ఢిల్లీ : సీఎం అతిషి కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. ఆ వ్యాఖ్యలపై రమేష్ బిదూరి కౌంటర్ ఇచ్చారు.
‘మీడియా సమావేశంలో సీఎం డ్రామాకు తెరతీశారు. ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఓడిపోతామని తెలిసే ఆమ్ ఆద్మీ ఇలాంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని మండిపడ్డారు. 'ఆప్దా'ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. 2001 పార్లమెంటు దాడిలో మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. అఫ్జల్ గురుకు మద్దతుగా తండ్రి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై ఆమె మద్దతు ఇస్తుందో లేదో ముఖ్యమంత్రి చెప్పాలి.
కాగా, 2013లో తీహార్ జైలులో ఉరిశిక్ష పడిన అప్జల్ గురు కోసం రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్‌పై అతిషి తల్లిదండ్రులు సంతకం చేశారని బీజేపీ వాదిస్తోంది. పార్లమెంట్ దాడిలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.
ఆతిషీ కంటతడి
ఢిల్లీ ఆతిషీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు.
చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిదురి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని అతిషి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment