టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్న'ఎన్నికల అధికారి' | Election officer work with Telugu Desam Party | Sakshi
Sakshi News home page

టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్న'ఎన్నికల అధికారి'

Published Sun, Apr 6 2014 10:58 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

Election officer work with Telugu Desam Party

ఎన్నికల విధులు నిర్వహణకు వచ్చి... టీడీపీకే ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్న అన్నపూర్ణమ్మ అనే అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల కోసం అన్నపూర్ణ అనే అధికారి హిందూపురం మండలం మలుగూరు వచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను టీడీపీకే ఓటు వేయాలంటూ ఆమె ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆ విషయాన్ని వైఎస్ఆర్ ఏజెంట్లు గమనించి... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై అప్పటికప్పుడే విచారణ జరిపిన ఉన్నతాధికారులు అన్నపూర్ణమ్మను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement