నితాంశీ గోయల్.. 16 ఏళ్ల ఈ అమ్మాయి ‘లాపతా లేడీస్’లో ఫూల్ కుమారీగా అమాయకత్వాన్ని ఒలకబోసి విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. స్క్రీన్‌కి నితాంశీ కొత్తేం కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర, వెండితెర ప్రేక్షకాభిమానులకు సుపరిచితురాలు! ఈ యంగెస్ట్ యాక్ట్రెస్‌కి సోషల్ మీడియాలో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు.
నోయిడాలో పుట్టి పెరిగింది. తల్లి.. రాశి గోయల్, గృహిణి. తండ్రి నితిన్ గోయల్, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి.
చిన్నప్పుడే కరాటే కూడా నేర్చుకుంది. ‘మోహినీ ఆట్టమ్’లోనూ శిక్షణ పొందింది. శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది. పియానో కూడా వాయిస్తుంది.
చైల్డ్ మోడల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పేరుమోసిన ఎన్నో బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసింది. ఇటు ప్రింట్, అటు టీవీ యాడ్స్‌లో నటించింది.
ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ మొదలు పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. 2015లో ‘మిస్ పాంటలూన్స్ జూనియర్ ఫ్యాషన్ ఐకాన్’ టైటిల్‌ని గెలుచుకుంది.
తన పేరుతోనే ఓ యూట్యూబ్ చానెల్‌ని కూడా స్టార్ట్ చేసింది. 2022లో యునైటెడ్ బిజినెస్ జర్నల్ ‘ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్–30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘వికీ డోనర్’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ‘ఎమ్.ఎస్. ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘ఇందూ సర్కార్’, ‘హుడ్దంగ్’.. తాజాగా ‘లాపతా లేడీస్’ సినిమాల్లో నటించింది.
‘మన్ మే విశ్వాస్ హై’తో బుల్లితెర ప్రవేశం చేసింది. అందులో శబ్రీగా ఆమె చూపిన అభినయం.. టీవీ ఇండస్ట్రీలో నితాంశీ ఉనికిని చాటింది. ‘నాగార్జున : ఏక్ యోధా’, ‘ఇష్క్‌బాజ్’, ‘పేశ్వా బాజీరావు’ లాంటి సీరియల్స్‌లో చక్కటి అవకాశాలను తెచ్చిపెట్టింది.
నితాంశీ చురుకుదనం, ప్రతిభ ఆమెను వెబ్‌స్క్రీన్‌కీ పరిచయం చేశాయి ‘లవ్ స్లీప్ రిపీట్’ అనే వెబ్ సిరీస్‌తో. తర్వాత ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’లోనూ నటించింది. అంతేకాదు ‘మేరే సప్నే’, ‘నఖ్రా’, ‘హమ్ మిలే థే జాహా’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నితాంశీ మెరిసింది.
"ప్రియంకా చోప్రా అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు చూస్తూ.. ఆమె యాక్టింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ పెరిగాను. అందుకే ఆమే నాకు ఇన్‌స్పిరేషన్!" – నితాంశీ గోయల్
Comments
Please login to add a commentAdd a comment