‘విక్రాంత్‌’లో దొంగలు | Computer Devices Stolen From INS Vikrant Being Built In Kochi | Sakshi

‘విక్రాంత్‌’లో దొంగలు

Sep 19 2019 4:45 AM | Updated on Sep 19 2019 4:46 AM

 Computer Devices Stolen From INS Vikrant Being Built In Kochi - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ విషయంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నౌకలో దొంగలు పడ్డారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో 4 కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు, వాటిలోని హార్డ్‌ డ్రైవ్‌లు, ప్రాసెసర్లు, ర్యామ్‌లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. కాగా, కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలో సీసీటీవీలు లేవనీ, ఇక్కడి భద్రతను ఓ ప్రైవేటు సంస్థ చూస్తోందని కేరళ డీజీపీ లోక్‌నాథ్‌ తెలిపారు. 2009లో కొచి్చన్‌ షిప్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నిర్మాణం ప్రారంభమైంది. 2023 నాటికి ఇది భారత నేవీలో చేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement