న్యూఢిల్లీ:ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన సీఎం అతిషిని టార్గెట్ చేశారు. అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురును సమర్థించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అతిషి తల్లిదండ్రులది భారత్ వ్యతిరేక మనస్తత్వమని అన్నారు.
అందుకే పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు ప్రయత్నించారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గం నుంచి బిదూరి సీఎం అతిషిపై బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదిన ఫలితాలు రానున్నాయి.
కాగా, బిదూరి సీఎం అతిషి లక్ష్యంగా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషిసింగ్‌గా మారిందన్నారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరో సందర్భంలో బిదూరి వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరియేనన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆప్,బీజేపీల మధ్య చైనీస్ సీసీ కెమెరాల వివాదం
Comments
Please login to add a commentAdd a comment