
తాప్సీ
‘టచ్ మీ నాట్’ ఫ్లవర్‌ని ముట్టుకుంటే ముడుచుకుంటుంది. అంత సాఫ్ట్. ఆ పువ్వులా సుకుమారమైన క్యారెక్టర్లే కాదు ఫిజికల్‌గా ఛాలెంజ్ చేసే పాత్రలను కూడా ఇష్టపడతారు తాప్సీ. క్యారెక్టర్‌లో ఒదిగిపోవడానికి ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తారామె. రీసెంట్‌గా ‘నీతిశాస్త్ర’ అనే యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారీ ఢిల్లీ బ్యూటీ. ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా స్వయంగా చేశారామె. కొన్ని నిమిషాల ఈ సీక్వెన్స్ కోసం రెండు రోజులు అలుపెరగకుండా ప్రాక్టీస్ చేశారు. ఈ సీక్వెన్స్‌లో పాల్గొనటం గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘నీతిశాస్త్ర’లో సెల్ఫ్ డిఫెన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపించాను.
నామ్ షబానా, బేబి సినిమాల్లో యాక్షన్ ఓరియంటెడ్ రోల్స్ చేయడంతో ఈ ఫైట్ సీక్వెన్స్ చేయడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మా కొరియోగ్రాఫర్ టీను సార్ ఈ సీక్వెన్స్‌ను రెండు రోజులు ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ కూడా ఇంటెన్స్‌గా జరిగేది. అతని పేషన్స్ వల్లే ప్రతీ మూవ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగాను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆ కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తోంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. వర్క్ మీద అంత డెడికేషన్ ఉండటం వల్లే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారామె. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment