
షార్ట్ ఫిలింలో స్టార్ హీరోయిన్
ఈ శుక్రవారం నామ్ షబానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఢిల్లీ భామ తాప్సీ, మరో ఇంట్రస్టింగ్ రోల్ లో కనిపించనుంది. అమ్మాయిల మీద జరుగుతున్న లైగింక దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింలో అతిథి పాత్రలో కనిపించనుంది. హైదరాబాద్ పోలీస్ సహకారంతో తెరకెక్కుతున్నీ షార్ట్ ఫిలింకు హైదరాబాద్ యునివర్సిటీ విద్యార్థిని విషీ టెక్కీ దర్శకత్వం వహిస్తోంది.
టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయం అయినా.. బాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బ్యూటి తాప్సీ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన జుమ్మంది నాధం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ తరువాత.. సౌత్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసింది. కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలు చాలా ఉన్నా.. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ కొద్ది రోజుల్లో బాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ తో కలిసి చేసిన పింక్ సినిమా తాప్సీ కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి వరకు గ్లామర్ షోకే పరిమితమైన ఈ భామ. ప్రస్తుతం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో ఆకట్టుకుంది. సినిమాలే కాదు సందేశాత్మకంగా తెరకెక్కే షార్ట్ ఫిలింస్ లోనూ నటించేందుకు రెడీ అంటోంది.