సింగర్కు మాఫియా బెదిరింపులు... | Bollywood singer Arijit Singh on underworld don Ravi Pujari's radar | Sakshi

సింగర్కు మాఫియా బెదిరింపులు....

Aug 17 2015 3:24 PM | Updated on Apr 3 2019 6:23 PM

సింగర్కు మాఫియా  బెదిరింపులు... - Sakshi

సింగర్కు మాఫియా బెదిరింపులు...

ముంబై నగరంలో అండర్ వరల్డ్ మాఫియాకు, బాలీవుడ్కు మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా మాఫియా డాన్ రవి పూజారి బాలీవుడ్ గాయకుడిని టార్గెట్ చేశాడు.

ముంబై:  అండర్ వరల్డ్ మాఫియాకు, బాలీవుడ్కు మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి.  తాజాగా మాఫియా డాన్  రవి పూజారి.. ఓ బాలీవుడ్ గాయకుడిని టార్గెట్ చేశాడు. బాలీవుడ్ సింగర్ అరిజిత్  సింగ్ను సుమారు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని  డిమాండ్ చేశాడట.  అయితే అంత  పెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని అనడంతో మరో బేరానికి దిగాడు రవి పూజారి.  తమ కోసం  ఉచితంగా కొన్ని షోలు చేసి పెట్టాలని అడిగాడట. 

 

అయితే  దీనికి సంబంధించి అరిజీత్ సింగ్ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. కానీ స్థానిక పోలీసులకు ఈ విషయమై అరిజీత్ సింగ్ మేనేజర్ ఫోన్ ద్వారా మౌఖిక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కాగా రవి పూజారికి బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరించడం, ఇలాంటి కాల్స్ చేయడం అలవాటే. గతంలో షారూఖ్ ఖాన్, ప్రీతిజింతాలను  టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement