
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.
⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.
⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు
అందుకుంది.
⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్‌తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.
⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది.
⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్‌గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది.
⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.
⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న.
Comments
Please login to add a commentAdd a comment