self defence
-
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్‌లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్‌స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్‌స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్‌స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్‌స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్‌స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్‌లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్‌లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్‌లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
Self Defence: ఆగంతకుడు ఎదురుగా ఉంటే... వెనుక నుంచి వస్తే ఏం చేయాలి?
గాంధీజీ ఆకాంక్ష ఇది. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిరోడ్డు మీద ధైర్యంగా సంచరించగలిగిన రోజు మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు... అని ఆకాంక్షించాడు బాపూజీ. అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడానికి స్త్రీ ధైర్యం చేస్తోంది. కానీ సంస్కారం లోపిస్తున్నది మగవాళ్లలోనే. అయితే మహిళ ఒకప్పటిలాగా ఉండడం లేదు. ఆకతాయి మగవాళ్లు ఏడిపిస్తారని ముడుచుకు పోవడం లేదు. ఏడిపించిన వాళ్ల దేహశుద్ధి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇందుకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఉదంతమే. ఆమె డ్యూటీ ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తోంది. ఓ యువకుడు ఆమె బైక్‌ను ఆపాడు. అతడి దుర్మార్గపు ఆలోచనను కని పెట్టింది. అయితే ఆమె భయంతో బిగుసుకుపోలేదు, పారిపోయే ప్రయత్నమూ చేయలేదు. రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని ఆ యువకుడిని చితక్కొట్టింది. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాల’ని సమాజం నుంచి ప్రశంసలందుకుంటోంది. ‘ఆడపిల్ల ఒద్దికగా తల వంచుకుని వెళ్లాలి’ అనే కాలదోషం పట్టిన సూక్తిని తిరగరాసింది. ఈ ఆధునిక సమాజంలో మనగలగాలంటే ఆడపిల్ల ఎలా ఉండాలో... చెప్పడానికి తానే రోల్‌మోడల్‌గా నిలిచింది. మగవాడు సాహసం చేస్తే హీరో, మహిళ సాహసం చేస్తే షీరో. ‘‘ప్రతి ఒక్క బాలిక, మహిళ స్వీయ రక్షణ చిట్కాలను నేర్చుకుని తీరాలి. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌కి చాలా శక్తి కావాలని, ఆడపిల్లలు ఈ ప్రాక్టీస్ చేస్తుంటే లాలిత్యాన్ని కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా ఉండాల్సిన ఫిట్నెస్ చాలు. ఈ ప్రాక్టీస్‌తో దేహం శక్తిమంతం అవుతూ, ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది. నిజానికి ప్రమాదం ఎదురైనప్పుడు స్పందించాల్సింది మెదడు. ఈ ప్రాక్టీస్‌తో మెదడు చురుగ్గా ఉంటుంది. దాంతో తక్షణమే అప్రమత్తమై మెళకువలతో వేగంగా స్పందిస్తుంది. నైట్‌షిఫ్ట్‌లు, డ్యూటీలో భాగంగా బయట ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు తప్పనిసరిగా స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకుని తీరాలి. మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే... ఏదైనా సాధించగలమనే ధైర్యం కూడా వస్తుంది. ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ప్రాక్టీస్‌తో తమ మీద తమకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, అది ధైర్యానికి కారణమవుతుంది. ఆ ధైర్యం కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తుంది. గన్నవరం అమ్మాయిని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలి. ఆమె స్ఫూర్తితో మరికొంత మంది ప్రతికూల పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు’’ అన్నారు కరాటే చాంపియన్ సైదా ఫలక్. ఆమె తెలంగాణలో స్కూళ్లలో బాలికలకు స్వీయరక్షణ నేర్పిస్తున్నారు. పక్షులు, జంతువులు... స్త్రీపురుష భేదం లేకుండా వేటికవి తనను తాను రక్షించుకుంటాయి. మనిషికెందుకు ఈ తేడా? సమాజం విధించిన పరిధిలో కుంచించుకుపోవడం వల్లనే స్త్రీ బాధితురాలిగా మిగులుతోంది. అంతేతప్ప స్త్రీలో తనను తాను రక్షించుకోగలిగిన శక్తి లేక కాదు. దేహదారుఢ్యంలో పురుషుడికి సమానం కాకపోవచ్చు. కానీ తనను తాను పురుషుడికి దీటుగా తీర్చిదిద్దుకోవడంలో మాత్రం వెనుకబాటుతనం ఉండదు. సమాజం గీసిన అసమానత్వపు గిరిగీతను చెరిపేయడం మొదలుపెట్టింది మహిళ. ఇప్పటికే అనేక స్కూళ్ల నుంచి స్వీయరక్షణలో శిక్షణ పొందిన తరం బయటకు వచ్చింది. ఈ దారిలో మరికొంత మంది నడిచి తీరుతారు. గాంధీజీ కలలు కన్న సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మహిళలు నిశ్శబ్దంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఫలాలు సమీప భవిష్యత్తులోనే అందుతాయనడంలో సందేహం లేదు. ధైర్యం... ఆరోగ్యం! నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో తైక్వాండో క్లాసులు పెట్టారు. అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాలుగుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నాను. ప్రాక్టీస్‌కి ముందు తర్వాత తేడా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. మా నాన్న లేరు. అక్క, అమ్మ, నేను. బయట పనులు చక్కబెట్టుకుని రాగలిగిన ధైర్యం వచ్చింది. ‘ఆడపిల్ల కాబట్టి’ అని జాగ్రత్తలు నేర్పించే వయసులో మా అమ్మ నాకు తైక్వాండో నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే... ఈ ప్రాక్టీస్ వల్ల ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన కారణంగా ఎదురవుతున్న అనేక అనారోగ్యాల నుంచి కూడా దూరంగా ఉండగలుగుతాం. – కంభంపాటి లలితాకీర్తన, బీటెక్ స్టూడెంట్, కర్నూలు నన్ను నేను రక్షించుకోగలను! తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్, థర్డ్ డాన్ లెవెల్‌కు చేరాను. రాయలసీమలో ఈ స్థాయిని చేరుకున్న అమ్మాయిని నేను మాత్రమే. ఔరంగాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో మొదటి స్థానం నాది. దీనిని స్పోర్ట్‌గా చూడండి, మార్షల్ ఆర్ట్‌గా చూడండి. కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మరువద్దు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అమ్మాయిలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం సాధ్యం కాదు. అర్ధరాత్రి డ్యూటీ చేయలేమంటే కుదరదు. అంతేకాదు... విలువలు పతనమవుతున్నాయి కూడా. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ మెళకువలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే ఏ పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలననే ఆత్మవిశ్వాసం వస్తుంది. మహిళలు కూడా ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం అనుకోకూడదు. కనీసంగా కొన్ని టెక్నిక్లనైనా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ‘నన్ను నేను రక్షించుకోగలను’ అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. – జి. కెహితీ, కుకివోన్ తైక్వాండో నేషనల్ చాంపియన్, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ నేర్పిస్తూనే ఉన్నాను! తైక్వాండో నేర్పించడం నాకు వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతగా చేపట్టాను. ముప్పై ౖఏళ్లుగా ఐదువేల మందికి శిక్షణనిచ్చాను. ఈ యుద్ధవిద్యల్లో జపాన్ వాళ్లది కరాటే, చైనా వాళ్లది కుంగ్‌ఫూ, కొరియా వాళ్లది తైక్వాండో. మా అమ్మాయి పేరు కెహితి కూడా కొరియా పదమే. మా కొరియన్ మాస్టారి పట్ల గౌరవంతో ఆ పేరు పెట్టుకున్నాను. ఆడపిల్లల విషయానికి వస్తే ఈ మూడింటిలో తైక్వాండో అత్యుత్తమ స్వీయరక్షణ కళ. – జి. శోభన్‌బాబు, కుకివోన్ తైక్వాండో బ్లాక్‌బెల్ట్ సెవెన్త్ డాన్, వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆగంతకుడు ఎదురుగా ఉంటే... 1. హేమర్ స్ట్రైక్... చేతిలో ఉన్న వస్తువే ఆయుధం. బండి తాళం అయినా సరే. ఏమీ లేకపోతే చేతులే ఆయుధం. చేతిలో ఉన్న ఆయుధంతో సుత్తితో గోడకు మేకు కొట్టినట్లుగా ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. చేతిలో ఏమీ లేకపోతే పిడికిలి బిగించి దాడి చేయాలి. 2. గ్రోయిన్ కిక్... చేతులతో చేసిన దాడి సరిపోకపోతే కాళ్లకు పని చెప్పాలి. మోకాలి దెబ్బ ఆగంతకుడి కాళ్ల మధ్య తగలాలి. ఈ దాడితో చాలావరకు తాత్కాలికంగా దేహభాగం పక్షవాతం సోకినట్లు చచ్చుబడిపోతుంది. అతడు తేరుకునేలోపు పారిపోవచ్చు లేదా పోలీసులకు పట్టించవచ్చు. వెనుక నుంచి వస్తే... 1. ఆల్టర్నేటివ్ ఎల్బో స్ట్రైక్... ఇది ఆగంతకుడు వెనుక నుంచి దాడి చేసినప్పుడు ప్రయోగించాల్సిన టెక్నిక్. మోచేతిని భుజాల ఎత్తుకు లేపి దేహాన్ని తాడులా మెలితిప్పుతున్నట్లు తిరుగుతూ మోచేతితో ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. అతడు తేరుకునేలోపు వేగంగా మళ్లీ మళ్లీ దాడి చేయాలి. మోచేతితో దాడి చేస్తున్నప్పుడు పాదాన్ని దేహ కదలికకు అనుగుణంగా గాల్లోకి లేపి, దేహం బరువును మునివేళ్ల మీద మోపాలి. అప్పుడే మోచేతి అటాక్ సమర్థంగా ఉంటుంది. 2. ఎస్కేప్ ఫ్రమ్ ఎ ‘బేర్ హగ్ అటాక్’ ... ఆగంతకుడు వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నప్పుడు తప్పించుకునే మార్గం ఇది. రెండు మోచేతులను గాల్లోకి లేపి ఒకదాని తర్వాత మరో మోచేతితో ఆగంతకుడి ముఖం, దవడల మీద దాడి చేయాలి. అప్పుడు అతడి చేతులు వదులవుతాయి. అప్పుడు ఎదురుగా తిరిగి అరచేతిని చాకులాగ చేసి మెడ మీద కర్రతో కొట్టినట్లు దాడి చేయాలి. వెంటనే పిడికిలి బిగించి మెడ మీద గుద్దుతూ మరో చేతిని మెడ మీద వేసి అతడిని కిందపడేయాలి. దేహం మీద రకరకాలుగా దాడి చేసి శత్రువును నిర్వీర్యం చేయవచ్చు. నూటికి 81 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు యూఎస్‌లో ఓ సర్వేలో తెలిసింది. మహిళల రక్షణ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఓరేగాన్ సూచించిన కొన్ని స్వీయరక్షణ పద్ధతులివి. – వాకా మంజులారెడ్డి -
Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..
అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్మెంట్లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది. శాంతాబాలు పవార్ వయసు 86. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్ అంత పాపులర్. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది. ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్ దేశ్‌ముఖ్ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్. అన్నట్లు ఈ వారియర్ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్ మూవీ ‘సీత ఔర్ గీత’లో నటించింది. -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్‌లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్‌కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్‌తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. -
మహిళలు కోరితే ఆయుధాలు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : ఆత్మరక్షణ కోసం మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆయుధాలిస్తుందా? ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్మెన్లను తొలగించి, మహిళా రక్షణకు వారికి గన్మెన్లను ఇవ్వాలని లేదా వారికి ఆయుధాలైనా ఇవ్వాలని ఆయన సూచించారు. ఎన్కౌంటర్లతో హత్యాచారాలకు ఫుల్స్టాప్ పడుతుం దని ప్రభుత్వం భావించవద్దని, అసలు హత్యాచారాలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటేనే ఉత్తమమని ఆయన శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్కౌంటర్ ముఖ్యమంత్రి చేయించారనే విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారని, ఆ చర్యను ప్రోత్యహించే విధంగా ఆయన మాట్లాడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. -
అమ్మాయిలూ...ఆదిపరాశక్తిలా మారండి!
ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరో ఒకరు వస్తారు, సహాయం చేస్తారు అని అనుకోవడం కాకుండా..ప్రతీ మహిళ తనను తాను కాపాడుకోవడం నేర్చుకోవాలి. తనకు తానే బాడీగార్డ్‌లా మారాలి. ఎవరైనా తన జోలికి వస్తే ఆదిపరాశక్తిలా మారి వారిని మట్టుబెట్టాలి. ఇలా చేయాలంటే చిన్నప్పటినుంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్‌లు తెలిసుండాలి. ఆ టెక్నిక్లేంటో తెలియాలంటే ఇప్పుడు చూద్దాం. -
కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు చెల్లించినప్పటికీ చెల్లించలేదంటూ అధికారులను, పోలీసులను తప్పదోవ పట్టిస్తున్న కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని న్యూ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చెరుకూరి వెంకటరమణ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ స్పం దన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు ఇప్పటికే తమ అసోసియేషన్ నుంచి వేతనాలు అందజేశామని, ఇంకా ఎవరిౖMðనా చెల్లించనట్లయితే వారు తమను నేరుగా సంప్రదిస్తే వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇదివరకే భాస్కర్‌ను సస్పెండ్ చేశాం గతంలో నిధులు దుర్వినియోగం చేసిన కొమర భాస్కర్‌ను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సస్పెండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి విచారణకు హాజరై వివరాలను సమర్పించాలని కోరినప్పటికీ ఆయన అందజేయలేదన్న విషయాన్ని ఎస్పీకి వివరించారు. అప్పట్లో శిక్షకులకు భాస్కర్ జీతాలు చెల్లించలేదన్న విషయం తెలుసుకొని రాష్ట్ర అసోసియేషన్ నేరుగా జిల్లాకు విచ్చేసి శిక్షకులకు వేతనాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ భాస్కర్ మాత్రం తాము వేతనాలు బకాయి పడ్డామని, శిక్షకులకు చెల్లించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని వివరించారు. కొమర భాస్కర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినా ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్, టీఎఫ్ఐ, డబ్ల్యూటీఎఫ్ పేరు, లోగోలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దానిపై అసోసియేషన్ పరంగా చర్యలకు సిద్ధమైనట్లుగా ఎస్పీకి వివరించారు. నేరుగా సంప్రదించండి ఇప్పటివరకు తమను సంప్రదించిన 114 ప్రభుత్వ స్కూల్స్, 4 కేజీబీవీ స్కూళ్లలో శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు అందజేసినట్లుగా ఆయన వివరించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 7702234995 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. శిక్షకులకు వేతనాలు చెల్లించిన విషయాన్ని పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. -
టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న యాప్ టిక్‌టాక్. సినిమా డైలాగులు, పాటలు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉన్న ఈ యాప్ పట్ల... యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిక్‌టాక్ పట్ల ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పేందుకు ఈ యాప్‌ను ఎంచుకున్నారు. రోడ్డు భద్రత, సెల్ఫ్ డిఫెన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఇప్పటికే లక్ష హార్ట్‌లను సంపాదించుకున్న పోలీసులు.. మరిన్ని సరికొత్త వీడియోలను అప్లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..‘ ప్రజలకు త్వరగా..మరింత చేరువకావడానికి టిక్‌టాక్ ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాం. వీటికి మంచి స్పందన కూడా వస్తోంది’ అని పేర్కొన్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని వీడియోలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. టిక్‌టాక్‌తో ఇటువంటి లాభాలు కూడా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు. -
భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, దాన్ని సమర్థిస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్ ప్రకటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు బోల్డన్ శుక్రవారం ఫోన్ చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాడిని ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం.. తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న సాయాన్ని పాక్ నిలిపివేయాలని హెచ్చరించింది. పాక్ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్ ఇస్ఫాహన్(ఇరాన్): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పాక్– ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం నుంచి పాక్ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్’ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. -
పాడు చేతుల నుంచి కాపాడుకో
అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని దినదిన గండంగా మసులుకోవాలి? ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్ ఉద్యోగినులు మార్షల్ ఆర్ట్స్ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్‌చున్ కుంగ్‌ఫూ పేరొందింది. ఎందుకంటే... అన్నీ అనువైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం. మహిళల చేత.. మహిళల కోసం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్ చున్ కుంగ్ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్ మహిళ.. వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠవింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ... బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపి మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్ చున్ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు. శక్తి ప్రదర్శన కోసం కాదు ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్ వింగ్ చున్.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు. మగవాళ్లు / మహిళలు నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ నేర్పిస్తారు? స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జిఓ ‘స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణా కేంద్రం స్థాపించింది. రెండేళ్లు సాధన... ► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది. ► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు. ► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్‌లో ఉన్న అందరూ దీన్ని సాధన చేయవచ్చు. ► శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం అవసరం ఉండదు. ► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు. ► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం. వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు – ఎస్.సత్యబాబు -
కష్టం కూడా ఇష్టమే
‘టచ్ మీ నాట్’ ఫ్లవర్‌ని ముట్టుకుంటే ముడుచుకుంటుంది. అంత సాఫ్ట్. ఆ పువ్వులా సుకుమారమైన క్యారెక్టర్లే కాదు ఫిజికల్‌గా ఛాలెంజ్ చేసే పాత్రలను కూడా ఇష్టపడతారు తాప్సీ. క్యారెక్టర్లో ఒదిగిపోవడానికి ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తారామె. రీసెంట్గా ‘నీతిశాస్త్ర’ అనే యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారీ ఢిల్లీ బ్యూటీ. ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా స్వయంగా చేశారామె. కొన్ని నిమిషాల ఈ సీక్వెన్స్ కోసం రెండు రోజులు అలుపెరగకుండా ప్రాక్టీస్ చేశారు. ఈ సీక్వెన్స్‌లో పాల్గొనటం గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘నీతిశాస్త్ర’లో సెల్ఫ్ డిఫెన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపించాను. నామ్ షబానా, బేబి సినిమాల్లో యాక్షన్ ఓరియంటెడ్ రోల్స్ చేయడంతో ఈ ఫైట్ సీక్వెన్స్ చేయడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మా కొరియోగ్రాఫర్ టీను సార్ ఈ సీక్వెన్స్‌ను రెండు రోజులు ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ కూడా ఇంటెన్స్‌గా జరిగేది. అతని పేషన్స్ వల్లే ప్రతీ మూవ్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆ కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తోంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. వర్క్ మీద అంత డెడికేషన్ ఉండటం వల్లే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారామె. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. -
ఆత్మరక్షణలో జేసీ బ్రదర్స్..
► కేసులు, వేధింపులతో భయపెట్టే యత్నం ► పైలా నర్సింహయ్య విషయంలో జేసీపై తీవ్ర విమర్శలు ► ప్రభోదానంద ఆశ్రమ ఘటనలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు ► అసాంఘిక శక్తులకు జేసీ బ్రదర్స్ అండ! ► క్రమంగా దూరమవుతున్న కేడర్ జేసీ బ్రదర్స్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన నాయకులు రోడ్డెక్కి చేస్తున్న యాగీ నవ్వుల పాలవుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద వైఖరి అడ్డూఅదుపు లేని వ్యాఖ్యలతో వీరింతే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధినేత మెప్పు కోసం మైకందుకోగానే ప్రతిపక్షం పై నోరు పారేసుకుంటున్న తీరు ఆ నేతల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. అనంతపురం: వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోట నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. సీరియస్‌గా చేస్తున్న ప్రసంగం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సీనియర్ నేతలు ఎలాంటి సందేశం ఇస్తారోనని ఎంతో ఆశతో వచ్చే ప్రజలు ఆ నేతల తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఇదీ ఇటీవల కాలంలో జేసీ బ్రదర్స్ తీరు. జేసీ దివాకర్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసిన ప్రభాకర్ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న చాలా సందర్భాల్లో ఆయన వ్యవహారం ఇదే రీతిన ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఆయనను వారించాల్సింది పోయి.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో చెప్పకనే చెబుతోంది. తాజాగా విజయవాడ, వైజాగ్ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత దివాకర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్‌రోడ్డులో టెంటు వేసి విపక్షనేతపై దుర్భాషలాడారు. దీనిపై సోషియల్ మీడియాలో జేసీ బ్రదర్స్‌పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రికి చెందిన పైలా నర్సింహయ్య అనే వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపీఆర్ ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంగా ఉండటంతో కోర్టు ఆదేశాలతో ‘అనంత’ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించాలని మహేశ్ అనే డాక్టర్ సిఫారసు చేశారు. అయినా సూపరింటెండెంట్ జగన్నాథం పైలాను రెఫర్ చేయలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ రాజకీయనాయకుడు, తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్సకు సాయం చేయాల్సింది పోయి, ఇలా వ్యవహరించడమేంటని రాజకీయనేతలతో పాటు మేధావులు తప్పుబడుతున్నారు. దీంతో పాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. ఇసుక వ్యవహారంలో వెంకటేశ్ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్‌రెడ్డిపై వెంకటేశ్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దళితుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అండగా? జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పలుసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకోలేకపోయారు. దీనిపై తాడిపత్రి వైఎస్సార్సీపీ ఇన్చార్జి పెద్దారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయింది. జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వాసులు ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నారు. అంతేకాక వేధింపులకు గురి చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి సాక్ష్యమని.. బయటికి రాని బెదిరింపులు ఇలా చాలా ఉన్నాయనేది విపక్షాల వాదన. ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. -
ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి!
-
ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి!
ప్యొంగ్ యాంగ్: తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఉత్తరకొరియా అడుగులు వేస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రూపకల్పణలో తాము ఫైనల్ స్టేజీలో ఉన్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. 2016లో అణు పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం బాలిస్టిక్ మిస్సైల్ చివరిదశకు చేరుకున్నామని న్యూ ఇయర్ స్పీచ్ ఇస్తూ ఆదివారం స్వయంగా ఆయనే తెలిపారు. ప్యొంగ్ యాంగ్ అణు సామర్థ్యాన్ని మెరుచుపరుచుకుందని, బలమైన ప్రత్యర్ధులు సైతం తమ దేశంపై యుద్ధానికి రావాలంటే వణికిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. 'గత ఏడాది తాము రెండు అణు పరీక్షలు, క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశాం. ఎటుంటి పరిస్థితులు ఎదురైనా తమ అణ్వస్త్రాలతో ఢీకొనేందుకు సిద్దంగా ఉంటాం. ఖండాంతర క్షిపణి త్వరలోనే పరీక్షించి మా స్థాయిని పెంచుకుంటాం. అప్పుడు తమ ఆర్మీకి బలమైన అస్త్రాలు అందిస్తాం' అని కిమ్ జోంగ్ పేర్కొన్నారు. అణ్వాయుధాలన్నీ కేవలం తమ ఆత్మ రక్షణ కోసమేనని పేర్కొంటూనే అమెరికా లాంటి దేశాలను ఢీకొట్టాలంటే అణ్వాయుధాలు సమకూర్చుకోవాల్సందేనని మరోసారి ప్రస్తావించారు. -
స్వీయ రక్షణకు శిక్షణ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినులకు స్వీయ రక్షణకు సంబంధించిన అంశాలపై మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీ వసతి గృహాల ప్రాంగణంలో ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ట్రై నింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లక్ష్మి, రవి బృందం విద్యార్థినులకు స్వీయ రక్షణ, కరాటే అంశాల్లో శిక్షణ ఇచ్చింది. విద్యార్థినుల పరీక్షల షెడ్యూల్ పరిశీలించిన తరువాత 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని విద్యార్థినుల వసతి గృహం చీఫ్ వార్డెన్ ఆచార్య ఎల్ జయశ్రీ తెలిపారు. -
ఆత్మరక్షణ కోసమే మా అణ్వాయుధాలు
తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తరకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే అణ్వాయుధాలున్న దేశాలు ఎంత బెదిరించినా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధిస్తామని తెలిపినా తాము మాత్రం వాటిని వదిలిపెట్టేది లేదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో ఈ విషయం తెలిపారు. తమ దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నీ కేవలం ఆత్మరక్షణ కోసమేనని, తమకు అమెరికా నుంచి అణ్వాయుధాల ముప్పు ఉంది కాబట్టే వీటిని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. అణ్వాయుధాలు కలిగి ఉండాలన్నది తమ దేశ విధానమని తెలిపారు. ఇతర దేశాలతో తమ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో జాతీయ భద్రత, కొరియన్ ద్వీపకల్పంలో శాంతి దృష్ట్యా తమకు ఈ ఆయుధాలు ఉండాలన్నారు. తమ అణ్వాయుధాలను రాశి, వాసి పరంగా మరింత బలోపేతం చేసుకుంటామని కూడా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో స్పష్టం చేశారు. కొరియన్ ద్వీపకల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని.. ఇక్కడ ఏ క్షణంలోనైనా అణు యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దక్షిణ కొరియా, అమెరికా కలిసి తరచు పెద్ద ఎత్తున అణ్వాయుధ విన్యాసాలు చేస్తున్నాయని, ఉత్తరకొరియా నాయకత్వాన్ని అస్థిరత పాలుచేయాలని, రాజధాని ప్యాంగ్యాంగ్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. గత సంవత్సరం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించినా వాళ్లు పట్టించుకోలేదని ఆయన అన్నారు. -
ఆత్మరక్షణలో తెలంగాణ టీడీపీ
-
మహిళా పోలీస్.. మార్షల్ ఆర్ట్స్
-
అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ
ఆత్మరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని 90 వేల మంది అమ్మాయిలకు జూడో, కరాటేలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అక్కడి మాధ్యమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఈ శిక్షణ ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇప్పించడం వెంటనే మొదలుపెట్టాలని మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణను కూడా ఒక భాగంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని నెలల క్రితమే ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునవ్వర్ అంజార్‌ను సలహాదారుగా నియమించారు. -
ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్
తాను ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీపై సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతరులు కూడా దాడి చేశారని, అప్పుడు మాత్రమే తాను వెల్ లోకి దూసుకెళ్లానని ఆయన తెలిపారు. మార్షల్స్ అదుపులోకి తీసుకుని, తిరిగి వదిలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణరక్షణ కోసం మాత్రమే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదని రాజగోపాల్ చెప్పారు. -
'అభయ'కు చేటు చేసిన చాటింగ్!
'అభయ'పై సామూహిక అత్యాచార ఘటన భాగ్యనగర వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనకు ఏమరపాటు కూడా ఒక కారణమని తెలుస్తోంది. బాధితురాలు ఏమరపాటుగా ఉండడం వల్లే దుండగులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. స్వీయరక్షణ విషయంలో 'అభయ' కాస్త అప్రమత్తంగా వ్యవహరించివుంటే కామాంధుల బారి నుంచి బయటపడేదన్న వాదన విన్పిస్తోంది. ఒక్కోసారి మన నిర్లక్ష్యమే నేరగాళ్లకు ఆయుధమవుతుంది. 'అభయ' విషయంలోనూ ఇది రుజువయింది. తన హాస్టల్‌కు వెళ్లేందుకు కిరాయి కారులో ఎక్కిన వెంటనే ఆమె సెల్‌ఫోన్ చాటింగ్‌లో మునిగిపోయింది. కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో లీనమయింది. ఆమె ఏమరపాటును దుండగులు తమకు అనువుగా మలుచుకున్నారు. కారును దారి మళ్లించి దారుణానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ చాటింగ్ నుంచి అభయ తేరుకునేటప్పటికీ ఆలస్యమైపోయింది. సెల్‌ఫోన్ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేశారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను పాడుచేశారు. అడుగడునా కీచక సంతతి పొంచివున్న కంప్యూటర్ కాలంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని 'అభయ' ఉదంతం చాటిచెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలకు బానిసలుగా మారి ఆత్మరక్షణ మర్చిపోవద్దని హెచ్చరిస్తోందీ ఘటన. చుట్టుపక్కల గమనించకుండా సెల్ఫోన్లో మునిగి తేలడం నేటి తరంలో చాలా మందికి బలహీనతగా మారడం దురదృష్టకర పరిణామం. స్వీయ రక్షణ గురించి పట్టించుకోకుండా సాంకేతి వెల్లువలో కొట్టుకుపోతుండండం ప్రమాదకర ధోరణిగా మారుతోంది. బెంగళూరులోని స్నేహితుడికి సమాచారం అందించిన 'అభయ' కనీసం పోలీసు నంబర్ 100కు సమాచారమిచ్చినా దుండగులు బరితెగించి ఉండేవారు కాదేమో. చాలా మందికి ఈ నంబర్ ఉందన్న సంగతి తెలియపోవడం శోచనీయం. నేరాల నిరోధానికి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. తనను కాటేసేందుకు చూసిన ఆటోడ్రైవర్ల కళ్లలో పెప్పర్ పౌడర్ చల్లి ఓ యువతి ఇటీవల బయటపడిన ఉదంతం మనకు గుర్తుండే వుంటుంది. ఏదేమైనా కీచకుల పశుశాంఛకు 'అభయ' బలైంది. ఆత్మరక్షణ పట్ల అతివలు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశముంది. -
ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలో శిక్షణ
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఢిల్లీలో వైద్య విద్యార్థిని నిర్భయపై జరిగిన లైంగికదాడి, హత్య నేపథ్యంలో పిల్లలను బోధనకు పంపించాలంటే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం బాలికలు కరాటేలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికలకు శిక్షణ ఇవ్వాలని సన్నాహాలు చేస్తుందని మంత్రి ప్రకటనలో స్పష్టమైంది. కాగా, జిల్లావ్యాప్తంగా 2,911 ప్రాథమిక, 412 ప్రాథమికోన్నత, 387 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలకుపైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలికలకు కరాటేలో శిక్షణ ఇవ్వాలంటే బాధ్యతను వ్యాయామ ఉపాధ్యాయులకు అప్పగించాలి. కానీ, వ్యాయామ ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. ఈ పోస్టులను భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం లేదు. లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిన కరాటే మాస్టర్లను అయినా నియమించాలి. ఏ విధంగా అమలు చేస్తుందో వేచిచూడాల్సిందే. జెడ్పీహెచ్ఎస్లలో కొంతకాలం అమలు గతంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ పాఠశాలల్లో బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించింది. అయితే ఎంపిక చేసిన 75 జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల్లో మాత్రమే అమలు చేసింది. 2012 నుంచి ఏప్రిల్ 2013 వరకు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే కరాటే దుస్తులు సరఫరా చేసింది. ప్రైవేటుగా కరాటేలో నిష్ణాతులైన మాస్టర్లను శిక్షకులుగా నియమించింది. మండలానికి ఒకరు చొప్పున నియామకం చేసింది. రోజు ఒక పాఠశాలలో కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా వారికి రూ.4 వేలు గౌరవ వేతనం ఇచ్చేవారు. అనంతరం గత ఏప్రిల్ మాసంలో కరాటే శిక్షకులను ప్రభుత్వం తొలగించింది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. కరాటేతో లాభాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజు బాలికలు, యువతులపై లైంగికదాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే బాలికలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థినులకు, ఉద్యోగానికి వెళ్లే మహిళలు ధైర్యంగా కాలు బయట పెట్టలేని దుస్థితి. ఈ క్రమంలో పాఠశాల స్థాయి నుంచి బాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంది. తమకు తాము రక్షించుకోవచ్చనే ధైర్యం ఏర్పడుతుంది. ఇంకా కరాటే సాధనతో ఆరోగ్యంతోపాటు, ఆత్మరక్షణ , జ్ఞాపకశక్తి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యం వస్తుంది. యోగాలో కూడా తర్ఫీదు ఇవ్వడంతో శరీరానికి అలసటనేది ఉండదు. చురుకుగా ఉంటారు. చదువులో కూడా రాణిస్తారు.