ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్‌వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.
‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్‌స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.
रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है।
दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है।
यही…— Atishi (@AtishiAAP) October 20, 2024
ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment