సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..
⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్‌గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.
⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది.
⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ‘ఫిల్మ్‌ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్‌డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.
స్క్రిప్ట్‌ను
నమ్మి చేసిన ‘కృష్ణన్‌కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్‌గుడ్ మూవీస్‌గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.
⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్‌లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.
⇒ నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!
– సానియా అయ్యప్పన్
Comments
Please login to add a commentAdd a comment