annapurnamma
-
TS: అత్తా, అల్లుళ్ల మధ్య యుద్ధం
నిజామాబాద్: రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు ప్రశాంత్‌రెడ్డి. ఈసారి మేనల్లుడు అయిన ప్రశాంత్‌రెడ్డిపై ఎలాగైన విజయం సాధించాలని మేనత్త అన్నపూర్ణమ్మ పంతం. బీజేపీ అభ్యర్థిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తుండగా ఆమె సోదరుని కుమారుడు మేనల్లుడైన వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వేముల సురేందర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు అన్నపూర్ణమ్మ. ఆమె పుట్టినిల్లు వేల్పూర్ కాగా మెట్టినిల్లు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి. మేనత్త, అల్లుడు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డి మేనత్త కొడుకైన మల్లికార్జున్‌రెడ్డితో పోటీ పడి విజయం సాధించారు. ఇప్పుడు మేనత్తతో పోటీలో నిలువడం విశేషం. వీరి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. -
ఆయన దృష్టిలో నేనే సూపర్ స్టార్ : అర్చన
‘‘నేను’సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ తర్వాత కూడా నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. ‘శ్రీరామదాసు’లో చేసిన సీత క్యారెక్టర్ నాకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది’అన్నారు అర్చన. మహానటి జమున, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ రోల్స్ చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో అర్చన మాట్లాడుతూ.. ‘జమున, అన్నపూర్ణమ్మగార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాది మెడికల్ స్టూడెంట్ పాత్ర. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించాం. శివనాగుగారు నా పాత్రను అద్భుతంగా మలిచారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారు ఈ సినిమా చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది’అన్నారు. గత ఏడాది నవంబర్‌లో అర్చన వివాహం జగదీశ్‌తో జరిగింది. ‘పెళ్లి తర్వాత మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. 2020 మనపై బాగా ప్రభావం చూపించింది. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్‌గా చేస్తాను. నాకు డాన్స్ చేయడం బాగా ఇష్టం. స్పెషల్ సాంగ్స్, గ్లామర్ రోల్స్ చేయడం వల్ల అవకాశాలు తగ్గుతాయనుకోను. కెమెరామేన్ అంజి డైరెక్షన్లో ఒక ప్రాజెక్టు సైన్ చేశాను. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’అన్నారు. -
స్వచ్ఛమైన ప్రేమ
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను, ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను మిళితం చేసి తెరకెక్కించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. టైటిల్ రోల్స్‌లో సీనియర్ నటి అన్న పూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా, సీనియర్ నటి జమున ఒక కీలక పాత్రలో బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించారు. ‘‘ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నాం. కొంతమంది మిత్రుల, శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్ని అమృత, ప్రణయ్‌లకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ఇందులో వైకుంఠపురం అనే గ్రామానికి చెందిన జమిందారిణి అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్న పూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోశాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో వాస్తవంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు నటించారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలైట్’’ అన్నారు. -
బీజేపీలోకి అన్నపూర్ణమ్మ!
సాక్షి, సుభాష్‌నగర్: మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మను లక్ష్మణ్ పార్టీలోకి ఆహ్వానించగా అంగీకరించినట్లు తెలిసింది. వారి చేరికకు అక్టోబర్ నెలలో ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేరికలపై దృష్టి సారించింది. ఈ మేరకు నియోజక వర్గా ల్లో పట్టు ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్ సైతం ఎంపీ అర్వింద్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించికుంది. భేటీ అనంతరం షకీల్ తనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా అర్వింద్ ఉన్నట్లు చెప్పగా, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే ఎంపీ ని కలిసినట్లు షకీల్ ప్రకటించారు. బీజేపీ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని పట్టు ఉన్న నేతలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, నిజామాబాద్ రూరల్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించే నేతల కోసం అన్వేషిస్తున్నారు. అధికార పార్టీతో పాటు ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడేలా ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. -
అన్నపూర్ణమ్మ మనవడు
సీనియర్ నటులు అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ పోషించారు. నర్రా శివనాగేశ్వర్ రావు (శివనాగు) దర్శకత్వంలో యం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ పతాకంపై యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ– ‘‘ చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. శివనాగు చాలా క్రమశిక్షణ ఉన్న దర్శకుడు. నా మనవడిగా నటించిన మాస్టర్ రవితేజ పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడు’’ అన్నారు. యమ్.ఎన్. ఆర్ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషం. శివనాగు ఎంతో అందంగా ఈ చిత్రం తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. 200లకు పైగా థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని శివనాగు అన్నారు. ‘‘శివనాగుగారి దర్శకత్వంలో ‘దేవినేని’ సినిమా చేస్తున్నాను. సినిమా మీద ఎంతో ఇష్టంతో పని చేస్తారాయన’’ అన్నారు హీరో తారకరత్న. సీనియర్ పాత్రికేయులు వినాయక రావు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గిరికుమర్(గిరి), సంగీతం: రాజ్ కిరణ్. -
అక్కినేని అన్నపూర్ణమ్మ
అమ్మ పాత్రలనగానే గుర్తొచ్చే నటీమణుల్లో అన్నపూర్ణమ్మ ఒకరు. క్యారెక్టర్ నటిగా పలు పాత్రలు చేసిన ఆమె ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఇప్పటివరకూ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన అన్నపూర్ణమ్మ ఇందులో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.ఎన్.ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరిలో ఎవరికి ఏం జరిగినా రచ్చబండ దగ్గర పంచాయితీ చేస్తారు. ఈ రచ్చబండకు అక్కినేని అన్నపూర్ణమ్మ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. హీరోయిన్గా అర్చన నటిస్తుండగా, జీవ, రఘుబాబు, కారుమంచి రఘు, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
‘హిందుస్తానీ’ దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత
ముంబై: ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణదేవి(92) కన్నుమూశారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిందుస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవిని 1977లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడే. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి 1941లో వివాహమాడి, 1962లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తన జీవితకాలంలో అధికభాగం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అన్నపూర్ణాదేవి..ముంబైకి మకాం మార్చి కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇవ్వడానికే అంకితమయ్యారు. ఆమె శిష్యుల్లో హరిప్రసాద్ చౌరాసియా(బన్సూరి), ఆశిష్ ఖాన్(సరోద్), అమిత్ భట్టాచార్య(సరోద్), బహదూర్ఖాన్(సరోద్), బసంత్ కాబ్రా(సరోద్), , జోతిన్ భట్టాచార్య(సరోద్), నిఖిల్ బెనర్జీ(సితార్), నిత్యానంద్ హల్దీపూర్(బన్సూరి), పీటర్ క్లాట్(సితార్), ప్రదీప్ బారట్(సరోద్), సంధ్యా ఫాడ్కే(సితార్), సరస్వతి సాహా(సితార్), సుధీర్ ఫాడ్కే(సితార్), సురేశ్ వ్యాస్(సరోద్) తదితర ప్రముఖులున్నారు. అన్నపూర్ణదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తండ్రే గురువు.. ‘మా’గా పిలుచుకునే అన్నపూర్ణాదేవిది సంప్రదాయ సంగీత నేపథ్యమున్న కుటుంబం. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా, అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఐదేళ్ల ప్రాయం నుంచే తండ్రి ఉస్తాద్ బాబా నుంచి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తొలుత సితార్ వైపు మొగ్గుచూపినా, తరువాత సూర్బహర్(తక్కువ పిచ్ ఉండే సితార్)పై మక్కువ పెంచుకుని అందులోనే ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో ‘సేనియా మైహర్ ఘరానా’ అనే శైలిని నెలకొల్పడంలో ఆమె తండ్రి విశేష కృషి చేశారు. -
మన వంటలూ... మన బంధుత్వాలూ ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి!
అన్నపూర్ణ... ఆవిడ పేరులో సంప్రదాయం... ఆవిడ రుచులలోనూ సంప్రదాయమే... శాకాహారం మాత్రమే ఇష్టం... కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులకు ఆమడ దూరం... కాలానుగుణంగా రుచులలో మార్పులు వచ్చినా... సీనియర్ సినీ - టీవీ నటి అన్నపూర్ణమ్మ వంటలు మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్లాగే ఉంటాయి... ఈ రోజు అన్నపూర్ణ పుట్టినరోజు... ఈ సందర్భంగా ఆమె ఇష్టపడే కొన్ని రుచులు మీ కోసం... సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్న అన్నపూర్ణగారి దగ్గరకు మా ఫొటోగ్రాఫర్ శివ మల్లాల కెమెరాతో వెళ్లగానే... ‘నాతో ఏం వంట చేయించాలని వచ్చారు’ అని ఆప్యాయంగా పలకరించారు అన్నపూర్ణమ్మ. మీరు ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారెందుకు... అన్నపూర్ణ: నాకు ఇంటర్వ్యూలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చెప్పినా ఒకటే ఉంటుంది! మీరు ‘అన్నపూర్ణ వంటలు - పిండివంటలు’ అనే పుస్తకం రాశారు కదా! అన్నపూర్ణ: మీకా విషయం భలే గుర్తుందే! ఈ పాటికి ఆ పబ్లిషరే మర్చిపోయి ఉంటాడు! మొదటి నుంచి మీరు వెజిటేరియనేనా... అన్నపూర్ణ: గతంలో నాన్ వెజ్ తినేదాన్ని. కానీ ఆరోగ్యరీత్యా చాలా కాలం క్రితమే మానేశాను. నాన్‌వెజ్‌లో మీరు బాగా చేసే వంటకం ఏది? అన్నపూర్ణ: తినడం మానేశాక వాటి గురించి మర్చిపోయాను. వెజిటేరియన్లో... అన్నపూర్ణ: పప్పులే! పప్పు కంటె మించింది ఈ ప్రపంచంలో ఇంకేముంది! పప్పులో ఏ కాయగూర వేసినా ఇష్టంగా తింటాను. ఇందులో కావలసినన్ని మాంసకృత్తులు ఉంటాయి. మా ఇంటికి ఎవరొచ్చినా అదే వండి పెడతాను. (నవ్వుతూ...) కోళ్లూ, మేకలూ మా ఇంటి చుట్టూ తిరగవు. అసలు మీరు బాగా ఇష్టంగా ఏవేం తింటారు? అన్నపూర్ణ: దోసకాయ పప్పు, దోసకాయ - వంకాయ పచ్చడి, బెండకాయ వేపుడు... ఇలా సాత్వికంగా ఉండేవన్నీ ఇష్టంగా తింటాను. అన్నట్లు, నాకు పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మీరే వంట చేసుకుంటున్నారా! అన్నపూర్ణ: ప్రస్తుతం పనేం లేదు కదా! వంటలు చేసుకోవడమే పని. ఆ మాటకొస్తే... మనం తినేవి మనం చేసుకోవడమే మంచిది. మీ వంటను ఎవరైనా మెచ్చుకున్నారా! అన్నపూర్ణ: ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా నా వంటను నేను మెచ్చుకుంటాను. మనం మెచ్చుకుని తినేలా ఉందంటే వంట బాగా వచ్చినట్లే కదా... మీరు 40 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉన్నారు కదా! ఎప్పుడైనా ఎవరికైనా చేసి పెట్టారా... అన్నపూర్ణ: (నవ్వుతూ...) ఇప్పటివాళ్ళలో శాకాహారం ఎవరు తింటున్నారండీ? ఎక్కువగా నాన్వెజే తింటారు. మరి, నేనేమో నాన్‌వెజ్ చేయను. కొత్తగా చాలా స్వీట్స్ వస్తున్నాయి కదా... అన్నపూర్ణ: నేనింకా పాతకాలంలోనే ఉన్నాను. లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, బొబ్బట్లు, పూర్ణాలు... ఇవన్నీ ఇష్టంగా తింటాను. పండగలకు ఏం చేస్తారు... అన్నపూర్ణ: ఒక్కో పండుగకు ఒక్కో వంటకం తప్పనిసరి కదా! దసరాల్లో... అమ్మవారికి తప్పకుండా పూర్ణాలు నైవేద్యం పెట్టాలి. సంక్రాంతికంటారా... తలకిందులుగా తపస్సు చేసినా అరిసెలు చేయక తప్పదు. ఇక, ఇంటికి అల్లుడొచ్చినప్పుడు అందరూ నాన్ వెజ్ చేస్తారు. కానీ నేను మాత్రం గారెలే చేస్తాను. ఇంకా... సున్నుండలు. అవి తింటే బలమే కాదు, ఒంటికి చలవ కూడా! మీరు చెప్పే నాలుగు మంచి మాటలు... అన్నపూర్ణ: మనిషి ఎప్పుడూ కాళ్లతోటి నడుస్తాడు. అదీ భూమి మీదే నడుస్తాడు. అంతేకానీ తలతో నడవలేడు కదా! అలాగే, మన వంటలూ, మన బంధుత్వాలూ ఎన్నటికీ మారకూడదు! వంటలైనా, బంధుత్వాలైనా.. సంక్లిష్టత లేకుండా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత కమ్మగా ఉంటాయి. - సంభాషణ: డా. వైజయంతి మామిడికాయ పప్పు కావలసినవి: కందిపప్పు - కప్పు; మామిడికాయ - 1; పచ్చి మిర్చి - 4; ఎండు మిర్చి - 4; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; కారం - టీ స్పూను తయారి: ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి మునగకాడను ముక్కలు చేయాలి కందిపప్పుకి తగినంత నీరు చేర్చి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, మామిడికాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి ఉడికించిన పప్పు జత చేసి బాగా కలపాలి పసుపు, కారం వేసి మరో మారు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి. ముక్కల పులుసు కావలసినవి: కూరగాయ ముక్కలు - 3 కప్పులు (బెండకాయలు, టొమాటో, మునగకాడ, సొరకాయ, ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, దోస, తోటకూర...); చింతపండు - పెద్ద నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; రసం పొడి - టీ స్పూను; ఎండు మిర్చి - 5; పచ్చి మిర్చి - 5 (మధ్యకు పొడవుగా కట్ చేయాలి); ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; కరివేపాకు - 2 రెమ్మలు తయారి: ముందుగా అన్ని కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు, నీళ్లు జత చేసి ఉడికించాలి చింతపండు రసం వేసి మరిగించాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వే యాలి బెల్లం పొడి వేసి మరోమారు కలపాలి చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వే సి మరిగించాలి కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. చేమదుంపల పులుసు కూర కావలసినవి: చేమదుంపలు - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 10 (మధ్యకు నిలువుగా కట్ చేయాలి); చింతపండు పులుసు - 5 టేబుల్ స్పూన్లు (చింతపండు నానబెట్టి పులుసు చిక్కగా తీయాలి); ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; మెంతి పొడి - పావు టీ స్పూను తయారి: చేమదుంపలను కుకర్‌లో ఉడికించి, తీసి చల్లారాక తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు, కారం, బెల్లం పొడి వేసి ఉడికించాలి చేమదుంప ముక్కలు వేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉంచాలి మెంతి పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. చిక్కుడుకాయ తీపికూర కావలసినవి: చిక్కుడు కాయలు - పావు కేజీ; ఇంగువ - కొద్దిగా; ఎండు మిర్చి - 6; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; శన గపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; చింతపండు గుజ్జు - అర టీ స్పూను; బెల్లం పొడి - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా తయారి: ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత ఉంచాలి చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం పొడి, బియ్యప్పిండి వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. దొండకాయ - కొబ్బరి కారం వేపుడు కావలసినవి: దొండకాయలు - పావు కేజీ; ఎండుకొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీస్పూను; ఆవాలు - అర టీ స్పూను; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); శనగపప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు. తయారి: దొండకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి కరివేపాకు వేసి కొద్దిగా వేయించిన తర్వాత, దొండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, రెండు నిమిషాలయ్యాక మూత ఉంచి, ముక్కలు మెత్తబడేవరకు సుమారు పావు గంట సేపు ఉడికించాలి మూత తీసి, కారం, కొబ్బరి పొడి, పల్లీలు వేసి బాగా కలిపి దించేయాలి. -
అక్కినేని ఆవకాయ
‘కొత్త ఆవకాయ’... అసలు ఈ సౌండ్ వింటేనే ‘అద్భుతః’ అనిపిస్తుంది. చిత్రాన్నాల్లో పులిహోర, కూరల్లో వంకాయ, పచ్చళ్లలో కొత్త ఆవకాయ... వీటికి తిరుగేలేదు. ఆర్యుల మాట కూడా ఇదే. పైగా ఇది ఆవకాయ సీజన్. ఇతర రాష్ట్రాల సంగతి ఏమో కానీ... మన తెలుగు లోగిళ్లలో మాత్రం ప్రస్తుతం ఎక్కడ చూసినా కొత్త ఆవకాయ ఘుమ ఘుమలే. ఇక్కడున్న స్టిల్ చూడండి. గరిటెతో కలపాల్సిన ఆవకాయని చక్కగా చేతితో కలిపేస్తున్నాడు సుమంత్. పైగా ఇది సినిమా కోసం తీయించుకున్న స్టిల్ కాదు. ఇంట్లో స్వయంగా ఆవకాయ పెడుతూ తీయించుకున్న స్టిల్. సుమంత్‌కి ఆవకాయకి ఉన్న అనుబంధం మామూలుది కాదు. సుమంత్ చిన్నప్పట్నుంచీ తాతయ్య, నాయనమ్మ దగ్గరే పెరిగిన విషయం తెలిసిందే. అక్కినేని అన్నపూర్ణ ఆవకాయ పెట్టడంలో సిద్ధహస్తురాలట. స్వహస్తాలతో ఆమె ఆవకాయ పట్టి, చుట్టాలకు, పక్కాలకు పంపేవారట. ‘అన్నపూర్ణమ్మగారి ఆవకాయ’ అనగానే అందరూ లొట్టలేసుకొని మరీ తినేవారట. ఏఎన్నార్‌కి కూడా అన్నపూర్ణమ్మ ఆవకాయ అంటే మహా ప్రీతి. అందుకే... ఆమె ఆవకాయ పెడుతున్నప్పుడు పక్కనే ఉండి మామిడి ముక్కల సైజు నుంచి, ఆవపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పాయలు, నూనె... ఇలా మోతాదులన్నీ దగ్గరుండి చూసేవారట. ఆమె పోయాక కూడా... ఆమె రుచి చూపించిన ఆవకాయని మాత్రం అక్కినేని వదల్లేదట. బతికున్నంతవరకూ ఈ సీజన్ రాగానే ఇంట్లో ఆవకాయ పెట్టాల్సిందే. అన్నపూర్ణమ్మ పంపినట్టే అక్కినేని కూడా తమ ఇంటి ఆవకాయని అందరికీ పంపేవారట. గత ఏడాది కూడా ఈ పద్ధతిని అనుసరించారట అక్కినేని. సుమంత్ షూటింగ్ పనిమీద విదేశాల్లో ఉంటే... ఆవకాయని అక్కడికి పంపారట. తాతయ్య దగ్గరే ఆవకాయ తయారీని నేర్చుకున్నారు సుమంత్. ఇప్పుడు ఆయనకి నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలు మాత్రం అలా ఉన్నాయి. అందుకే... నాన్నమ్మ, తాతయ్యల జ్ఞాపకమైన అక్కినేని ఆవకాయని స్వయంగా తయారు చేశారు సుమంత్. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఈ స్టిల్ పెట్టుకున్నారాయన. -
టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్న'ఎన్నికల అధికారి'
ఎన్నికల విధులు నిర్వహణకు వచ్చి... టీడీపీకే ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్న అన్నపూర్ణమ్మ అనే అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల కోసం అన్నపూర్ణ అనే అధికారి హిందూపురం మండలం మలుగూరు వచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను టీడీపీకే ఓటు వేయాలంటూ ఆమె ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ విషయాన్ని వైఎస్ఆర్ ఏజెంట్లు గమనించి... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై అప్పటికప్పుడే విచారణ జరిపిన ఉన్నతాధికారులు అన్నపూర్ణమ్మను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. -
మేధోమథనం.. అంతర్మథనం..
సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : జిల్లా తెలుగుదేశంలో అయోమయం నెలకొంది. తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్ర విభజన పక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాం తం... ఢిల్లీలో దీక్ష ..సమన్యాయం పేరుతో పూటకో మాట.. తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పైగా పార్టీలోని కొందరు ముఖ్యనేతలు సమైక్యాంధ్ర కోసం కోర్టుకు వెళ్లటం వం టి అంశాలు కూడా తీవ్ర నిర్వేదానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్ల రాజకీయ భవితవ్యంపై చర్చ జరుగుతుండగా...పయనమెటనే విషయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికల నర్సారెడ్డిలతో పాటు పలువురి జిల్లా, నియోజక వర్గం స్థాయి నాయకుల రాజకీయ ముందడుగుపై రాజకీయ వర్గాలు, ముఖ్యంగా పార్టీ కేడర్‌లో రసవత్తరమైన చర్చ సాగుతోంది. అదేవిధంగా జీవోఎంకు విభజనపై అధినేత బాబు నివేదిక ఇవ్వక పోవటంపై కూడా తమ్ముళ్లను మరింత నైరాశ్యంలోకి నెట్టినట్లయింది. పైగా ముందున్న విభజన సమస్యపై స్పష్టత ఇవ్వకుండా రానున్న ఎన్నికల కోసం మేధోమథనసదస్సులు నిర్వహిం చటం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇదివరకే ఢిల్లీ దీక్షలకు కచ్చితంగా రావాలని ఒత్తిడి చేయటంతో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లి వచ్చారు. ఇది వారిని ఇరుకున పెట్టగా అంతర్మథనంలో పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడటం ఎలాగన్న ఆలోచనలు వారిని రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కునేలా చేస్తున్నాయి. ఇదే తరుణంలో ఈ నెల 11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించతల పెట్టిన మేధోమథన సదస్సుకు జిల్లా నుంచి 30 మందికి పైగా ప్రతి నిధులు హాజరుకావాలని అధిష్టాన వర్గం నుంచి పిలుపురావడం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. సదస్సుకు జిల్లా నుంచి 30 మంది ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కార్యవర్గం, నియోజక వర్గ ఇన్చార్జిలు, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో ఇన్చార్జిలు లేకపోవడంతో త్రిసభ్యకమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేధోమథన సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే అధినేత చంద్రబాబు సమన్యాయం పేరుతో సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో మేధోమథన సదస్సుకు హాజరు వారికి సందిగ్ధంగా మారింది.