ఈక్వల్‌ జర్నీస్లోగా ఉంది | National Safety Week March 4th to March 10th | Sakshi
Sakshi News home page

ఈక్వల్‌ జర్నీస్లోగా ఉంది

Published Wed, Mar 5 2025 5:19 AM | Last Updated on Wed, Mar 5 2025 5:38 AM

National Safety Week March 4th to March 10th

నేషనల్‌ సేఫ్టీ వీక్‌  (మార్చి 4– మార్చి 10)
పని ప్రదేశాల నుండి బహిరంగ ప్రదేశాల వరకు ఎన్నో చోట్ల భద్రతప్రాపాముఖ్యతను గుర్తు తెస్తుంది... జాతీయ భద్రతా దినోత్సవం. భద్రతా అవగాహన–అమలుకు అంకితమైన ‘నేషనల్‌ సేఫ్టీ వీక్‌’లో భాగంగా వివిధ రంగాలలో, వివిధ ప్రదేశాలలో, వివిధ కోణాలలో మహిళల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు వెదకడం అత్యవసరం. అనివార్యం. వికసిత భారత్‌కు ఆయువు పట్టు... మహిళల శ్రేయస్సు, భద్రత...

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) ప్రకారం భారతదేశంలో 15–49 సంవత్సరాల వయస్సు గల 30 శాతం మంది మహిళలు శారీరక, లైంగిక, గృహహింసను అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంతప్రాపాధాన్యత ఇస్తున్నాయి.

మహిళల భద్రత, భద్రతాప్రాపాజెక్ట్‌ల కోసం ప్రభుత్వం ‘నిర్బయ నిధి’ని ఏర్పాటు చేసింది. నిర్భయ నిధి కింద బ్యూరో ఆఫ్‌పోలిస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బిపీఆర్‌ అండ్‌ డి) దర్యాప్తు అధికారులు,ప్రాపాసిక్యూషన్‌ అధికారులు, వైద్య అధికారులకు శిక్షణ ఇస్తారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ(సెక్సువల్‌ అసాల్ట్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌) కిట్‌లను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాపాంతాలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.

‘ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’(డబ్ల్యూపీఎస్‌–2023)లో 177 దేశాల్లో మహిళల భద్రతలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలను డెన్మార్క్, స్విట్జర్లాండ్‌ దక్కించుకున్నాయి. ఆఫ్గనిస్తాన్‌ అట్టడుగు స్థానంలో ఉంది.

2022: మహిళలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ హింసకుపాల్పడే టాప్‌10 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఈ జాబితాలో 537 సంఘటనతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. 125 సంఘటనలతో మన దేశం 7వ స్థానంలో ఉంది.

ఉమెన్‌ సేఫ్టీకి సంబంధించి వివిధ సంస్థలు ట్రైనింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి నుంచి సేఫ్టీకి సంబంధించిన టిప్స్, సేఫ్టీకి సంబంధించిన గోల్డెన్‌ రూల్స్‌ చెప్పడం, యాప్స్‌ను పరిచయం చేయడం వరకు ఎన్నో చేస్తున్నారు. సెల్ఫ్‌–డిఫెన్స్‌కు సంబంధించి అ΄ోహలను తొలగిస్తున్నారు. 

హక్కులను సాధించడానికిపోరాటపటిమ... అవకాశాలను అందుకోవడానికి ప్రతిభాపాటవాలు... సాధించి, అందుకున్న దాంట్లో స్థిరపడే చోటేపోరాటం... ఇవన్నీ అవసరం అవడానికి కారణం అభద్రత, రక్షణలేమి! అవి ఇన్నేళ్ల మహిళల ప్రయాణాన్ని మళ్లీ మొదటికే తీసుకొస్తాయేమోననే భయం వెంటాడుతోంది! తర్వాత తరాలను జీరో దగ్గర నిలబెట్టకుండా.. వాళ్లకో మైల్‌స్టోన్‌ను అందివ్వాలనేదే ఈతరం మహిళల ఆరాటం! అది విమెన్‌ ఫ్రెండ్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వల్లే సాధ్యం! ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రపోలీస్‌ శాఖ చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు తెలంగాణ  సీఐడీ, విమెన్‌ సేఫ్టీవింగ్‌ ఏడీజీపీ శిఖాగోయల్‌.

ఏ రంగంలో అయినా మహిళాప్రాపాతినిధ్యం పెరిగితేనే మహిళలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మొదటినుంచీ పురుషాధిపత్య రంగమైనపోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ మహిళలప్రాతినిధ్యం పెరగాలి. ఇదివరకటితోపోలిస్తే పెరిగింది కూడా. అయినా జాతీయ స్థాయిలో చూస్తే వీరి సంఖ్య  25 శాతం కూడా లేదు. తెలంగాణపోలీస్‌ శాఖలో మహిళల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తోంది. దాంతో రాష్ట్రపోలీస్‌ శాఖలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రికార్డ్‌ స్థాయిలో 2,500 మంది మహిళలను అపాయింట్‌ చేశాం. అంటే దాదాపు 20 శాతం.  

ఎస్సీటీపీసీప్రా΄ోగ్రామ్‌ ద్వారా 2,338 మందిని తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బ్యాచ్‌ ఇది.పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి మహిళలనుప్రా΄ోత్సహించడానికే ఇలాంటి ప్రీ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ కృషి జరుగుతోంది. అయినా ఈ రంగంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది. మహిళల నియామకాలను పెంచడంలో చిత్తశుద్ధి ప్రయత్నాలతోపాటు జెండర్‌పాలసీ, మహిళలకు లీడర్‌షిప్‌ ట్రైనింగ్స్‌ అనేవీ చాలా అవసరం. ఇన్ని అవాంతరాల మధ్య కూడా గుర్తించదగిన విజయాన్నే సాధిస్తున్నాం.

భద్రతా నగరాల్లో ఒకటిగా...
మహిళా భద్రత, రక్షణ కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితమైంది కాదు. ఇంటి నుంచి మొదలు స్కూల్, వర్కింగ్‌ ప్లేస్, ట్రాన్స్‌΄ోర్ట్‌ ఇలా అన్ని చోట్లా సమస్యగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు పెద్ద పీట వేస్తోంది. షీ టీమ్స్, భరోసా సెంటర్స్, సాహస్, సీడీఈడబ్ల్యూ (డొమెస్టిక్‌ వయొలెన్స్‌) కౌన్సెలింగ్‌ సెంటర్స్, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్స్, చట్టాలను కఠినంగా అమలుపరచడం, నిర్భయ ఫండ్స్‌తో అధునాతన నిఘా పరికరాలు, సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్స్, హెల్ప్‌లైన్స్‌ వంటివాటితో భద్రత, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాం. దీంతో మహిళ లు నిర్భయంగా బయటకు వచ్చి.. తమకు నచ్చిన రంగంలో రాణించే వాతావరణం ఏర్పడింది. 

కిందటేడు మార్చిలో టీ సేఫ్‌ సర్వీస్‌నుప్రాపారంభించింది ప్రభుత్వం. ఇది చదువు, స్త్రీల హక్కులు, చట్టాల గురించి అమ్మాయిల్లో అవగాహన కల్పించడం, అలాగే మహిళలను గౌరవించాలనే స్పృహను అబ్బాయిల్లో కలిగించడం వంటి కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింసను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వీటన్నిటి వల్లే తెలంగాణ ఈరోజు దేశంలోనే అత్యధిక వర్కింగ్‌ విమెన్‌ ఉన్న రాష్ట్రంగా, హైదరాబాద్‌.. దేశంలోకెల్లా భద్రతా నగరాల్లో ఒకటిగా నిలిచాయి.  

సవాళ్లు...
ఇంత చేస్తున్నా ఇంకా చాలామంది మహిళల్లో తమ హక్కులు, చట్టాల విషయంలో పూర్తి అవగాహన రాలేదు. దీనివల్ల గృహహింస, పనిప్రదేశాల్లో లైంగికవేధింపులు వంటివాటి మీద ఫిర్యాదు చేయడం లేదు. అవగాహన ఉన్నవారు కూడా వెనుకడుగు వేస్తున్నారు పరువు, ప్రతిష్ఠ లాంటి భయాల వల్ల. ఇవన్నీ మహిళల భద్రత, రక్షణకు అడ్డంకులుగా మారుతున్నాయి. అయినాపోలీస్‌ శాఖ అలుపెరగని ప్రయత్నం చేస్తోంది.

మనమే క్రియేట్‌ చేసుకోవాలి...
ఏ రంగంలో మహిళలు మైనారిటీగా ఉంటారో ఆ రంగంలో సవాళ్లు తప్పనిసరి. అయితే వాటికి భయపడకుండా మన స΄ోర్ట్‌ సిస్టమ్‌ను మనమే రూ΄÷ందించుకోవాలి. దాన్ని విజయానికి సోపానంగా మలచుకోవాలి.ప్రాపాధాన్యాలను గ్రహించి.. దానికి అనుగుణంగా పనిచేసుకుపోవడమనేది కూడా ఒక నైపుణ్యంగా మారుతుంది.ప్రాపాధాన్యాలను గ్రహిస్తూ వర్క్‌– లైఫ్‌ బ్యాలెన్స్‌ని ఒక స్కిల్‌లా డెవలప్‌ చేసుకోవాలి. -శిఖాగోయల్‌

డిజిటల్‌ థ్రెట్‌ను ఢీ కొట్టాలి
ట్రెడిషినల్‌ ముప్పుకు అదనంగా ఈ–థ్రెట్స్‌ సోషల్‌మీడియా రాకతో మరింత పెరుగుదల భయం వీడితేనే నేటి మహిళకు పూర్తి భద్రత బాధితుల వివరాల గోప్యతకుపోలీస్‌ భరోసా ‘సోషల్‌ మీడియా సహా డిజిటల్‌ ప్రపంచం మానవ జీవితాల్లోకి చొచ్చుకు΄ోయింది. ఆపై దాని వల్ల ముంచుకొస్తున్న ముప్పును తెలుసుకున్నాం. ఇప్పుడు నిరోధక మార్గాలు అన్వేషిస్తున్నాం. నేటి మహిళకు పెను సవాల్‌గా మారిన డిజిటల్‌ థ్రెట్‌ను సమర్థంగా ఢీ కొట్టాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి’... అన్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, హైదరాబాద్‌ నేర పరిశోధన విభాగం డీసీపీ ఎన్‌.శ్వేత. మహిళల భద్రతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు కీలకాంశాలు వివరించారు.

వేధింపులు పరిధి దాటాయి
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. ఆమెకు ఏళ్లుగా ఎదురవుతున్న వేధింపులు, గృహహింస తదితరాలను ట్రెడిషనల్‌ థ్రెట్‌గా చెప్పుకోవచ్చు. నేటి మహిళ వీటిని చాలా వరకు సమర్థంగా ఎదుర్కొంటోంది. ఫలానాప్రాపాంతం లో ఈవ్‌ టీజింగ్‌ చేసేపోకిరీలు ఉన్నారని తెలిస్తేపోలీసులకు ఫిర్యాదు చేస్తాం లేదా ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అయితే డిజిటల్‌ థ్రెట్‌కు, సైబర్‌పోకిరీలకుప్రాపాంతం, పరి«ధి అంటూ ఉండవు.

ముప్పును పట్టించుకోవట్లేదు
డిజిటల్‌ మీడియాను మహిళలు, యువతులు ఓ మంచి ఎక్స్‌ప్రెషన్‌ లాట్‌ఫాంగా వినియోగించుకుంటున్నారు. తమ అభి్రపాయాలు, అభిరుచులను అక్కడ స్వేచ్ఛగా వెలిబుచ్చుతున్నారు. తద్వారా వేల మందికి సుపరిచితులుగా మారిన, ఆర్థికంగా నిలదొక్కుకున్న అతివలూ ఎందరో ఉన్నారు. అయితే ఈ ఎక్స్‌ప్రెషన్‌లో అంతర్లీనంగా ఉన్న ముప్పును గుర్తించలేక΄ోతున్నారు. ఫలితంగా అనేక మంది మహిళలు ఫిజికల్‌గా, వర్చువల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాగ్రత్తలను విస్మరిస్తున్నారు
స్వభావ సిద్ధంగానే మహిళలు బాహ్య ప్రపంచంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తొందరగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడరు. నమ్మకం కలిగే వరకు అభిరుచులు పంచుకోవడం మాట అటుంచి కనీసం తమ పేరు కూడా చెప్పరు. రియల్‌ వరల్డ్‌లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... వర్చువల్‌ వరల్డ్‌లో మాత్రం తొందరపడుతున్నారు. హాయ్, హలోతో మొదలైన ఈ పరిచయాలు వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేసుకునే వరకు వెళుతున్నాయి. ఇవే కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి.

వీరి భయమే వారికి ధైర్యం
డిజిటల్‌ థ్రెట్‌కు లోనైన మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. కుటుంబం, సమాజం, వ్యక్తిగత జీవితం.. ఇలా అనేక అంశాలను ఊహించుకుని భయపడుతున్నారు. ఈ భయమే ఎదుటి వారికి ధైర్యం అవుతోంది. మరింత రెచ్చి΄ోతూ బ్లాక్‌మెయిల్‌ చేసే స్థాయికి వెళుతున్నారు. మీ పరువు అనేది మీ చేతుల్లో, మీ ప్రవర్తనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. నట్టింట్లో, నడివీధిలోనే కాదు... ‘నెట్‌’ఇంట్లోనూ బాధితురాలిగా మారిన అతివకు అన్ని ఏజెన్సీలు అండగా ఉంటాయి. వీళ్లు తమకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకోవాలి. ధైర్యంగా ముందుకువచ్చిపోలీసులతోపాటు సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి.            

ఫిర్యాదు ఎక్కడైనా చేయవచ్చు
మీరు ఏప్రాపాంతంలో ఉన్నప్పటికీ మరేప్రాపాంతంలో అయినా ఏ ఏజెన్సీకి అయినా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేసిన వాళ్లే దర్యాప్తు చేయడమో, సంబంధితప్రాపాంతానికి బదిలీ చేయడమో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బా«ధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా గోప్యతపాటిస్తారు. ఈ విషయంలో న్యాయస్థానాలు సైతం బాధితులకు పూర్తి అండ, సహాయసహకారాలు అందిస్తుంటాయి. టెక్నాలజీని  వాడుకోవాలి, విచక్షణతో ముందుకు వెళ్లాలి.  – ఎన్‌.శ్వేత. డీసీపీ నేర పరిశోధన విభాగం,  హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement