patiala
-
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం
గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్‌లోని టీ పాయింట్ హోటల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. అయితే హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్‌రాజ్ గిల్ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్‌లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. -
గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..
చండీగఢ్: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని పర్మీందర్ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు..మమ్మల్ని చూసి: సిద్ధూ
చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.. పాటియాలలోని తన ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చాడని వెల్లడించారు. పని మనిషి అతడ్ని చూసి తనను అప్రమత్తం చేశాడని చెప్పుకొచ్చారు. టెర్రస్‌పైకి వచ్చిన ఆగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధూ పేర్కొన్నారు. తాము బయటకు వెళ్లి చూడగానే అనుమానిత వ్యక్తి పక్కింటిపైకి దూకి పారిపోయాడని వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped. Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has… — Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023 ఈ విషయాన్ని వెంటనే పాటియాల ఎస్ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానని, పంజాబ్ డీజీపీతో కూడా మాట్లాడానని సిద్ధూ చెప్పారు. అనంతరం ఎస్ఎస్పీ వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అనుమానిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు సిద్ధు కాంగ్రెస్ నేతలతో ఇంట్లోనే సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాటియాల మాజీ ఎంపీ ధర్మవీర గాంధీ, ఇతర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పని పనిషి ఆగంతకుడ్ని చూసిన విషయాన్ని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పారని గాంధీ వివరించారు. తాము వెంటనే బయటకు వెళ్లి చూడగా.. అతడు పక్కింటిపైకి దూకి పారిపోయాడని తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
సత్ప్రవర్తనతో రెండు నెలల ముందే... సిద్ధూ విడుదల
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది. -
పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఛండీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల కిందటి నాటి ఓ కేసులో.. కిందటిఏడాది ఆయనకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటియాలా జైలు నుంచి బయటకు రాగానే తాను మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు. వాస్తవానికి ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది శిక్ష విధించింది సుప్రీం కోర్టు. దాని ప్రకారం మే నెలలో ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ, శిక్షాకాలంలో సత్ప్రవర్తన కారణంగానే ఆయన ముందుగా విడుదల అవుతున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆదివారాలు పోనూ, సత్ప్రవర్తన కింద 48 రోజుల్ని మినహాయించి.. ముందుగానే సిద్ధూను రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని సిద్ధూ న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ కూడా ధృవీకరించారు. Will address the media outside patiala jail around noon.. — Navjot Singh Sidhu (@sherryontopp) April 1, 2023 1988, డిసెంబర్ 27వ తేదీన పాటియాలలో పార్కింగ్ విషయంలో జరిగిన ఓ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్సంధూలు.. ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాధితుడు 65 ఏళ్ల గురునమ్ సింగ్ మరుసటిరోజు కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. సిద్ధూ, గురునమ్ తలపై బలంగా కొట్టాడని, ఆ గాయం కారణంగానే అతను చనిపోయాడని బాధిత కుటుంబం వాదించింది. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే.. 2018లో సుప్రీం కోర్టు సిద్ధూ నేరాన్ని సాధారణమైందిగా ప్రకటిస్తూ.. వెయ్యి రూపాయల జరిమానా విధించింది. చివరకు బాధిత కుటుంబం మరోసారి కోర్టును ఆశ్రయించడంతో కిందటి ఏడాది తీర్పును సమీక్షించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో.. నేర తీవ్రత దృష్ట్యా సిద్ధూకి జైలు శిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డ కోర్టు, ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. Telangana: కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన -
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు..చివరికి ఏమైందంటే?
చండీగఢ్: పంజాబ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతం నుంచి అతడి ప్రయాణం మొదలవ్వగా.. మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. తనకు ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు అతని ఇంతటి సాహసానికి పూనుకున్నాడు. అయితే చివరికి బాలుడి కోరిక తీరనే లేదు. ఎంతో అభిమానం, ఆశతో కలవాలనుకున్న యూట్యూబ్ స్టార్ విదేశాలకు వెళ్లాడని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వివరాలు.. పటియాలాకు చెందిన 13ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్ మల్హన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ‘ట్రిగ్గర్డ్ ఇన్సాన్’ యూట్యూబ్ ఛానల్ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. బాలుడు కూడా అతన్ని అతను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్ నిర్వాహకుడు నిష్చాయ్ మల్హాన్‌ను కలవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్న విద్యార్థి తన సైకిల్‌పై అక్టోబర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు. చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం మూడు రోజులు 250 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. అయితే మల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లినట్లు చెప్పడంతో అతను తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక సోషల్ మీడియాను ఉపయోగించి బాలుడి గురించి ప్రచారం చేశారు. చివరికి యూట్యూబర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్‌ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా బాలుడు విషయం యూట్యూబ్ స్టార్ వరకు చేరింది. ముందుగా విద్యార్థి కనిపించకుండా పోయాడని తెలిసి ఆందోళన చెందిన మల్హాన్ పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవాలని పోలీసులను కోరాడు. అనంతరం విద్యార్థి దొరికిన సంగతి తెలిసి..‘హమ్మయ్యా ఎట్టకేలకు బాలుడు తన ఇంటికి చేరాడు. మంచి విషయం’ అంటూ ట్వీట్ చేశాడు. This is serious, if anybody has any information, please contact the police or the undersigned. I'm not in Delhi and travelling in Dubai, without network, will keep posted about this however much I can. https://t.co/BllLoZEubM — Nischay Malhan (@TriggeredInsaan) October 7, 2022 -
ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్‌కు అనుమతిస్తారా?
పటియాలా: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూను పటియాలా సెంట్రల్ జైలు నుంచి రాజేంద్ర ఆసుపత్రికి అధికారులు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జైల్లో సిద్ధూకు స్పెషల్ డైట్ కావాలని ఆయన తరపు లాయర్ కోర్టులో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే వైద్యుల బోర్డు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎలాంటి ఎటువంటి ప్రత్యేక ఆహారం అవసరమో బోర్డు నిర్ణయించనుంది. అనంతరం సంబంధిత నివేదికను స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పిస్తుంది. 1988 నాటి రోడ్ర్యాడ్ కేసులో ఏడాది జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. గత శుక్రవారం పటియాలా కోర్టులో సిద్ధూ లొంగిపోయారు. చదవండి: జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ
పటియాలా: కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూని పటియాలా జైల్లో బారక్ నంబర్–10లో ఉంచారు. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురితో కలిసి రాత్రంతా ఆయన గడిపారు. శుక్రవారం రాత్రి జైల్లో సిద్ధూ అసహనంగానే గడిపినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా తినలేదు. తినేసి వచ్చానని చెప్పి, కొన్ని మందులు వేసుకున్నారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదు. ప్రత్యేకంగా భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు. జైలు వైద్యులు సిద్ధూ అనారోగ్యాన్ని గుర్తించి అంగీకరిస్తే ఆయన భోజనం జైలు క్యాంటిన్ నుంచి తెప్పించుకోవచ్చునని లేదంటే స్వయంగా వంట చేసుకునే అవకాశం కూడా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉండడం విశేషం. సిద్ధూకి రెండు సెట్లు తెల్ల రంగు పైజామాలు, ఒక చైర్, టేబుల్, ఒక కప్బోర్డు, రెండు తలపాగాలు, కప్పుకోవడానికి దుప్పటి, మంచం, బెడ్షీట్లు, లోదుస్తులు, టవళ్లు, దోమలు కుట్టకుండా నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. 1988 నాటి రోడ్డు ఘర్షణల కేసులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 8 నెలల్లోపే బయటకు వచ్చే చాన్స్ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్
Patiala Clashes Punjab: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో ప్రభుత్వం రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు డిపార్ట్మెంట్లోని ముగ్గురు ఉన్నతాధికారులను భగవంత్ మాన్ సర్కార్ తొలగించింది. పాటియాలా రేంజ్ ఐజి, పాటియాలా ఎస్ఎస్పీ, ఎస్పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. पटियाला में आज सुबह 9:30 से शाम 6 बजे तक मोबाइल इंटरनेट सेवाएं अस्थायी रूप से निलंबित किया गया: गृह विभाग, पंजाब सरकार | #Patiala | #PatialaViolence | #PatialaRiots | #Panjab | pic.twitter.com/KEFsOoi62j — IBC24 News (@IBC24News) April 30, 2022 ఇదిలా ఉండగా.. ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజియాలా జిల్లాలో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే నగరంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. #Patiala pic.twitter.com/0XgntqTEcG — Jitender Sharma (@capt_ivane) April 29, 2022 ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు -
శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వి, కత్తులు దూసి
చండీగఢ్: పంజాబ్‌లోని పాటియాలాలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఒక గ్రూప్ వారు మరో గ్రూప్‌పై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు. పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నాయకత్వంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. శివసేన కార్యకర్తలు ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. కత్తులు దూయడంతో పాటియాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్‌లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. చదవండి: వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు #WATCH | Punjab: A clash broke out between two groups near Kali Devi Mandir in Patiala today. Police personnel deployed at the spot to maintain law and order situation. pic.twitter.com/yZv2vfAiT6 — ANI (@ANI) April 29, 2022 పాటియాలాలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పాటియాలాలో ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని తాను డీజీపీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పాటియాలాలో పరిస్థితులు పునరుద్ధరిరంచినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశరు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం కాపాడటం చాలా ముఖ్యమని భగవంత్ మాన్ అన్నారు. The incident of clashes in Patiala are deeply unfortunate. I spoke with the DGP, peace has been restored in the area. We are closely monitoring the situation and will not let anyone create disturbance in the State. Punjab’s peace and harmony is of utmost importance. — Bhagwant Mann (@BhagwantMann) April 29, 2022 పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. -
కరోనా కలకలం.. 30 మంది అథ్లెట్లకు పాజిటివ్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ 2020 సన్నాహకాల్లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిర్వహించిన కరోనా పరీక్షల్లో 30 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పటియాల, బెంగళూరు నగరాల్లోని నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సెల్లెన్స్‌ల్లో 741 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లే ఏ అథ్లెట్ కూడా వైరస్ బారిన పడకపోవడం ఊరట కలిగించే అంశం. వైరస్ సోకిన వారి జాబితాలో భారత పురుషుల బాక్సింగ్ చీఫ్ కోచ్ సీఏ కుట్టప్ప, షాట్‌పుట్ కోచ్ మోహిందర్ సింగ్ డిల్లాన్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు సాయ్ ప్రకటించింది. పటియాల ఎన్ఐఎస్లో మొత్తం 313 మందికి పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి పాజిటివ్‌గా తేలిందని, బెంగళూరు కేంద్రంలో 428 మందికి పరీక్షలు నిర్వహిస్తే నలుగురికి వైరస్ సోకిందని సాయ్ పేర్కొంది. అయితే, ఈ రెండు సెంటర్లలో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు గానీ, కోచ్‌లుగానీ వైరస్ బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహమ్మారి బారిన పడిన బాక్సర్ల జాబితాలో ఆసియా సిల్వర్ మెడలిస్ట్ దీపక్ కుమార్, ఇండియా ఓపెన్ గోల్డ్ మెడలిస్ట్ సంజిత్ ఉన్నారు. చదవండి: నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: భజ్జీ -
ద్యుతీ చంద్‌కు స్వర్ణం
పాటియాలా: ఫెడ రేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నమెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీ లో ద్యుతీ స్వర్ణాన్ని గెలుచుకుంది. సోమవారం జరిగిన 100మీ. పరుగును ద్యుతీ అందరికన్నా ముందుగా 11:45 సెకన్లలోనే ముగించి విజేతగా నిలిచింది. కానీ ఈ విభాగంలో ఆసియా చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (11:40 సె.) ఆమె అందుకోలేకపోయింది. 100మీ. పరుగులో ఆమె విఫలమైనప్పటికీ... 200మీ. పరుగులో ద్యుతీ ఆసియా చాంపియన్‌షిప్ బెర్తును సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర ద్యుతీ శిక్షణ పొందుతోంది. -
ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు
-
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
తండ్రిని మోసం చేసిన కొడుక్కి కోర్టు ఝలక్
పాటియాల: కన్నతండ్రిని మోసం చేసిన ఓ కుమారుడు అతడి భార్యకు పంజాబ్‌లోని ఓ కోర్టు తగిన బుద్ది చెప్పింది. మాయమాటలు చెప్పి, బంగారంలా చూసుకుంటామని నమ్మబలికించి వారికున్న పొలాన్ని తమ పేరుమీదకు మార్పించుకుని ఆ తర్వాత తల్లిదండ్రులను వెళ్లగొట్టిన ఆ ప్రబుద్ధులకు తగిన శాస్తి చేసింది. ఆ పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతుల పేరుమీదకు మార్చాలని చెప్పింది. దీంతో చకచకా ఆ మండల అధికారి ఆ పనులు పూర్తి చేయడంతో ఆ కపట తనయుడు, కోడలు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని టర్కియానా గ్రామంలో జోగిందర్ సింగ్ (80) అనే పెద్దాయనకు మల్కిత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. వారికి ఐదున్నర ఎకరాల భూమి ఉంది. అయితే, వృద్ధులైన ఆ తల్లిదండ్రులను కుమారుడు, కోడలు కలిసి నమ్మబలికించి మొత్తం పొలాన్ని రాయించుకున్నారు. అనంతరం అప్పుడే నిర్మించుకున్న కొత్త ఇంట్లో నుంచి గెంటేశారు. వెంటనే ఊర్లోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్న పాత ఇంట్లో ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు కావడంతో తలదించుకొని అతడి మాట ప్రకారం ఊరెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో వృద్ధుడైన జోగిందర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) బజిందర్ సింగ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారి సంక్షేమం దృష్ట్యా ఆ కుమారుడి చేతిలోకి వెళ్లిన పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతులకు కేటాయించారు. -
పాటియాలలో మరోసారి కలకలం!
పాటియాల : పఠాన్‌కోట్ సంఘటన మరవకముందే పంజాబ్‌లో మరోసారి కలకలం రేగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి కారును అపహరించుకు వెళ్లారు. పాటియాలలోని దష్మిష్ నగర్లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రామకృష్ణకు స్వర్ణం
మరో మూడు రజతాలు సాక్షి, హైదరాబాద్: పాటియాలాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరానికి చెందిన ఎం. రామకృష్ణ సత్తా చాటాడు. ఓ స్వర్ణం, రెండు రజతాలతో మెరిశాడు. స్నాచ్ (126 కేజీ)లో పసిడిని సాధించిన రామకృష్ణ... జర్క్ (157 కేజీ)లో రజతం నెగ్గాడు. ఓవరాల్‌గా మొత్తం 283 కేజీల బరువు ఎత్తి మరో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లోనూ రామకృష్ణ రజతం సంపాదించాడు. -
దృశ్యం.. అమితం
Lens& లైఫ్ ఆమె కెమెరా కన్ను పడితే ప్రతి దృశ్యం అపురూపమే. ప్రతి కదలికా ప్రత్యేకమే. ఆరేళ్ల వయసు నుంచే ‘లెన్స్’తో అనుబంధం... ‘క్లిక్’ల్లో వినూత్నం... సామాజిక నేపథ్యం. చారిత్రక కట్టడాలు, దైవారాధన, ప్రకృతి సౌందర్యం, గిరిజనుల జీవన విధానం, బాల కార్మికుల బతుకులు... ఆమె కెమెరాకు కనిపించే దృశ్యాలివే. పంజాబ్‌లో పుట్టి... సిటీలో స్థిరపడిన అమితా తల్వార్ ‘లెన్స్ అండ్ లైఫ్’ ఆమె మాటల్లోనే... మాది పంజాబ్‌లోని పాటియాలా. 1954లో పుట్టిన నేను పెరిగింది అక్కడే. పాటియాలా సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసే నాన్న దయాకృష్ణన్పూరీ హాబీగా కెమెరా క్లిక్‌మనిపించేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పర్యాటక ప్రదేశాలకు వెళ్లినా పెంటాక్స్ కెమెరా వెంట తీసుకొచ్చేవారు. అలా నాకు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఇది గమనించిన అమ్మానాన్న నాకు బేబీ బ్రౌన్ కెమెరా చేతికిచ్చారు. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా ఫొటోలు తీయడం హాబీగా మారింది. చండీగఢ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ చేశా. 1974లో కోల్‌కతాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పరిక్షిత్ తల్వార్‌తో వివాహమైంది. ఆయన నా ఆసక్తిని గమనించి వెన్నుతట్టారు. అలా నేను ఇప్పటివరకు శ్రీనగర్, జైపూర్, అలహాబాద్‌లోని ప్రయాగ్ మేళా, ఛత్తీస్‌గఢ్, లేహ్, లడఖ్, భూటాన్లలో పర్యటించి అక్కడి చారిత్రక, ప్రకృతి అందాలను లెన్స్‌లో బంధించగలిగా. లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కరస్పాన్‌డెన్స్ కోర్సు చేశా. కొన్ని ఇంగ్లిష్ పత్రికలకు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేశా. భర్త ఐటీసీ భద్రాచాలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాం. సిటీలో జరిగే ఆర్ట్ అండ్ కల్చర్‌ను కళ్లకు కట్టినట్లు చూపించగలిగా. ఇందులో భాగంగానే ఇటీవలే క్యాన్సర్ రోగులు, బాలల విద్య కోసం నిధులు సేకరించేందుకు ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటుచేశా. ఫిల్మ్ మేకింగ్ చేస్తుంటా. ఆ క్లిక్ మరవలేను... నా కెమెరాలో బందీ అయిన అన్నీ దృశ్యాలు నాకు బెస్ట్. చారిత్రక కట్టడాలు అయినా, ప్రకృతి సౌందర్యమైనా, బాల కార్మికుల స్థితిగతులైనా... ప్రతి ఫొటోకూ మంచి స్పందన వచ్చింది. ఎన్జీవోలకు నిధుల సేకరణ కోసం నా ఫొటోల ఎగ్జిబిషన్ ‘బుక్ ఆఫ్ మై ఫొటోగ్రఫీ’కి వచ్చిన రెస్పాన్స్ సంతృప్తినిచ్చింది. 2011, 2012, 2013... ఇలా మూడేళ్లు బనారస్ పర్యటనకు వెళ్లా. ఈ ఏడాది కూడా వెళుతున్నా. తొలిసారి నేను ‘కోర్స్ ఆఫ్ రివర్ గంగా’ వద్దకు వెళ్లి, శివుడికి పూజలు అందించే దృశ్యాన్ని క్లిక్‌మనిపించా. గంగా తీరం, సంధ్యా సమయం.. భక్తజన సంద్రం ఆధ్యాత్మిక వాతావరణంలో పారవశ్యులవుతున్నారు. విశ్వనాథుడు, గంగానది, సూర్యుడు, అగ్ని దేవతలను పూజిస్తూ గంగమ్మకు భక్తులు హారతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హారతికి ముందు విజిల్ వేస్తారు. వేకువ జామునే లేచి... ఆ విజిల్ వేసే దృశ్యాన్ని కెమెరాలో బంధించా. చలికాలం కావడంతో విపరీతమైన మంచు. భక్తులు, వారు వెలిగించిన కర్పూర హారతులను క్లిక్‌మనిపించా. ఈ ఫొటో నాకెంతో సంతృప్తినిచ్చింది. కుటుంబ సభ్యులతో ప్రముఖ పర్యాటక కేంద్రం కాశీకి వెళ్లాను. ఆ ట్రిప్‌నూ క్లిక్‌లతో ఫుల్ ఎంజాయ్ చేశా. ఇదే కాదు... నేను తీసిన ఎన్నో ఫొటోలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ ఫొటో కోసం నికాన్డీ 800 కెమెరా వాడా. బనారస్ ఫొటోలన్నింటితో ఓ పుస్తకం తేవాలనుకుంటున్నా. తద్వారా వచ్చే నిధులను సమాజసేవకు వినియోగించాలన్నదే నా అభిలాష. ప్రజంటర్: వాంకె శ్రీనివాస్ -
'సంచలన పార్టీ'కి డిపాజిట్ గల్లంతు
రాజకీయాల్లో వారం రోజులు సుదీర్ఘ గడువు అన్నాడు... ఈ మాటలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు అక్షరాలా వర్తిస్తాయి. అవినీతిపై పోరాటాన్ని అస్త్రంగా చేసుకుని అనతికాలంలో ఢిల్లీలో గద్దెనెక్కిన ఆప్ అంతలోనే ఆదరణ కోల్పోయింది. ఆప్ స్పీడు చూసి అతిపెద్ద పార్టీలు సైతం జడుసుకున్నాయి. అయితే ఆప్ రాజకీయ ప్రభంజనం పాలపొంగులా చల్లారిపోవడంతో ఇప్పుడు పెద్ద పార్టీలు లోలోన సంతోషపడుతున్నాయి. అతితక్కువ కాలంలో జనాదరణ పొంది సంచలన విజయం సాధించిన ఆప్ స్వీయతప్పిదాలతో అంతేవేగంగా కిందకు పడింది. పంజాబ్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు తాజా రుజువు. సాధారణ ఎన్నికల్లో దేశమంతా ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించినా పంజాబ్ అక్కున చేర్చుకుంది. నలుగురు ఎంపీలును గెలిపించింది. మూడు నెలలు తిరగకుండానే పరిస్థితి తారుమారైంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కలేదు. పాటియాలా, తల్వాండి సాబూ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపపోరులో ఆప్ అభ్యర్థులు పూర్తిగా వెనుకబడ్డారు. పాటియాలా సీటును కాంగ్రెస్, తల్వాండి సాబూ స్థానాన్ని శిరోమణి అకాలీదళ్ గెల్చుకున్నాయి. అయితే ఈ ఫలితంతో తాము నిరాశ చెందలేదని ఆప్ ఆద్మీ పార్టీలు చెప్పడం గమనార్హం. ప్రజలకు క్లీన్ పాలిటిక్స్ అందించాలన్న లక్ష్యానికి కట్టుబడ్డామని పునరుద్ఘాటించింది. డబ్బు, మద్యంతో ఓటర్లను కాంగ్రెస్, అకాలీదళ్ మభ్యపెట్టవడం వల్లే గెలిచాయని ఆప్ నేతలు ఆరోపించారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ కు ఇప్పుడు పంజాబ్ లోనూ ఎదురుదెబ్బ తగిలింది. దీని బట్టి చూస్తే తమకు పట్టం కట్టిన చోట పడిపోవడం ఆప్ కు అలవాటుగా మారిందన్న అనుమానం కలగకమానదు! -
'మా తుపాకులు మీకివ్వం'
మామూలుగా ఎన్నికల వేళ పౌరుల దగ్గరుండే ఆయుధాలను ప్రభుత్వం వద్ద జమ చేయాల్సి ఉంటుంది. దేశమంతా ఇదే జరుగుతుంది. కానీ పంజాబ్ లో మాత్రం 'మా తుపాకులను సరండర్ చేసేది లేదు' అని కుండ బద్దలుగొట్టేస్తున్నారు. పంజాబ్ లో మొత్తం 2.86 లక్షల లైసెన్స్ ఆయుధాలున్నాయి. వీరంతా మార్చి 19 లోపు తమ తమ ఆయుధాలను జమచేయాలి. కానీ ఇప్పటి వరకూ కేవలం 1.03 లక్ష తుపాకులను మాత్రమే జమ చేశారు. తుపాకులు కేవలం మగవారి దగ్గరే కాదు, స్త్రీల దగ్గర కూడా ఉన్నాయి. పంజాబ్ లో 31,344 మంది మహిళలకు గన్ లైసెన్స్ ఉంది. లైసెన్స్డ్ ఆయుధాలు ఎక్కువగా పాటియాలా, లూఢియానాలలో ఉన్నాయి. ఒక్క లూఢియానా నగరంలోనే 17,348 ఆయుధాలున్నాయి. మోగా, ఫిరోజ్ పూర్, భటిండా జిల్లాల్లోనూ తుపాకుల సంఖ్య ఎక్కువే.