ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ | AAP, BJP workers clash in Delhi after debate show on TV channel | Sakshi
Sakshi News home page

ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Published Sat, Jan 3 2015 10:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

AAP, BJP workers clash in Delhi after debate show on TV channel

 న్యూఢిల్లీ: టీవీ న్యూస్ చానల్‌లో చర్చ సందర్భంగా జరిగిన వాడివేడి చర ్చ.... ఆప్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరికది ఆప్ అభ్యర్థి షాహి రామ్ కారు దహ నానికి దారితీసింది. తుగ్లకాబాద్‌లోని డీడీఏ కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. అనంతరం అక్కడికి సమీపంలోని గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఆప్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులే ఇందుకు కారణమని, వారే ప్రేరేపించారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మద్దతుదారులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రమేష్ బిధూరీ ఖండించారు. ఆప్...హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఈ ఘర్షణకు తన మద్దతుదారులే కారణమనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆప్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడి ఆ నిందను తమపై మోపుతున్నారన్నారు. వారే గొడవకు దిగారని, తమ పార్టీ కార్యకర్తలు ఈ ఘర్షణలో గాయపడ్డారన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement