Girl students
-
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్‌లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే
అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలు, కార్యక్రమాలు రాష్ట్రంలోని బాలికల్లో చదువుకోవాలన్న ఆలోచనను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితంగా అమ్మాయిలందరూ బడిబాట పడుతున్నారు. పాఠశాలల స్థాయిలోనే ఆగిపోకుండా కళాశాలలో సైతం అడుగు పెడుతున్నారు. మంచి ఉద్యోగమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి బాలిక కనీసం పదో తరగతి వరకు అయినా చదవాలన్న తపన, తాపత్రయంతో ప్రభుత్వం ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి పదో తరగతి అర్హత పెట్టింది. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలవడంతో తల్లిదండ్రులు సైతం బాలికల చదువుకు ఊకొడుతున్నారు. ఫలితంగా ఏడాదికేడాది పాఠశాలలు, కళాశాలల్లో వీరి చేరికలు పెరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ అండగా నిలవడంతో విద్యా రంగంలో అమ్మాయిలు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు చదువుల్లో వెనుకబడిన ఆడపిల్లలు నేడు అన్ని అడ్డంకులను అధిగమించి పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బాలికల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో యుక్త వయసు రాక ముందే ఆడ పిల్లల పెళ్లిళ్లపై దృష్టి సారించే తల్లిదండ్రులు.. నేడు ఆ ఆలోచనను వాయిదా వేసి, వారి చదువులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఆడపిల్లల చేరికలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఏన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్), ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదికల్లోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. బాలికల చేరికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత అధికమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపిస్తున్నారు. పాఠశాల స్థాయి అనంతరం.. ఇంటర్మీడియెట్ చదవులకు వీలుగా బాలికల కోసం ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఉన్నత కోర్సుల్లో చేరే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. విద్యకు సంబంధించిన భారమంతా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఆడపిల్లల చేరికలు బాగా పెరిగాయి. ఏటా పెరుగుదల రాష్ట్రంలో 2020–21లో టెన్త్‌లో 3,19,193 మంది బాలికలు ఉండగా, 2021–22లో వారిలో 2,37,530 (75 శాతం) మంది ఇంటర్లో చేరారు. అంతకు ముందు ఏడాది.. అంటే 2019–20లో టెన్త్‌లో 3,20,227 మంది ఉండగా, అందులో 2,24,943 (70 శాతం) మంది 2020–21లో ఇంటర్లో చేరినట్లు యూడైస్ గణాంకాలు వివరిస్తున్నాయి. ఏటేటా బాలికల చేరికల శాతం పెరుగుతోందనేందుకు ఈ గణాంకాలే తార్కాణం. ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయి సాధిస్తున్నారు. 2022 ఇంటర్ ఫలితాల్లో 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా బాలురు 32 శాతమే ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో బాలికల చేరికలు మరింత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బాలికల జీఈఆర్ పెరుగుదల 2.28 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో 11.03 శాతానికి పెరిగిందని ఐష్ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా తగ్గిన డ్రాపవుట్లు గతంలో దేశ వ్యాప్తంగా చాలా కాలంగా 7 లేదా 8వ తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపవుట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో క్రమేణా ఆ పరిస్థితి మారుతోంది. 14–16 వయసు బాలికలు బడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయే వారి శాతం 2018 నాటికి 13.5 శాతం వరకు ఉన్నట్లు అసర్ గత నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ శాతం 7.9 శాతానికి తగ్గినట్లు 2022 నివేదిక పేర్కొంది. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో బడులకు వెళ్లని వారి శాతం 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఇంటర్లో పెరిగిన చేరికలు గతంలో టెన్త్ తర్వాత బాలికల చదువు ముందుకు సాగడానికి చాలా సమస్యలు ఉండేవి. అయితే కాలేజీల అందుబాటు, వివిధ వనరుల కల్పనతో భద్రతాపరమైన చర్యలు పెరగడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను కాలేజీల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడంతో హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్ స్థాయిల్లోనూ బాలికల చేరికలు బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విడుదల చేసే దేశ వ్యాప్త గణాంకాల ప్రకారం 2021–22లో పదో తరగతిలో 89,66,648 మంది బాలికలు ఉండగా.. ఇందులో ఇంటర్లో 73,36,609 (82 శాతం) మంది చేరారు. 2020–21 గణాంకాల ప్రకారం టెన్త్‌లో 91,64,940 మంది ఉండగా, వారిలో ఇంటర్లో 65,80,132 (72 శాతం) మంది చేరారు. అంటే పది శాతం మేర బాలికల చేరికలు పెరిగినట్లు యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ – యూడైస్+ (యూడీఐఎస్+) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్యలోనూ బాలికల పెరుగుదల ► ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువుల్లోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఐష్ పేర్కొంది. 2020–21 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నత చదువుల్లో చేరికలు 2019–20లో 3.85 కోట్లు ఉండగా, 2020–21లో అది 4.13 కోట్లకు చేరినట్లు తెలిపింది. అంటే 28.80 లక్షల మంది పెరిగారు. ► 2018–19లో 2.7 శాతం ఉండగా, 2019–20లో 3 శాతం మేర, 2020–21లో 7.4 శాతం మేర పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. వీరిలో బాలికల చేరికలు 2019–20లో 1.89 కోట్లు కాగా, 2020–21లో 1.96 కోట్లుగా ఉంది. 2021–22, 2022–23 అధికారిక గణాంకాలు ఖరారైతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ► ఏపీ విషయానికి వస్తే యూడైస్ గణాంకాల ప్రకారం 2018–19లో టెన్త్ బాలికల్లో 70 శాతం మంది ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో అమ్మ ఒడి తదితర కార్యక్రమాలతో 78 శాతం మంది ఇంటర్లో చేరారు. ► 2020–21లో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో చేరికలు 70 శాతంగా ఉన్నా, మళ్లీ 2021–22 నాటికి బాలికల చేరికల శాతం 75 శాతానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇంటర్లో బాలికల చేరికలు 2021–22లో ఏపీలో 75 శాతంగా ఉండగా బీహార్‌లో 56 శాతం, కర్ణాటకలో 73 శాతం, తెలంగాణలో 74 శాతంగా ఉన్నాయి. -
బడి నుంచి మృత్యు ఒడికి...
ప్యాపిలి(నంద్యాల): మరో ఐదు నిమిషాల్లో బడి నుంచి తమ ఇళ్లకు చేరుకోవాల్సిన ఇద్దరు పిల్లలు... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా కొట్టడంతో మృత్యుఒడికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు ఒక్కసారిగా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండటం సహచర విద్యార్థులను కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్ల వద్ద శనివారం జరిగింది. రాచర్ల ఉన్నత పాఠశాలలో నేరేడుచెర్ల గ్రామానికి చెందిన శివమ్మ, రంగన్న దంపతుల కుమార్తె రజని(15) పదో తరగతి, ఐరా, మదార్ దంపతుల కుమార్తె షాహిదాబి(13) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన మరో 18 మంది విద్యార్థులు కూడా రాచర్ల ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ప్రతి రోజు ఉదయం ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటారు. యథావిధిగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలో నేరేడుచెర్లకు బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న ఆటో గ్రామ శివారులో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటో డోర్ వైపు కూర్చున్న రజని, షాహిదాబి ఎగిరి రోడ్డుపై పడగా, వారి మీద ఆటో పడటంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల రోదనలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. రాచర్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సొంత ఆటోలో వస్తూనే.. ప్రమాదంలో మృతిచెందిన షాహిదాబి తండ్రి మదార్‌కు టాటా మ్యాజిక్ ఆటో ఉంది. ప్రతి రోజు సాయంత్రం మదార్ రాచర్ల ఉన్నత పాఠశాలకు వెళ్లి తన కుమార్తెతోపాటు మిగిలిన విద్యార్థినులను ఆటోలో ఎక్కించుకుని నేరేడుచెర్లకు తీసుకువచ్చేవాడు. అయితే, మదార్‌కు శనివారం వ్యక్తిగత పని ఉండటంతో వెళ్లలేదు. తమ గ్రామానికే చెందిన శివ అనే డ్రైవర్‌ను పంపాడు. అతను వేగంగా నడపడం వల్లే ఆటో బోల్తా పడి షాహిదాబి, రజని మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
Vizag Students: ఆ నలుగురు తిరిగొచ్చారు..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘మా కోసం వెతక్కండి.. మేము మా కాళ్ల మీద బతకాలని దూరంగా వెళ్లిపోతున్నాం.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.. మా బతుకు కోసం వెళ్తున్నాం.. అలా అని అబ్బాయిలతో వెళ్తున్నాం అని ఎక్కువగా అనేసుకోకండి. కేవలం మేము పైకి ఎదగడానికి మాత్రమే వెళ్తున్నాం. మమ్మల్ని వెతక్కండి. మేము ఎక్కడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మేము మంచి పొజిషన్‌కు వచ్చాక మేమే మీ దగ్గరకు వస్తాం..’అంటూ ఓ లేఖ రాసి నలుగురు పదో తరగతి విద్యార్థినులు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఆ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి.. నగరమంతా గాలించారు. చివరకు గాజువాకలో నలుగురు బాలికలను గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు బాలికలు బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు. చదవండి: (Vizag: మా కోసం వెతకొద్దు.. నలుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్..) యూనిఫాం మార్చుకుని, సివిల్ డ్రెస్‌లో ట్యూషన్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నలుగురూ కలిసి వెళ్లిపోయారు. ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు రాత్రి 10 గంటలు దాటినా ఇళ్లకు చేరుకోకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ దృష్టికి వెళ్లింది. వెంటనే సీపీ స్పందించి ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా పోలీసులను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ వెళ్లిన నలుగురు విద్యార్థినులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీని ఆధారంగా వివరాలు సేకరించారు. మరో వైపు ఆ నలుగురి బాలికల ఫొటోలను వలంటీర్ల గ్రూపులో పెట్టారు. బాలికలు నలుగురూ గురువారం మధ్యాహ్నం గాజువాకలో ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు అమ్మి, వచ్చిన డబ్బులతో ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నారు. వివిధ వాట్సప్ గ్రూపుల్లో వారి ఫొటోలను గమనించిన ఆ దుకాణ యజమాని.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి విద్యార్థినులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
Vizag: మా కోసం వెతకొద్దు.. నలుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నలుగురు పదో తరగతి విద్యార్థినులు అదృశమయ్యారు. వన్‌టౌన్ సమీపంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ స్కూల్లో వీరంతా చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ పూర్తయిన తర్వాత ట్యూషన్‌కి వెళ్తాం అని చెప్పి.. తిరిగి కనిపించలేదు. కుటుంబ సభ్యులు రాత్రి అంతా గాలించారు. చివరికి గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అదృశ్యమైన నలుగురు విద్యార్థులు తమ గురించి వెతకవద్దని లేఖను కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి రాశారు. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఉంటారనే వాదన వినిపిస్తుంది. విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ, రేణుక, హన్సిక, యమున అనే ఈ నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ -
లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం
కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌తో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. హెచ్ఎంలకు అవగాహన బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్ లైన్ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్ హెల్ప్ లైన్ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్ హెల్ప్ లైన్ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి ప్రవర్తనలో ఆకస్మిక మార్పు ఇతరుల నుంచి దూరంగా ఉండటం శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు భయపడుతూ ఉండటం ఆహారం, నిద్రలో మార్పులు బాలికలకు బోధించాల్సినవి మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫోన్ చేయండి - కెఎల్ఎస్.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం. – డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు -
స్మార్ట్ సృజన
ఆ చిట్టి బుర్రలు సృజనకు స్మార్ట్‌గా పదునుపెట్టాయి. అద్భుత ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. అందరిచేత ఔరా అనిపించాయి. నిపుణులనూ అబ్బురపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటాయి. గుంటూరు జిల్లా కీర్తి పతాకను రెపరెపలాడించాయి. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలో జిల్లా విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వినూత్న ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. గత నెల 31, ఈనెల ఒకటో తేదీన విజయవాడలోని లయోలా కళాశాలలో ఇన్స్పైర్ మనక్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఆన్లైన్ మూల్యాంకనంలో భాగంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 331 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. వీటికి ముగ్దులైన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు జాతీయస్థాయికి 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిలో గుంటూరు జిల్లా నుంచి మూడు నమూనాలు ఉన్నాయి. ఎంపికైన మూడు ప్రాజెక్టులూ ఒకే పాఠశాలకు చెందిన విద్యార్ధినులు రూపొందించినవి కావడం విశేషం. మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్‌కు చెందిన జయశ్రీ, తేజశ్రీ, వర్గీస్ రూపొందించిన మూడు ప్రాజెక్టులు న్యాయ నిర్ణేతలను అమితంగా ఆకట్టుకున్నాయి. గైడ్ టీచర్ బండారు టైటస్ పర్యవేక్షణలో వీరు ప్రాజెక్టులను రూపొందించారు. వీరు త్వరలో జాతీయస్థాయిలో జరిగే ప్రదర్శనకు హాజరు కానున్నారు. – గుంటూరు ఎడ్యుకేషన్ ప్రతిభే ‘బ్యాగ్’బోన్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ స్కూల్‌బ్యాగ్ విద్యార్థిని పేరు: బిట్రా జయశ్రీ, 8వ తరగతి స్మార్ట్ స్కూల్ బ్యాగ్‌ను అత్యద్భుతంగా రూపొందించి ఔరా అనిపించింది. బిట్రా జయశ్రీ. ఈ బ్యాగ్ ద్వారా ఎంత బరువు పుస్తకాలను మోస్తున్నదీ తెలుసుకోవచ్చు. ఎక్కువ పుస్తకాలను మోయడం కష్టమనిపిస్తే దీనిని ట్రాలీగా మార్చుకోవచ్చు. బ్యాగ్‌లోనే మాస్క్, శానిటైజర్ ఉంచుకోవచ్చు. వర్షం వస్తే ఆటోమేటిక్‌గా గొడుగు తెరుచుకునేలా సెన్సార్ల అమరిక ఉంది. దీనివల్ల విద్యార్థి పొరపాటుగా తప్పిపోయినా, దుండగులు అపహరించుకుని వెళ్లినా జీపీఎస్ ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. బ్యాగులో ఉన్న పుస్తకాలను దొంగిలించే యత్నం చేసినా వెంటనే పసిగట్టే వీలుంది. ఔరా సౌర ఊయల ప్రాజెక్టు పేరు: సోలార్ స్మార్ట్ ఊయల విద్యార్థిని పేరు: బేగ్ వర్గీస్, 8వ తరగతి చంటిపిల్లల కోసం చక్కటి ఊయలను తీర్చిదిద్దింది బేగ్ వర్గీస్. ఇది సౌర శక్తితో పనిచేస్తుంది. ఊయలకు మోటర్‌ను అమర్చడం ద్వారా సోలార్ మాడ్యూల్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌శక్తి ద్వారా ఇది ఊగుతుంటుంది. ఊయలకు ఫ్యాన్నూ అమర్చుకోవచ్చు. పిల్లలను ఆస్పత్రుల్లో ఉంచినప్పుడు సెలైన్ అయిపోయినా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు పిల్లలను ఎత్తుకువెళ్లే యత్నం చేసినా సైరన్ మోగుతుంది. భళా సైకిల్ ప్రాజెక్టు పేరు: స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్ విద్యార్థిని పేరు: మాచర్ల తేజశ్రీ, 9వ తరగతి సౌరశక్తితో పని చేసే స్మార్ట్ ఫోల్డబుల్ ఈ–సైకిల్‌ను ఆవిష్కరించి భళా అనిపించింది. మాచర్ల తేజశ్రీ. దీనిని పాఠశాలకు వెళ్లేందుకు, ఇతర పనులకు ఉపయోగించవచ్చు. ఫోల్డ్ చేసి ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యవసాయ పనుల్లో భాగంగా పంటకు నీరు పెట్టడం, విత్తనాలు నాటేందుకు ఉపయోగించొచ్చు. రైతులు, మహిళలు, వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం
సాక్షి, రంగారెడ్డి: ఐదు రోజుల క్రితం మంచాల కేజీబీవీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైందని మంచాల ఎస్సై రామన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న సమ్రీన్(14), 8వ తరగతి చదువుతున్న నుస్రాత్(13) పారిపోయారు. ఇందులో నుస్రాత్‌ను మంగళవారం శంషాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో గుర్తించినట్లు వెల్లడించారు. సమ్రీన్ ఆచూకీ లభించలేదని నల్గొండలోని వారి బంధువులకు ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం లభించిందన్నారు. చదవండి: ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి.. -
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
‘స్వేచ్ఛ’గా చదువుదాం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. అపోహలు తొలగిస్తూ.. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్కిన్స్ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్ సప్లయి, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ లేకపోవడమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి -
ఇక్కడ ఆడుతూ.. పాడుతూ..పాఠాలు నేర్పుతారు
విజయనగరం అర్బన్: అనాథ, నిరుపేద బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో వినూత్న బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు వీలుగా ఆటపాటలతో, విజ్ఞానదాయక అంశాలపై దృష్టిసారించారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఇటీవలే వారి డైట్ చార్జీలను కూడా పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా విద్యార్థినులకు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థినులకు ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల్లో బోధన అందిస్తోంది. విద్యార్థినులకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో, ఇతర కళాంశాల్లో రాణించేలా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల ఒకప్పుడు 80 శాతం దాటని ఉత్తీర్ణత మూడేళ్లుగా పెరుగుతూ రావడం విశేషం. పదోతరగతిలో 2017–18 లో 96.7 శాతం, 2018–19లో 97.56 శాతం, గత ఏడాది శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. దశలవారీగా విస్తరణ జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. అన్ని వర్గాలకు చెందిన నిరుపేద, అనాథ బాలికలు 8,206 మంది అందులో విద్యాబోధన పొందుతున్నారు. 6 నుంచి 10 వరకు తరగతుల నిర్వహణతోపాటు గతేడాది నుంచి ఇంటర్ తరగతులు కూడా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడే అవాసం కల్పిస్తున్నారు. నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కరోనా అనంతరం పునఃప్రారంభమైనా ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయిస్తూ వాటి వ్యాప్తిని నిరోధించింది. వసతి గృహాల్లోని భోజన సౌకర్యం మెరుగుపర్చి, డైట్ చార్జీలను రూ.1,400కు పెంచింది. మోనూలో కూడా పలు మార్పులు చేసింది. రోజుకో రకమైన పదార్థాలతో సరికొత్త మెనూ రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచినవెంటనే ప్రీ బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, శాకాహారులకు కాయగూరలు అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడుగుడ్లు, అన్నం, రోజకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు నిరుపేద, అనాథ బాలికల విద్యాబోధన కోసం నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒత్తిడి లేని బోధన, అభ్యసనాలను అమలు చేస్తున్నాం. ఈ నేపధ్యంలోనే టెన్త్ ఫలితాలు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలోని 33 కేజీబీవీల్లో 8,206 మంది బాలికలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. – జె.విజయలక్ష్మి, ఏపీసీ, ఎస్ఎస్ఏ ( చదవండి: క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్ ) -
కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్డౌన్ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. వివరాలు.. నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్లైన్ క్లాస్‌ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్‌ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష -
విద్యార్థినిపై అధ్యాపకుల అనుచిత ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: ఈవెంట్ పేరిట ఇంటికి పిలిపించుకొని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన ఓ విద్యార్థిని ఫైనలియర్ చదువుతోంది. జనవరి 24న ఈవెంట్ ఉందని చెప్పడంతో ఆమె తన సోదరుడిని తీసుకొని మాదాపూర్ చందానాయక్ తండాలోని వైస్ ప్రిన్సిపాల్ కల్యాణ్ వర్మ ఇంటికి వచ్చింది. సోదరుడు బయటే ఉండగా విద్యార్థిని ఇంట్లోకి వెళ్లింది. కల్యాణ్ లోపలికి పిలిచి ఆమెపై చేయివేసి అనుచితంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వెళ్తుండగా హెచ్‌వోడీ రవీందర్ మెయిన్‌డోర్‌ను మూసేసి విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇద్దరినీ ప్రతిఘటించి తలుపులు తీసుకొని బయటకు పరుగుతీసింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా విద్యార్థిని కుటుంబీకులతో నిందితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 9న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం గాలిస్తున్నామని మాదాపూర్ సీఐ చెప్పారు. విద్యార్థి సంఘాల ఆందోళన కల్యాణ్ శర్మ, రవీందర్‌లపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాల డైరెక్టర్ వాణి ఒక మహిళ అయ్యుండి బాధితురాలి పక్షాన మాట్లాడకుండా బేరసారాలకు దిగారని ఆరోపించారు. ఆమెను ఘెరావ్ చేశారు. -
రన్నింగ్ బస్సులోనుంచి దూకిన యువతులు
లక్నో : యువకుల ఎగతాళి మాటలతో భయాందోళనకు గురైన ఇద్దరు కాలేజీ విద్యార్ధినులు రన్నింగ్‌లో ఉన్న బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రన్‌హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనకాల సీట్లలో యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు. ( ఆమె అలా చేస్తే అత్యాచారం తప్పేది!) దానికి తోడు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ‘‘ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు! భలే సరదా ఉంటుంది’’ అనటం ప్రారంభించారు. దీంతో భయాందోళనకు గురైన యువతులు మరోసారి డ్రైవర్‌ను ప్రాథేయపడుతున్నట్లు అడిగారు. అతడు ఒప్పుకోలేదు. ఆ యువకులు కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్ధినులు ఒకరి తర్వాత ఒకరు బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్ సదరు యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది. ( 'దొంగ' పనిమనిషి అరెస్ట్ ) -
ఫస్ట్ క్లాస్‌లో పాసైతే స్కూటీ.. ప్రతీ రోజు రూ. 100
గువహటి : అస్సాం ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూల్లో చదివే విద్యార్థినులకు ఆర్థిక సహాయం చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థినికి ప్రతీ రోజు స్కూలుకు వెళితే రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వనుంది. ఆదివారం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, ఆపై చదువులు చదివే విద్యార్థినులు పుస్తకాలు కొనుక్కోవటానికి గానూ మూడు వేల రూపాయలు ఇవ్వనున్నామని, జనవరి చివరల్లో ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. (చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం) గత సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నప్పటికి కరోనా వైరస్ కారణంగా చేయలేకపోయామని అన్నారు. అంతేకాకుండా స్కూళ్లతో పాటు కాలేజీలలో చదివే విద్యార్థినులకు కూడా నగదు సహాయం చేస్తామని చెప్పారు. 2019 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం 144.30 కోట్లు ఖర్చు చేస్తోందని, 22,245 మంది విద్యార్థినులు ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారని వెల్లడించారు. -
తండ్రి ఇబ్బందులను అధిగమించే ఆలోచన
సాక్షి, నల్లగొండ : ఆ విద్యార్థిని తన తండ్రి పడుతున్న ఇబ్బంది తొలగించేందుకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ ఆలోచన చేసింది. ఈ ఆలోచనను రాష్ట్రస్థాయికి పంపగా.. నచ్చడంతో దానికి సంబంధించి ప్రాజెక్టు తయారు చేసేందుకు ఇంక్విలాబ్ ఫౌండేషన్.. తమ ప్రతినిధులు అశోక్, షమీర్‌ను నల్లగొండకు పంపింది. వారి సూచనల మేరకు జిల్లా సైన్స్ అధికారి, గైడ్ టీచర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టును తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు ఎంపికైంది. రాష్ట్రంనుంచి మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో నల్లగొండ బాలికల పాఠశాల విద్యార్థిని తయారు చేసిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ ప్రాజెక్టు ఒకటి. ఆ ప్రాజెక్టు ఖర్చు ఇంక్విలాబ్ ఫౌండేషనే భరించనుంది. ఈ ప్రాజెక్టును 19వ తేదీన వీడియో క్లిప్ ద్వారా ఆన్లైన్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లానుంచి 370 ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో విద్యార్థుల్లో కలిగే ఆలోచనల మేరకు ప్రాజెక్టుల తయారీకి ఏటా ప్రతిపాదనలు కోరుతోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి విద్యార్థులు వారి ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఆలోచనను మాత్రమే స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తగా వచ్చే ఆలోచనలు పంపించాలని కోరగా నల్లగొండ నుంచి 280 పాఠశాల నుంచి 370 ఆలోచనలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపించారు. తండ్రి పడుతున్న సమస్యతో వచ్చిన ఆలోచన.. నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బషీరా తన తండ్రి పక్షవాతం కారణంగా కాలు చేయి పని చేయని పరిస్థితి. దానివల్ల తండ్రి ఇంట్లో ఏమీ తన సొంతంగా చేసుకోలేకపోయేవాడు. దీని పరిష్కారానికి ఆ బాలికకు ఓ ఆలోచన వచ్చింది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ చైర్ వీల్ చైర్‌తో బటన్ నొక్కితే చైర్ ఎత్తులోకి లేవడం పైన ఉన్న వస్తువులను అందుకోవడం, వీల్‌చైర్‌తో ఇంట్లో సొంతంగా తిరగ గలగడం, తన పనులు తానే చేసుకోగలుగుతాడని ఆ బాలిక భావించి తన ఆలోచనను పాఠశాలలోని గైడ్ టీచర్ పూర్ణిమకు చెప్పింది. ఆమె వెంటనే ముగ్గురిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తయారు చేసి ఆ ఆలోచన వీడియో రూపంలో రాష్ట్రస్థాయికి పంపారు. అయితే రాష్ట్రంలో 7,093 ఐడియాలు వివిధ సమస్యలపై వచ్చాయి. రౌండ్ల వారీగా ఎంపిక చేయగా.. చివరకు 25 ప్రాజెక్టులను మూడో రౌండ్లో ఎంపిక చేశారు. ఈ 25లో నల్లగొండ విద్యార్థిని ప్రాజెక్టు ఉండడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. 25 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ నమూనా రాష్ట్రస్థాయికి ఎంపిక సంతోషకరం నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినికి వచ్చిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ ఆలోచన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రస్థాయికి 7 వేల పైచిలకు ప్రాజెక్టులు పంపితే అందులో 25 ఎంపిక చేస్తే అందులో జిల్లా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థిని, సైన్స్ అధికారి, గైడ్ టీచర్‌కు అభినందనలు. – భిక్షపతి, డీఈఓ -
మందు పార్టీ.. విద్యార్ధినులు సస్పెండ్
-
వీడియో వైరల్.. విద్యార్థినుల బహిష్కరణ
చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఓ కాలేజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. కాలేజ్ నుంచి వారిని బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు విద్యార్థినులు, వారి స్నేహితులతో కలిసి ఆరు వారాల కిందట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అబ్బాయిలతో పాటు వారు కూడా మద్యం సేవించారు. విద్యార్థినులు బీర్ తాగుతున్న దృశ్యాలను అందులోని ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం డిసెంబర్ 24వ తేదీన కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్ ప్రిన్సిపల్.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్‌కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు అంతకన్నా తక్కువగా ఉంది. -
బాలికలదే హవా..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,398 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6127 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం గా 65.19 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2995 మంది పరీక్షలు రాయగా 1740 మంది, బాలికలు 4370 మంది పరీక్షలకు హాజరు కాగా 2849 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 873 మంది బాలురకు గాను 575 మంది, బాలికలు 1160 మందికి 963 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో మొత్తం 9489 మంది విద్యార్థులు హాజరు కాగా 5859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 61.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో జనరల్ విభా గంలో బాలురు 2959 మందికి 1643 మంది ఉత్తీ ర్ణులయ్యారు. బాలికలలో 4462 మందికి 2923 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 919 బాలురకు 490 మంది, బాలికలలో 1149 మం దికి 803 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో గత సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 70.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసంవత్సరం 65.19 శాతానికి తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 73 కళాశాలలు ఉండగా, వీటిలో 14 ప్రభుత్వ, 9 గిరిజన సంక్షేమ, 5 సాంఘిక సంక్షేమ, 3 కస్తూర్బా, ఒక టీఎస్ఆర్జేసీ, 41 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. అయితే కళాశాలల వారీగా ఫలితాలు ఇంకా తెలియలేదని ఇంటర్ నోడల్ అధికారి ఎస్డి జహీర్అహ్మద్ తెలిపారు. -
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
క్లాస్‌రూమ్‌లోనే నాలుగు రోజుల నరకం..
కోల్‌కతా: కథువా ఉదంతంతో దేశ వ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే తరగతి గదిలో కీచకపర్వం కొనసాగించాడు. ఇద్దరు విద్యార్థినులపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని దినాజ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌లోని పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థిని స్కూలు పేరు చెబితే భయపడుతోంది. వెళ్లనని మొండికేస్తోంది. దీంతో తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని ఏమైందని అడగగా.. తమ టీచర్ చేసే ఆకృత్యాలను బాలిక చెప్పింది. మరో బాలికను కూడా సార్ ఇలాగే చేశాడని చెప్పగా.. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఆవేశానికి లోనైన బాలికల తండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తరగతి గదిలో లైంగిక దాడులు చేస్తున్న టీచర్‌ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. విద్యార్థులందరూ వెళ్లిపోయాక క్లాస్‌రూమ్‌లో తమపై అత్యాచారం చేసేవాడని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత బాలికలు చెప్పారు. నాలుగు రోజులపాటు తమ కూతుళ్లపై కీచకపర్వం కొనసాగించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
88 మంది బాలికలను వివస్త్రలుగా మార్చి.. పనిష్మెంట్!
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పనిష్మెంట్ పేరిట తోటి విద్యార్థినుల ముందు 88మంది బాలికలతో బలవంతంగా దుస్తులు విప్పించారు ముగ్గురు ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఓ కాగితంలో అసభ్య వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ.. టీచర్లు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పాపుమ్ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 23న ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరో, ఏడో తరగతికి చెందిన 88మంది బాలికలను ఇలా అవమానించారు. ఈ నెల 27న బాధిత విద్యార్థినులు ఆల్ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్‌ఎస్‌యూ)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్‌ఎస్‌యూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఓ విద్యార్థిని, ప్రధానోపాధ్యాయుడి పట్ల అసభ్య వ్యాఖ్యలు రాసి ఉన్న కాగితం దొరకడంతో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఒక జూనియర్ టీచర్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థినుల ముందు 88 మంది బాలికలతో దుస్తులు విప్పించి.. అవమానపరిచారు. ఈ ఘటనపై అరుణచాల్ప్రదేశ్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమ్మాయిల దుస్తులపై ఆంక్షల్లేవు: బీహెచ్‌యూ
సాక్షి, న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్‌గా నియమితులైన రోయనా సింగ్ విద్యార్థినుల స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్‌పై అమ్మాయిలకు ఎలాంటి నియంత్రణలు ఉండవని తేల్చిచెప్పారు. క్యాంపస్ మెస్‌ల్లో మాంసాహారంపై నిషేధాన్ని తోసిపుచ్చారు. ‘నేను యూరప్‌లో పుట్టా... తరచూ యూరప్, కెనడాలను సందర్శిస్తా విద్యార్థినుల వేషధారణపై నియంత్రణలు విధిస్తే నాపై నేను విధించుకున్నట్టే’ అని రోయనా సింగ్ అన్నారు. తమకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోలేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముందని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అబ్బాయిల కామెంట్లను నిరసిస్తూ.. అమ్మాయిలు వారికి సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వారికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు. బెనారస్ యూనివర్సిటీ ఎన్నడూ అమ్మాయిలపై నియంత్రణలు విధించలేదని, భవిష్యత్‌లోనూ విధించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడున్న అమ్మాయిలంతా 18 ఏళ్లు పైబడిన వారేనని, వారిలో అసలు ఈ ఆలోచనలను ఎందుకు రేకెత్తించాలని అన్నారు. వర్సిటీలో ఈవ్‌టీజింగ్, రౌడీయిజం వంటి అవలక్షణాలను పారదోలేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. క్యాంపస్ అంతటా సీసీ టీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు.