Ramesh bidhuri
-
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజస్థాన్ ఎన్నికలపై పాక్ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి..మరోసారి నోరుజారి వార్తల్లోకెక్కారు. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి.. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంతోపాటు పాకిస్థాన్ కూడా రాజస్థాన్ ఎన్నికలపై కన్నేసి ఉంచిందని అన్నారు. టోంక్ స్థానంపై లాహోర్ కన్నేసిందన్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులకు టోంక్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నరని ఆరోపించారు. ‘ఇక్కడి ఎన్నికలపై లాహోర్ నిఘా ఉంచింది. ఎన్నికల తర్వాత లాహోర్‌లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలి. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉంది’ అంటూ బిధూరి వ్యాఖ్యానించారు. కాగా టోంక్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ పోటీ చేస్తుండటం గమనార్హం. చదవండి: సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం అయితే బిధూరి ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం తొలిసారి కాదు. గత పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ కున్వర్ డానిష్ అలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిధురిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి కీలకంగా మారాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రాజస్థాన్‌లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవడంతో.. ఈ అవకాశంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డిసెంబర్ 3న వెలువడబోయే ఫలితాలతో రాజస్థాన్ ఎవరి వశం కాబోతుందో తెలనుంది. -
పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, బిధూరి వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ అగ్రనాయకత్వం రమేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు విపక్ష ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, వీరి ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సారధ్యంలోని సభా హక్కుల కమిటీకి స్పీకర్ పంపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. लोकसभा अध्यक्ष @ombirlakota जी का आभार,उन्होंने दानिश अली प्रकरण में @LokSabhaSectt की कमिटि को जॉंच का ज़िम्मा सौंपा ।आज यह इसलिए संभव हो पाया क्योंकि लोकसभा में भाजपा का बहुमत है,नहीं तो पहले लोकसभा ने 2006 में RJD-JDU-congress का जूता व माईक मारपीट,2012 में सोनिया गांधी जी की… — Dr Nishikant Dubey (@nishikant_dubey) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోంక్‌లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. VIDEO | "I am waiting for the Speaker (Lok Sabha) to take action in this matter. I hope he will definitely take action," says BSP MP @KDanishAli on the issue of derogatory comments made against him by BJP Ramesh Bidhuri in Lok Sabha. pic.twitter.com/ULJKqudtnm — Press Trust of India (@PTI_News) September 28, 2023 ఇది కూడా చదవండి: భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ -
మొత్తానికి ఆయన చెప్పినట్టే జరిగిందిగా.. కపిల్ సిబాల్
జైపూర్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు జైపూర్‌లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై మరోసారి డానిష్ అలీ స్పందిస్తూ ఇది ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు దక్కిన బహుమతి అయి ఉంటుందని అన్నారు. ప్రమోషన్.. పార్లమెంట్లో రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్న అధిష్టానం ఆయనకు టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ బుధవారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. राजस्थान प्रदेश भाजपा कार्यालय जयपुर में ज़िला टोंक की समन्वय बैठक में प्रदेश अध्यक्ष श्री @cpjoshiBJP जी द्वारा संगठनात्मक कार्यों व चुनाव की तैयारियों के साथ सेवा सप्ताह के कार्यक्रमों सहित आगामी कार्यकर्ताओं के प्रवास योजनाओं की जानकारी लेते हुए। pic.twitter.com/wK63ctXR6X — Ramesh Bidhuri (@rameshbidhuri) September 27, 2023 అక్కడ ఆయనైతేనే కరెక్టని.. సమావేశాలు ముగిశాక డానిష్ అలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలను మతపరంగా దూషించడానికే నిర్వహించారని బీజేపీ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని ఆరోజే వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందన్నారు. ఆ జిల్లాలో 30 శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. నేనేమీ అనలేదు.. అంతకుముందు డానిష్ అలీ ప్రధాని కులాన్ని దూషించిన కారణంగానే రమేష్ బిధూరీ అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ బీజేపీ నేతలు విమర్శించగా అందులో డానిష్ అలీ ఎక్కడా ప్రధాని కుల ప్రస్తావన చేయలేదని.. ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఒక తీవ్రవాదిని ఎలా అనుమతించారని మాత్రం ప్రశ్నించిన సంభాషణలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Despite the abuses and extreme provocation, I didn’t utter a single word that could harm the sanctity of the temple of democracy. Even I didn’t repeat what Mr @rameshbidhuri said about me and my community. Inspite of it @BJP4India is trying it’s best to create a false narrative. pic.twitter.com/yApQ6w1vJR — Kunwar Danish Ali (@KDanishAli) September 26, 2023 ఇది కూడా చదవండి: ‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’ -
సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. आज भाजपा के कुछ नेता एक नैरेटिव चलाने का प्रयास कर रहे हैं कि संसद में मैंने श्री रमेश बिदूरी को भड़कया, जबकि सच्चाई यह है कि मैंने प्रधानमंत्री पद की गरिमा को बचाने का काम किया और सभापति जी को मोदी जी से संबंधित घोर आपत्तिजनक शब्दों को सदन की कार्रवाई से हटाने की माँग की थी। pic.twitter.com/s5u0Ptb0Ou — Kunwar Danish Ali (@KDanishAli) September 23, 2023 ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. #WATCH | Delhi: On BJP MP Ramesh Bidhuri's remark, BJP MP Nishikant Dubey says "...The words used by him are not acceptable. I was present in the Parliament when all this took place. BSP MP Danish Ali kept calling PM Modi 'neech'. I have written a letter to Lok Sabha Speaker Om… pic.twitter.com/TIg4A9bc1a — ANI (@ANI) September 23, 2023 నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! -
రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రతిపక్ష పారీ్టల నేతలు శనివారం డిమాండ్ చేశారు. బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలని, సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కొందరు స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రమేశ్ బిధూరీ వ్యాఖ్యల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ పేర్కొన్నారు. -
లోక్‌సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు. -
‘బీజేపీ నేతపై చర్యలు తీసుకోకపోతే’.. బీఎస్పీ ఎంపీ కన్నీటి పర్యంతం
న్యూఢిల్లీ: తనపై మతపరమైన దూషణలు చేసిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు చేపట్టకపోతే లోక్‌సభకు రాజీనామా చేసేందుకు సిద్ధమని బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే ఇంత అవమానం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు బీఎస్పీ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. తన మైండ్ బద్దలు అయ్యేలా ఉందని, ఈరోజు రాత్రి నిద్ర కూడా పట్టేలా లేదని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. బిధురి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. స్పీకర్‌గా మీ నేతృత్వంలో నూతన పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం దురదృష్టకరమని లేఖలో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బిధూరిపై చర్యలు తీసుకుని తన హక్కులను కాపాడనిపక్షంలో లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం ‘ప్రజలు ఎన్నుకున్న ఎంపీలను వారి మతాలతో ముడిపెట్టి దాడి చేయడానికే ఈ ప్రత్యేక సమావేశాలకు పిలిచారా?. ఇది మొత్తం దేశానికే సిగ్గుచేటు. సొంత పార్టీ ఎంపీపై బీజేపీ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదా అతన్ని వెనకేసుకొస్తుందో చుద్దాం.. ఇదొక ద్వేషపూరిత ప్రసంగం’ అని పేర్కొన్నారు. మరోవైపు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఎంపీ రమేష్ బిధురికి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 25 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ కోరింది. అదే విధంగా ముస్లిం ఎంపీని కించపరిచేలా మాట్లాడిన రమేష్ బిధురిని స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాగా చంద్రయాన్ విజయంపై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్ధేశిస్తూ.. సౌత్ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ అభ్యంతరకర పదాలు ఉపయోగించారు. మైనార్టీ ఎంపీపై బీజేపీ లోక్‌సభ సభ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ సభ్యుడి ప్రవర్తనపై విపక్షాలు భగ్గుమన్నాయి. బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్ -
‘బడుల్లో భగవద్గీత తప్పనిసరి చేయాలి’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ రూపొందించిన ప్రైవేటు మెంబర్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ ఈ బిల్లును సభ ముందుంచుతారు. విద్యాసంస్థల పాఠ్య పుస్తకాల్లో నైతిక బోధనగా భగవద్గీత నిర్భంధ బోధన బిల్లుగా ఈ బిల్లును వ్యవహరించనున్నారు. అయితే మైనార్టీలకు చెందిన విద్యాసంస్థల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను ఈ బిల్లులో చేర్చలేదు. -
జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
పార్లమెంటులో పన్నీర్ అనుకూల ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. పలుసార్లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒకసారి వాయిదాపడగా, రాజ్యసభలో కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఆరుగురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఆమె ఆస్పత్రిలో ఉన్న ఫొటో ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్సిడీ వంటగ్యాస్, ఇతర ఇంధన ధరల పెంపుపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ధరలు పెంచి ప్రభుత్వం పేదలపై పెనుభారాన్ని మోపుతోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాగా, శత్రు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ శుక్రవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. విద్యాసంస్థల్లో నైతిక విద్య కింద భగవద్గీత బోధనను తప్పనిసరి చేయాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 103 ప్రైవేటు బిల్లులను సభ్యులు తీసుకొచ్చారు. -
ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
న్యూఢిల్లీ: టీవీ న్యూస్ చానల్లో చర్చ సందర్భంగా జరిగిన వాడివేడి చర ్చ.... ఆప్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరికది ఆప్ అభ్యర్థి షాహి రామ్ కారు దహ నానికి దారితీసింది. తుగ్లకాబాద్‌లోని డీడీఏ కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. అనంతరం అక్కడికి సమీపంలోని గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఆప్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులే ఇందుకు కారణమని, వారే ప్రేరేపించారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మద్దతుదారులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రమేష్ బిధూరీ ఖండించారు. ఆప్...హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఈ ఘర్షణకు తన మద్దతుదారులే కారణమనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆప్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడి ఆ నిందను తమపై మోపుతున్నారన్నారు. వారే గొడవకు దిగారని, తమ పార్టీ కార్యకర్తలు ఈ ఘర్షణలో గాయపడ్డారన్నారు.