
అన్నపూర్ణమ్మ
అమ్మ పాత్రలనగానే గుర్తొచ్చే నటీమణుల్లో అన్నపూర్ణమ్మ ఒకరు. క్యారెక్టర్ నటిగా పలు పాత్రలు చేసిన ఆమె ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఇప్పటివరకూ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన అన్నపూర్ణమ్మ ఇందులో పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎం.ఎన్.ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది.
ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరిలో ఎవరికి ఏం జరిగినా రచ్చబండ దగ్గర పంచాయితీ చేస్తారు. ఈ రచ్చబండకు అక్కినేని అన్నపూర్ణమ్మ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. హీరోయిన్‌గా అర్చన నటిస్తుండగా, జీవ, రఘుబాబు, కారుమంచి రఘు, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment