స్వీయ రక్షణకు శిక్షణ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినులకు స్వీయ రక్షణకు సంబంధించిన అంశాలపై మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీ వసతి గృహాల ప్రాంగణంలో ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ లక్ష్మి, రవి బృందం విద్యార్థినులకు స్వీయ రక్షణ, కరాటే అంశాల్లో శిక్షణ ఇచ్చింది. విద్యార్థినుల పరీక్షల షెడ్యూల్ పరిశీలించిన తరువాత 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని విద్యార్థినుల వసతి గృహం చీఫ్ వార్డెన్ ఆచార్య ఎల్ జయశ్రీ తెలిపారు.