కీచక ప్రొఫెసర్ పీచమణిచారు | Girl Students Beating Up Professor For Sending Obscene Messages In Patiala | Sakshi
Sakshi News home page

కీచక ప్రొఫెసర్‌ తాట తీశారు

Published Mon, May 7 2018 10:00 AM | Last Updated on Mon, May 7 2018 10:04 AM

Girl Students Beating Up Professor For Sending Obscene Messages In Patiala - Sakshi

పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్‌ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు.

దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అయింది. కాగా ఆ ప్రొఫెసర్‌ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement