‘‘నేను’సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ తర్వాత కూడా నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. ‘శ్రీరామదాసు’లో చేసిన సీత క్యారెక్టర్ నాకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది’అన్నారు అర్చన. మహానటి జమున, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ రోల్స్ చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో అర్చన మాట్లాడుతూ.. ‘జమున, అన్నపూర్ణమ్మగార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాది మెడికల్ స్టూడెంట్ పాత్ర. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించాం. శివనాగుగారు నా పాత్రను అద్భుతంగా మలిచారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారు ఈ సినిమా చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది’అన్నారు.
గత ఏడాది నవంబర్‌లో అర్చన వివాహం జగదీశ్‌తో జరిగింది. ‘పెళ్లి తర్వాత మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. 2020 మనపై బాగా ప్రభావం చూపించింది. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్‌గా చేస్తాను. నాకు డాన్స్ చేయడం బాగా ఇష్టం. స్పెషల్ సాంగ్స్, గ్లామర్ రోల్స్ చేయడం వల్ల అవకాశాలు తగ్గుతాయనుకోను. కెమెరామేన్ అంజి డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్టు సైన్ చేశాను. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment