security failure
-
వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అయితే వైఎస్ జగన్ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి. జనాల తోపులాటతో వైఎస్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు. చదవండి: కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్ జగన్ -
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం సృష్టంగా కనిపించింది. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. హెలిప్యాడ్ వద్దకు వేలాది మంది దూసుకు రావడంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్ది సేపు సంశయించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయ్యేలా పర్యటన ఖరారైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి నేరుగా వాహనంలో జాతీయ రహదారి మీదగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి వచ్చేలా పర్యటన ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు 80 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ, అంతా హెలికాప్టర్ దిగే ప్రదేశం వద్దకే వేలాది మంది అభిమానులు దూసుకొచ్చి చుట్టు ముట్టేశారు.కనీసం రోప్ పార్టీ కూడా లేని పరిస్థితి. దీంతో తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో అభిమానులు తోపులాటల మధ్య వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగి, వాహనం వద్దకు చేరుకున్నారు. హైస్కూల్ ఆవరణలో అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు కానీ, తగినంత పోలీస్ సిబ్బంది మాత్రం లేరు. దీంతో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హెలిప్యాడ్ వద్దకు వచ్చేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చాలా మంది హెలిప్యాడ్ వద్ద జగన్‌ను కలవలేకపోయారు. ఇదీ చదవండి; పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరికవైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అభిమానుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో అభిమానుల ముసుగులో ఎవరైనా ఆయనకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది హెలికాప్టర్‌ను చుట్టేయడంతో జగన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానుల ముసుగులో టీడీపీ మూకలు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తున్న నేపథ్యంలో ఈ సందేహం వస్తోందని ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. గతంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్‌తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్‌లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
Winter Parliament Session 2023: లోక్‌సభ నిరవధికంగా వాయిదా
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్‌సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్‌సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్‌లోని నాగౌర్‌లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్‌సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్‌శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్‌కు పంపాడు. తర్వాత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
Parliament: లోక్‌సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్‌రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు. -
పార్లమెంట్ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్‌సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. మొత్తం దానిదే! తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్‌పీఎఫ్‌గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. పీఎస్ఎస్ చరిత్ర పెద్దదే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్‌ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్‌భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్‌లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్ అండ్ వార్డ్ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు.. అన్నింటా కీలకంగా.. .. 2009 ఏప్రిల్ 19వ తేదీన వాచ్ అండ్ వార్డ్‌ను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్ఎస్. పార్లమెంట్ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్ఎస్ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద.. అలాగే ఎట్ హోమ్ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్ఎస్సే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్ఎస్దే కీలక పాత్ర. అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్ఎస్ చూసుకుంటుంది. స్వతంత్రంగా పని చేయదు.. పీఎస్ఎస్ అనేది పార్లమెంట్ భవనం పూర్తి కాంప్లెక్స్ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్/సీఆర్పీఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ, ఎన్ఎస్జీలు పార్లమెంట్ పరిధిలో పీఎస్ఎస్ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు. పార్లమెంట్ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్ఎస్కు హెడ్‌గా ఉంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్ఎస్ పనితీరును పర్యేవేక్షిస్తారు. పీఎస్‌ఎస్‌లో సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్ పరిధిలోనే. పార్లమెంట్ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది. పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్‌తో పాటు సభ లోపలి మార్షల్స్ కూడా పీఎస్ఎస్ పరిధిలోకే వస్తారు. మూడంచెల తనిఖీలు.. పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి చెకింగ్స్ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీలు చేస్తారు. ఇక, పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్‌తో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. అలా ఎలా..? సాధారణ విజిటర్ పాస్‌ల మీదే సందర్శకులు పార్లమెంట్‌కు వస్తుంటారు. ఈ పాస్‌లు జారీ చేసేముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్‌లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్లు, స్కానర్లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే పార్లమెంట్ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్ షెల్స్‌తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. నాడు జరిగింది ఇదే.. 2001 డిసెంబర్ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. అదీ హైటెక్ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు..మమ్మల్ని చూసి: సిద్ధూ
చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.. పాటియాలలోని తన ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చాడని వెల్లడించారు. పని మనిషి అతడ్ని చూసి తనను అప్రమత్తం చేశాడని చెప్పుకొచ్చారు. టెర్రస్‌పైకి వచ్చిన ఆగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధూ పేర్కొన్నారు. తాము బయటకు వెళ్లి చూడగానే అనుమానిత వ్యక్తి పక్కింటిపైకి దూకి పారిపోయాడని వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped. Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has… — Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023 ఈ విషయాన్ని వెంటనే పాటియాల ఎస్ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానని, పంజాబ్ డీజీపీతో కూడా మాట్లాడానని సిద్ధూ చెప్పారు. అనంతరం ఎస్ఎస్పీ వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అనుమానిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు సిద్ధు కాంగ్రెస్ నేతలతో ఇంట్లోనే సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాటియాల మాజీ ఎంపీ ధర్మవీర గాంధీ, ఇతర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పని పనిషి ఆగంతకుడ్ని చూసిన విషయాన్ని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పారని గాంధీ వివరించారు. తాము వెంటనే బయటకు వెళ్లి చూడగా.. అతడు పక్కింటిపైకి దూకి పారిపోయాడని తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ: పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భఠిండా ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఉదయం భఠిండా చేరుకున్నారు. చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..) అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న ప్రధాని.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు. చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం) -
ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ర్యాలీని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు నిరసనకారులలతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిరాకరించారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని .. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్టు సీఎం చన్నీ తెలిపారు. చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..) -
‘విక్రాంత్’లో దొంగలు
న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ విషయంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నౌకలో దొంగలు పడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 4 కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు, వాటిలోని హార్డ్ డ్రైవ్‌లు, ప్రాసెసర్లు, ర్యామ్‌లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. కాగా, కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలో సీసీటీవీలు లేవనీ, ఇక్కడి భద్రతను ఓ ప్రైవేటు సంస్థ చూస్తోందని కేరళ డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు. 2009లో కొచి్చన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం ప్రారంభమైంది. 2023 నాటికి ఇది భారత నేవీలో చేరనుంది. -
అమిత్‌షాపై దాడిలో భద్రతా వైఫల్యం!
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలో శుక్రవారం జరిగిన టీడీపీ కార్యకర్తల దాడితో ఏపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ వ్యవస్థ కలిగిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనలో భద్రతను గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలిపిరి వద్ద చోటుచోసుకున్న ఈ ఘటన ఏపీ పోలీసు వ్యవస్థలోని డొల్లతనం బయటపడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షా కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు రువ్వడంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ)వర్గాలు ఆరా తీశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు బీజేపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నెల 12న ఏపీ పోలీస్ టెక్ భవనాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాను తలుచుకుంటే కేంద్ర వాహనాలు తిరగనివ్వననే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల పలు సభల్లో చంద్రబాబు నుంచి మంత్రులు వరకు అందరూ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు గుర్తించాయి. అలిపిరి ఘటనలో పాల్గొన్నది ఎవరు? వారికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? అనే కోణాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల తీరుపై కూడా వారు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అలాగే, దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఏపీ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ నివేదిక కోరినట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ హోం మంత్రి చినరాజప్ప దాడి జరగలేదని ప్రకటించడం వివాదాస్పదమైంది. -
ఎవరా లేడీ కిలాడీ!
పది రోజులుగా ప్రసూతి విభాగంలోనే మకాం పక్కా ప్రణాళికతో మగ శిశువు అపహరణ సెక్యూరిటీ వైఫల్యంపై రాజకీయ పక్షాల మండిపాటు సబ్‌కలెక్టర్‌ను ఘెరావ్ చేసిన మహిళా సంఘాలు ఐదు గంటల పాటు ఆస్పత్రిలోనే బైఠాయించిన వంగవీటి రాధాకృష్ణ ఆస్పత్రి సిబ్బందిని ‘బావ..’ అని పిలుస్తూ పరిచయం చేసుకుంది.. అప్పుడే పుట్టిన చిన్నారులను ముద్దాడుతూ పండంటి బిడ్డ పుట్టాడనే పొగడ్తలతో రోగులకు దగ్గరైంది.. ఇలా పది రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ తన మాయమాటలతో సిబ్బంది, రోగులను పరిచయం చేసుకుంది.. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ పరిశీలించింది. అదును చూసి ప్రజలు, సందర్శకుల నిషేధిత ప్రాంతమైన ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని అందరి కళ్లుగప్పి అపహరించుకుపోయింది.. 30 నుంచి 35 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఎవరనే దానిపై ఇప్పుడు పోలీసులతో పాటు అందరూ దృష్టి సారించారు. విజయవాడ (లబ్బీపేట) : విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని పోతిన వారి వీధికి చెందిన ఐతా సుబ్రహ్మణ్యం, కళ్యాణి దంపతుల ఐదు రోజుల మగ శిశువు అపహరణ పక్కా ప్లాన్‌తో జరిగినట్లు ప్రభుత్వాస్పత్రి సిబ్బందే చెపుతున్నారు. అప్పుడే శిశువుకు పాలు పట్టించి, టిఫిన్ చేసేందుకు వెళ్లిన కళ్యాణిని గమనించిన ఆ కిలాడీ లేడీ అదును చూసి శిశువును అపహరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్ఎన్సీయూ వద్ద సెక్యూరిటీ గార్డు కూడా లేడని సమాచారం. టిఫిన్ చేసి పది నిమిషాల్లో ఎన్ఐసీయూలోకి వెళ్లిన కళ్యాణికి తన బిడ్డ కనిపించలేదు. నిషేధిత ప్రాంతంలో అపహరణ ఎలా... ప్రత్యేక నవజాత శిశు చికిత్సా విభాగం నిషేధిత ప్రాంతంగా ఉంది. అక్కడ శిశువులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించారు. రోజులో ఒక్కసారి మాత్రమే తల్లిని అనుమతిస్తారు. అలాంటి వార్డులో శిశువు అపహరణకు గురవడాన్ని పలు రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులతో పాటు, సబ్‌కలెక్టర్ కూడా తప్పుబట్టారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వాస్పత్రిలో భద్రత ఎలా ఉందో అర్థమవుతుందని ఆరోపిస్తున్నారు. సబ్ కలెక్టర్ ఘెరావ్ ప్రభుత్వాస్పత్రిలో ఘటన జరిగిన వెంటనే ప్రాథమిక విచారణకు వచ్చిన సబ్‌కలెక్టర్‌ను మహిళా సంఘాలు ఘెరావ్ చేశాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సృజన వారితో మాట్లాడుతూ అపహరణకు గురైన బిడ్డను తిరిగి అప్పగిస్తామని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బందిని విచారించిన పోలీసులు శిశువు అపహరణకు గురైన సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న సిబ్బందితో పాటు, సెక్యురిటీ గార్డులను పోలీసులు ఆస్పత్రిలోనే విచారించారు. ఈ సందర్భంగా ఎస్ఎన్సీయూ వద్ద ఉన్న సెక్యురిటీ గార్డులో ఆ కిలాడీ లేడీ సన్నిహితంగా ఉండేదని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శిశువు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ ఆచూకీ ఎప్పటికి లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో తమ బిడ్డ ఆచూకీ చెప్పండంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేస్తోంది. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ సుబ్బారావు ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : పూనం మాలకొండయ్య ప్రభుత్వాస్పత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగంలో శిశువు అపహరణ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనమ్ మాలకొండయ్య అన్నారు. ఆమె గురువారం రాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శిశువు తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. బిడ్డ క్లూ తమకు దొరికిందని ఆమె వివరించారు. -
భద్రత వైఫల్యం వల్లే కాల్పులు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: భద్రత వైఫల్యం వల్లే హైదరాబాద్ ను సేఫ్ జోన్ గా తీవ్రవాదులు ఎంచుకుంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బార్కాస్ లో తీవ్రవాదిని అరెస్ట్ చేయగా, బుధవారం ఉదయం పారిశ్రామికవేత్తపై ఏకే 47తో కాల్పులు జరిపి.. విధ్వంసం సృష్టించిన పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా దృష్టిపెట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్, అక్టోపస్ లను పటిష్టం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం కోతలు పట్టి లబ్ధిదారులను తగ్గించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.