Goel
-
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్‌లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
Nitanshi Goel: 16 ఏళ్ల ఈ అమ్మాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో..
నితాంశీ గోయల్.. 16 ఏళ్ల ఈ అమ్మాయి ‘లాపతా లేడీస్’లో ఫూల్ కుమారీగా అమాయకత్వాన్ని ఒలకబోసి విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. స్క్రీన్‌కి నితాంశీ కొత్తేం కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర, వెండితెర ప్రేక్షకాభిమానులకు సుపరిచితురాలు! ఈ యంగెస్ట్ యాక్ట్రెస్‌కి సోషల్ మీడియాలో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు.నోయిడాలో పుట్టి పెరిగింది. తల్లి.. రాశి గోయల్, గృహిణి. తండ్రి నితిన్ గోయల్, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి.చిన్నప్పుడే కరాటే కూడా నేర్చుకుంది. ‘మోహినీ ఆట్టమ్’లోనూ శిక్షణ పొందింది. శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది. పియానో కూడా వాయిస్తుంది.చైల్డ్ మోడల్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పేరుమోసిన ఎన్నో బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసింది. ఇటు ప్రింట్, అటు టీవీ యాడ్స్‌లో నటించింది.ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ మొదలు పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. 2015లో ‘మిస్ పాంటలూన్స్ జూనియర్ ఫ్యాషన్ ఐకాన్’ టైటిల్‌ని గెలుచుకుంది.తన పేరుతోనే ఓ యూట్యూబ్ చానెల్ని కూడా స్టార్ట్ చేసింది. 2022లో యునైటెడ్ బిజినెస్ జర్నల్ ‘ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్–30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘వికీ డోనర్’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ‘ఎమ్.ఎస్. ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘ఇందూ సర్కార్’, ‘హుడ్దంగ్’.. తాజాగా ‘లాపతా లేడీస్’ సినిమాల్లో నటించింది.‘మన్ మే విశ్వాస్ హై’తో బుల్లితెర ప్రవేశం చేసింది. అందులో శబ్రీగా ఆమె చూపిన అభినయం.. టీవీ ఇండస్ట్రీలో నితాంశీ ఉనికిని చాటింది. ‘నాగార్జున : ఏక్ యోధా’, ‘ఇష్క్బాజ్’, ‘పేశ్వా బాజీరావు’ లాంటి సీరియల్స్‌లో చక్కటి అవకాశాలను తెచ్చిపెట్టింది.నితాంశీ చురుకుదనం, ప్రతిభ ఆమెను వెబ్స్క్రీన్కీ పరిచయం చేశాయి ‘లవ్ స్లీప్ రిపీట్’ అనే వెబ్ సిరీస్‌తో. తర్వాత ‘ఇన్సైడ్ ఎడ్జ్’లోనూ నటించింది. అంతేకాదు ‘మేరే సప్నే’, ‘నఖ్రా’, ‘హమ్ మిలే థే జాహా’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నితాంశీ మెరిసింది."ప్రియంకా చోప్రా అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు చూస్తూ.. ఆమె యాక్టింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ పెరిగాను. అందుకే ఆమే నాకు ఇన్స్పిరేషన్!" – నితాంశీ గోయల్ -
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కాపాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341ల కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్‌షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్‌కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్‌గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్ అభినందించారు. -
పీసీబీ తో సమావేశం అనవసరం
► కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీ: పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో సమావేశమయ్యే అవసరం బీసీసీఐకి లేదని కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయ పడ్డారు. దుబాయ్ లో పీసీబీ అధికారులతో బీసీసీఐ సమావేశమవ్వడాన్ని గోయల్ తప్పుబట్టారు. వారు పీసీబీతో ఎందుకు సమావేశమయ్యారో అర్థం కావడం లేదన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలు ఆపె వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవని స్పష్టం చేశారు. సోమవారం బీసీసీఐ, పీసీబీల మధ్య జరిగిన సమావేశంపై మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. గోయల్ మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాను కలిసి ఈశాన్య రాష్ట్రల్లో క్రీడల అభివృద్ధి విషయంపై చర్చించారు. ఇప్పటికే రూ.4.5 కోట్లతో ఫుట్ బాల్ మైదానాన్ని మంజూరు చేశామని గోయల్ తెలిపారు. 2015-2023 లోఇరుదేశాల మధ్య ఐదు ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందాలు జరిగాయి. అయితే పాక్ ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించడంతో ఈ సీరిస్‌లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పీసీబీ రూ.387 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటు బీసీసీఐకి లీగల్ నోటిసులు పంపించింది. ఈ విషయం చర్చించేందుకు సోమవారం బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, సీఈవో రాహుల్ జోహ్రి, జీఎం ఎంవీ శ్రీధర్‌లు దుబాయ్‌లో పీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు కొనసాగించలేమని వారు పీసీబీ అధికారులకు తేల్చి చెప్పారు. -
క్రికెట్‌ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్
దేశంలోని అన్ని క్రీడల్లాగే క్రికెట్ కూడా ప్రభుత్వ క్రీడా నియమావళి పరిధిలోకి రావాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అయినప్పటికీ క్రికెట్‌ను స్పోర్ట్స్ కోడ్‌లో చేర్చడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ‘క్రికెట్‌ను కూడా క్రీడా నియమావళిలో చేర్చుతాం. అన్ని క్రీడల్లాగే క్రికెట్ ఈ జాబితాలో ఉండాలనుకుంటున్నాం. లోధా కమిటీ నిబంధనల మేరకు స్పోర్ట్స్ కోడ్‌ను పునరుద్దరిస్తున్నాం. త్వరలో ప్రకటించబోయే ఈ జాబితాలో క్రికెట్‌ను చేరుస్తాం. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తాం’ అని గోయెల్ అన్నారు.