డెబ్యూ పాప్ సింగిల్ ‘థగ్ రంఝా’తో సంగీత ప్రియులు ‘వాహ్వా’ అనుకునేలా చేసింది ఆకాశ సింగ్. ఈ పాట ఒక నెలలోనే 27 మిలియన్‌ల వ్యూస్‌ను క్రాస్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ‘మోస్ట్ వాచ్‌డ్ ఇండియన్ వీడియో’గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా ‘సనమ్ తేరి కసమ్’లోని ‘ఖీచ్ మేరీ ఫొటో’ పాటతో వాహ్వా వాహ్వా అనిపించేలా చేసింది. సింగర్, కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ మీకా సింగ్‌తో తన కెరీర్ మొదలుపెట్టింది ఆకాశసింగ్.
మ్యూజిక్ బ్యాండ్‌లోని పదిమందిలో తానొక్కరే అమ్మాయి. ‘ఇండియాస్ రా స్టార్’ పోటీలో పాల్గొన్న ఆకాశ గాత్రం విన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా ‘శభాష్’ అనడమే కాదు సింగర్‌గా బాలీవుడ్‌లో బ్రేక్ ఇచ్చాడు. తాజాగా....‘మన్మానీ’ పాటతో ప్రశంసలు అందుకుంటుంది ఆకాశ. ‘ఇది జస్ట్ మ్యూజిక్ పీస్ కాదు. అంతకంటే ఎక్కువ. దీనిలోని ప్రేమ భావాలతో శ్రోతలు కనెక్ట్ అవుతారు.
ఇందులో నా సొంత అనుభవాలు ఉన్నాయి’ అంటుంది ఆకాశ. ఆమె దృష్టిలో పాట అనేది ఇలా విని అలా మరిచిపోయేది కాదు. శ్రోతలు ఒకచోట స్థిరంగా కూర్చుంటూనే పాట రెక్కలతో విహారం చేయాలి. ఆ విహారం ఊహాల్లోకి, ప్రేమభావాల్లోకి, భవిష్యత్‌లోకి....ఎక్కడికైనా కావచ్చు. కొత్త ప్రదేశాల్లో గడపడం, కొత్త వ్యక్తులతో పరిచయం, సృజనాత్మక పనుల్లో భాగం కావడం ఆకాశ సింగ్‌కు ఇష్టమైన పని.
Comments
Please login to add a commentAdd a comment