
సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గోల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ పలువురు ఈ విషయమై ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నారు. గతంలో పలువురు దర్శకనిర్మాతలు తమని వేధించారని బయటపెడుతున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం మీటూ పేరుతో ఓ ఉద్యమం కూడా నడిచింది.
(ఇదీ చదవండి: ఆస్తులు కోల్పోయి మంచాన పడ్డ నటి.. 118 నుంచి 38 కిలోలకు..)
ఈ కమిట్మెంట్స్ గురించి పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు. కానీ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా మాట్లాడుకొచ్చారు.
'మీడియాలో హైలైట్ కావడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారు. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్స్ ఉండేది. నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పనిచేశాను కాబట్టి నన్ను ఆ ఉద్దేశంతో ఎవరూ అడగలేదు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం అయితే చేయరు' అని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'బ్రహ్మానందం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment