
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్‌కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ!
ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
Comments
Please login to add a commentAdd a comment