Navjot Singh Sidhu says security lapse after suspicious man spotted at his home - Sakshi
Sakshi News home page

Navjot Singh Sidhu: రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు.. భద్రతా వైఫల్యంపై సిద్ధూ ఆందోళన

Published Mon, Apr 17 2023 9:29 AM | Last Updated on Mon, Apr 17 2023 10:39 AM

Navjot Singh Sidhu Says Suspicious Man Spotted At His Home - Sakshi

టెర్రస్‌పైకి వచ్చిన అగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల  ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధు పేర్కొన్నారు.

చండీగడ్‌: పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్‌ సిద్ధూ..  పాటియాలలోని తన ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చాడని వెల్లడించారు. పని మనిషి అతడ్ని చూసి తనను అప్రమత్తం చేశాడని చెప్పుకొచ్చారు.

టెర్రస్‌పైకి వచ్చిన ఆగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల  ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధూ పేర్కొన్నారు. తాము బయటకు వెళ్లి చూడగానే అనుమానిత వ్యక్తి పక్కింటిపైకి దూకి పారిపోయాడని వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని వెంటనే పాటియాల ఎస్‌ఎస్‌పీకి ఫోన్ చేసి చెప్పానని, పంజాబ్ డీజీపీతో కూడా మాట్లాడానని సిద్ధూ చెప్పారు. అనంతరం ఎస్‌ఎస్‌పీ వెళ్లి ఇంటిని పరిశీలించారు.  ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అనుమానిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనుమానితుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు సిద్ధు కాంగ్రెస్‌ నేతలతో ఇంట్లోనే సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాటియాల మాజీ ఎంపీ ధర్మవీర గాంధీ, ఇతర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పని పనిషి ఆగంతకుడ్ని చూసిన విషయాన్ని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పారని గాంధీ వివరించారు. తాము వెంటనే బయటకు వెళ్లి చూడగా.. అతడు పక్కింటిపైకి దూకి పారిపోయాడని తెలిపారు.
చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement