నిజామాబాద్: రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు ప్రశాంత్‌రెడ్డి. ఈసారి మేనల్లుడు అయిన ప్రశాంత్‌రెడ్డిపై ఎలాగైన విజయం సాధించాలని మేనత్త అన్నపూర్ణమ్మ పంతం. బీజేపీ అభ్యర్థిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తుండగా ఆమె సోదరుని కుమారుడు మేనల్లుడైన వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
బీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వేముల సురేందర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు అన్నపూర్ణమ్మ. ఆమె పుట్టినిల్లు వేల్పూర్ కాగా మెట్టినిల్లు కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి. మేనత్త, అల్లుడు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డి మేనత్త కొడుకైన మల్లికార్జున్‌రెడ్డితో పోటీ పడి విజయం సాధించారు. ఇప్పుడు మేనత్తతో పోటీలో నిలువడం విశేషం. వీరి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment