భద్రత వైఫల్యం వల్లే కాల్పులు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: భద్రత వైఫల్యం వల్లే హైదరాబాద్ ను సేఫ్ జోన్ గా తీవ్రవాదులు ఎంచుకుంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బార్కాస్ లో తీవ్రవాదిని అరెస్ట్ చేయగా, బుధవారం ఉదయం పారిశ్రామికవేత్తపై ఏకే 47తో కాల్పులు జరిపి.. విధ్వంసం సృష్టించిన పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇకనైనా దృష్టిపెట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్, అక్టోపస్ లను పటిష్టం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం కోతలు పట్టి లబ్ధిదారులను తగ్గించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.