‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్‌గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్‌తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..
⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.
⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.
⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.
⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్‌లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.
ఏ క్యారెక్టర్‌నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్‌లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్.
Comments
Please login to add a commentAdd a comment