సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఢిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఆమెకు వ్యాఖ్యలపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ ఆప్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి అతిషి తాజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో మతపరమైన కట్టడాలను కూల్చివేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సక్సేనా ఆదేశాల మేరకు ప్యానెల్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆదేశాలపై తమకు సమాచారం ఉందని కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో అతిషి కామెంట్స్‌పై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆప్ సర్కార్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన స్థలాలను కూల్చివేసేందుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒకవేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడే శక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో మరింత నిఘా పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Delhi CM Atishi's big allegation against the L-G:
- 'L-G orders the demolition of temples'
- 'Mandirs and religious places targeted'
- 'Hindu and Buddhist temples targeted'
However, the Delhi L-G has dismissed all allegations of 'temple demolition' & accused Atishi of… pic.twitter.com/66WTV5Lpvj— TIMES NOW (@TimesNow) January 1, 2025
ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆప్ నేతలు ప్లాన్ చేస్తున్నాయి. ఇక, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన విజయంతో అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు, కాంగ్రెస్ కూడా ఢిల్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment