెట్టాలని అడిగాడట. అయితే దీనికి సంబంధించి అరిజీత్ సింగ్ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. కానీ స్థానిక పోలీసులకు ఈ విషయమై అరిజీత్ సింగ్ మేనేజర్ ఫోన్ ద్వారా మౌఖిక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కాగా రవి పూజారికి బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరించడం, ఇలాంటి కాల్స్ చేయడం అలవాటే. గతంలో షారూఖ్ ఖాన్, ప్రీతిజింతాలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. -
వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు. రవి పూజారి నుంచి బెదిరింపు మెసెజ్ వస్తున్నట్టు పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా కార్యదర్శి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసినట్టు మహేశ్ పటేల్ చెప్పారు. నెస్లీ వాడియా కార్యదర్శి పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నెస్లీ వాడియా ఫోన్ కు వచ్చాయా లేక కార్యదర్శి మొబైల్ వచ్చాయా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. నెస్లీవాడియా కుమారుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, మాజీ ప్రేయసి ప్రీతి జింటా మే 30 తేదిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో వాడియా కుటుంబ పేరు మీడియాలో వినిపిస్తోంది. నెస్ వాడియా, ప్రీతి జింటాలకు కేసు నేపథ్యంలో బెదిరింపులు వచ్చాయా అనే విషయంపై ఓ అవగాహనకు రాలేదని పోలీసులు తెలిపారు. తాజా ఫిర్యాదుపై వాడియా గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది.