అర్చన, బాలాదిత్య
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను, ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను మిళితం చేసి తెరకెక్కించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. టైటిల్ రోల్స్‌లో సీనియర్ నటి అన్న పూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా, సీనియర్ నటి జమున ఒక కీలక పాత్రలో బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించారు. ‘‘ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నాం.
కొంతమంది మిత్రుల, శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్ని అమృత, ప్రణయ్‌లకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ఇందులో వైకుంఠపురం అనే గ్రామానికి చెందిన జమిందారిణి అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్న పూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోశాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో వాస్తవంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు నటించారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలైట్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment